Israil
-
ఇజ్రాయెల్ వ్యూహం బ్యాక్‌ఫైర్!
పాలస్తీనా మిలిటెంట్ సంస్థ ‘హమాస్’ అధినేత యాహ్యా సిన్వర్(61) హత్య విషయంలో ఇజ్రాయెల్ వ్యూహం వికటిస్తోంది. హమాస్ సభ్యులను భయకంపితులను చేసి ఆత్మస్థైర్యం దెబ్బతీయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం విడుదల చేసిన డ్రోన్ వీడియో దృశ్యం నిజానికి వారిలో మరింత స్ఫూర్తిని రగిలిస్తోంది. ఇజ్రాయెల్‌పై భీకర పోరాటానికి పురికొల్పుతోంది. ఈ వీడియోను విడుదల చేయడం ద్వారా ఇజ్రాయెల్ పెద్ద తప్పు చేసిందని విశ్లేషకులు చెబుతున్నారు. గాజాలోని ఓ ఇంటిపై ఇజ్రాయెల్ జవాన్లు చేసిన దాడిలో సిన్వర్ మరణించిన సంగతి తెలిసిందే. ఈ దాడికి సంబంధించిన ఇజ్రాయెల్ సైన్యం విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇజ్రాయెల్ దాడిలో తీవ్రంగా గాయపడిన సిన్వర్ చివరి క్షణాలు ఇందులో కనిపిస్తున్నాయి. సిన్వర్ కుడి చెయ్యి చాలావరకు నుజ్జునుజ్జుగా మారింది. బాంబుల దాడితో తీవ్రంగా దెబ్బతిన్న ఓ భవనంలో ఒక సోఫాలో ఆయన కూర్చొని ఉన్నారు. చుట్టూ దుమ్మూ ధూళి దట్టంగా పేరుకుపోయి ఉంది. తనపై దాడి చేస్తున్న డ్రోన్‌పై ఆయన ఎడమ చెయ్యితో కర్ర లాంటిది విసురుతూ కనిపించారు. ఒకవైపు ప్రాణాలు పోయే పరిస్థితి కనిపిస్తున్నా, మరోవైపు శత్రువుపై పోరాటం ఆపలేదంటూ సోషల్ మీడియాలో పోస్టుల వర్షం కురిసింది. రక్షణ వలయం లేదు.. కవచం లేదు గాజా భూభాగంలోని భారీ సొరంగంలో సిన్వర్ తలదాచుకుంటున్నాడని, చుట్టూ బాడీగార్డులతో దుర్భేద్యమైన రక్షణ వలయం ఏర్పాటు చేసుకున్నాడని, అంతేకాకుండా ఇజ్రాయెల్ నుంచి బందీలుగా పట్టుకొచ్చిన వారిని రక్షణ కవచంగా వాడుకుంటున్నాడని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ పలు సందర్భాల్లో చెప్పారు. ఇజ్రాయెల్ అధికారులు సైతం ఇదే విషయం పదేపదే వెల్లడించారు. కానీ, వీడియో దృశ్యం చూస్తే సిన్వర్ సొరంగంలో లేడు. బహుళ అంతస్తుల భవనంలో ఉన్నాడు. ఆయన చుట్టూ రక్షణ వలయం గానీ, రక్షణ కవచం గానీ లేదు. ఇజ్రాయెల్ చెప్పిందంతా అబద్ధమేనని ఈ దృశ్యాలు రుజువు చేశాయి. మద్దతుదారుల కంటతడిమృత్యువుకు చేరువవుతూ కూడా సిన్వర్ సాగించిన పోరాటాన్ని చూసి పాలస్తీనావాసులు, హమాస్ మద్దతుదారులు కంటతడి పెడుతున్నారు. వారిలో పెల్లుబుకుతున్న ఆగ్రహం ఇజ్రాయెల్‌పై కసిగా మారుతోంది. సిన్వర్ హత్యకు ప్రతీకారం తప్పదని కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. డ్రోన్ వీడియో దృశ్యం పాలస్తీనా పౌరులకు స్ఫూర్తిదాయకంగా మారడం గమనార్హం. వారంతా ఇజ్రాయెల్‌పై దుమ్మెత్తిపోస్తున్నారు. సిన్వర్ త్యాగాన్ని కొనియాడుతున్నారు. ఈ వీడియో ద్వారా ఇజ్రాయెల్ ఆశించింది ఒకటి కాగా, జరుగుతున్నది మరొకటి కావడం గమనార్హం – సాక్షి, నేషనల్ డెస్క్ఇదీ జరిగిందిసిన్వర్ హత్య ఆపరేషన్ గురించి ఇజ్రాయెల్ సైనికాధికారులు కొన్ని వివరాలు వెల్లడించారు. ఇజ్రాయెల్ సైన్యానికి చెందిన 828వ బిస్లామాచ్ బ్రిగేడ్ తాల్ అల్–సుల్తాన్‌లో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా, ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. సైనికుల కంట పడకుండా సందులు గొందులు తిరుగుతూ తప్పించుకొనేందుకు ప్రయతి్నంచారు. వారిలో ఒక వ్యక్తి ఒంటరిగా ఓ ఇంట్లోకి ప్రవేశించినట్లు ఇజ్రాయెల్ డ్రోన్లు గుర్తించాయి. దాంతో జవాన్లు ఆ ఇంటిని చుట్టుముట్టారు. యుద్ధట్యాంకుతో పేల్చివేశారు. ఈ ఘటనలో సిన్వర్ మరణించాడు. మిగిలిన ఇద్దరు వ్యక్తులను కూడా సైన్యం అంతం చేసింది. అయితే, తొలుత చనిపోయిన వ్యక్తి సిన్వర్ అని ఇజ్రాయెల్ సైన్యానికి తెలియదు. అనుమానంతో మృతదేహం వేలిని కత్తిరించి, ఇజ్రాయెల్‌కు పంపించి డీఎన్ఏ టెస్టు చేశారు. సిన్వర్ డీఎన్ఏతో అది సరిగ్గా సరిపోయింది. దాంతో చనిపోయింది సిన్వర్ అని తేల్చారు. -
Iran-Israel Tensions: మార్కెట్లకు యుద్ధ భయం
ముంబై: పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ ఉద్రికత్తలు, ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలోని బలహీన సంకేతాల ప్రభావంతో స్టాక్ సూచీలు సోమవారం ఒక శాతానికి పైగా నష్టపోయాయి. ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల అనిశ్చితి, విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు, మార్చిలో టోకు ద్రవ్యోల్బణం మూడు నెలల గరిష్టానికి చేరుకోవడం తదితర అంశాలు ప్రతికూల ప్రభావం చూపాయి. ఉదయం సెన్సెక్స్ 930 పాయింట్ల 73,315 వద్ద, నిఫ్టీ 180 పాయింట్లు క్షీణించి 22,339 వద్ద మొదలయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభం నుంచి ఏ దశలోనూ కొనుగోళ్ల మద్దతు లభించకపోవడంతో సూచీలు రోజంతా నష్టాల్లో కదలాడాయి. చివరికి సెన్సెక్స్ 845 పాయింట్లు పతనమై 2 వారాల కనిష్టం దిగువున 73,400 వద్ద నిలిచింది. నిఫ్టీ 247 పాయింట్లు క్షీణించి 22,272 వద్ద స్థిరపడింది. ఒక్క ఆయిల్‌అండ్‌గ్యాస్ మినహా అన్ని రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఫైనాన్సియల్ సరీ్వసెస్, సరీ్వసెస్, ఐటీ, బ్యాంకింగ్ ఇండెక్సులు మెటల్, ఆటో షేర్లు భారీ నష్టాలు చవిచూశాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.3,288 కోట్ల షేర్లను అమ్మేశారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.4,763 కోట్ల షేర్లను కొన్నారు. ఆసియాలో ఒక్క చైనా(1%) మినహా అన్ని దేశాల సూచీలు దాదాపు ఒకశాతానికి పైగా నష్టపోయాయి. కనిష్ట స్థాయిల వద్ద కొనుగోళ్ల మద్దతు లభించడంతో యూరప్ మార్కెట్లు కోలుకున్నాయి. ► సెన్సెక్స్ 845 పాయింట్ల పతనంతో బీఎస్ఈలో రూ.5.18 లక్షల కోట్లు ఆవిరయ్యాయి. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.394 లక్షల కోట్లకు దిగివచి్చంది. కాగా ఈ సూచీలో 30 షేర్లకు గానూ మారుతీ సుజుకీ (1%), నెస్లే (0.62%), సన్‌ఫార్మా(0.10%) మాత్రమే లాభపడ్డాయి. ► ఐటీ దిగ్గజం టీసీఎస్ షేరు ఒకటిన్నర శాతం నష్టపోయి రూ.3942 వద్ద నిలిచింది. క్యూ4 ఫలితాలు మెప్పించడంతో ట్రేడింగ్ ప్రారంభంలో 1.50% పెరిగి రూ.4063 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. అయితే నష్టాల మార్కెట్ ట్రేడింగ్‌లో భాగంగా ఈ షేరులో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. ► అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడం దేశీయ ఆయిల్‌అండ్‌గ్యాస్ కంపెనీల షేర్లకు కలిసొచి్చంది. ఓఎన్జీసీ 6%, ఐజీఎల్ 2%, ఐఓఎల్, గెయిల్ 1.50% చొప్పున లాభపడ్డాయి. జీఎస్పీఎల్ 1% లాభపడ్డాయి. ► ప్రతి ఈక్విటీ షేరుకు రూ.118 ప్రత్యేక డివిడెండ్ చెల్లించేందుకు బోర్డు ఆమోదించడంతో ఆస్టర్ డీఎం హెల్త్‌కేర్ షేరు 7% లాభపడి రూ.523 వద్ద నిలిచింది. ట్రేడింగ్‌లో 14% ఎగసి రూ.558 వద్ద జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసింది. -
మగువ కన్నీళ్లకు ఇంత శక్తి ఉందా? పరిశోధనలో షాకింగ్ విషయాలు
ఎంతవారైనా కాంత దాసులే అంటాడు త్యాగరాజు. ఆడదాని ఓరచూపులో చిత్తుకానీ మగాడు లేడు అంటాడు ఓ సినీ కవి. అవన్నీ నిజమే అనేలా శాస్త్రవేత్తల అధ్యయనంలో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. ఆడవాళ్ల కంటి నుంచి వచ్చే కన్నీళ్లకు ఉన్న శక్తిని చూసి ఆశ్చర్యపోయారు. దెబ్బకి మగాడిలో ఉన్న దూకుడుతునానికి కళ్లెం పడుతుందని ప్రూవ్ చేసి చూపించారు కూడా. ఈ మేరకు ఇజ్రాయెల్‌లోని వీజ్ మాన్ ఇన్స్టిట్యూట్ ఆప్ సైన్స్ నిర్వహించిన పరిశోధనలో మానవ కన్నీళ్లలో రసాయన సంకేతం ఉందని, మెదడు కార్యకలాపలను ప్రభావితం చేస్తుందని కనుగొన్నారు. స్త్రీల నుంచి వచ్చే కన్నీళ్ల వాసన పురుషుల కోపాన్ని నియంత్రిస్తుందని వెల్లడించారు. అందుకోసం పరిశోధకులు ఆడ ఎలుకలపై పరిశోధన చేశారు. ఆ అధ్యయనంలో ఆడ ఎలుకల కన్నీళ్లు మగ ఎలుకల దాడిని నియంత్రించినట్లు తెలిపారు. అంతేగాదు ఈ మగ ఎలుకలు కూడా తమ కన్నీళ్లతో ఆల్పా అనే జాతి ఎలుకల దాడిని నివారిస్తాయిని పేర్కొన్నారు. అలాగే ఇద్దరు వాలంటీర్ మహిళలపై కూడా ప్రయోగం చేశారు. వాళ్లికి ముందుగానే ఇద్దరు మగావాళ్లతో కొన్ని రకాల గేమ్‌లు ఆడమన్నారు. అలాగే వారి డబ్బులను లాక్కునేలా మోసం చేయమన్నారు. ఆ తర్వాత వెంటనే కన్నీళ్లు పెట్టుకుని క్షమాపణలు చెప్పమన్నారు. ఇలా చేయంగానే సదరు మగవాళ్లలో ప్రతికార చర్యలు నెమ్మదిగా తగ్గిపోయినట్లు గమనించారు. ఈ అధయనంలో ప్రతీకారం తీర్చుకోవాలనే పురుషుల కోరిక 43.7% వరకు తగ్గిపోయిందన్నారు. ఈ పరిశోధనలో పాల్గొన్న సదరు పురుషులను బ్రెయిన్‌ను ఎమ్మారై స్కాన్ చేయగా మహిళ కన్నీళ్ల వాసన వారి మెదడును ప్రభావితం చేసి ఆయా ప్రాంతాల్లో ప్రిఫ్రంటల్ కార్టెక్స్, పూర్వ ఇన్సులాలో చురుకుదనం తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ఇక్కడ కొన్ని విషయాలను గమనించాలి. శిశువులు పుట్టగానే ఏడుస్తారు. ఇక్కడ వారికి వచ్చే హానిని నియంత్రించడానికి కన్నీళ్లు పెట్టేలా ఏడవడం జరుగుతుందన్నారు. ఇక్కడ శిశువులు నిస్సహాయులు కాబట్టి తమ పట్ల కోపంగా ప్రవర్తించొద్దని ఏడుపు రూపంలో తెలియజేస్తారని, అందుకు తగ్గట్టుగానే మానవ మెదడు ఆటోమెటిక్‌గా కరిగి కోపాన్ని తమాయించుకుంటుంది. ఇదే మాదిరిగా నిజజీవితంలో కొన్ని సందర్భాల్లో ఈ కన్నీళ్లు వాసన ప్రభావంతంగా కనిపించదని కూడా చెప్పారు. గృహహింస, ఆడవాళ్లపై అకృత్యాలు లేదా టార్చర్ పెట్టే నేరగాళ్లలో దూకుడుని ఈ కన్నీళ్ల వాసన పెద్దగా ప్రభావం చేయకలేకపోయిందని అన్నారు ఇక్కడ కాస్త దీన్ని నిశితంగా గమనిస్తే.. వాళ్లది హింసా ప్రవృత్తి. సాధారణంగా సున్నితమైన మనస్సు గలవాళ్లకే మహిళ కన్నీళ్లకు ఇలా ప్రతిస్పందిస్తారని శాస్త్రవేత్తలు ధీమాగా చెబుతున్నారు. ఇక్కడ మహిళ కన్నీళ్ల వాసన మగవాడి కోపానికి కళ్లేం వేయగలిగినప్పుడు, స్త్రీ పట్ల అమానుషింగా ప్రవర్తించే నేరగాళ్ల బ్రెయిన్‌ని ఎందుకు ప్రభావితం చేయలేకపోతుందనేది శాస్త్రవేత్తలకు అర్థంకానీ చిక్కు ప్రశ్న. ఈ మిస్టరీని చేధించగలిగితే మహిళల పట్ల జరిగే ఎన్నో అమానుషాలను సులభంగా నియంత్రించొచ్చని చెప్పింది పరిశోధకుల బృందం. (చదవండి: సర్జరీ చేసే టైంలో పేషెంట్‌పై డాక్టర్ తోడి! వీడియో వైరల్) -
రత్నాలు–ఆభరణాల వాణిజ్యంపై ఎఫెక్ట్
న్యూఢిల్లీ: ఇజ్రాయెల్–హమాస్ వివాదం భారత్– ఇజ్రాయెల్ మధ్య రత్నాలు, ఆభరణాల వ్యాపారంపై ప్రభావం చూపుతుందని ఎగుమతిదారులు సోమవారం తెలిపారు. 2021–22లో భారత్ రెండు దేశాల మధ్య రత్నాలు, ఆభరణాల వాణిజ్యం 2.8 బిలియన్ డాలర్లు. 2022–23లో ఈ విలువ 2.04 బిలియన్ డాలర్లుగా ఉంది. కట్, పాలి‹Ù్డ వజ్రాలు భారతదేశం నుండి ఇజ్రాయెల్‌కు అత్యధికంగా ఎగుమతి అవుతున్నాయి. తర్వాతి స్థానంలో ల్యాబ్‌లో రూపొందించిన వజ్రాల వాటా ఉంది. ఇక ఇజ్రాయెల్ నుంచి భారత్ ప్రధానంగా కఠిన (రఫ్) వజ్రాలను దిగుమతి చేసుకుంటోంది. 2022–23లో సరుకులు, సేవల రంగాలలో మొత్తం భారతదేశం–ఇజ్రాయెల్ వాణిజ్యం దాదాపు 12 బిలియన్ డాలర్లుగా అంచనా. 2022–23లో ఇజ్రాయెల్ నుండి భారత్‌కు జరిగిన ఒక్క సరుకు ఎగుమతుల విలువ 8.4 బిలియన్ డాలర్లు. దిగుమతుల విలువ 2.3 బిలియన్ డాలర్లు. వెరిసి ఇది 6.1 బిలియన్ డాలర్ల వాణిజ్య మిగులుకు దారితీసింది. ఇజ్రాయెల్‌కు భారత్ ఎగుమతుల్లో డీజిల్, కట్, పాలి‹Ù్డ వజ్రాలు ఉన్నాయి. దిగుమతుల్లో రఫ్ డైమండ్స్, కట్ అండ్ పాలి‹Ù్డ డైమండ్స్, ఎలక్ట్రానిక్స్, టెలికం పరికరాలు, పొటాషియమ్ క్లోరైడ్, హెర్బిసైడ్లు ఉన్నాయి. ఇజ్రాయెల్‌తో భారత్ వాణిజ్యం ఎక్కువగా ఎర్ర సముద్రంలో ఉన్న ఈలాట్ నౌకాశ్రయం ద్వారా జరుగుతోంది. నిపుణులు ఏమన్నారంటే... ఇజ్రాయెల్‌కు భారత ఎగుమతులపై తాజా పరిణామాల ప్రతికూల ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా ఇక్క డ రత్నాలు, ఆభరణాల పరిశ్రమ తీవ్ర ప్రతికూల ప్రభావానికి గురికావచ్చు. రఫ్ వజ్రాలకు దేశంలో కొరత ఏర్పడే వీలుంది. – కొలిన్ షా, కామా జ్యువెలరీ ఎండీ ఇజ్రాయెల్‌లోని మూడు అతిపెద్ద నౌకాశ్రయాలు – హైఫా, అష్డోద్, ఈలత్లలో కార్యకలాపాలు అంతరాయం కలిగితే ఆ దేశంతో భారత్ వాణిజ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఎగుమతులకు ప్రతికూల పరిణామం ఇది. – అజయ్ శ్రీవాస్తవ, జీటీఆర్ఐ సహ వ్యవస్థాపకులు ఈ వివాదం స్వల్పకాలంలో భారతీయ ఎగుమతిదారులపై ప్రభావం చూపుతుంది. యుద్ధం తీవ్రతరం అయితే, ఆ ప్రాంతానికి ఎగుమతులు జరిపే ఎగుమతిదారులకు మరిన్ని ఇబ్బందులు ఎదురుకావచ్చు. – శరద్ కుమార్ సరాఫ్, టెక్నోక్రాఫ్ట్ ఇండస్ట్రీస్ ఇండియా వ్యవస్థాపక చైర్మన్ -
యూదుల ప్రార్థనా మందిరంపై ఉగ్రదాడి.. ఏడుగురు మృతి..
జెరూసలెం: ఇజ్రాయెల్ రాజధాని జెరూసలెంలోని యూదుల ప్రార్థనా మందిరంపై ఉగ్రవాది దాడికి తెగబడ్డాడు. కన్పించిన వారిపై బుల్లెట్లు వర్షం కురిపించాడు. శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటనలో ఏడుగురు చనిపోయారు. తూటాలు తగిలి మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. నివె యాకోవ్ బోలెవార్డ్‌లో జరిగిన ఈ ఘటనపై సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకున్నారు. తుపాకీతో ఉన్న ఉగ్రవాదిని కాల్చి చంపారు. అతను తీసుకొచ్చిన వాహనాన్ని కూడా ధ్వంసం చేశారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఘటనా స్థలాన్ని సందర్శించారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. ఇది అత్యంత తీవ్రమైన ఉగ్రచర్య అని అధికారులు తెలిపారు. ఇటీవలి కాలంలో ఇలాంటి భయానక ఘటన జరగలేదన్నారు. నిందితుడ్ని పాలస్తీనాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. సంబరాలు.. మరోవైపు ఈ దాడిని పాలస్తీనా ఉగ్రసంస్థలు ప్రశంసించాయి. కానీ ఇది తమ పని కాదని పేర్కొన్నాయి. కొన్ని చోట్ల పాలస్తీనా ప్రజలు ఈ ఘటనను సంబరంగా జరుపుకొన్నారు. మిఠాయిలు పంచి, ర్యాలీలు చేశారు. చదవండి: నన్ను చంపించేందుకు జర్దారీ కుట్ర: ఇమ్రాన్ -
ఏ భర్తకు ఇటువంటి కష్టం రాకూడదు!
Australian Man Banned From Leaving Israel: ఇటీవల కాలంలో రకరకాల విడాకులు చట్టాలు గురించి విన్నాం. అయితే వాటిలో భార్యకు విడాకులు ఇవ్వాలంటే అత్యంత పెద్ద మొత్తంలో భరణం ఇవ్వడం వంటివి చూశాం. కానీ ఇక్కడ ఒక దేశంలో భరణం పూర్తిగా చెల్లించేంత వరకు దేశం విడిచి పెట్ట వెళ్లకుండా నిషేధించారు. (చదవండి: ప్రపంచపు తొలి డ్యూయల్ మోడ్ వాహనం) అయితే అసలు విషయంలోకెళ్లితే....ఆస్ట్రేలియన్‌కి చెందిన 44 ఏళ్ల నోమ్ హుప్పెర్ట్ 2012లో తన పిల్లల కోసం అని తన భార్య కోసం ఇజ్రాయెల్ దేశానికి వెళ్లాడు. అయితే అతని భార్య ఇజ్రాయెల్ కోర్టులో విడాకుల కేసు వేసింది. దీంతో కోర్టు 2013లో హుప్పెర్ట్కి వ్యతిరేకంగా "స్టే-ఆఫ్-ఎగ్జిట్"(దేశాన్ని విడిచి వెళ్లకూడదు) ఆర్డర్‌ని జారీ చేసింది. అంతే కాదు పిలల్లకు 18 ఏళ్లు వచ్చే వరకు ప్రతి నెల రూ లక్ష భరణం చెల్లించాల్సి ఉంటుంది. ఈ కారణంగా అతను దేశాన్ని విడిచిపెట్టడానికి వీలు లేకుండా ఆదేశాలు జారీ చేసింది. అంటే హుప్పెర్ట్ పిల్లల భవిష్యత్తు ఖర్చుల నిమిత్తం సుమారు రూ 18 కోట్లు చెల్లించాలి. ఈ మొత్తం చెల్లించేంత వరకు హుప్పెర్ట్ డిసెంబర్ 31, 9999వ సంవత్సవరం వరకు దేశాన్ని విడిచిపెట్టి వెళ్లకుండా ఇజ్రాయెల్ కోర్టు నిషేధించింది. పైగా సెలవు కారణంగానో లేక పని మీదనో కూడా వెళ్లడానికి వీల్లేదు. అంతేకాదు ఒకసారి ఇజ్రాయెల్ కోర్టు నుంచి ఇలాంటి ఆదేశాలు(నో ఎగ్జిట్ ఆర్డర్) వచ్చిన వాళ్లు కనీసం 21 రోజులు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. అయితే ఫార్మాస్యూటికల్ కంపెనీకి సంబంధించిన రసాయన శాస్త్రవేత్త అయిన హుప్పెర్ట్ దీనిపై ఆవేదన వ్యక్తం చేశాడు.. ఇజ్రాయెల్ వివాహ చట్టాలు చాలా కఠినమైనవని పైగా పురుషుల ఆర్థిక పరిస్థితి పై కోర్టు ఎటువంటి విచారణ జరపకుండా పురుషుల ఆదాయంలో 100 శాతం చెల్లించాల్సిందేనని ఆదేశిస్తుందని అని తన గోడు బ్రిటీష్ మీడియాకి వెల్లబోసుకున్నాడు.. (చదవండి: ప్రధాని మోదీ విరాళం ఎంతో తెలుసా!!) -
ఎన్ఎస్వోకు కోపమొచ్చింది.. ఆ దేశాల్లో ‘పెగసస్’ బ్లాక్!
వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా తాము తయారుచేసిన ‘పెగసస్’స్పైవేర్ సాఫ్ట్వేర్ దుర్వినియోగం అవుతోందని పలు కథనాలు వెలువడి, అనేక దేశాల్లో వివాదమైన నేపథ్యంలో దాని తయారీసంస్థ ఎన్ఎస్వో గ్రూప్ ఆగ్రహంగా ఉంది. అందుకే తమ సొంత క్లయింట్లు ఆ స్పైర్‌వేర్‌ను వినియోగించడానికి వీల్లేకుండా తాత్కాలికంగా బ్లాక్‌చేసిందని అమెరికా మీడియాలో కథనాలొచ్చాయి. ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్ఎస్వో గ్రూప్ తయారుచేసిన పెగసస్ స్పైవేర్ సాఫ్ట్‌వేర్‌ను పలు దేశాల ప్రభుత్వాలు ఉగ్రవాదం, నేరాలు, తదితరాల కట్టడి కోసం కొనుగోలుచేస్తాయి. అయితే, ఈ లక్ష్యాలకు బదులుగా పౌరులు, జడ్జీలు, మంత్రులు, పాత్రికేయులు, మానవహక్కుల నేతలు, పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వ ఉన్నతాధికారులపై నిఘాకు దుర్వినియోగం చేస్తున్నట్లు వాషింగ్టన్ పోస్ట్, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్, తదితర అనేక మీడియా సంస్థల నివేదికలు బహిర్గతపరచడం తెల్సిందే. దీంతో ఎన్ఎస్వో సంస్థ తాత్కాలికంగా తమ క్లయింట్లు ఈ టెక్నాలజీని వాడకుండా బ్లాక్‌చేసింది. పలు మీడియాల సమాఖ్య ‘పెగసస్ ప్రాజెక్ట్’పేరిట ఈ దుర్వినియోగంపై వివరాలు రాబడుతున్న నేపథ్యంలో తమ సంస్థ ఈ చర్య తీసుకుందని ఎన్ఎస్వో ఉన్నతాధికారి చెప్పారని ఇజ్రాయెల్‌లోని లాభాపేక్షలేని స్వతంత్ర మీడియా సంస్థ నేషనల్ పబ్లిక్ రేడియో(ఎన్పీఆర్) వెల్లడించింది. ఎన్ఎస్వో ఇప్పటికే ఐదు ప్రభుత్వాలను బ్లాక్‌చేసిందని వాషింగ్టన్ పోస్ట్ తన కథనంలో పేర్కొంది. వీటిలో మెక్సికో, సౌదీ అరేబియా, దుబాయ్ కూడా ఉన్నాయని తెలుస్తోంది.అయితే, ప్రభుత్వాలు ఫోన్ల హ్యాకింగ్‌కు పాల్పడిన ఘటనకు తమ సంస్థకు ఎలాంటి సంబంధం లేదని, సంస్థ అంతర్గత దర్యాప్తులోనూ ఇదే తేలిందని ఎన్ఎస్వో ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ఆరోపణలు తీవ్రస్థాయిలో రావడంతో ఇజ్రాయెల్ దేశ ప్రభుత్వం సైతం ఎన్ఎస్వో సంస్థపై దర్యాప్తునకు ఆదేశించడం తెల్సిందే. దర్యాప్తులో భాగంగా టెల్అవీవ్ సిటీ దగ్గర్లోని ఎన్ఎస్వో ఆఫీస్‌లో అధికారులు దర్యాప్తు చేపట్టారని ఇజ్రాయెల్ రక్షణశాఖ పేర్కొంది. ఎన్ఎస్వో సంస్థకు 40 దేశాల్లో 60కిపైగా కస్టమర్లు ఉన్నారని తేలింది. ఈ లిస్ట్‌లో ఉన్నవన్నీ పలు దేశాల నిఘా, దర్యాప్తు సంస్థలు, సైనిక విభాగాలేనని సమాచారం. -
అయిదు సార్లు ఫోన్లు మార్చా..అయినా వదల్లే: పీకే
సాక్షి, న్యూఢిల్లీ: పెగాసస్ హ్యాకింగ్ వ్యవహారం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ప్రతిపక్ష నేతలు, జర్నలిస్టులు, ఇతర ప్రముఖుల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారనే ఆరోపణలు అటు లోక్సభలోకూడా తీవ్ర దుమారాన్ని రాజేసాయి. తాజాగా ఈ సెగ రాజకీయ వ్యూహాకర్త ప్రశాంత్ కిశోర్‌ను కూడా తాకింది. ఈ క్రమంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. అయిదుసార్లు తాను ఫోన్లు మార్చానని, అయినా ఇప్పటికీ హ్యాకింగ్ కొనసాగుతోందని ఆయన మండిపడ్డారు. ఇజ్రాయెల్ స్పైవేర్ 'పెగసాస్' టార్గెట్ చేసిన ప్రముఖుల్లో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కూడా ఉండటం గమనార్హం. ది వైర్ నివేదిక ప్రకారం ఎన్నికల సమయంలో ప్రశాంత్ కిషోర్ ఫోన్‌ను కేంద్రం హ్యాక్ చేసింది. ఫోరెన్సిక్ విశ్లేషణ ప్రకారం 2018 నుంచి 2019 ఎన్నికల ముందు వరకు ప్రశాంత్ కిషోర్ ఫోన్‌ను ట్యాప్ చేశారని, అలాగే జూలై 14 చివరిసారి ట్యాప్ అయినట్టు తెలుస్తోంది. ఇజ్రాయిల్‌కు చెందిన పెగాసస్ స్పైవేర్ ద్వారా దేశీయంగా ప్రముఖుల ఫోన్లు హ్యాక్ చేస్తున్నారని ఆరోపణలు గుప్పుమున్నాయి.ప్రాథమిక అంచనాల ప్రకారం సుమారు 300 మంది భారతీయుల ఫోన్లను ట్యాపింగ్ చేయగా, ఇందులో 40 మంది ప్రముఖ జర్నలిస్టులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కూడా హ్యాకర్లు టార్గెట్ చేసినట్లు సమాచారం. వైష్ణవ్ ఆయన భార్య పేరుతో రిజిస్టర్ చేసిన ఫోన్ నంబర్ల చివరి అంకెలు బహిర్గతమైన రికార్డుల్లో కన్పిస్తున్నాయని వైర్ తెలిపింది. 2014లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోనే బీజేపీ అధికారం చేపట్టేందుకు ప్రచార వ్యూహకర్తగా కిశోర్ కీలక పాత్ర పోషించారు. అయితే ఆ తరువాత బీజేపీ వ్యతిరేక పార్టీలకే పనిచేస్తూ వచ్చారు. ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ భారీ మెజార్టీతో విజయం సాధించడంలో పీకే కృషి చాలా ఉంది. కాగా ఫోన్ల ట్యాపింగ్‌కు సంబంధించి బీజేపీ రాజ్యసభ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి ట్వీట్ సంచలనంగా మారింది. కేంద్ర మంత్రులు, సుప్రీంకోర్టు జడ్జిలు, ఆర్ఎస్ఎస్ నేతలు,జర్నలిస్టుల ఫోన్ల ట్యాపింగ్‌పై సుబ్రహ్మణ్యస్వామి ట్వీట్ చర్చకు దారితీసిన సంగతి తెలిసిందే. వాషింగ్టన్ పోస్ట్ నివేదిక ప్రకారం, ఎన్ఎస్ఓ గ్రూప్, పెగాసస్ మాలావేర్ క్లయింట్ల జాబితాలో ఉన్న పది దేశాలలో భారతదేశం ఒకటి -
విడిపోని స్నేహం మనది
న్యూఢిల్లీ: స్నేహితుల దినోత్సవం సందర్భంగా భారత్‌కు ఇజ్రాయెల్ వినూత్నంగా సందేశం పంపింది. బ్లాక్‌బస్టర్ హిందీ సినిమా ‘షోలే’లోని ఏ దోస్తీ హమ్ నహీ తోడేంగే.. పాటను ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ‘భారత్‌కు ఫ్రెండ్‌షిప్‌డే శుభాకాంక్షలు! మన స్నేహం మరింత బలపడాలి, భాగస్వామ్యం ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి’ అంటూ ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం ట్విట్టర్లో పేర్కొంది. దీంతోపాటు ప్రధాని మోదీ, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుల సమావేశాల దృశ్యాలను, 1975 నాటి హిందీ హిట్ సినిమా ‘షోలే’లోని ఏ దోస్తీ హమ్ నహీ తోడేంగే(మన స్నేహాన్ని వదులుకోం)పాటను నేపథ్యంగా జత చేసింది. దీనిపై ప్రధాని మోదీ స్పందించారు. భారత్, ఇజ్రాయెల్ మధ్య స్నేహ భావం కలకాలం నిలిచి ఉంటుందంటూ హీబ్రూ భాషలో ట్వీట్ చేశారు. ‘కృతజ్ఞతలు. అద్భుతమైన ఇజ్రాయెల్ ప్రజలకు, మంచి స్నేహితుడు నెతన్యాహుకు ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు. రెండు దేశాల మైత్రి బలమైంది, శాశ్వతమైంది. ఈ స్నేహం మరింత వర్థిల్లాలి’ అని పేర్కొన్నారు. -
అంతా భారత్ చేతుల్లోనే!
ఇజ్రాయెల్‌తో శాంతి ప్రక్రియలో భారత్ కీలక భూమిక వహించాలని పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్.. భారత ప్రధాని మోదీని కోరారు. అంతకుముందు, మోదీకి రమల్లాలో ఘన స్వాగతం లభించింది. అనంతరం ఇరుదేశాధినేతలు ద్వైపాక్షిక అంశాలు, పాలస్తీనా–ఇజ్రాయెల్ శాంతి ఒప్పందాలపై చర్చించారు. రమల్లా: ఇజ్రాయెల్‌తో శాంతి ప్రక్రియలో భారత్ కీలక భూమిక వహించాలని పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్.. భారత ప్రధాని మోదీని కోరారు. శాంతి నెలకొల్పే అంశంలో వివిధ దేశాలతో చర్చించి ఒప్పించాల్సిన బాధ్యతను మోదీ భుజస్కంధాలపై పెట్టారు. అంతకుముందు, మోదీకి (పాలస్తీనా అధికార పర్యటనకు వచ్చిన తొలి భారత ప్రధాని) రమల్లాలో ఘన స్వాగతం లభించింది. అనంతరం ఇరుదేశాధినేతలు ద్వైపాక్షిక అంశాలు, పాలస్తీనా–ఇజ్రాయెల్ శాంతి ఒప్పందాలపై చర్చించారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం దిశగా ఆరు ఒప్పందాలపై ఇరుదేశాల అధికారులు సంతకాలు చేశారు. పాలస్తీనా సామర్థ్య నిర్మాణం కోసం భారత్ దాదాపు 50 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.321 కోట్లు) పెట్టుబడి పెట్టనున్నట్లు మోదీ తెలిపారు. తర్వాత ఇద్దరు నేతలు సంయుక్త మీడియా ప్రకటన విడుదల చేశారు. అంతర్జాతీయంగా పెరుగుతున్న భారత్ ప్రభావం కారణంగానే ఈ శాంతిప్రక్రియలో కీలకంగా వ్యవహరించాలని కోరామని అబ్బాస్ వెల్లడించారు. పాలస్తీనాకు అండగా ఉంటాం పాలస్తీనా ప్రభుత్వం, ప్రజల ప్రయోజనాలను కాపాడే విషయంలో భారత్ చిత్తశుద్ధితో వ్యవహరిస్తోందని మోదీ అన్నారు. ‘భారత్, పాలస్తీనాల మధ్య స్నేహం పురాతనమైనది. పాలస్తీనా అభివృద్ధి ప్రయాణంలో భారత్ భాగస్వామ్యం తప్పకుండా ఉంటుంది. చర్చల ప్రక్రియ ద్వారా పాలస్తీనా త్వరలోనే స్వతంత్ర, సార్వభౌమ దేశంగా నిలవనుంది’ అని మోదీ అన్నారు. పాలస్తీనాలో శాంతి, స్థిరత్వం నెలకొల్పే ప్రక్రియలో భారత్ మద్దతుంటుందని.. అయితే ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం చర్చల ద్వారానే సాధ్యమని మోదీ తెలిపారు. దౌత్యం, దూరదృష్టి మాత్రమే హింసకు అడ్డుకట్ట వేయగలవన్నారు. ‘ఇదేమీ అంత సులభమైన విషయం కాదు. కానీ మేం ఈ దిశగా చిత్తశుద్ధితో ప్రయత్నిస్తాం’ అని ప్రధాని పేర్కొన్నారు. యూఏఈతో ఐదు ఒప్పందాలు పాలస్తీనాలో శాంతి నెలకొల్పేందుకు భారత నాయకత్వం మొదట్నుంచీ అండగా నిలుస్తోందని అబ్బాస్ పేర్కొన్నారు. ప్రధాని మోదీతో నిర్మాణాత్మక, ఫలప్రదమైన చర్చలు జరిగాయని ఆయన తెలిపారు. పాలస్తీనాతోపాటు పశ్చిమాసియా ప్రాంతంలో నెలకొంటున్న పరిస్థితులను మోదీకి వివరించామన్నారు. అయితే.. తూర్పు జెరూసలేంను పాలస్తీనా రాజధానిగా అంగీకరించాల్సిందేనని అబ్బాస్ పేర్కొన్నారు. జోర్డాన్ నుంచి యూఏఈ చేరుకున్న ప్రధాని మోదీకి అబుధాబి యువరాజు మహ్మద్ బిన్ జాయెద్ ఘనస్వాగతం పలికారు. అనంతరం వీరిద్దరూ సమావేశమై.. విస్తృతాంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఇరు పక్షాల మధ్య ఐదు కీలక ఒప్పందాలు జరిగాయి. ఇందులో భారత ఆయిల్ కంపెనీల కన్సార్షియానికి 10% రాయితీ కల్పించే చారిత్రక ఒప్పందం కూడా ఉంది. ఇది 2018 నుంచి 2057వరకు 40 ఏళ్లపాటు అమ ల్లో ఉంటుంది. ఈ ఒప్పందంతో గల్ఫ్ దేశాల్లోని భారత కార్మికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. మోదీకి అరుదైన గౌరవం పాలస్తీనా పర్యటన సందర్భంగా మోదీకి ఆ దేశం అరుదైన గౌరవాన్ని ప్రకటించింది. పాలస్తీనా విదేశీ అతిథులకు ఇచ్చే అత్యున్నత పురస్కారం ‘గ్రాండ్ కాలర్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ పాలస్తీనా’తో సత్కరించింది. అంతకుముందు జోర్డాన్ రాజధాని అమ్మన్ నుంచి రమల్లా వరకు మోదీ హెలికాప్టర్‌కు ఇజ్రాయెల్ హెలికాప్టర్లు రక్షణగా వచ్చాయి. హెలికాప్టర్ దిగగానే.. పాలస్తీనా ప్రధాని హమ్దల్లా స్వాగతం పలికారు. అనంతరం అధ్యక్ష భవనం (మఖాటా)లో ఏర్పాటుచేసిన స్వాగత కార్యక్రమానికి అబ్బాస్ ఆలింగనంతో ఆహ్వానించారు. రమల్లాలోని యాసర్ అరాఫత్ సమాధిని సందర్శించి నివాళులర్పించారు. పాలస్తీనా తమ విదేశీ అతిథులకిచ్చే అత్యున్నత పురస్కారం ‘గ్రాండ్ కాలర్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ పాలస్తీనా’తో మోదీని సత్కరిస్తున్న పాలస్తీనా ప్రధాని మహమూద్ అబ్బాస్. శనివారం రమల్లాలో జరిగిన కార్యక్రమంలో దీన్ని అందించారు. -
నెతన్యాహుకు ఆత్మీయ స్వాగతం
న్యూఢిల్లీ: ఆరు రోజుల పర్యటన నిమిత్తం ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు భారత్ చేరుకున్నారు. ప్రొటోకాల్‌ను పక్కనపెట్టి.. ఢిల్లీ విమానాశ్రయంలో నెతన్యాహుకు ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతం పలికారు. ఆయనను హత్తుకుని భారత పర్యటనకు సాదరంగా ఆహ్వానించారు. ఈ పర్యటనలో భాగంగా పలు ద్వైపాక్షిక ఒప్పందాలపై భారత్, ఇజ్రాయెల్‌లు సంతకాలు చేయనున్నాయి. ముంబై, ఆగ్రా, గుజరాత్లో నెతన్యాహు పాల్గొనే కార్యక్రమాలకు ప్రధాని మోదీ హాజరవుతారు. నెతన్యాహు పర్యటనపై మోదీ స్పందిస్తూ.. ‘నా స్నేహితుడు నెతన్యాహుకు స్వాగతం.. భారత్‌లో మీ పర్యటన చరిత్రాత్మకమే కాకుండా ప్రత్యేకమైంది. ఇరు దేశాల మధ్య సన్నిహిత సంబంధాల్ని మరింత బలోపేతం చేస్తుంది’ అని ట్వీట్ చేశారు. భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌తో భేటీ సందర్భంగా.. తనకు లభించిన అపూర్వ స్వాగతానికి నెతన్యాహు కృతజ్ఞతలు తెలిపారు. ఆదివారం రాత్రి నెతన్యాహు, ఆయన సతీమణికి ప్రధాని మోదీ ప్రత్యేక విందు ఇచ్చారు. తీన్ మూర్తి–హైఫా చౌక్‌గా పేరు మార్పు అంతకుముందు సెంట్రల్ ఢిల్లీలోని తీన్ మూర్తి చౌక్ మెమోరియల్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో మోదీ, నెతన్యాహు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆ చౌక్ పేరును అధికారికంగా తీన్ మూర్తి– హైఫా చౌక్‌గా మార్చారు. ఇజ్రాయెల్ నగరం హైఫా విముక్తి కోసం మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో అమరులైన భారతీయ సైనికులకు ఇరువురు నేతలు నివాళులర్పించారు. తీన్ మూర్తి మెమోరియల్లోని సందర్శకుల పుస్తకంలో సంతకాలు చేశారు. ‘హైఫా నగరం విముక్తికి మొదటి ప్రపంచ యుద్ధంలో అమరులైన భారతీయ సైనికుల నిస్వార్థ త్యాగానికి నేను సెల్యూట్ చేస్తున్నా. ఇజ్రాయెల్ ప్రధాని సమక్షంలో వీర సైనికులకు నివాళులర్పిస్తున్నాం. ఈ చరిత్రాత్మక దినాన ఈ ప్రాంతానికి తీన్ మూర్తి–హైఫా చౌక్‌గా నామకరణం చేస్తున్నాం.’ అని సందర్శకుల పుస్తకంలో మోదీ రాశారు. తీన్‌మూర్తి చౌక్‌లోని మూడు కాంస్య విగ్రహాలు.. ‘15వ ఇంపీరియల్ సర్వీస్ బ్రిగేడ్’కు చెందిన హైదరాబాద్, జోధ్‌ఫూర్, మైసూర్ సైనికులకు ప్రతీక. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో సెప్టెంబర్ 23, 1918న హైఫాకు ఒట్టొమాన్, జర్మనీ బలగాల నుంచి ఈ బ్రిగేడ్ విముక్తి కల్పించింది. పలు కీలక ఒప్పందాలపై సంతకాలు ఈ పర్యటనలో భాగంగా మోదీ, నెతన్యాహులు వివిధ అంశాలపై విస్తృత స్థాయి చర్చలు జరుపుతారు. ఢిల్లీ, ఆగ్రా, గుజరాత్, ముంబైలో నెతన్యాహు పర్యటిస్తారు. చమురు, సహజవాయువు, పునరుత్పాదక ఇంధనం, సైబర్ భద్రత, తదితర ఎంఓయూలపై ఇరు దేశాలు సంతకాలు చేస్తాయి. 15 ఏళ్ల తర్వాత.. 15 ఏళ్ల అనంతరం ఇజ్రాయెల్ ప్రధాని ఒకరు భారత్‌లో పర్యటిస్తున్నారు. 2003లో అప్పటి ఇజ్రాయెల్ ప్రధాని ఏరియల్ షరన్ భారత్‌లో పర్యటించారు. ఆరు నెలల క్రితం ప్రధాని మోదీ ఇజ్రాయెల్ పర్యటనతో ఆ దేశంతో సంబంధాలు బలపడ్డాయి. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల పునరుద్ధరణ జరిగాక ఆ దేశంలో పర్యటించిన తొలి ప్రధాని మోదీనే కావడం విశేషం. -
క్షిపణుల కొనుగోలు ఒప్పందం రద్దు!
జెరూసలెం: ఇజ్రాయెల్‌కు చెందిన ఓ ఆయుధాల కంపెనీతో యుద్ధ ట్యాంకులను ధ్వంసం చేసే క్షిపణుల (స్పైక్) కొనుగోలు ఒప్పందాన్ని భారత్ రద్దు చేసుకుంది. దాదాపు రూ.3 వేల కోట్ల విలువైన 1,600 క్షిపణుల కొనుగోలు ఒప్పందాన్ని రద్దు చేసుకోవడంపై ఆ కంపెనీ విచారం వ్యక్తం చేసింది. త్వరలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు భారత్‌కు రానున్న సమయంలో ఒప్పందం రద్దు చేసుకోవడం గమనార్హం. ‘ఒప్పందం రద్దు చేసుకుంటున్నట్లు భారత్ రక్షణ శాఖ నుంచి అధికారిక సమాచారం అందింది’ అని రాఫెల్ అడ్వాన్స్ డిఫెన్స్ సిస్టమ్స్ ప్రతినిధి వెల్లడించారు. -
క్రిస్మస్ వేడుకలపై ట్రంప్ ప్రకటన ప్రభావం
బెత్లహాం: ఇజ్రాయెల్ రాజధానిగా జెరూసలెంను గుర్తిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన బెత్లహాంలో క్రిస్మస్ వేడుకలపై ప్రభావం చూపుతోంది. ప్రతి ఏడాదీ డిసెంబరు 24 అర్ధరాత్రి క్రైస్తవులు సామూహిక ప్రార్థనలు చేస్తారు. స్థానికులే కాకుండా పలు దేశాల నుంచి కూడా యాత్రికులు వస్తుంటారు. ట్రంప్ నిర్ణయంతో పాలస్తీనా నిరసనకారులు, ఇజ్రాయెల్ ఆర్మీ మధ్య ఘర్షణలు, నిరసనల నేపథ్యంలో యాత్రికుల సంఖ్య బాగా తగ్గిపోయింది. హింసకు భయపడే ఎంతోమంది పర్యాటకులు ఇక్కడకు రాలేదని ఓ ఆర్చ్‌బిషప్ చెప్పారు. -
అమెరికాకు వ్యతిరేకంగా ఐరాసలో తీర్మానం
వాషింగ్టన్: జెరూసలేంను ఇజ్రాయేల్ రాజధానిగా గుర్తిస్తూ అమెరికా తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఐరాస సాధారణ సభలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని మెజార్టీ దేశాలు ఆమోదించాయి. భారత్‌తో సహా 128 దేశాలు తీర్మానానికి అనుకూలంగా ఓటేశాయి. తొమ్మిది దేశాలు అమెరికా నిర్ణయాన్ని సమర్ధించగా.. 35 దేశాలు ఓటింగ్‌కు గైర్హాజరయ్యాయి. టర్కీ, యెమెన్ దేశాల ప్రతినిధులు ఐరాసలో తీర్మానాన్ని ప్రవేశపెడుతూ.. జెరూసలేం వివాదాన్ని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించాయి. అన్ని దేశాలు ఐరాస భద్రతా మండలి తీర్మానానికి కట్టుబడి ఉండాలని డిమాండ్ చేశాయి. -
జెరూసలేం’ తీర్మానంపై అమెరికా వీటో
వాషింగ్టన్: జెరూసలేంను ఇజ్రాయెల్ రాజధానిగా గుర్తిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఐరాస భద్రతా మండలిలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని యూఎస్ వీటో చేసింది. ఆరేళ్ల కాలంలో, ట్రంప్ హయాంలో అమెరికా ఈ హక్కును వినియోగించుకోవడం ఇదే తొలిసారి. ఈజిప్టు రూపొందించిన ఈ తీర్మానాన్ని భద్రతా మండలిలో అమెరికా మిత్ర దేశాలైన జపాన్, ఫ్రాన్స్, బ్రిటన్ కూడా సమర్థించాయి. 50 ఏళ్లుగా జెరూసలేంపై ఇజ్రాయెల్ సార్వభౌమ హక్కులను వ్యతిరేకిస్తున్న భద్రతా మండలి మరోసారి అదే వైఖరిని ఉద్ఘాటించింది. ట్రంప్ నిర్ణయంతో మధ్యప్రాచ్య ప్రాంతంలో శాంతి పునరుద్ధరణ ప్రక్రియకు విఘాతం కలుగుతుందని, అది ఉగ్రవాదులకు ఊతంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. జెరూసలేంలో దౌత్య కార్యాలయాలు ఏర్పాటుచేసుకోవద్దని కోరింది. ఈ అంశంపై సోమవారం జరిగిన ఓటింగ్‌లో అమెరికా వీటో హక్కు ప్రయోగించడాన్ని ఆ దేశ రాయబారి నిక్కీ హేలీ సమర్థించారు. తమ దౌత్య కార్యాలయం టెల్‌అవీవ్‌లోనే కొనసాగుతుందని బ్రిటన్ స్పష్టం చేసింది. -
చైనా చేతిలో మన అత్యాధునిక టెక్నాలజీ..!
న్యూఢిల్లీ : సమవుజ్జీలు అయిన రెండు దేశాల మధ్య పైచేయి కోసం జరిగే పోరాటం, పడే ఆరాటం గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. భారత రక్షణ దళం చేసిన చిన్న పొరబాటు దేశ రక్షణకు తీవ్ర ముప్పు వాటిల్లే పరిస్థితిని తెచ్చింది. కొద్ది రోజుల క్రితం భారత్‌కు చెందిన మానవ రహిత డ్రోన్ డోక్లాం పీఠభూమి సరిహద్దులో ఎగురుతూ చైనా భూభాగంలోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. డ్రోన్ భూభాగంలోకి ప్రవేశించిన రెండు వారాల తర్వాత చైనా దానిపై ప్రకటన విడుదల చేసింది. డ్రోన్‌ను నేలకూల్చినట్లు పేర్కొంది. అక్రమంగా తమ భూభాగంలోకి ప్రవేశించినందుకు భారత్ క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్ చేసింది. మన టెక్నాలజీ చైనా చేతిలో.. తాజా సమాచారం ప్రకారం పూర్తి ఫిట్నెస్తో ఉన్న డ్రోన్ హెరాన్ నుంచి టెక్నాలజీని చైనా చోరి చేసిందనే రిపోర్టులు వస్తున్నాయి. అత్యాధునిక సాంకేతికతతో తయారైన హెరాన్ డ్రోన్‌ను భారత్ ఇజ్రాయెల్ నుంచి కొనుగోలు చేసింది. దీన్ని ఇజ్రాయెలీ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్(ఐఏఐ) తయారు చేసింది. ఏ వాతావరణ పరిస్థితినైనా ఎదుర్కొనగల సామర్ధ్యం హెరాన్ సొంతం. హెరాన్ బరువులో 250 కిలోలు దాని సెన్సార్లే ఉంటాయి. ఆపరేట్ చేసే బేస్ నుంచి తప్పిపోయిన తిరిగి బేస్‌ను చేరుకునేలా దీన్ని ఐఏఐ రూపొందించింది. దీంతో డ్రోన్ చైనాలోకి తప్పిపోగానే.. అదే తిరిగి బేస్‌కు వచ్చేస్తుందని భారత రక్షణ వర్గాలు భావించాయి. అయితే అలా జరగలేదు. దీంతో ఎంతో విలువైన టెక్నాలజీని చైనా తస్కరించి ఉండొచ్చని అధికారులు బెంబేలెత్తిపోతున్నారు. డ్రోన్ ఉదంతంపై ఇజ్రాయెల్‌కు చెందిన ఓ ప్రముఖ భద్రతా సంస్థ ఆసక్తికర కామెంట్లు చేసింది. ఓ చక్కని గూఢచారిని కోల్పోవడం భారత్‌కు దెబ్బ అయితే.. అత్యాధునిక సాంకేతికతను చేజిక్కించుకున్న చైనా బలగాలకు విలువ సమాచారం దొరికినట్లే అని పేర్కొంది. కార్గిల్ యుద్ధం తర్వాత వేసిన కార్గిల్ రివ్యూ కమిటీ సూచనతో భారత్ హెరాన్ మానవ రహిత డ్రోన్లను ఇజ్రాయెల్ నుంచి కొనుగోలు చేసింది. 2000లో భారత ఆర్మీ, నేవీ, వాయుసేనలు ఈ డ్రోన్లను వినియోగించటం ప్రారంభించాయి. ప్రస్తుతం భారత ఆర్మీ వద్ద ఇలాంటి డ్రోన్లు 45 ఉన్నట్లు సమాచారం. -
గాజాపై ఇజ్రాయెల్ క్షిపణుల వర్షం
గాజా : ఇజ్రాయెల్ వాయుదళం టెర్రరిస్టు ఆక్రమిత ప్రాంతమైన గాజాపై శనివారం తెల్లవారుజామున క్షిపణుల వర్షం కురిపించింది. ఈ దాడిలో అనేక తీవ్రవాద స్థావరాలు నేలమట్టమయ్యాయి. శక్తిమంతమైన మిస్సైల్స్‌ను ఎయిర్‌బేస్‌లపై ఇజ్రాయెల్ ప్రయోగించడంతో టెర్రరిస్టు గ్రూపు హమాస్ ఘోరంగా దెబ్బతింది. అంతకుముందు శనివారం అర్థరాత్రి సమయంలో హమాస్ గ్రూపు మూడు క్షిపణులను ఇజ్రాయెల్‌పై ప్రయోగించింది. వీటిలో ఒకదాన్ని ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థ నేలకూల్చింది. మరొకటి కొంతదూరం ప్రయాణించి కుప్పకూలగా.. ఇంకొకటి మాత్రం నగరాన్ని తాకింది. దీంతో ప్రతీకార చర్యగా ఇజ్రాయెల్ రాత్రికి రాత్రి గాజాపై దాడికి పూనింది. కాగా, ఇజ్రాయెల్ క్షిపణి దాడుల్లో ఇద్దరు హమాస్ తీవ్రవాదులు హతం అయ్యారు. మరో 15 మంది గాయపడినట్లు రిపోర్టులు వచ్చాయి. గాజా–వెస్ట్ బ్యాంక్ సమస్య : పాలస్తీనా–ఇజ్రాయెల్‌ల మధ్య అనేక అంశాల్లో వివాదాలున్నాయి. ఈ నేపథ్యంలో వీటి మధ్య 1948, 1967ల్లో యుద్ధాలు కూడా జరిగాయి. 1967నాటి యుద్ధంలో పాలస్తీనా పరిధిలో ఉన్న వెస్ట్ బ్యాంక్, గాజాలు ఇజ్రాయెల్ సొంతమయ్యాయి. ప్రస్తుతం వెస్ట్‌బ్యాంక్ ఎక్కువగా ఇజ్రాయెల్ ఆధీనంలోనే ఉంది. దీంతో ఇక్కడ జరిగే కార్యకలాపాల్ని, ఇజ్రాయెల్ వ్యతిరేక నిరసనల్ని ఆ దేశం విజయవంతంగా అణచివేస్తోంది. పైగా ఇక్కడ క్రమంగా యూదుల సంఖ్య పెరుగుతోంది. కాగా, గాజా మాత్రం హమాస్ అనే ఇస్లామిక్ సంస్థ ఆధీనంలో ఉంది. గాజా, వెస్ట్ బ్యాంక్ ప్రాంతాలను దక్కించుకునేందుకు ఇజ్రాయెల్, పాలస్తీనాలు ప్రయత్నిస్తున్నాయి. -
సైనికులతో పాలస్తీనా పౌరుల కొట్లాట
బీరట్, లెబనాన్ : వివాదాస్పద నిర్ణయంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య తూర్పు దేశాల్లో పెను కల్లోలం రేపారు. జెరూసలేంను ఇజ్రాయెల్ రాజధానిగా గుర్తిస్తున్నట్లు ట్రంప్ బుధవారం రాత్రి ప్రకటించిన విషయం విదితమే. అక్కడితో ఆగని ట్రంప్ అమెరికా రాయబార కార్యాలయాన్ని టెల్ అవీవ్ నగరం నుంచి జెరూసలేంకు మార్చుతున్నట్లు కూడా పేర్కొన్నారు. ట్రంప్ నిర్ణయాలతో ఆందోళనలకు పాలస్తీనాలోని రామల్లా, బెత్లేహంలోని ప్రజలు ఇజ్రాయెల్ దళాలతో కొట్లాటకు దిగారు. ట్రంప్ ప్రకటనపై అరబ్ దేశాల్లో ఓ వైపు బహిరంగ సభలు కొనసాగుతుండగా.. మరో వైపు నిరసన జ్వాలలు ఎగసిపడుతున్నాయి. ఇదే సమయంలో మధ్య ఆసియా దేశాల్లో మళ్లీ 1967 నాటి పరిస్థితులు తలెత్తుతాయేమోననే భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ సందర్భంగా ఇజ్రాయెల్ - పాలస్తీనాలు ‘జెరూసలేం’కు అంత ప్రాధాన్యతను ఎందుకు ఇస్తున్నాయో చూద్దాం. ‘జెరూసలేం’ ఓ ప్రాచీన పుడమి.. జెరూసలేం పుడమి ఇస్లాం, క్రైస్తవం, యూదు మతాలకు ప్రసిద్ధి గాంచింది. ఈ గడ్డపై క్రీస్తు నడయాడారని కూడా నమ్మకం. తొలిసారి 1948లో జెరూసలేం విషయమై అరబ్బులు, యూదుల మధ్య వివాదం రేగింది. దీంతో జెరూసలేంలోని పశ్చిమ ప్రాంతాన్ని ఇజ్రాయెల్(యూదులు), తూర్పు ప్రాంతాన్ని అరబ్బులు కైవసం చేసుకున్నారు. 1967లో జరిగిన యుద్ధంలో తూర్పుప్రాంతాన్ని కూడా ఇజ్రాయెల్ స్వాధీనం చేసుకోవడం ఎడతెగని రక్తపాతానికి కారణమైంది. జెరూసలేంలోని తూర్పు ప్రాంతంలో జరిగే ఘోరాల్లో బయటకు రాని వాటి సంఖ్యకు లెక్కేలేదు. ఆ ప్రాంతంలో అశాంతి రాజ్యమేలుతోంది. దాదాపు మూడు వేల ఏళ్ల నాటి నుంచి జెరూసలేం ఇజ్రాయెల్ రాజధానిగా ఉంటోందననేది యూదుల వాదన. ఇదే సమయంలో జెరూసలేంలోని తూర్పు ప్రాంతం పాలస్తీనాకు రాజధాని కావాలనేది అరబ్బుల కల. చాలా మంది అరబ్బులు ఇజ్రాయెల్ ప్రభుత్వం ఓటు హక్కు ఇవ్వకున్నా.. తూర్పు జెరూసలేంలోనే ఏళ్లుగా నివసిస్తున్నారు. -
పాకిస్తాన్ ఆర్మీదే పైచేయి
న్యూఢిల్లీ : ఇజ్రాయెల్‌తో 500 మిలియన్ల డాలర్ల భారీ రక్షణ ఒప్పందాన్ని భారత్ ఉప సంహరించుకుంది. ఈ ఒప్పందం రద్దుతో భారత ఆర్మీ ఆశలు ఆవిరయ్యాయి. శత్రు దేశాల యుద్ధ ట్యాంకర్లను, బంకర్లను నాశనం చేసేందుకు ఇజ్రాయెల్‌తో 'స్పైక్ క్షిపణుల' ఒప్పందాన్ని భారత్ చేసుకుంది. పాకిస్తాన్ ఆర్మీ వద్ద మూడు నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో గల ట్యాంకర్లు, బంకర్లు నాశనం చేయగల సామర్ధ్యం గల క్షిపణులు ఉన్నాయి. అయితే, ఇజ్రాయెల్‌తో ఒప్పందం తర్వాత పాక్ కంటే శక్తిమంతమైన క్షిపణులు మనకు సమకూరుతాయని భారతీయ ఆర్మీ భావించింది. ప్రస్తుతం కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ట్యాంకర్లను నాశనం చేయగల మిస్సైల్స్ మాత్రమే మన వద్ద ఉన్నాయి. చైనానే పాక్‌కు ఇచ్చింది.. యుద్ధ ట్యాంకులను తునాతునకలు చేయగల శక్తమంతమైన చైనీస్ హెచ్‌జే-8 మిస్సైల్‌ను చైనా పాకిస్తాన్‌కు అందించింది. వీటికి పాకిస్తాన్ భక్తర్ అనే పేరు పెట్టుకుంది. అంతేకాకుండా హెచ్‌జే-8 కంటే మరింత సామర్ధ్యం గల అమెరికాకు చెందిన టీఓడబ్ల్యూ క్షిపణులు కూడా పాకిస్తాన్ అమ్ములపొదిలో ఉన్నాయి. వీటి రేంజ్ నాలుగు కిలోమీటర్ల పైమాటే. భారత్ వద్ద ఉన్నవి ఇవే.. యుద్ధ ట్యాంకులను, బంకర్లను నాశనం చేయగల క్షిపణులు భారత ఆర్మీ వద్ద కూడా ఉన్నాయి. ఫ్రెంచ్-జర్మన్‌కు చెందిన మిలన్ 2టీ, రష్యా నుంచి కొనుగోలు చేసిన కొన్కర్స్ మిస్సైల్స్లు కేవలం రెండు కిలోమీటర్ల దూరంలోని వాటిని మాత్రమే నాశనం చేయగలవు. స్పైక్ క్షిపణి ప్రత్యేకత ఇదే.. స్పైక్ క్షిపణులను ప్రయోగించడానికి ఒక జవాను చాలు. కదిలే లక్ష్యాలను కూడా ఇది చేధించగలదు. క్షిపణిని ప్రయోగించిన వెంటనే జవానులు అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి వెళ్లడానికి కూడా స్పైక్ మిస్సైల్స్ అవకాశం కల్పిస్తాయి. ఎందుకీ అర్థాంతర రద్దు..? ఇజ్రాయెల్ నుంచి కొనుగోలు చేయాలని భావించిన స్పైక్ యాంటి ట్యాంక్ మిస్సైళ్ల ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని భారత్ నిర్ణయించింది. ఈ తరహా క్షిపణుల్ని దేశీయ పరిజ్ఞానంతో తయారుచేసే బాధ్యతను రక్షణరంగ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో)కు అప్పగించింది. మేకిన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా స్పైక్ క్షిపణుల సాంకేతికతను పూర్తిస్థాయిలో భారత్‌కు బదిలీ చేసేందుకు ఇజ్రాయెల్ వైపు నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని అధికారిక వర్గాలు తెలిపాయి. ఈ తరహా క్షిపణుల రూపకల్పనకు డీఆర్డీవోకు నాలుగేళ్ల గడువు ఇచ్చినట్లు వెల్లడించాయి. ఇజ్రాయెల్‌కు చెందిన రాఫెల్ అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్స్, భారత్‌కు చెందిన కళ్యాణి గ్రూప్ స్పైక్ మిస్సైళ్లను రూపొందించడానికి హైదరాబాద్‌లో రూ.70 కోట్లతో ఉత్పత్తి కేంద్రాన్ని ఆగస్టులో ప్రారంభించాయి. -
బ్రిటన్ కేబినెట్ మంత్రి ప్రీతి రాజీనామా
లండన్: బ్రిటన్‌లో భారత సంతతి కేబినెట్ మంత్రి, బ్రెగ్జిట్‌కు గట్టి మద్దతుదారు ప్రీతి పటేల్ (45) పదవికి రాజీనామా చేశారు. ఇజ్రాయెల్ పర్యటనలో భాగంగా అనుమతి లేకుండా ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూతో పాటు పలువురు నేతలతో రహస్యంగా భేటీ కావడంతో పాటు ఆ విషయాన్ని ప్రభుత్వానికి తెలపకపోవడంతో అంతర్జాతీయ అభివృద్ధి మంత్రిగా పనిచేస్తున్న ప్రీతిపై వేటు పడింది. ఇజ్రాయెల్ నేతలతో భేటీ విషయం వివాదాస్పదంగా మారడంతో ఆఫ్రికా పర్యటనను అర్ధంతరంగా ముగించుకుని రావాలని ప్రధాని థెరిసా మే ప్రీతిని ఆదేశించారు. దీంతో బుధవారం ప్రధాని కార్యాలయానికి చేరుకున్న ఆమె థెరిసాకు రాజీనామా సమర్పించారు. రాజీనామా లేఖలో తొలుత క్షమాపణలు తెలిపిన ప్రీతి.. తాను బలంగా ప్రతిపాదించే నిజాయితీ ప్రమాణాలను అందుకోవడంలో విఫలమయ్యానని అంగీకరించారు. ఇజ్రాయెల్ నేతలతో కేవలం ఉత్సుకతతోనే భేటీ అయినట్లు చెప్పారు. సాధారణంగా విదేశీ పర్యటనలు జరిపే బ్రిటిష్ మంత్రులు ఆ వివరాలను తమ విదేశాంగ శాఖకు తప్పనిసరిగా తెలపాల్సి ఉంటుంది. -
మోదీ పర్యటనతో పాక్ వెన్నులో వణుకు
న్యూఢిల్లీ: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇజ్రాయెల్ పర్యటనను చూసి పాకిస్తాన్ వణికిపోతోంది. పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా రెండు దేశాల అధినేతలు పెద్ద కుట్ర పన్నుతున్నట్లున్నారంటూ పాక్ రక్షణ శాఖ విశ్లేషకులు, రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘పాకిస్తాన్లో అశాంతి సృష్టించేందుకు భారత్, ఇజ్రాయెల్ దేశాలు ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నాయి. ఇప్పుడు మోదీ స్వయంగా ఇజ్రాయెల్‌లో పర్యటించడం, రక్షణ ఒప్పందాలు చేసుకోవడం నిజంగా పాకిస్తాన్‌కు ఆందోళన కలిగించే అంశమే’ పాక్ విదేశాంగ శాఖకు చెందిన అధికారి ఒకరు మీడియా ముందు వ్యాఖ్యానించారు. ‘భారత్, ఇజ్రాయెల్ దేశాలు కలసి కచ్చితంగా పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా కుట్రపన్నుతుంటాయి’ అని పాకిస్తాన్ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ ప్రత్యేక సలహాదారు ఆసిఫ్ కిర్మాణి కూడా ఆందోళన వ్యక్తం చేశారు. నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో భారత్, ఇజ్రాయెల్ దేశాలు రూ.10,400 కోట్ల విలువైన రక్షణ ఒప్పందం చేసుకోవడం పట్ల పాకిస్తాన్ ఎక్కువగా ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇంతవరకు ఏ భారత ప్రధాన మంత్రి ఇజ్రాయెల్‌లో పర్యటించనప్పుడు మోదీ పర్యటించడం వెనక కచ్చితంగా మతలబు ఉంటుందని పాక్ ఆందోళన చెందుతుంది. ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ఇంతకాలం పాలస్తీనాకు భారత్ మద్దతు ఇస్తూ రావడం వల్ల భారత ప్రధానులెవరూ ఆ దేశంలో పర్యటించలేదు. భారత్‌తోపాటు ప్రపంచ దేశాలు కూడా ఇప్పుడు పాలస్తీనా సమస్యను దాదాపు మరచిపోయాయి. అందుకనే మోదీ ప్రస్తుత ఇజ్రాయెల్ పర్యటన పట్ల కూడా ప్రపంచ దేశాలు అభ్యంతరం వ్యక్తం చేయలేదు. -
వ్యూహాత్మక బంధం!
సిక్కిం సమీపంలోని సరిహద్దుల్లో చైనాతో మనకేర్పడ్డ వివాదం ముదురుతున్న తరుణంలో భారత్–ఇజ్రాయెల్ మధ్య ఉన్న చిరకాల చెలిమి ‘వ్యూహాత్మక భాగ స్వామ్యం’లోకి ప్రవేశించింది. దౌత్య పరిభాషలో ‘వ్యూహాత్మక భాగస్వామ్యా’నికి విస్తృతార్ధం ఉంటుంది. మన దేశానికి ఇలాంటి సంబంధాలు చాలా తక్కువ దేశాలతో–అమెరికా, జపాన్, బ్రిటన్, ఆస్ట్రేలియా వగైరాలతో ఉన్నాయి. ఇరు దేశా ల్లోనూ భవిష్యత్తులో వచ్చే ప్రభుత్వాలు ఇక వెనక్కు వెళ్లలేనంతగా ఈ సంబంధాలు పెనవేసుకుంటాయి. ఇవి ఆర్ధిక, రాజకీయ, రక్షణ, సాంకేతిక రంగాలకు విస్తరిస్తాయి. అందుకే ప్రధాని నరేంద్రమోదీతో బుధవారం రెండు గంటలపాటు చర్చలు సాగిన తర్వాత మాట్లాడిన ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ తాజా బంధాన్ని ‘స్వర్గంలో కుదిరిన పెళ్లి’గా అభివర్ణించారు. అంతకుముందు రోజు ఈ ద్వైపాక్షిక బంధాన్ని ‘ఐ స్క్వేర్ టీ స్క్వేర్’(ఇజ్రాయెల్ టెక్నాలజీ, ఇండియన్ టాలెంట్) అని చమత్కరించారు. దేన్నయినా హత్తుకునేలా చెప్పే మోదీ దీన్ని ‘ఐ ఫర్ ఐ’(ఇండియా ఫర్ ఇజ్రాయెల్)గా వర్ణించి ఆ పదబంధానికుండే ‘కంటికి కన్ను’ అర్ధాన్నే మార్చేశారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల్లో అంతరిక్ష పరిశోధన మొద లుకొని వ్యవసాయం, జల సంరక్షణ వగైరాల వరకూ ఏడు ప్రధానాంశాలున్నా రక్షణ, భద్రత అత్యంత కీలకం కాబోతున్నదని ఇరు దేశాల సంయుక్త ప్రకటన తెలియజెబుతోంది. ఈ ప్రకటన బహురూపాల్లో, వ్యక్తీకరణల్లో ఉండే ఉగ్రవాదాన్ని ఖండించడంతోనే సరిపెట్టలేదు. ఉగ్రవాదానికి, ఉగ్రవాద ముఠాలకు మద్దతు, ప్రోత్సాహం, నిధులు, ఆశ్రయం కల్పించేవారికి వ్యతిరేకంగా కఠిన చర్యలు తీసు కుంటామని హెచ్చరించింది. భాగస్వాములు కాదల్చుకున్న దేశాలు ఈ స్థాయిలో దృఢంగా తనతో ఉండాలని మన దేశం ఎప్పటినుంచో కోరుకుంటున్నది. ఆ విష యంలో ఇజ్రాయెల్ ముందున్నట్టయింది. ఇజ్రాయెల్ మనతో పోలిస్తే చిన్న దేశమే కావొచ్చుగానీ... ఉగ్రవాదాన్ని ఎదుర్కొనడంలో దానికున్న అనుభవం అంతా ఇంతా కాదు. దానితో వ్యవహరించడానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం అభి వృద్ధిలో కూడా ఆ దేశానికి పేరుప్రఖ్యాతులున్నాయి. భారత గడ్డపై జరిగే ఉగ్రవాద చర్యలన్నిటి మూలాలూ పాకిస్తాన్లో ఉన్నాయని మన దేశం తరచు చెబుతుంటుంది. కొన్ని ఘటనలకు సంబంధించి కీలకమైన సాక్ష్యాధారాలను కూడా వెల్లడించింది. అయినా అమెరికా మొదలుకొని చాలా దేశాలు పరోక్షంగా విమర్శిం చడమే తప్ప నేరుగా పేరెట్టి మీ గడ్డ ఉగ్రవాదుల అడ్డాగా మారిందని పాకిస్తాన్‌కు ఎప్పుడూ చెప్పలేదు. ఆ విషయంలో ఇజ్రాయెల్ ఎలాంటి తడు ములాట లేకుండా గట్టిగా ఖండిస్తుందని ఈ సంయుక్త ప్రకటన స్పష్టం చేస్తున్నది. అయితే మనం కూడా ఆ స్థాయిలోనే స్పందించాల్సివస్తుంది. పాలస్తీనా సంస్థల కార్యకలాపాలు హింసాత్మక రూపం తీసుకున్నప్పుడు మన దేశం కటువైన భాష ఉపయోగించేది కాదు. సమస్య పరిష్కారానికి అన్ని పక్షాలూ శాంతి యుతంగా కృషి చేయాలని సూచించేది. ఇకపై మన ధోరణి కూడా మార్చుకోవాల్సి ఉంటుంది. నరేంద్రమోదీ తాజా పర్యటన ఇజ్రాయెల్‌తో మనకున్న సంబంధాలను పున ర్నిర్వచించింది. ఇజ్రాయెల్ అనుసరిస్తున్న విధానాన్ని ఒకప్పుడు యూదు మత వాదంగా, జాత్యహంకారంతో సమం చేస్తూ అంతర్జాతీయ వేదికలపై మాట్లాడిన మన దేశం ఇప్పుడు దాన్ని పూర్తిగా విడనాడిందని ఆయన పర్యటన స్పష్టం చేసింది. కొన్ని దశాబ్దాలుగా భారత్ అలా అంటున్నా ఇజ్రాయెల్ ఏనాడూ నొచ్చు కోలేదు. మనతో ఉన్న సంబంధాలపై ఆ ప్రభావం పడనీయలేదు. మోదీకి స్వాగతం చెప్పిన సందర్భంగా హత్తుకున్న నెతన్యాహూ ఈ రోజు కోసం ఇజ్రాయెల్ ఏడు దశాబ్దాలుగా వేచి చూస్తున్నదని చెప్పడాన్నిబట్టే భారత్‌తో సాన్నిహిత్యం కోసం ఆ దేశం ఎంత తహతహలాడుతున్నదో అర్ధం చేసుకోవచ్చు. నిజానికి నరేంద్ర మోదీ కూడా ఆ స్థాయిలోనే ఇజ్రాయెల్ పట్ల తనకున్న మమకారాన్ని వ్యక్తం చేశారు. ఇన్నాళ్లూ మంత్రుల హోదాలో ఆ దేశం వెళ్లిన ఎల్కే అద్వానీ మొదలుకొని సుష్మా స్వరాజ్ వరకూ నేతలందరూ తప్పనిసరిగా పక్కనున్న పాల స్తీనా కూడా వెళ్లేవారు. ఆ దేశం మనసు కష్టపెట్టుకుంటుందన్న భావమే ఇందుకు కారణం. కానీ నరేంద్రమోదీ ఆ సంప్రదాయానికి స్వస్తి పలికారు. అయితే అంతర్జాతీయంగానూ, పశ్చిమాసియాలోనూ మారిన పరిస్థితుల నేప థ్యంలో ఒకరితో స్నేహసంబంధాలు ఏర్పడినంత మాత్రాన వేరొకరితో అవి నిలిచిపోతాయనుకోవాల్సిన అవసరం లేదు. నిజానికి ఇన్నేళ్లుగా మన దేశం అరబ్బు దేశాలతో చెలిమి చేస్తున్నా అవి కశ్మీర్ విషయంలో పాకిస్తాన్నే బహి రంగంగా సమర్ధిస్తూ వచ్చాయి. ఇజ్రాయెల్‌తో మన సంబంధాలు అంతంత మాత్రంగానే ఉంటున్నా ఆ దేశం కశ్మీర్ వివాదంలో ఎప్పుడూ మనల్నే సమర్ధించింది. అరబ్బు దేశాలతో మన వాణిజ్యం 2016–17లో 12,000 కోట్ల డాలర్ల మేర ఉంది. ఇందులో 5,000 కోట్ల డాలర్లు ఎగుమతులు, 7,000 కోట్లు దిగుమతులు ఉంటాయని ఒక అంచనా. అదే ఇజ్రాయెల్‌తో చూస్తే ఆ వాణిజ్యం మొత్తం 500 కోట్ల డాలర్లు మాత్రమే. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక ఇజ్రాయెల్‌తో మనకున్న ఆయుధ కొనుగోళ్లు 117 శాతం పెరిగిన మాట వాస్తవమే అయినా ఇప్పటికీ రష్యాయే మన ప్రధాన అమ్మకందారు. ఖతార్‌తో కలహం వచ్చాక అరబ్బు దేశాల శిబిరం సమైక్యంగా లేదు. మోదీ ఈ రెండేళ్లలోనూ పశ్చిమాసియాలోని దేశాలన్నీ పర్యటించారు. ఇన్నాళ్లకు ఇజ్రాయెల్‌ను ఎంచుకున్నారు. ఉగ్రవాదంపై మన దేశం చేసే పోరు భవిష్యత్తులో కొత్త రూపు సంతరించుకుంటుందని ఈ పర్యటన తేటతెల్లం చేసింది. ఉగ్రవాదంపై అంత ర్జాతీయ ఒడంబడిక కోసం రెండు దశాబ్దాలుగా సాగుతున్న చర్చలు ఆ పదానికివ్వాల్సిన నిర్వచనం దగ్గరే కొట్టుమిట్టాడుతున్న తరుణంలో... ఇజ్రా యెల్‌తో మనకేర్పడిన తాజా బంధం దానికి కొత్త ఊపునిస్తుందని... వ్యవసాయ, జల సంరక్షణ విధానాల్లో విప్లవాత్మక మార్పులకు దోహదపడుతుందని చెప్పవచ్చు. -
బంధం కోసం: 'ఐ ఫర్ ఐ'
జెరుసలేం/న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెటన్యాహుతో బుధవారం భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ప్రపంచ శాంతి, భద్రతలకు ఇరుదేశాలు చేయాల్సిన కృషిపై చర్చించారు. దాదాపు నాలుగు గంటలపాటు సాగిన ఇరువురు దేశాధినేతల భేటీలో ఏడు ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. వీటిలో వ్యవసాయం, నీటి నిర్వహణ వంటి కీలకమైన ఒప్పందాలు కూడా ఉన్నాయి. ఇజ్రాయెల్‌లో తనకు లభించిన స్వాగతానికి ప్రధానమంత్రి మోదీ.. నెటన్యాహుకు ధన్యవాదాలు తెలియజేశారు. భారత పర్యటనకు కుటుంబ సమేతంగా విచ్చేయాలని మోదీ నెటన్యాహును ఆహ్వానించారు. దీనిపై స్పందించిన నెటన్యూహు.. మోదీ ఆఫర్‌ను అంగీకరిస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే భారత పర్యటనకు విచ్చేస్తామని వెల్లడించారు. కాగా, ఓ భారత ప్రధానమంత్రి ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్లడం ఇదే తొలిసారి. మోదీ ఇజ్రాయెల్ పర్యటన - కీలకాంశాలు: 1- ఇరువురు దేశాధినేతల భేటీ అనంతరం 2008 పేలుళ్ల బాధితురాలైన ఇజ్రాయెల్ బాలిక మోషే హోల్ట్జ్బెర్గ్ను మోదీ కలిశారు. మోషే ప్రధానమంత్రి మోదీని తమ దేశానికి ఆహ్వానిస్తూ 'డియర్ మిస్టర్ మోదీ.. ఐ లవ్ యూ' అంటూ వెల్కమ్ నోట్‌ను చదివింది. 2- ఇరు దేశాలను ఉగ్రవాదం సవాలు చేస్తోందని నెటన్యాహు అన్నారు. మోషేను కలవడం ఇరు దేశాలు చెడుకు వ్యతిరేకంగా పోరాడతాయని చెప్పడానికేనని తెలిపారు. 3- వ్యవసాయం, నీరు, ఆరోగ్యం తదితర కీలకాంశాలపై చర్చించినట్లు నెటన్యాహు పేర్కొన్నారు. ఇరుదేశాల భాగస్వామ్యం మంచిని పెంచి పోషించేందుకు కృషి చేస్తుందని చెప్పారు. 4- భారత్, ఇజ్రాయెల్‌లు ఒకరి ఇంట్రెస్ట్‌లను మరొకరు పరస్పరం గౌరవించుకుని, సహకరించుకుంటాయని మోదీ పేర్కొన్నారు. 5- ఇరు దేశాలు పెట్టుబడులను పెంచుకుంటు పోవడం వల్ల భాగస్వామ్యం మరింత దృఢపడుతుందని మోదీ చెప్పారు. గురువారం ఇరు దేశాల ప్రధానమంత్రులు టాప్ కంపెనీల సీఈవోలను భేటీ అవనున్నారు. 6- మూడు రోజుల పర్యటనకు వెళ్లిన మోదీ.. తనకు లభించిన ఆహ్వానంపై ట్వీటర్ ద్వారా స్పందించారు. తనను ప్లీజ్ చేయడం కోసం అధ్యక్షుడు రివ్లిన్ ప్రోటోకాల్‌ను ఉల్లంఘించారని చెప్పారు. ఇజ్రాయెల్ తనకు ఘన స్వాగతాన్ని పలికిందని తెలిపారు. నెటన్యాహు తనకు ఇచ్చిన గౌరవం భారత ప్రజలకు ఇచ్చిందని అన్నారు. 7- ఐ ఫర్ ఐ( ఇండియా ఫర్ ఇజ్రాయెల్, ఇజ్రాయెల్ ఫర్ ఇండియా) అని మోదీ వ్యాఖ్యానించారు. అధ్యక్షుడు రివ్లిన్ను కలిసిన అనంతరం మోదీ ఈ వ్యాఖ్య చేశారు. 8- ఈ రోజు కోసం తాము 70 సంవత్సరాల నుంచి వేచి చూస్తున్నట్లు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెటన్యాహు అన్నారు. భారత్-ఇజ్రాయెల్‌ల మధ్య సంబంధం సహజమైనదని చెప్పారు. 9- ప్రధాని మోదీకి ఇస్తున్న విందుకు నెటన్యాహు హాజరయ్యారు. 10- ఇజ్రాయెల్‌లో నివసిస్తున్న భారతీయులను ఉద్దేశించి జెరుసలేంలో ప్రధాని మోదీ చేసే ప్రసంగానికి నెటన్యాహు కూడా హాజరుకానున్నారు. -
ఇజ్రాయెల్ మాజీ ప్రధాని ఎహుద్ విడుదల
జెరూసలేం: ఇజ్రాయెల్ మాజీ ప్రధాని ఎహుద్ ఓల్మెర్ట్(71) జైలు నుంచి విడుదలయ్యారు. ఇక్కడి పెరోల్ బోర్డు ఆయన శిక్ష పూర్తికాకుండానే ఆదివారం విడుదల చేసింది. జెరూసలేం మేయర్‌గా, దేశ విదేశాంగ మంత్రిగా పనిచేస్తున్న సమయంలో ఓ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టును ప్రోత్సహించడానికి ఎహుద్ లంచం తీసుకున్నారని కేసు నమోదైంది. 2014లో న్యాయస్థానం ఆయనను దోషిగా నిర్ధారించింది. 2006లో ఇజ్రాయెల్ ప్రధానిగా ఎన్నికైన ఎహుద్ పాలస్తీనాతో శాంతిస్థాపనకు విశేషంగా కృషిచేశారు. ఓ దశలో జెరూసలేంలోని కొంత భాగాన్ని శాంతి ఒప్పందం ద్వారా వదులుకునేందుకు సైతం సిద్ధపడ్డారు. మరోవైపు జైలు నుంచి ముందస్తుగా విడుదల అయిన ఎహుద్ కొన్ని మాసాల పాటు సామాజిక సేవ చేయాల్సి ఉంటుందని జైళ్ల శాఖ అధికార ప్రతినిధి అస్సఫ్ లిబ్రటి తెలిపారు. -
ఈ ఫోన్ రేటు చూస్తే దిమ్మ తిరగాల్సిందే!
జెరుసలేం: మనకు తెలిసిన మామూలు ఫోన్ల రేట్లు సాధారణంగా తక్కువగానే ఉంటాయి. మరి సోలారిన్ పేరుతో విడుదలకు సిద్ధమైన ఈ ఫోన్ రేటు చూస్తే ఎవరికైనా దిమ్మ తిరగాల్సిందే... ఈ మొబైల్ ఖరీదు అక్షరాల 20 వేల డాలర్లు(13.3 లక్షలు) ఇంత రేటు కలిగిన మొబైల్స్ సాధారణంగా వజ్రాలు, బంగారంతో డిజైన్లు చేసి ఉంటాయనుకుంటున్నారా? అయితే సోలారిన్ ... సాధారణ ఆండ్రాయిడ్ ఫోన్ మాదిరిగానే ఉండబోతోందని కంపెనీ తెలిపింది. ఇంతకీ ఈ ఫోన్ ప్రత్యేకత ఏంటా..? అని అనుకుంటున్నారా....ఈ మొబైల్‌ను తయారు చేస్తున్న బ్రిటీష్, ఇజ్రాయెల్‌లకు చెందిన ఓ స్టార్టప్ కంపెనీ... ఉద్యోగ నిపుణులను దృష్టిలో ఉంచుకుని తామీ ఫోన్ తయారు చేస్తున్నట్లు తెలిపింది. కాస్త రేటు ఎక్కువగా అనిపించినా సోలారిన్ మిలటరీ గ్రేడ్ సెక్యూరిటీతో వినియోగదారులకు లభిస్తుందనీ, దీనివల్ల సమాచారాన్ని హ్యాక్ కాకుండా కాపాడుకునేందుకు ఎక్కువ వెచ్చించాల్సిన పని లేదని కంపెనీ వివరించింది. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న టెక్నాలజీకి ఈ ఫోన్ ఫీచర్స్ మూడు సంవత్సరాల ముందుకు ఉంటుందని కంపెనీ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్లు చెప్పారు. యూరప్, అమెరికా దేశాల్లో హ్యాకర్ల బారి నుంచి తప్పించుకోవాలని చూసే వారందరూ ఈ మొబైల్‌ను కొనేందుకు ఆసక్తి చూపుతారని వారు వివరించారు. ప్రస్తుతం ప్రపంచ లగ్జరీ ఫోన్ల మార్కెట్ విలువ 1.1 బిలియన్ డాలర్లుగా ఉందని వారు తెలిపారు.