ఎంతవారైనా కాంత దాసులే అంటాడు త్యాగరాజు. ఆడదాని ఓరచూపులో చిత్తుకానీ మగాడు లేడు అంటాడు ఓ సినీ కవి. అవన్నీ నిజమే అనేలా శాస్త్రవేత్తల అధ్యయనంలో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. ఆడవాళ్ల కంటి నుంచి వచ్చే కన్నీళ్లకు ఉన్న శక్తిని చూసి ఆశ్చర్యపోయారు. దెబ్బకి మగాడిలో ఉన్న దూకుడుతునానికి కళ్లెం పడుతుందని ప్రూవ్ చేసి చూపించారు కూడా.
ఈ మేరకు ఇజ్రాయెల్‌లోని వీజ్ మాన్ ఇన్‌స్టిట్యూట్ ఆప్ సైన్స్ నిర్వహించిన పరిశోధనలో మానవ కన్నీళ్లలో రసాయన సంకేతం ఉందని, మెదడు కార్యకలాపలను ప్రభావితం చేస్తుందని కనుగొన్నారు. స్త్రీల నుంచి వచ్చే కన్నీళ్ల వాసన పురుషుల కోపాన్ని నియంత్రిస్తుందని వెల్లడించారు. అందుకోసం పరిశోధకులు ఆడ ఎలుకలపై పరిశోధన చేశారు. ఆ అధ్యయనంలో ఆడ ఎలుకల కన్నీళ్లు మగ ఎలుకల దాడిని నియంత్రించినట్లు తెలిపారు. అంతేగాదు ఈ మగ ఎలుకలు కూడా తమ కన్నీళ్లతో ఆల్పా అనే జాతి ఎలుకల దాడిని నివారిస్తాయిని పేర్కొన్నారు.
అలాగే ఇద్దరు వాలంటీర్ మహిళలపై కూడా ప్రయోగం చేశారు. వాళ్లికి ముందుగానే ఇద్దరు మగావాళ్లతో కొన్ని రకాల గేమ్‌లు ఆడమన్నారు. అలాగే వారి డబ్బులను లాక్కునేలా మోసం చేయమన్నారు. ఆ తర్వాత వెంటనే కన్నీళ్లు పెట్టుకుని క్షమాపణలు చెప్పమన్నారు. ఇలా చేయంగానే సదరు మగవాళ్లలో ప్రతికార చర్యలు నెమ్మదిగా తగ్గిపోయినట్లు గమనించారు. ఈ అధయనంలో ప్రతీకారం తీర్చుకోవాలనే పురుషుల కోరిక 43.7% వరకు తగ్గిపోయిందన్నారు. ఈ పరిశోధనలో పాల్గొన్న సదరు పురుషులను బ్రెయిన్‌ను ఎమ్మారై స్కాన్ చేయగా మహిళ కన్నీళ్ల వాసన వారి మెదడును ప్రభావితం చేసి ఆయా ప్రాంతాల్లో ప్రిఫ్రంటల్ కార్టెక్స్, పూర్వ ఇన్సులాలో చురుకుదనం తక్కువగా ఉన్నట్లు గుర్తించారు.
ఇక్కడ కొన్ని విషయాలను గమనించాలి. శిశువులు పుట్టగానే ఏడుస్తారు. ఇక్కడ వారికి వచ్చే హానిని నియంత్రించడానికి కన్నీళ్లు పెట్టేలా ఏడవడం జరుగుతుందన్నారు. ఇక్కడ శిశువులు నిస్సహాయులు కాబట్టి తమ పట్ల కోపంగా ప్రవర్తించొద్దని ఏడుపు రూపంలో తెలియజేస్తారని, అందుకు తగ్గట్టుగానే మానవ మెదడు ఆటోమెటిక్‌గా కరిగి కోపాన్ని తమాయించుకుంటుంది. ఇదే మాదిరిగా నిజజీవితంలో కొన్ని సందర్భాల్లో ఈ కన్నీళ్లు వాసన ప్రభావంతంగా కనిపించదని కూడా చెప్పారు.
గృహహింస, ఆడవాళ్లపై అకృత్యాలు లేదా టార్చర్ పెట్టే నేరగాళ్లలో దూకుడుని ఈ కన్నీళ్ల వాసన పెద్దగా ప్రభావం చేయకలేకపోయిందని అన్నారు ఇక్కడ కాస్త దీన్ని నిశితంగా గమనిస్తే.. వాళ్లది హింసా ప్రవృత్తి. సాధారణంగా సున్నితమైన మనస్సు గలవాళ్లకే మహిళ కన్నీళ్లకు ఇలా ప్రతిస్పందిస్తారని శాస్త్రవేత్తలు ధీమాగా చెబుతున్నారు. ఇక్కడ మహిళ కన్నీళ్ల వాసన మగవాడి కోపానికి కళ్లేం వేయగలిగినప్పుడు, స్త్రీ పట్ల అమానుషింగా ప్రవర్తించే నేరగాళ్ల బ్రెయిన్‌ని ఎందుకు ప్రభావితం చేయలేకపోతుందనేది శాస్త్రవేత్తలకు అర్థంకానీ చిక్కు ప్రశ్న. ఈ మిస్టరీని చేధించగలిగితే మహిళల పట్ల జరిగే ఎన్నో అమానుషాలను సులభంగా నియంత్రించొచ్చని చెప్పింది పరిశోధకుల బృందం.
(చదవండి: సర్జరీ చేసే టైంలో పేషెంట్‌పై డాక్టర్ తోడి! వీడియో వైరల్)
Comments
Please login to add a commentAdd a comment