Aggressive
-
వేసవిలో శునకాలు ఎందుకు రెచ్చిపోతుంటాయి?
దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. మనుషులతో పాటు జంతువులు కూడా ఎండ వేడిమికి తాళలేకపోతున్నాయి. వేసవిలో శునకాలు రెచ్చిపోతుండటాన్ని మనం చూస్తుంటాం. అవి ఎందుకు అలా ప్రవర్తిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.మనుషులకు మాదిరిగానే చలికాలం, వేసవి కాలం, వర్షాకాలం మొదలైనవి కుక్కల ప్రవర్తనను ప్రభావితం చేస్తాయి. ఒక నివేదిక ప్రకారం కుక్కలు చల్లని వాతావరణంలో ఉదాశీనంగా ఉంటాయి. అయితే వేసవికాలం రాగానే అవి హైపర్ యాక్టివ్‌గా మారిపోతాయి. వేసవిలో కుక్కలు మరింత దూకుడుగా మారుతాయని ఒక పరిశోధనలో వెల్లడయ్యింది.అమెరికన్ వెటర్నరీ మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జోస్ ఆర్చ్ తెలిపిన వివరాల ప్రకారం వేసవి కాలంలో శునకాలు మరింత వేడి అనుభూతికి లోనవుతాయి. వేసవికాలం మనుషులకు మించి శునకాలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది. అధిక వేడి లేదా ఉష్ణోగ్రత శునకాలలోని థర్మోగ్రూలేషన్ను ప్రభావితం చేస్తుంది. దీని కారణంగా కుక్కలు వేడిని తట్టుకోలేవు. ఇటువంటి పరిస్థితిలో కుక్కలు అసాధారణంగా ప్రవర్తిస్తాయి.వేసవి కాలంలో కుక్కలలో కార్టిసాల్ హార్మోన్ (స్ట్రెస్ హార్మోన్) పెరుగుతుందని పెన్ స్టేట్ యూనివర్శిటీ ఒక పరిశోధనలో కనుగొంది. దీని కారణంగా అవి అసాధారణంగా ప్రవర్తిస్తాయని గుర్తించారు. ఈ సమయంలో కుక్కలు ఆకస్మికంగా మొరగడం, మనుషులను చుట్టుముట్టడం, కరవడం, పరిగెత్తడం లాంటి చర్యలను చేస్తాయి.వేసవిలో పెంపుడు శునకాలు లేదా వీధి కుక్కలు ఇలా ప్రవర్తించకుండా ఉండాలంటే వాటికి నీరు, ఆహారం అందుబాటులో ఉంచాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే అవి ఎప్పుడూ నీరసంగా పడుకున్నట్లు కనిపిస్తే, అవి వడ దెబ్బకు గురయ్యాయని గుర్తించాలి. అటువంటి స్థితిలో వాటికి వైద్య సహాయం అందించాలి. -
మగువ కన్నీళ్లకు ఇంత శక్తి ఉందా? పరిశోధనలో షాకింగ్ విషయాలు
ఎంతవారైనా కాంత దాసులే అంటాడు త్యాగరాజు. ఆడదాని ఓరచూపులో చిత్తుకానీ మగాడు లేడు అంటాడు ఓ సినీ కవి. అవన్నీ నిజమే అనేలా శాస్త్రవేత్తల అధ్యయనంలో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. ఆడవాళ్ల కంటి నుంచి వచ్చే కన్నీళ్లకు ఉన్న శక్తిని చూసి ఆశ్చర్యపోయారు. దెబ్బకి మగాడిలో ఉన్న దూకుడుతునానికి కళ్లెం పడుతుందని ప్రూవ్ చేసి చూపించారు కూడా. ఈ మేరకు ఇజ్రాయెల్‌లోని వీజ్ మాన్ ఇన్స్టిట్యూట్ ఆప్ సైన్స్ నిర్వహించిన పరిశోధనలో మానవ కన్నీళ్లలో రసాయన సంకేతం ఉందని, మెదడు కార్యకలాపలను ప్రభావితం చేస్తుందని కనుగొన్నారు. స్త్రీల నుంచి వచ్చే కన్నీళ్ల వాసన పురుషుల కోపాన్ని నియంత్రిస్తుందని వెల్లడించారు. అందుకోసం పరిశోధకులు ఆడ ఎలుకలపై పరిశోధన చేశారు. ఆ అధ్యయనంలో ఆడ ఎలుకల కన్నీళ్లు మగ ఎలుకల దాడిని నియంత్రించినట్లు తెలిపారు. అంతేగాదు ఈ మగ ఎలుకలు కూడా తమ కన్నీళ్లతో ఆల్పా అనే జాతి ఎలుకల దాడిని నివారిస్తాయిని పేర్కొన్నారు. అలాగే ఇద్దరు వాలంటీర్ మహిళలపై కూడా ప్రయోగం చేశారు. వాళ్లికి ముందుగానే ఇద్దరు మగావాళ్లతో కొన్ని రకాల గేమ్‌లు ఆడమన్నారు. అలాగే వారి డబ్బులను లాక్కునేలా మోసం చేయమన్నారు. ఆ తర్వాత వెంటనే కన్నీళ్లు పెట్టుకుని క్షమాపణలు చెప్పమన్నారు. ఇలా చేయంగానే సదరు మగవాళ్లలో ప్రతికార చర్యలు నెమ్మదిగా తగ్గిపోయినట్లు గమనించారు. ఈ అధయనంలో ప్రతీకారం తీర్చుకోవాలనే పురుషుల కోరిక 43.7% వరకు తగ్గిపోయిందన్నారు. ఈ పరిశోధనలో పాల్గొన్న సదరు పురుషులను బ్రెయిన్‌ను ఎమ్మారై స్కాన్ చేయగా మహిళ కన్నీళ్ల వాసన వారి మెదడును ప్రభావితం చేసి ఆయా ప్రాంతాల్లో ప్రిఫ్రంటల్ కార్టెక్స్, పూర్వ ఇన్సులాలో చురుకుదనం తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ఇక్కడ కొన్ని విషయాలను గమనించాలి. శిశువులు పుట్టగానే ఏడుస్తారు. ఇక్కడ వారికి వచ్చే హానిని నియంత్రించడానికి కన్నీళ్లు పెట్టేలా ఏడవడం జరుగుతుందన్నారు. ఇక్కడ శిశువులు నిస్సహాయులు కాబట్టి తమ పట్ల కోపంగా ప్రవర్తించొద్దని ఏడుపు రూపంలో తెలియజేస్తారని, అందుకు తగ్గట్టుగానే మానవ మెదడు ఆటోమెటిక్‌గా కరిగి కోపాన్ని తమాయించుకుంటుంది. ఇదే మాదిరిగా నిజజీవితంలో కొన్ని సందర్భాల్లో ఈ కన్నీళ్లు వాసన ప్రభావంతంగా కనిపించదని కూడా చెప్పారు. గృహహింస, ఆడవాళ్లపై అకృత్యాలు లేదా టార్చర్ పెట్టే నేరగాళ్లలో దూకుడుని ఈ కన్నీళ్ల వాసన పెద్దగా ప్రభావం చేయకలేకపోయిందని అన్నారు ఇక్కడ కాస్త దీన్ని నిశితంగా గమనిస్తే.. వాళ్లది హింసా ప్రవృత్తి. సాధారణంగా సున్నితమైన మనస్సు గలవాళ్లకే మహిళ కన్నీళ్లకు ఇలా ప్రతిస్పందిస్తారని శాస్త్రవేత్తలు ధీమాగా చెబుతున్నారు. ఇక్కడ మహిళ కన్నీళ్ల వాసన మగవాడి కోపానికి కళ్లేం వేయగలిగినప్పుడు, స్త్రీ పట్ల అమానుషింగా ప్రవర్తించే నేరగాళ్ల బ్రెయిన్‌ని ఎందుకు ప్రభావితం చేయలేకపోతుందనేది శాస్త్రవేత్తలకు అర్థంకానీ చిక్కు ప్రశ్న. ఈ మిస్టరీని చేధించగలిగితే మహిళల పట్ల జరిగే ఎన్నో అమానుషాలను సులభంగా నియంత్రించొచ్చని చెప్పింది పరిశోధకుల బృందం. (చదవండి: సర్జరీ చేసే టైంలో పేషెంట్‌పై డాక్టర్ తోడి! వీడియో వైరల్) -
అగ్గిపెట్టె మచ్చా పేరిట అరుదైన ఘనత!
‘నమస్తే అన్నా..’ అంటూ ఆప్యాయంగా సంభాషణ మొదలుపెట్టే అగ్గిపెట్టె మచ్చా, అవతలి వాళ్లు రెచ్చగొట్టడం, అటుపై తనదైన స్టైల్లో వాళ్లపై తిట్ల పురాణం అందుకోవడం ద్వారా ఫేమస్ అయ్యాడని తెలిసిందే. చిత్తూరుకు చెందిన కిరణ్ కుమార్ అలియాస్ అగ్గిపెట్టె మచ్చా.. ఇప్పుడు అరుదైన ఘనతను దక్కించుకున్నాడు. ప్లేస్టోర్‌లో అతని పేరిట రిలీజ్ అయిన ఓ గేమ్.. లక్షకు పైగా డౌన్లోడ్లు సాధించడం విశేషం. ఒక మీమ్ క్యారెక్టర్.. అందునా తెలుగు మీమ్ క్యారెక్టర్ మీద వీడియో గేమ్ ఈ ఘనత సాధించడం ఇదే మొదటిసారి. ప్లే స్టోర్‌లో Game on Aggipettimacha అనే ఈ గేమ్.. ‘గేమ్ ఆన్ మీమ్’ తరపున డెవలప్ అయ్యింది. లక్షకు పైగా డౌన్ లోడ్స్, 4.4 రేటింగ్(మచ్చా ఫ్యాన్సే అయి ఉండొచ్చు) దక్కించుకోగా, 20 ఎంబీ సైజ్ ఉన్న ఈ గేమ్‌ను ఆదరిస్తుండడం విశేషం. ఇందులో కోపధారి మనిషి, జాంబీరెడ్డి, తమిళ మీమ్ క్యారెక్టర్ ఎంజీఆర్ నగర్ బిజిలీ కూడా ఉండగా.. తెలుగు నుంచి మచ్చానే టాప్ డౌన్లోడ్లతో నిలిచాడు. సాధారణంగా సెలబ్రిటీలు, సినిమాల విషయంలో ఇలాంటి గేమ్స్ ఆదరణ దక్కించుకుంటున్నప్పటికీ.. ఒక తెలుగు ఇంటర్నెట్ సెలబ్రిటీ, అది కూడా మచ్చా ఖాతాలో ఈ ఘనత చేరడం విశేషం. చిరు సాయం కాగా, మానసిక స్థితి సరిగా లేని కిరణ్ అలియాస్ అగ్గిపెట్టె మచ్చా.. తన చేష్టలతో అవతలివాళ్లకు హాస్యాన్ని పంచుతున్న విషయం తెలిసిందే. అయితే అతన్ని క్యాష్ చేసుకోవాలని యూట్యూబ్ ఛానెల్స్, కొన్ని టీవీ ఛానెల్స్ కూడా అతన్ని జనాల ముందుకు తీసుకొచ్చాయి. అయినప్పటికీ ఎంతో కొంత ఆర్థిక సాయం ద్వారా అతను ఊరట చెందుతుండగా.. మరోవైపు తనదైన చేష్టలతో, ఇంటర్వ్యూలతో పాపులారిటీ పెంచుకుంటున్నాడు. ఇక ఈ గేమ్ నిర్వాహకులు కూడా మచ్చాకు ఎంతో కొంత సాయం చేయడం మంచిదేమోనన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కొన్ని మార్చండి మచ్చాకి ఉన్న ఫేమ్‌తో ఈ గేమ్ బాగుందని కొందరు అంటున్నప్పటికీ.. సాంకేతికంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఫ్రెండ్లీ ఫీచర్లను ఇంకా డెవలప్ చేయాల్సి ఉందని రివ్యూలు ఇస్తున్నారు. ఇక ఈ గేమ్‌లో నమస్తే అన్నా.. అంటూ మొదలుపెట్టే మచ్చా, తన స్టైల్ పాట పాడడం, ‘ఎగిరి తంతా’.., ‘పోతే పోయిందని గానీ యెధవ ప్రాణం’ లాంటి డైలాగులు ఆకట్టుకుంటున్నాయి. లెవెల్స్‌ను పెంచడంతో పాటు ఖతర్ పాప లాంటి కొన్ని మీమ్ క్యారెక్టర్లను కూడా ఇంట్రడ్యూస్ చేసి అప్డేట్ చేయాలని పలువురు రివ్యూల ద్వారా రిక్వెస్ట్ చేస్తుండడం విశేషం. చదవండి: సుఖం కోసం కష్టమెందుకు! -
షమీ...నేను పిచ్చోణ్ని కాదు!
కోల్‌కతా: ‘మిస్టర్ కూల్’ ధోని తన సహచరుల్ని దారిలో పెట్టేందుకు అప్పుడప్పుడూ కోపాన్ని కూడా ప్రదర్శిస్తాడు. కానీ ఇవేవీ మనకు లైవ్ మ్యాచ్‌ల్లో కనిపించవు. ఇవి చవిచూసిన ఆటగాళ్లు చెబితేతప్ప తెలియదు. ఇలాంటి అనుభవాన్నే ఎదుర్కొన్న పేసర్ మొహమ్మద్ షమీ దీన్ని ఇప్పుడీ లాక్డౌన్ సమయంలో తన బెంగాల్ రంజీ జట్టు సహచరుడు మనోజ్ తివారీతో పంచుకున్నాడు. 2014లో న్యూజిలాండ్ పర్యటన సందర్భంగా వెల్లింగ్టన్లో జరిగిన టెస్టులో సరిగా సంధించని బంతిపై కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తుంటే మహీకి కోపమొచ్చిందట. వెంటనే ‘దేఖ్ బేటా... బహుత్ లోగ్ ఆయే మేరే సామ్నే... బహుత్ లోగ్ ఖేల్‌కే చలే గయే. జూట్ మత్ బోల్. తుమారే సీనియర్, తుమారే కెప్టెన్ హై హమ్. యే బేవకూఫ్ కిసీ ఔర్‌కో బనానా’ (చూడు బిడ్డా... నేను ఎంతో మందిని చూశాను. నా కళ్ల ముందు ఆడి వెళ్లిన వారెందరో ఉన్నారు. ఇలాంటి అబద్ధాలు చెప్పకెప్పుడూ. నేను నీ సీనియర్ని. కెప్టెన్నీ కూడా... నన్ను పిచ్చోణ్ని చేయకు. వేరే వాళ్లెవరినైనా మభ్యపెట్టు) అని మందలించినట్లు అప్పటి సంఘటనని పేసర్ గుర్తు చేసుకున్నాడు. ఆ మ్యాచ్‌లో భారత్ మంచి స్థితిలో ఉన్నప్పటికీ బ్రెండన్ మెక్కల్లమ్ (302) ట్రిపుల్ సెంచరీతో గెలుపు దూరమైందని, నిజానికి 14 పరుగుల వద్ద కోహ్లి క్యాచ్ వదిలేయడంతో అతను సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆవిష్కరించాడని షమీ వివరించాడు. మళ్లీ 300కు చేరువైనప్పుడు కూడా క్యాచ్ వదిలేయడంతో అసహనానికి గురైన షమీ తర్వాత బంతి బౌన్సర్ వేశాడు. ఆ బౌన్సర్‌ను ధోని అందుకోలేకపోవడం... అదికాస్తా బౌండరీ దాటిపోవడం జరిగాయి. దీనిపై ధోని సంజాయిషీ కోరగా షమీ ఏదో చెప్పబోయాడు. దాంతో ‘మిస్టర్ కూల్’ తనకు ఘాటుగా బదులిచ్చాడని షమీ అప్పటి విషయాన్ని వివరించాడు. -
మున్సిపల్ ఎన్నికల్లో దూకుడుగా వెళదాం
సాక్షి, హైదరాబాద్ : ‘పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుని, దేశంలోనే ఎక్కువ సభ్యత్వాలున్న ప్రాంతీయపార్టీగా అవతరించాం. ఈ నెల 31లోగా పార్టీ సంస్థాగత కమిటీల నిర్మాణం పూర్తయ్యేలా చూద్దాం. మున్సిపల్ ఎన్నికలు ఏ క్షణంలో జరిగినా ఎదుర్కొనేందుకు టీఆర్ఎస్ సిద్ధంగా ఉంది. క్షేత్ర స్థాయిలో పార్టీ యంత్రాంగాన్ని సమన్వయం చేసి ముందుకు నడపడమే మన ముందున్న తక్షణ కర్తవ్యం. మునిసిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ నుంచి నామమాత్ర పోటీయే ఉంటుంది. మున్సిపల్ ఎన్నికల్లో దూకుడుగా వెళదాం’అని టీఆ ర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ ముఖ్యనేతలకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణ భవన్లో బుధవారం టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులతో కేటీఆర్ సుదీర్ఘ సమావేశం నిర్వహించారు. ఉదయం 10.30 నుంచి సాయం త్రం 4గంటల వరకు జరిగిన ఈ సమావేశంలో పార్టీ సభ్యత్వ నమోదు, సంస్థాగత కమిటీల నిర్మాణం, పార్టీ కార్యాలయ భవనాల నిర్మాణం, మునిసిపల్ ఎన్నికల పై కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ యంత్రాంగా న్ని సమాయత్తం చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహం పై పార్టీ ప్రధాన కార్యదర్శులకు మార్గదర్శనం చేశారు. వచ్చే నెలలో సన్నాహకాలు పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం పూర్తయిన నేపథ్యంలో.. ఈ నెల 31 లోగా సంస్థాగత కమిటీల నిర్మాణం పూర్తి చేయాలని కేటీఆర్ ఆదేశించారు. ఇప్పటికే గ్రామ, మండల కమిటీల నిర్మాణం జరగడంతో.. నూతన కమిటీల వివరాలను పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపించాలన్నారు. మునిసిపాలిటీల్లోనూ వార్డు, బూత్ స్థాయి కమిటీల ఏర్పాటును నెలాఖరులోగా పూర్తి చేయాలని గడువు విధించారు. సెప్టెంబర్ మొదటి వారం నుంచి అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించాలని, ఈ సమావేశాలను మున్సిపల్ ఎన్నికల సన్నాహకాల కోసం ఉపయోగపడేలా చూడాలన్నారు. ఈ సమావేశాలకు ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ జడ్పీ చైర్మన్లను కూడా తప్పనిసరిగా ఆహ్వానించాలని నొక్కి చెప్పారు. భవన నిర్మాణ పర్యవేక్షణకు నలుగురితో కమిటీ జిల్లా కేంద్రాల్లో నిర్మిస్తున్న టీఆర్ఎస్ కార్యాలయ భవన నిర్మాణాల పనులపై కూడా కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. వర్షాలు, ఇతర కారణాలతో అక్కడక్కడా పనులకు అవాంతరాలు ఎదురవుతున్నా గడువులోగా పనులు పూర్తి చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు పార్టీ ప్రధాన కార్యదర్శులు వెల్లడించారు. కార్యాలయ భవన నిర్మాణ పనుల పర్యవేక్షణకు నలుగురితో కమిటీ వేస్తున్నట్లు ప్రకటించారు. ఈ కమిటీలో రాజ్యసభ సభ్యులు సంతోష్‌కుమార్, ఎమ్మెల్సీలు శేరి సుభాష్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రావణ్‌కుమార్ రెడ్డి సభ్యులుగా ఉంటారు. -
కొందరు ఎంజాయ్ చేస్తున్నారు : జైట్లీ
సాక్షి, న్యూఢిల్లీ : రాజకీయాల్లో పోట్లాట పెట్టుకోవాల్సింది సమస్యలతోనే తప్ప వ్యక్తులతో కాదని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీ తన సహచరులకు ఉద్భోదించారు. 'సమస్యలతో కలహం పెట్టుకోండి.. వ్యక్తులతో కాదు..' అని జైట్లీ అన్నారు. చట్టసభల చర్చా సమయాల్లో విషయాలపైనే మాట్లాడాలి తప్ప మనుషులను లక్ష్యంగా చేసుకొని కాదని హితవు పలికారు. కొంతమందికి బాధ్యతలు అప్పగించినప్పుడు వాటిల్లో విఫలమైనప్పుడు ఎవరికి నచ్చినట్లు వారు ప్రకటనలు చేయొద్దని కొన్నిసార్లు విఫలమవడం సహజమేనని చెప్పారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఎంపీలు, ఎమ్మెల్యే సదస్సులో జైట్లీ మాట్లాడారు. చట్టసభలో ఒక విషయంపై తీవ్రమైన చర్చ జరుగుతుంటే దానిని కొందరు మాత్రమే గమనిస్తున్నారని, అదే గందరగోళం నెలకొని సభలో గలాట జరుగుతుంటే మాత్రం పెద్ద మొత్తంలో ప్రచారం దొరుకుతుందని అభిప్రాయపడ్డారు. పార్లమెంటులో ఎప్పుడూ కూడా వ్యక్తిగతంగా లక్ష్యం చేసుకొని మాట్లాడొద్దని, దాన్ని చూసి కొందరు ఎంజాయ్ చేస్తున్నారని అన్నారు. అందుకే వ్యక్తులను కాకుండా సమస్య కేంద్రంగా డిబేట్ జరగాలని అన్నారు. -
ఉద్యోగ నియామకాల్లో ఐటి కంపెనీల దూకుడు
న్యూడిల్లీ: ఉద్యోగాల కోత సంక్షోభంలో ఉన్న ఐటీ ఉద్యోగులకు మండువేసవిలో జోరువాన లాంటి వార్త. మే నెలలో ఐటీ కంపెనీలు రికార్డ్ నియామకాలతో దూకుడును ప్రదర్శించాయి. మొత్తం ఉద్యోగాలతో పోలిస్తే బిపిఓ / ఐటి రంగంలో భారీ ఉద్యోగాలతో మొదటి స్థానం సాధించింది. ఏప్రిన్ నెలతో పోల్చుకుంటే మే నెలలో 25 శాతం వృద్ధిని సాధించిందని టైమ్స్ జాబ్స్ 'రిక్రూట్మెంట్ ఇండెక్స్ రిపోర్ట్ వెల్లడించింది. మొత్తంగా ఉద్యోగాల కల్పన 4 శాతం వృద్ధితో చేసిందని ఈ అధ్యయనంలో తేలింది. ముఖ్యంగా మే నెలలో పుణే, జైపూర్ నగరాల్లో 20 శాతం పుంజుకుని బెస్ట్ రిక్రూటర్లు గా నిలిచాయని నివేదించింది. ఐటీ బీపీఓ రంగాల్లో ఆటోమేషన్ ఉద్యోగాల కోతలకు దారితీసినప్పటికీ, ఈ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా వృద్ధి చెందుతున్న ఆర్థిక వృద్ధి ద్వారా నూతన ఉద్యోగాలు కూడా సృష్టించబడుతున్నాయనే వాస్తవాన్ని గమనించాలని ది టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్‌లో భాగమైన టైమ్స్ జాబ్స్ రామత్రేయ కృష్ణమూర్తి అన్నారు. ఈ సందర్భంగా 2016-17లో ఐటీ సెక్టార్ ఒక లక్ష, 70వేల ఉద్యోగాలకు జోడించిందన్న నాస్కామ్మ నివేదికను ఆయన గుర్తు చేశారు. ఆరోగ్య సంరక్షణ మరియు ఫార్మా రెండవ స్థానంలో నిలిచింది. మే నెలలోఉద్యోగాల కల్పనలో 7 శాతం పెరుగుదలను నమోదు చేసింది. కస్టమర్ సర్వీస్ నిపుణుల డిమాండ్ 20 శాతం పెరిగింది, అదే సమయంలో వైద్య నిపుణుల నియామకం 19 శాతం పెరిగింది. ఆటోమొబైల్ , బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్,బీమా విభాగాలు ఈ నెలలో ఇతర ముఖ్యమైన రిక్రూటర్లుగా ఉన్నాయి. అంతేకాదు 20ఏళ్ల అనుభవం వున్ననిపుణుల డిమాండ్ఆశ్చర్య కరంగా బాగా పుంజుకుందని ఈస్టడీ పేర్కొంది. 10-20 సం.రాల అనుభవం వారి డిమాండ్ 14 జంప్ చేయగా, 5-10 ఏళ్ల అనుభవం ఉన్న వారి డిమావండ్7శాతం పెరిగి రికార్డ్ క్రియేట చేసింది. కాగా 2-5 సం.రాల అనుభవం వున్న వారి గ్రోత 6శాతంగా ఉంది. అలాగే రెండేళ్ల లోపు అనుభవం ఉన్న ఉద్యోగులకు డిమాండ్ కనీసం 3 శాతం పెరిగిందని ఈ నివేదిక తేల్చింది. -
కోహ్లిపై గంభీర్ ఆసక్తికర కామెంట్లు
న్యూఢిల్లీ: విరాట్ కోహ్లితో వ్యక్తిగతంగా తనకు ఎటువంటి విభేదాలు లేవని సీనియర్ బ్యాట్స్ మన్ గౌతమ్ గంభీర్ తెలిపాడు. మైదానంలో తామిద్దరి భావోద్దేగాలు ఒకరకంగా ఉంటాయని చెప్పాడు. ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్య్వ్యూలో కోహ్లిపై తన అభిప్రాయాలను గంభీర్ వెల్లడించాడు. కోహ్లి నాయకత్వ పటిమను ప్రశంసించాడు. 'ఐపీఎల్ మ్యాచ్ లో కావాలనే కోహ్లితో గొడవ పడలేదు. ఇందులో వ్యక్తిగత విభేదాలు లేవు. విరాట్ కు వ్యతిరేకంగా ఆడాల్సి వస్తే దూకుడుగా ఉండక తప్పద'ని అన్నాడు. 2013 ఐపీఎల్ లో కోహ్లి, గంభీర్ మైదానంలో తిట్టుకున్న సంగతి తెలిసిందే. క్రికెట్ అనేది సీరియస్ క్రీడ అని, మైదానంలో దూకుడుగా ఉండడం తప్పు కాదని గంభీర్ అన్నాడు. 'విరాట్, నేను మైదానంలో దూకుడుగా వ్యవహరిస్తుంటాం. ఆట పట్ల మాకు ఎంతో ప్రేమ ఉంది. మేమిద్దరం ఒక జట్టులో ఉంటే ఒకే లక్ష్యం కోసం ఆడతామ'ని గంభీర్ చెప్పాడు. మార్గదర్శిలా కోహ్లి కెప్టెన్సీ ఉందని కితాబిచ్చాడు. రెండేళ్ల తర్వాత జాతీయ జట్టులోకి వచ్చిన గంభీర్ తొలిసారి కోహ్లి నాయకత్వంలో టెస్టు మ్యాచ్ ఆడాడు. న్యూజిలాండ్ తో జరిగిన టెస్టు మ్యాచ్ లో స్థాయికి తగ్గట్టు రాణించి తన సత్తా తగ్గలేదని చాటాడు. -
చెదిరిన మైత్రీ బంధం
⇒ ఆవేశం తెచ్చిన అనర్థం ⇒ ముగ్గురు స్నేహితుల జీవితాల్లో చీకట్లు ⇒ ఒకరిది అర్ధాంతర మరణం మరొకరు ఆస్పత్రిలో.. ⇒ ఇంకొకరు పోలీసుల అదుపులో... కుటుంబ సభ్యుల్లో తీవ్ర విషాదం మైత్రీ బంధమనే పునాదిపై సేవా సౌధాన్ని నిర్మించాలనే కల. నమ్మకమే ప్రధానంగా ముందుకు సాగుతున్న వేళ... ఆర్థిక విషయాల కలతలు... కలకలం సృష్టించాయి. మైత్రీ పునాదులకు బీటలు వారాయి. ఆవేశం ఆలోచనను... ఆవేదన విచక్షణను మరిపించేశాయి. కన్నుమూసి తెరిచే లోపు కలలన్నీ కల్లలయ్యాయి. ఒకరి జీవన యానం అర్థాంతరంగా ఆగిపోగా... మరో ఇద్దరి జీవితాల్లో చీకట్లు అలముకున్నాయి. ఇదీ ‘డాక్టర్ల త్రయం’ విషాద గాథ. చైతన్యపురి:సమాజానికి సేవ చేసేందుకు పవిత్రమైన వైద్య వృత్తిని ఎంచుకున్న ఉన్నత విద్యావంతులు వారు. సమాజంలో ప్రత్యేక గుర్తింపు, హోదా ఉన్నవారు. 15 ఏళ్ల క్రితం విధి నిర్వహణలో భాగంగా వారి మధ్య చిగురించిన పరిచయం స్నేహంగా మారింది. మైత్రీ బంధం వారిని అత్యున్నత ప్రమాణాలతో ఆస్పత్రిని నెలకొల్పడం ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా ప్రోత్సహించింది. ఐటీ కారిడార్‌గా పేరొందిన మాదాపూర్‌లో లారెల్ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిని ప్రారంభించే వరకు తీసుకెళ్లింది. ఆస్పత్రి ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలనుకున్న ఆ ముగ్గురు మిత్రుల కల చెదిరింది. వారి జీవితాల్లో విషాదాన్ని నింపింది. ఆ కుటుంబాల్లో అంతులేని బాధను మిగిల్చింది. ముగ్గురు మిత్రుల్లో.. సర్జన్ శశికుమార్ ఆత్మహత్య చేసుకోగా.. సాయి కుమార్ (అనస్థసిస్ట్) పోలీసుల అదుపులో ఉన్నారు. బుల్లెట్ గాయాలతో ఉదయ్ కుమార్ ఆస్పత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. సాయి కుమార్ ఇంటికి తాళం పడింది. వారి కలల సౌధం.. లారెల్ ఆస్పత్రి... వైద్యులు, పేషెంట్లు లేక బోసిపోయింది. ఆర్థిక విషయాల్లో ముగ్గురు మిత్రుల మధ్య పారదర్శకత లోపించడంతోనే ఇంతటి ఘోరం జరిగిందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్యపై చర్చించి... పరిష్కరించుకునే అవకాశం ఉన్నప్పటికీ క్షణికావేశమే వారి జీవితాల్లో చీకట్లు నింపిందని వారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఆత్మహత్యకు పాల్పడిన డాక్టర్ శశికుమార్ 2003లో కొత్తపేట్ మారుతీనగర్‌లో సాయినిఖిత సూపర్ స్పెషాలిటీ ల్యాప్రోస్కోపీ ఆస్పత్రిని ఏర్పాటు చేశారు. తన సేవలతో పరిసర కాలనీవాసుల మనసులను గెలుచుకున్నా రు. ఎవరికైనా ఆపద వచ్చిందంటే అర్ధరాత్రయినా శస్త్ర చికిత్స చేసేవాడని కాలనీవాసులు చెప్పారు. ఎవరితోనూ ఎలాంటి గొడవలు పెట్టుకునేవాడు కా దని... ఆస్పత్రి సిబ్బందితోనూ కలివిడిగా ఉండేవాడని అంటున్నారు. ఎప్పుడూ ఎవరిపై కోపగించుకున్న దాఖలాలూ లేవని సాయినిఖిత ఆస్పత్రి సిబ్బంది తెలి పారు.