సాక్షి, న్యూఢిల్లీ : రాజకీయాల్లో పోట్లాట పెట్టుకోవాల్సింది సమస్యలతోనే తప్ప వ్యక్తులతో కాదని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీ తన సహచరులకు ఉద్భోదించారు. 'సమస్యలతో కలహం పెట్టుకోండి.. వ్యక్తులతో కాదు..' అని జైట్లీ అన్నారు. చట్టసభల చర్చా సమయాల్లో విషయాలపైనే మాట్లాడాలి తప్ప మనుషులను లక్ష్యంగా చేసుకొని కాదని హితవు పలికారు. కొంతమందికి బాధ్యతలు అప్పగించినప్పుడు వాటిల్లో విఫలమైనప్పుడు ఎవరికి నచ్చినట్లు వారు ప్రకటనలు చేయొద్దని కొన్నిసార్లు విఫలమవడం సహజమేనని చెప్పారు.
పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఎంపీలు, ఎమ్మెల్యే సదస్సులో జైట్లీ మాట్లాడారు. చట్టసభలో ఒక విషయంపై తీవ్రమైన చర్చ జరుగుతుంటే దానిని కొందరు మాత్రమే గమనిస్తున్నారని, అదే గందరగోళం నెలకొని సభలో గలాట జరుగుతుంటే మాత్రం పెద్ద మొత్తంలో ప్రచారం దొరుకుతుందని అభిప్రాయపడ్డారు. పార్లమెంటులో ఎప్పుడూ కూడా వ్యక్తిగతంగా లక్ష్యం చేసుకొని మాట్లాడొద్దని, దాన్ని చూసి కొందరు ఎంజాయ్ చేస్తున్నారని అన్నారు. అందుకే వ్యక్తులను కాకుండా సమస్య కేంద్రంగా డిబేట్ జరగాలని అన్నారు.
అలా వద్దు.. కొందరు ఎంజాయ్ చేస్తున్నారు : జైట్లీ
Published Sun, Mar 11 2018 7:05 PM | Last Updated on Sun, Mar 11 2018 8:59 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment