ఉద్యోగ నియామకాల్లో ఐటి కంపెనీల దూకుడు | IT cos aggressive on hiring despite layoffs: Study | Sakshi
Sakshi News home page

ఉద్యోగ నియామకాల్లో ఐటి కంపెనీల దూకుడు

Published Tue, Jun 13 2017 3:42 PM | Last Updated on Thu, Sep 27 2018 4:07 PM

ఉద్యోగ నియామకాల్లో ఐటి కంపెనీల దూకుడు - Sakshi

ఉద్యోగ నియామకాల్లో ఐటి కంపెనీల దూకుడు

న్యూడిల్లీ: ఉద్యోగాల కోత సంక్షోభంలో ఉన్న ఐటీ ఉద్యోగులకు మండువేసవిలో జోరువాన లాంటి వార్త.  మే నెలలో  ఐటీ  కంపెనీలు రికార్డ్‌ నియామకాలతో దూకుడును ప్రదర్శించాయి. మొత్తం ఉద్యోగాలతో పోలిస్తే బిపిఓ / ఐటి రంగంలో   భారీ ఉద్యోగాలతో మొదటి స్థానం సాధించింది.  ఏప్రిన్‌ నెలతో   పోల్చుకుంటే మే నెలలో 25 శాతం వృద్ధిని సాధించిందని  టైమ్స్ జాబ్స్ 'రిక్రూట్మెంట్ ఇండెక్స్  రిపోర్ట్‌ వెల్లడించింది.  మొత్తంగా ఉద్యోగాల కల్పన  4 శాతం వృద్ధితో చేసిందని   ఈ అధ్యయనంలో  తేలింది.  ముఖ్యంగా మే నెలలో పుణే, జైపూర్ నగరాల్లో 20 శాతం పుంజుకుని బెస్ట్‌ రిక్రూటర్లు గా నిలిచాయని నివేదించింది.  ఐటీ  బీపీఓ రంగాల్లో  ఆటోమేషన్ ఉద్యోగాల కోతలకు దారితీసినప్పటికీ, ఈ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా వృద్ధి చెందుతున్న ఆర్థిక వృద్ధి ద్వారా నూతన ఉద్యోగాలు కూడా సృష్టించబడుతున్నాయనే వాస్తవాన్ని గమనించాలని ది టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్లో భాగమైన టైమ్స్ జాబ్స్‌   రామత్రేయ కృష్ణమూర్తి అన్నారు. ఈ సం‍దర్భంగా 2016-17లో  ఐటీ  సెక్టార్‌ ఒక లక్ష, 70వేల ఉద్యోగాలకు జోడించిందన్న  నాస్కామ్‌మ నివేదికను  ఆయన గుర్తు  చేశారు.  

ఆరోగ్య సంరక్షణ మరియు ఫార్మా రెండవ స్థానంలో నిలిచింది.  మే నెలలోఉద్యోగాల కల్పనలో 7 శాతం పెరుగుదలను నమోదు చేసింది.  కస్టమర్ సర్వీస్ నిపుణుల డిమాండ్ 20 శాతం పెరిగింది, అదే సమయంలో వైద్య నిపుణుల నియామకం 19 శాతం పెరిగింది. ఆటోమొబైల్ , బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్,బీమా  విభాగాలు ఈ నెలలో ఇతర ముఖ్యమైన రిక్రూటర్లుగా ఉన్నాయి.
 
అంతేకాదు 20ఏళ్ల అనుభవం వున్ననిపుణుల డిమాండ్‌ఆశ్చర్య కరంగా బాగా పుంజుకుందని ఈస్టడీ పేర్కొంది.  10-20 సం.రాల అనుభవం వారి డిమాండ్‌ 14 జంప్‌ చేయగా, 5-10 ఏళ్ల అనుభవం ఉన్న వారి డిమావండ్‌7శాతం పెరిగి రికార్డ్‌ క్రియేట​ చేసింది. కాగా 2-5  సం.రాల   అనుభవం వున్న  వారి గ్రోత​ 6శాతంగా ఉంది.  అలాగే రెండేళ్ల లోపు అనుభవం ఉన్న ఉద్యోగులకు డిమాండ్‌ కనీసం 3 శాతం పెరిగిందని ఈ నివేదిక తేల్చింది.  
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement