
ఐటీలో భారీగా ఉద్యోగాలు
మైహైరింగ్‌క్లబ్‌డాట్‌కామ్ సర్వే
న్యూఢిల్లీ: భారత కంపెనీలు వచ్చే 3 నెలల్లో హైరింగ్ కార్యకలాపాల జోరును పెంచనున్నాయి. మైహైరింగ్‌క్లబ్‌డాట్‌కామ్ ఈ అంశాలను తెలిపింది. ద ఎంప్లాయిమెంట్ అవుట్‌లుక్ పేరిట 5,414 భారత కంపెనీలపై సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్(జూలై-సెప్టెంబర్)లో తమ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగుల సంఖ్య పెరుగుతుందని 78 శాతం కంపెనీలు భావిస్తున్నాయి. ఇతర రంగాలతో పోల్చితే భారీగా ఐటీ, ఐటీఈఎస్ తరువాత బ్యాంకింగ్, ఆర్థిక సేవల రంగాల్లో అధికంగా ఉద్యోగాలు రానున్నాయి.