ప్రముఖ దేశీయ ఐటీ దిగ్గజం టీసీఎస్ సంచలన నిర్ణయం తీసుకుంది. చరిత్రలోనే కనీవిని ఎరుగని రీతిలో కొన్ని కంపెనీలు ఉద్యోగుల్ని భారీ ఎత్తున ఇంటికి పంపిచేస్తున్నాయి. అంతర్జాతీయ పరిస్థితులు, ఆర్థిక మాంద్యం భయాలు, ఆశించిన ఫలితాలు అందుకోవడంలో విఫలం’ అంటూ కారణాలు చెప్పి చేతులు దులిపేసుకుంటున్నాయి. కానీ టీసీఎస్ అందుకు విరుద్దంగా వ్యవహరిస్తుంది. రానున్న రోజుల్లో సుమారు 1.50 లక్షల మందిని నియమించుకోనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
టెక్ దిగ్గజం తాజాగా క్యూ3 ఫలితాల్ని విడుదల చేసింది. ఈ సందర్భంగా ..టీసీఎస్ జనవరి 9న 2023-24 ఆర్ధిక సంవత్సరం నాటికి సుమారు 1.25 లక్షల మంది నుంచి 1.50 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది.
అంతేకాదు గతేడాది డిసెంబర్ నెల ముగిసే సమయానికి సంస్థలో 613,974 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా.. క్యూ3లో 2,197 మంది ఉద్యోగులు సంస్థకు రిజైన్ చేశారు. అదే సమయంలో గడిచిన 18 నెలల కాలంలో భారీ ఎత్తున సిబ్బందిని హైర్ చేసుకున్నట్లు పేర్కొంది. మరోవైపు రానున్న రోజుల్లో టీసీఎస్ నియామకాలు జోరుగా చేపట్టనున్నట్లు ఆ సంస్థ సీఈవో గోపీనాథన్ తెలిపారు.
150,000 మంది నియామకం
టీసీఎస్ త్రైమాసిక ఫలితాల విడుదల అనంతరం కంపెనీ సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ రాజేష్ గోపినాథన్ విలేకరులతో మాట్లాడుతూ.. గతంలో ఉద్యోగుల్ని ఎలా నియమించుకున్నామో.. రానున్న రోజుల్లో ఆ తరహా ధోరణి కొనసాగుతుంది. వచ్చే ఏడాది 1,25,000-1,50,000 మందిని నియమించుకోనున్నాం’ అని తెలిపారు.
చదవండి👉 మూన్‌లైటింగ్ దుమారం, ఉద్యోగులపై ‘కాస్త సానుభూతి చూపించండయ్యా’
Comments
Please login to add a commentAdd a comment