నెతన్యాహుతో మోదీ (ఫైల్)
న్యూఢిల్లీ: స్నేహితుల దినోత్సవం సందర్భంగా భారత్‌కు ఇజ్రాయెల్ వినూత్నంగా సందేశం పంపింది. బ్లాక్‌బస్టర్ హిందీ సినిమా ‘షోలే’లోని ఏ దోస్తీ హమ్ నహీ తోడేంగే.. పాటను ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. ‘భారత్‌కు ఫ్రెండ్‌షిప్‌డే శుభాకాంక్షలు! మన స్నేహం మరింత బలపడాలి, భాగస్వామ్యం ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి’ అంటూ ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం ట్విట్టర్‌లో పేర్కొంది. దీంతోపాటు ప్రధాని మోదీ, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుల సమావేశాల దృశ్యాలను, 1975 నాటి హిందీ హిట్ సినిమా ‘షోలే’లోని ఏ దోస్తీ హమ్ నహీ తోడేంగే(మన స్నేహాన్ని వదులుకోం)పాటను నేపథ్యంగా జత చేసింది. దీనిపై ప్రధాని మోదీ స్పందించారు. భారత్, ఇజ్రాయెల్ మధ్య స్నేహ భావం కలకాలం నిలిచి ఉంటుందంటూ హీబ్రూ భాషలో ట్వీట్ చేశారు. ‘కృతజ్ఞతలు. అద్భుతమైన ఇజ్రాయెల్ ప్రజలకు, మంచి స్నేహితుడు నెతన్యాహుకు ఫ్రెండ్‌షిప్ డే శుభాకాంక్షలు. రెండు దేశాల మైత్రి బలమైంది, శాశ్వతమైంది. ఈ స్నేహం మరింత వర్థిల్లాలి’ అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment