friendship day wishes
-
స్వచ్ఛమైన స్నేహం.. తీపి జ్ఞాపకాల సంతకం..(ఫొటోలు)
-
Friendship Day: చెరగనిది మా స్నేహబంధం (ఫొటోలు)
-
ఇందులో మీ ఫ్రెండ్ ఏ కేటగిరీనో చెక్ చేసుకోండి
Happy Friendship Day 2021: అర్ధరాత్రి దాటిన తర్వాత మొదలైన స్నేహ ప్రవాహం.. ఇంకా కొనసాగుతూనే ఉంది. ఫేస్బుక్, ముఖ్యంగా వాట్సాప్ గ్రూపుల్లో, స్టేటస్సుల్లో ఫ్రెండ్షిప్ గొప్పదనం గురించి కొటేషన్లు, దోస్త్‌ల ఫొటోలు తెగ సందడి చేస్తున్నాయి. రెగ్యులర్‌గా ఫ్రెండ్షిప్ విలువ చెప్పే కంటెంట్‌కు ఇవాళ ఫుల్ గిరాకీ ఉంటుంది. అది చూసి కొందరికి ‘వావ్’ అనిపించొచ్చు.. మరికొందరికి ‘అబ్బో’ అనిపించొచ్చు. కానీ, ఎవరెన్ని అనుకున్నా స్నేహం అంటే.. . . . . . . . . . . ఒక కచ్చితమైన అవసరం. ‘ఈస్ట్ ఆర్ వెస్ట్ ఫ్రెండ్షిప్ ఈజ్ ది బెస్ట్’, ‘స్నేహాన్ని మించిది లేదు’.. ఇలాంటి కొటేషన్స్ చెప్పుకోవడానికి బాగానే ఉంటాయి. సింగిల్ కింగ్‌లైనా ఉంటారేమోగానీ.. ఫ్రెండ్ లేని మనిషి అరుదనే చెప్పాలి. జీవితంలో ఎవరితో షేర్ చేసుకోవద్దని ఫిక్స్ అయ్యే విషయాల్ని కూడా.. చివరికి ఏదో ఒక ‘బలహీన’ సందర్భంలో చెప్పుకునేది స్నేహితుడికే!. అలాగని మిగతా బంధాలను తక్కువేం చేయదు స్నేహ బంధం. అయితే స్నేహాల్లోనూ రకరకాలుంటాయి. అలాగే స్నేహితుల్లో రకరకాల మనస్తత్వాలవాళ్లూ ఉంటారు. అందుకే ఈ ఫ్రెండ్షిప్ డే సందర్భంగా దోస్తీలోని ఆ జానర్ల గురించి సరదాగా చర్చించుకుందాం. పక్కా కమర్షియల్ స్నేహంలో అవసరం ఉండొచ్చు. కానీ, స్నేహాన్ని పూర్తి అవసరంగా మార్చుకునేటోళ్లూ ఉంటారు. మనిషిని అమితంగా ఆకర్షించే నెగెటివిటీ వల్ల చాలామందికి స్నేహం మీద కలిగే భావనే ఇది. అఫ్కోర్స్.. ఇందులో కొంత వాస్తవం లేకపోలేదు. ఈ లోకంలో అన్నింటి కన్నా మిన్న అంటూ చెట్టాపట్టాలేసుకుని తిరిగి.. చివరికి డబ్బు-అంతస్థుల దగ్గరికి వచ్చేసరికి కొంతవరకు తడబడుతుంది స్నేహం. టార్చర్ స్నేహం వీళ్లు ప్రాణ స్నేహితులంటూ చెప్తుంటారు. ఊరంతా ప్రచారం చేస్తారు. వీళ్ల మాటలు కోటలు దాటుతాయి. కానీ, పక్కలోనే ఉంటూ పోటు పోడుస్తుంటారు. నస పెట్టి నానా ఇబ్బందులకు గురి చేస్తుంటారు. అయితే వీళ్ల స్నేహంలో ఒక స్వచ్ఛత ఉంటుంది. అది కొన్ని సందర్భాల్లో బయటపడుతుంది. అవసరాల్లోనే కాదు.. ఆపదలోనూ వదలుకోలేని బలహీనత కనిపిస్తుంటుంది వీళ్ల స్నేహంలో. అందుకే ‘ఫ్రెండ్‌వి రా’ అనుకుంటూ కలకాలం కలిసి మెలిసి ఉంటారు. ఏజ్‌లెస్ దోస్తులు ప్రేమకు వయసుతో సంబంధం లేదంటారు. కానీ, స్నేహానికి వయసుతో సంబంధం ఉండదని మరో నిజం. ఇది నిరూపించే దోస్తులు మన చుట్టూరానే.. మనలోనే కనిపిస్తుంటారు. కలిసి సరదాలు చేస్తారు. గోలలు చేస్తుంటారు. కలిసే గోతిలో పడుతుంటారు. వాళ్ల స్నేహం వాళ్లకే కాదు.. అవతలి వాళ్లకూ ఎంటర్టైన్మెంట్ పంచుతుంటుంది. అవసరానికో స్నేహం ప్రతీ ఫ్రెండూ అవసరమేరా అనే కొటేషన్ తెలుసు కదా!. అలాగే ఈ రకం స్నేహంలో అవసరం తీరేంత వరకే స్నేహం కొనసాగుతుంది. ఆ అవసరంలో ఉన్నంత దాకా వీళ్లు వెంట నడుస్తారు. అవసరమైతే సాయం చేస్తారు. తీరా.. తమ అవసరం పూర్తిగా తీరాక హ్యాండిచేస్తారు. అపార్థాలు, అవమానాలు, అనుమానాల నడుమ ఇలాంటి స్నేహాలు కలకాలం కొనసాగడం కొంచెం కష్టమే!. ప్రాణ స్నేహితులు ఈ స్నేహం చాలా చాలా ప్రత్యేకం. చిన్న వయసు నుంచి మొదలై చివరిదాకా సాగే అవకాశాలే ఎక్కువ. ఈ స్నేహంలో రాగద్వేషాలు కనిపించేది అతితక్కువ. ఒకరి కోసం ఒకరు త్యాగాలు చేసుకునేంత స్థాయి వీళ్లలో ఉంటుంది. ప్రాణం పోయేంత వరకు స్నేహాన్ని విడిచిపెట్టవు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంత గాఢబంధం వీళ్లది. పైగా ఎలాంటి తారతమ్యాలు లేనిది ఈ స్నేహం. అందుకే ‘చిలకా-కోయిల’లా కలకలకాలం కలిసి మెలిసి ఉంటారు. ఇలాంటి స్నేహంలో నడివయసులో పుట్టి కడదాకా సాగే స్నేహ బంధాలు చాలా అరుదుగా కనిపిస్తుంటాయి. లవ్లీ ఫ్రెండ్స్ అవతలి వాళ్లకు ఇదొక చిల్లర-చిచ్చర స్నేహం అనిపించొచ్చు. కానీ, వాళ్ల స్నేహంలో ఒక ఫ్రెష్‌నెస్ ఉంటుంది. వాళ్ల ఆనందం వాళ్లదే. అవతలి వాళ్ల గురించి అస్సలు పట్టించుకోరు. పోటాపోటీగా ఒకే అమ్మాయికి బీట్ కూడా కొడతారు. బడి నుంచి గుడి దాకా, రూమ్ నుంచి ఇంటి దాకా ప్రతీ విషయం చర్చించుకుంటారు. అవసరాలకు సాయం ఒకరికొకరు చేసుకుంటారు. కెరీర్ ఎదుగుదలకు వీళ్ల ప్రోద్భలం ఉంటుంది. అందుకే ఇది కూడా ఒక ప్రత్యేకమైన స్నేహమే!. ఇంటి స్నేహం స్కూల్, కాలేజీలు, ఆఫీసులు.. ఫ్రెండ్స్ అంటే ఇక్కడే దొరుకుతారా?. మనసు పెడితే ఇంట్లోనూ ఇంతకన్నా బలమైన స్నేహమే దొరుకుతుంది. అమ్మానాన్న, అక్కాచెల్లి, అన్నాతమ్ముడు, బావాబామ్మర్ది, మామాఅల్లుడు, తాతామనవడు.. అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో బంధాలు స్నేహ బంధాలుగానూ మార్చుకోవచ్చు. సంతోషమొచ్చినా.. దుఖమొచ్చినా వాళ్లతో పంచుకుని మనసు కుదుటపర్చుకోవచ్చు. ఎట్టిపరిస్థితుల్లో అపార్థాలకు చోటు ఉండని ఏకైక స్నేహం.. ఇంటి స్నేహమే! వాట్సాప్ బ్యాచ్ చిన్నప్పుడు ఎప్పుడో చదువుకుంటారు. సంవత్సరాల దొర్లిపోయే దాకా గుర్తుండరు. సడన్‌గా గుర్తుకొస్తారు. ఏదో ఒక సందర్భంలో కలుస్తారు. అడ్డగోలు వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేస్తారు. అయితే మెసేజ్‌ల వరద.. లేదంటే గప్‌చుప్. ఇలాంటి స్నేహితులు గెట్ టు గెదర్‌లోనే కలిసేది. చాలా సినిమాల్లో చూస్తుంటాం కదా. ‘గుర్తుకొస్తున్నాయి..’ అంటూ రీయూనియన్లలో సందడి చేసే బాపతి అన్నమాట. అఫ్కోర్స్.. బిజీ, టైం లేదంటూ కలయికను ఎగ్గొట్టి స్నేహితుల రోజున ఉప్పెనలా మెసేజ్‌లు పెట్టే దోస్తులు చాలామందే ఉన్నారండోయ్. ఇవేకాదు.. ఇంకా చాలా రకాల స్నేహాలే ఉంటాయి. అయితే నవ్వినా, తిట్టినా, ఏడ్పించినా, జోకులేసుకున్నా, చివరికి మోసానైనా తట్టుకుని నిలబడేది ఒక్క స్నేహమే. ఎంత చెప్పుకున్నా దూరాలను దగ్గర చేసే స్నేహం అంతిమంగా గొప్పదే. అందుకే ఆ బంధాన్ని గౌరవిస్తూ ఈ రోజును గుర్తించడం, అనుభవాలేవైనా అప్పటిదాకా జీవితంలో తారసపడిన రకరకాల స్నేహాల్ని ఒక్కసారి గుర్తు చేసుకోవడం తప్పేం కాదు. చివరగా.. అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. -సాక్షి, వెబ్‌డెస్క్ -
దోస్త్ మేరా దోస్త్
ఆదివారం స్నేహితుల దినోత్సవం. ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ల మధ్య ఉన్న స్నేహాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ‘‘ఫ్రెండ్షిప్లో నెమ్మదిగా వెళ్లాలి. కానీ ఒక్కసారి ఫ్రెండ్ అయిన తర్వాత ఆ బాండ్ ఎప్పటికీ కంటిన్యూ అవ్వాలి. మా మధ్య ఫ్రెండ్షిప్ని వివరించడానికి ఈ కొటేషన్ చాలు’’ అన్నారు తారక్. ‘‘కొన్ని బంధాలు ఏర్పడటానికి సమయం తీసుకుంటాయి. ఏర్పడ్డాక తిరిగి చూసేపనిలేదు. తారక్‌తో నాకు అలాంటి బాండ్ ఏర్పడింది’’ అన్నారు చరణ్. వీళ్లిద్దరూ రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ అనే పీరియాడికల్ మల్టీస్టారర్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. -
విడిపోని స్నేహం మనది
న్యూఢిల్లీ: స్నేహితుల దినోత్సవం సందర్భంగా భారత్‌కు ఇజ్రాయెల్ వినూత్నంగా సందేశం పంపింది. బ్లాక్‌బస్టర్ హిందీ సినిమా ‘షోలే’లోని ఏ దోస్తీ హమ్ నహీ తోడేంగే.. పాటను ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ‘భారత్‌కు ఫ్రెండ్‌షిప్‌డే శుభాకాంక్షలు! మన స్నేహం మరింత బలపడాలి, భాగస్వామ్యం ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి’ అంటూ ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం ట్విట్టర్లో పేర్కొంది. దీంతోపాటు ప్రధాని మోదీ, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుల సమావేశాల దృశ్యాలను, 1975 నాటి హిందీ హిట్ సినిమా ‘షోలే’లోని ఏ దోస్తీ హమ్ నహీ తోడేంగే(మన స్నేహాన్ని వదులుకోం)పాటను నేపథ్యంగా జత చేసింది. దీనిపై ప్రధాని మోదీ స్పందించారు. భారత్, ఇజ్రాయెల్ మధ్య స్నేహ భావం కలకాలం నిలిచి ఉంటుందంటూ హీబ్రూ భాషలో ట్వీట్ చేశారు. ‘కృతజ్ఞతలు. అద్భుతమైన ఇజ్రాయెల్ ప్రజలకు, మంచి స్నేహితుడు నెతన్యాహుకు ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు. రెండు దేశాల మైత్రి బలమైంది, శాశ్వతమైంది. ఈ స్నేహం మరింత వర్థిల్లాలి’ అని పేర్కొన్నారు. -
స్నేహితుల దినోత్సవ సైకత శుభాకాంక్షలు
గార శ్రీకాకుళం : మండల పరిధిలోని పోర్టు కళింగపట్నం బీచ్‌లో ఆదివారం స్నేహితుల దినోత్సవం పురస్కరించుకోని సైకత శిల్పం ద్వారా శుభాకాంక్షలు తెలపడంతో అందరూ అభినందించారు. అంపోలు గ్రామానికి చెందిన దాకోజు లాలూప్రసాద్ స్నేహితులకు దోస్త్ అన్న పేరిట సైకత శిల్పాన్ని రూపొందించాడు. సాయంత్రం బీచ్‌కు వచ్చిన సందర్శకులు దీన్ని చూసి అభినందించారు. -
సంతోషంగా ఉన్నా
సమస్య వచ్చినప్పుడు బాధపడిపోకుండా దాన్ని ఎలా పరిష్కరించుకోవాలో, అందులో కూడా పాజిటివ్‌నెస్‌ని ఎలా వెతుక్కోవాలో సోనాలీ బింద్రేని చూసి నేర్చుకోవచ్చు అనిపిస్తోంది. కేన్సర్ వ్యాధి సోకినా భయపడకుండా ధైర్యంగా, ముఖం మీద నవ్వు చెదరకుండా పోరాడటానికి సిద్ధపడ్డారు సోనాలీ. ఆ మధ్య జుత్తుని సగానికి కత్తిరించుకున్న ఆమె తాజాగా గుండు చేయించుకున్నారు. తన ఆరోగ్యం గురించి చెప్పడంతో పాటు తన స్నేహితులందరికీ ఫ్రెండ్షిప్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓ లేఖ రాశారు. దాని సారాంశం ఈ విధంగా... ‘‘ఈ నిమిషం నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఈ మాట చెబితే మీరందరూ నా వంక అదోలా చూడొచ్చు. కానీ అది నిజం. ఎందుకు చెబుతున్నానో వినండి. ప్రస్తుతం నేను ప్రతి చిన్న విషయాన్ని కూడా శ్రద్ధగా తీసుకుంటున్నాను. ఆనందం దొరికే ఏ అవకాశాన్ని వదులుకోవడంలేదు. నిజమే.. కొన్నిసార్లు బాధగా అనిపిస్తుంది. నిరాశ, నిస్పృహ నన్ను ముంచేస్తాయి. కానీ, నాకు నచ్చింది మాత్రమే నేను చేస్తున్నాను. నాకు నచ్చిన వాళ్లతోనే టైమ్ స్పెండ్ చేస్తున్నాను. దాంతో చాలా హ్యాపీగా ఉంటున్నాను. నా ఫ్రెండ్స్.. నా ధైర్యానికి వాళ్లే కారణం. వాళ్ల బిజీ షెడ్యూల్స్‌లో కూడా నా కోసం మెసేజ్, ఫోన్ కాల్, వీడియో కాల్ ఏదోటి చేసి నాతో టచ్‌లోనే ఉంటున్నారు. ఒక్క క్షణం కూడా నన్ను ఒంటరిగా ఫీల్ అయ్యేలా చేయడం లేదు. నిజమైన ఫ్రెండ్షిప్ అంటే ఏంటో తెలియజేస్తున్నారు. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. మీ అందరూ నా లైఫ్‌లో ఉండటం నా అదృష్టం. ఇంకో విషయం ఏంటంటే.. ఈ మధ్య రెడీ అవ్వడానికి ఎక్కువ టైమ్ కూడా పట్టడంలేదు. ఊరికే జుత్తు దువ్వుకునే పని లేదు కదా (నవ్వుతున్న ఎమోజీ). అన్నింట్లో పాజిటివిటీ వెతుక్కుందాం’’ అంటూ ఈ నోట్‌ను, ఫొటోను షేర్ చేశారు. సోనాలీ పట్టుదల చూస్తే అభినందించకుండా ఉండలేం కదూ. -
సీనియర్ హీరోలకు మెగాస్టార్ విషెష్
ఫ్రెండ్షిప్ డే సందర్భంగా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్.. సినీ పరిశ్రమలోని తన స్నేహితులు, సీనియర్ హీరోలు ధర్మేంద్ర, శత్రుఘ్న సిన్హాలకు శుభాకాంక్షలు చెప్పారు. ధర్మేంద్ర, సిన్హాలతో అమితాబ్ కలిసున్న ఫొటోలను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అంటూ 73 ఏళ్ల అమితాబ్ ట్వీట్ చేశారు. అమితాబ్, ధర్మేంద్ర (80) 1975లో బ్లాక్ బస్టర్ సినిమా షోలేలో కలసి నటించారు. ఈ సినిమాల్లో వీరిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్‌గా నటించారు. ఈ సినిమా గురించి అమితాబ్ ప్రస్తావిస్తూ కొన్ని సంఘటనలు ఎప్పటికీ మధురంగా ఉంటాయి అంటూ, షోలేలోని ధర్మేంద్ర స్టిల్‌ను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అలాగే అమితాబ్, శత్రుఘ్న సిన్హాలు దోస్తానా సినిమాలో నటించారు.