సైకత శిల్పం వద్ద లాలూప్రసాద్
గార శ్రీకాకుళం : మండల పరిధిలోని పోర్టు కళింగపట్నం బీచ్‌లో ఆదివారం స్నేహితుల దినోత్సవం పురస్కరించుకోని సైకత శిల్పం ద్వారా శుభాకాంక్షలు తెలపడంతో అందరూ అభినందించారు. అంపోలు గ్రామానికి చెందిన దాకోజు లాలూప్రసాద్ స్నేహితులకు దోస్త్ అన్న పేరిట సైకత శిల్పాన్ని రూపొందించాడు. సాయంత్రం బీచ్‌కు వచ్చిన సందర్శకులు దీన్ని చూసి అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment