సీనియర్ హీరోలకు మెగాస్టార్ విషెష్ | Amitabh Bachchan wishes Dharmendra, Shatrughan Sinha on friendship day | Sakshi
Sakshi News home page

సీనియర్ హీరోలకు మెగాస్టార్ విషెష్

Published Sun, Aug 7 2016 5:36 PM | Last Updated on Mon, Sep 4 2017 8:17 AM

సీనియర్ హీరోలకు మెగాస్టార్ విషెష్

సీనియర్ హీరోలకు మెగాస్టార్ విషెష్

ఫ్రెండ్షిప్ డే సందర్భంగా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్.. సినీ పరిశ్రమలోని తన స్నేహితులు, సీనియర్ హీరోలు ధర్మేంద్ర, శత్రుఘ‍్న సిన్హాలకు శుభాకాంక్షలు చెప్పారు. ధర్మేంద్ర, సిన్హాలతో అమితాబ్ కలిసున్న ఫొటోలను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అంటూ 73 ఏళ్ల అమితాబ్ ట్వీట్ చేశారు.

అమితాబ్, ధర్మేంద్ర (80) 1975లో బ్లాక్ బస్టర్ సినిమా షోలేలో కలసి నటించారు. ఈ సినిమాల్లో వీరిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్గా నటించారు. ఈ సినిమా గురించి అమితాబ్ ప్రస్తావిస్తూ కొన్ని సంఘటనలు ఎప్పటికీ మధురంగా ఉంటాయి అంటూ, షోలేలోని ధర్మేంద్ర స్టిల్ను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అలాగే అమితాబ్, శత్రుఘ్న సిన్హాలు దోస్తానా సినిమాలో నటించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement