సాక్షి, ముంబై: ’పద్మావతి’ సినిమా వివాదం దేశాన్ని కుదిపేస్తూనే ఉంది. ఈ సినిమాకు వ్యతిరేకంగా ఒకవైపు తీవ్ర ఆందోళనలు వెల్లువెత్తుకుండా.. మరోవైపు సినిమాను తెరకెక్కించిన దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ, ఈ సినిమాలో టైటిల్ రోల్ పోషించిన దీపికా పదుకోన్‌లను చంపేస్తామని, వారి తలలు నరికితే.. నజరానాలు ఇస్తామని రాజ్‌పుత్ వర్గీయులు తీవ్ర హెచ్చరికలు చేస్తున్నారు. పలు రాష్ట్రాలు ఈ సినిమాను నిషేధించాయి.
ఈ నేపథ్యంలో దేశాన్ని కుదిపేస్తున్న ఈ వివాదంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ, బిగ్ బీ అమితాబ్ బచ్చన్ స్పందించకపోవడాన్ని ప్రముఖ నటుడు, బీజేపీ ఎంపీ శత్రుఘ్న సిన్హా తప్పుబట్టారు. ఈ విషయంలో ప్రధాని మోదీ, బిగ్ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. ‘’పద్మావతి’ సినిమా వివాదం తీవ్రరూపం దాల్చింది. ఈ సినిమాపై అమితాబ్ బచ్చన్, ఆమిర్ ఖాన్, షారుఖ్ ఖాన్ ఎందుకు స్పందించడం లేదని ప్రజలు అడుగుతున్నారు. అదేవిధంగా కేంద్ర సమాచార ప్రసార మంత్రి, మోస్ట్ పాపులర్ అయిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా ఎందుకు గంభీరమైన మౌనాన్ని పాటిస్తున్నారు. ఇప్పటికే చాలా సమయమైంది’ అని శత్రుఘ్న ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఈ వివాదంపై తాను కూడా మాట్లాడుతానని, అయితే, ఈ చిత్ర దర్శకుడు భన్సాలీ స్పందించిన తర్వాత తాను మాట్లాడుతానని, ఒకవైపు సినిమా ప్రయోజనాలు, మరోవైపు రాజ్‌పుత్‌ల గౌరవం, మనోభావాలు దృష్టిలో పెట్టుకొని తాను మాట్లాడుతానని పేర్కొన్నారు.
.
Comments
Please login to add a commentAdd a comment