ఈ నేతల స్నేహం ఎందుకు గట్టిపడింది? ఇందిర చనిపోయాక అమితాబ్‌ ఏం చేశారు? | Political Relation and Friendship about PM Modi Amit Shah | Sakshi
Sakshi News home page

Political Friendship: ఈ నేతల స్నేహం ఎందుకు గట్టిపడింది?

Published Mon, Oct 9 2023 9:11 AM | Last Updated on Mon, Oct 9 2023 10:24 AM

Political Relation and Friendship about PM Modi Amit Shah - Sakshi

రాజకీయాల్లో శాశ్వత మిత్రుడు, శాశ్వత శత్రువు ఉండరని అంటుంటారు. రాజకీయాల్లో అధికారం అందుకోవడమే లక్ష్యంగా స్నేహాలు కొనసాగుతుంటాయి. స్నేహానికి రాజకీయాలకు దగ్గర సంబంధం ఉన్నట్టు కనిపిస్తుంది. రాజకీయ వర్గాల్లో స్నేహానికి సంబంధించిన అనేక కథలు వినిపిస్తుంటాయి. 

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమిత్ షా మధ్య ఉన్న స్నేహం, దేశ మాజీ దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ-అమితాబ్ బచ్చన్, నితీష్ కుమార్- లాలూ యాదవ్‌ల మధ్య స్నేహం మనకు ఉదాహరణలుగా కనిపిస్తాయి. 

అటల్- అద్వానీ
అటల్ బిహారీ వాజ్‌పేయి, లాల్ కృష్ణ అద్వానీల మధ్య ఉన్న స్నేహం నాటి రోజుల్లో చర్చనీయాంశంగా నిలిచింది. ఇద్దరూ దాదాపు కలిసే రాజకీయాల్లోకి ప్రవేశించారు. 1998లో బీజేపీ ఏకైక పెద్ద పార్టీగా అవతరించినప్పుడు, రథయాత్రతో పేరు తెచ్చుకున్న అద్వానీ తన రాజకీయ ఆశయాలను పక్కనబెట్టి, అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రధానమంత్రి అయ్యేందుకు మార్గం సుగమం చేశారు.

నరేంద్ర మోదీ- అమిత్ షా 
ప్రధాని నరేంద్ర మోదీకి అమిత్ షాపై నమ్మక అధికం అని చెబుతుంటారు. వీరిద్దరి మధ్య దాదాపు 40 ఏళ్ల స్నేహం ఉంది. వీరిద్దరూ ఆర్‌ఎస్‌ఎస్ ద్వారా ఒకరినొకరు కలుసుకున్నారు. మోదీ గుజరాత్ ముఖ్యమంత్రి కాగానే అమిత్ షా హోం శాఖ సహాయ మంత్రి అయ్యారు. నేడు మోదీ ప్రధానిగా ఉండగా, అమిత్ షా హోంమంత్రిగా ఉన్నారు. ప్రస్తుత భారత రాజకీయాల్లో అమిత్ షా, మోదీల స్నేహానికి తులతూగేలా మరెవరూ కనిపించరు. మోదీ, షాల స్నేహం వారి రాజకీయ ఆశయాలను నెరవేర్చుకోవడానికి దోహదపడింది.

లాలూ-నితీష్ 
బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్, ప్రస్తుత సీఎం నితీష్ కుమార్ మధ్య గాఢమైన స్నేహం ఉంది. అయితే రాజకీయాల్లో ఇద్దరూ ఒకరినొకరు తీవ్రంగా వ్యతిరేకించుకున్నట్లు కనిపిస్తారు. వీరి స్నేహంలో ఎన్నో విబేధాలు వచ్చాయి. చాలాసార్లు నితీష్ కుమార్ తన రాజకీయ వ్యూహాలను మార్చుకుని, లాలూ స్నేహాన్ని పక్కన పెట్టి, బీజేపీ పక్షాన నిలిచారు. ప్రస్తుతం వీరిద్దరి మధ్య స్నేహం కొనసాగుతోంది.

రాజీవ్ గాంధీ- అమితాబ్ బచ్చన్ 
అమితాబ్ బచ్చన్- రాజీవ్ గాంధీ బాల్య స్నేహితులు. ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్‌లో అమితాబ్‌ పుట్టినరోజు వేడుకలో వారు కలుసుకున్నారు. అమితాబ్ తల్లి తేజీ బచ్చన్, రాజీవ్ గాంధీ తల్లి, మాజీ ప్రధాని ఇందిరా గాంధీకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అమితాబ్‌ను ఇందిర తన మూడో కొడుకుగా భావించారు. ఇందిరా గాంధీ మరణం తరువాత అమితాబ్ ఆమె మృతదేహం దగ్గరే చాలసేపు కూర్చున్నారు. 
ఇది కూడా చదవండి: ఏ రాష్ట్రంలో మహిళలకు రిజర్వేషన్లలో పెద్దపీట?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement