న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో ఫిబ్రవరి 5న అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపధ్యంలో ఈరోజు(సోమవారం) సాయంత్రం ఐదు గంటలతో వివిధ పార్టీల ప్రచారపర్వం ముగియనుంది. గత నెల 20 నుంచి సాగుతున్న ఈ ప్రచారంలో పలు వింతలు విశేషాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఇటువంటి ఆసక్తికర ఉదంతం వెలుగు చూసింది.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో వివిధ పార్టీలకు చెందిన సీనియర్ నేతలు, నటులు ప్రచారాలు సాగిస్తున్నారు. తాజాగా తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ శత్రుఘ్న సిన్హా ఆదివారం ఢిల్లీలో ఆమ్ ఆద్మీ తరపున ప్రచారం సాగించారు. ప్రధాని మోదీని తన స్నేహితుడని అంటూనే ఆయనను ‘ప్రచార మంత్రి’అని అభివర్ణించారు. ఆయన(ప్రధాని) రోజూ 10 నుండి 12 గంటలు ప్రచారం చేస్తారని వ్యాఖ్యానించారు.
నటుడి నుండి రాజకీయ నేతగా మారిన సిన్హా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అభ్యర్థి ఆతిశీకి మద్దతుగా జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ), ఆమ్ ఆద్మీ పార్టీలు ‘ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయన్స్’ (ఐఎన్‌ఐ)లో భాగస్వాములు. శత్రుఘ్న సిన్హా తన ప్రసంగంలో ప్రధాని మోదీని విమర్శిస్తూ ‘మా గౌరవనీయ ప్రచార మంత్రి అంటే..ప్రధానమంత్రి అంటూ.. ఆయన నాకు స్నేహితుడు.. మనకి ప్రధానమంత్రి కూడా.. అని వ్యంగ్యోక్తి విసిరారు. ఆయన 18 గంటలు పనిచేస్తానని చెబుతారని, అయితే ఆయన ఆ 18 గంటల్లో 10 నుండి 12 గంటలు ప్రచారానికే కేటాయిస్తారని, కౌన్సిలర్ ఎన్నికలైనా, ఎమ్మెల్యే ఎన్నికలైనా, పార్లమెంటరీ ఎన్నికలైనా.. ఎక్కడికైనా మన గౌరవనీయ ప్రధానమంత్రి ఖచ్చితంగా అక్కడికి వెళతారు’అని సిన్హా విమర్శించారు. రెండు కోట్ల ఉద్యోగాలు, రైతుల ఆదాయం రెట్టింపు, ప్రతి వ్యక్తి బ్యాంకు ఖాతాలో రూ. కోటి మొదలైన హామీలను ఇచ్చిన మోదీ వాటిని నెరవేర్చలేదని సిన్హా అన్నారు.
ఇది కూడా చదవండి: మంచు దుప్పటిలో ఉత్తరాది.. 12 రాష్ట్రాలపై పొగమంచు దెబ్బ
Comments
Please login to add a commentAdd a comment