![Australia Man Banned From Leaving Israel Until 10000 Years - Sakshi](/styles/webp/s3/article_images/2021/12/25/Australia.jpg.webp?itok=J3zg_6Wp)
Australian Man Banned From Leaving Israel: ఇటీవల కాలంలో రకరకాల విడాకులు చట్టాలు గురించి విన్నాం. అయితే వాటిలో భార్యకు విడాకులు ఇవ్వాలంటే అత్యంత పెద్ద మొత్తంలో భరణం ఇవ్వడం వంటివి చూశాం. కానీ ఇక్కడ ఒక దేశంలో భరణం పూర్తిగా చెల్లించేంత వరకు దేశం విడిచి పెట్ట వెళ్లకుండా నిషేధించారు.
(చదవండి: ప్రపంచపు తొలి డ్యూయల్ మోడ్ వాహనం)
అయితే అసలు విషయంలోకెళ్లితే....ఆస్ట్రేలియన్‌కి చెందిన 44 ఏళ్ల నోమ్ హుప్పెర్ట్ 2012లో తన పిల్లల కోసం అని తన భార్య కోసం ఇజ్రాయెల్ దేశానికి వెళ్లాడు. అయితే అతని భార్య ఇజ్రాయెల్ కోర్టులో విడాకుల కేసు వేసింది. దీంతో కోర్టు 2013లో హుప్పెర్ట్‌కి వ్యతిరేకంగా "స్టే-ఆఫ్-ఎగ్జిట్"(దేశాన్ని విడిచి వెళ్లకూడదు) ఆర్డర్‌ని జారీ చేసింది. అంతే కాదు పిలల్లకు 18 ఏళ్లు వచ్చే వరకు ప్రతి నెల రూ లక్ష భరణం చెల్లించాల్సి ఉంటుంది.
ఈ కారణంగా అతను దేశాన్ని విడిచిపెట్టడానికి వీలు లేకుండా ఆదేశాలు జారీ చేసింది. అంటే హుప్పెర్ట్ పిల్లల భవిష్యత్తు ఖర్చుల నిమిత్తం సుమారు రూ 18 కోట్లు చెల్లించాలి. ఈ మొత్తం చెల్లించేంత వరకు హుప్పెర్ట్ డిసెంబర్ 31, 9999వ సంవత్సవరం వరకు దేశాన్ని విడిచిపెట్టి వెళ్లకుండా ఇజ్రాయెల్ కోర్టు నిషేధించింది. పైగా సెలవు కారణంగానో లేక పని మీదనో కూడా వెళ్లడానికి వీల్లేదు. అంతేకాదు ఒకసారి ఇజ్రాయెల్ కోర్టు నుంచి ఇలాంటి ఆదేశాలు(నో ఎగ్జిట్ ఆర్డర్) వచ్చిన వాళ్లు కనీసం 21 రోజులు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది.
అయితే ఫార్మాస్యూటికల్ కంపెనీకి సంబంధించిన రసాయన శాస్త్రవేత్త అయిన హుప్పెర్ట్ దీనిపై ఆవేదన వ్యక్తం చేశాడు.. ఇజ్రాయెల్ వివాహ చట్టాలు చాలా కఠినమైనవని పైగా పురుషుల ఆర్థిక పరిస్థితి పై కోర్టు ఎటువంటి విచారణ జరపకుండా పురుషుల ఆదాయంలో 100 శాతం చెల్లించాల్సిందేనని ఆదేశిస్తుందని అని తన గోడు బ్రిటీష్ మీడియాకి వెల్లబోసుకున్నాడు..
(చదవండి: ప్రధాని మోదీ విరాళం ఎంతో తెలుసా!!)
Comments
Please login to add a commentAdd a comment