ఇన్‌స్టాలో దుబాయ్‌ యువరాణి ఇన్‌స్టంట్‌ విడాకులు | Dubai princess Shaikha Mahra announces separation | Sakshi
Sakshi News home page

ఇన్‌స్టాలో దుబాయ్‌ యువరాణి ఇన్‌స్టంట్‌ విడాకులు

Published Thu, Jul 18 2024 4:46 AM | Last Updated on Thu, Jul 18 2024 9:21 AM

Dubai princess Shaikha Mahra announces separation

దుబాయ్‌: దుబాయ్‌ యువరాణి షైఖా మహ్రా మహమ్మద్‌ రషీద్‌ అలీ మక్తూమ్‌ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా సంచలన ప్రకటన చేశారు. తన భర్త షేక్‌ మనాబిన్‌ మహ్మద్‌ బిన్‌ రషీద్‌ బిన్‌ మనా అల్‌ మక్తూమ్‌కు విడాకులిచ్చారు. ‘‘ప్రియమైన భర్తకు.. మీరు ఇతరుల సహచర్యంలో ఉన్నందున మీకు విడాకులు ఇవ్వాలనుకుంటున్నాను. ఐ డివోర్స్‌ యూ.. ఐ డివోర్స్‌ యూ.. ఐ డివోర్స్‌ యూ. జాగ్రత్తగా ఉండండి. ... మీ మాజీ భార్య’’ అంటూ జూలై 16న ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. 

యువరాణి పోస్ట్‌ చేసిన వెంటనే ఆమె శ్రేయోభిలాషుల నుంచి సందేశాలు వెల్లువలా వచ్చాయి. మరోవైపు ఇన్‌స్టాగ్రామ్‌లో భార్యాభర్తలిద్దరూ ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకున్నారు. ఇద్దరూ కలిసి ఉన్న  ఫొటోలను కూడా తొలగించారు. షైఖా మహర్రా ప్రస్తుత దుబాయ్‌ రాజు షేక్‌ మొహమ్మద్‌ బిన్‌ రషీద్‌ అల్‌ మక్తూమ్‌ కుమార్తె. 2023 మేలో పారిశ్రామికవేత్త షేక్‌ మనా బిన్‌ మొహమ్మద్‌ బిన్‌ రషీద్‌ బిన్‌ మనా అల్‌ మక్తూమ్‌ను వివాహం చేసుకున్నారు. ఒక సంవత్సరం తర్వాత వారికి కుమార్తె జన్మించింది. ఆ భర్త, కూతురుతో ఉన్న ఫొటోను ఇన్‌స్టాలో ‘మేం ముగ్గురం’ అని జత చేసి పోస్ట్‌ చేశారు. జూన్‌ 4న ‘మేమిద్దమే’ కూతురుతో ఉన్న ఫొటోను పోస్ట్‌ చేశారు. ఇప్పుడు విడాకుల ప్రకటన సంచలనమైంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement