జెరూసలెం: ఇజ్రాయెల్ రాజధాని జెరూసలెంలోని యూదుల ప్రార్థనా మందిరంపై ఉగ్రవాది దాడికి తెగబడ్డాడు. కన్పించిన వారిపై బుల్లెట్లు వర్షం కురిపించాడు. శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటనలో ఏడుగురు చనిపోయారు. తూటాలు తగిలి మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు.
నివె యాకోవ్ బోలెవార్డ్‌లో జరిగిన ఈ ఘటనపై సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకున్నారు. తుపాకీతో ఉన్న ఉగ్రవాదిని కాల్చి చంపారు. అతను తీసుకొచ్చిన వాహనాన్ని కూడా ధ్వంసం చేశారు.
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఘటనా స్థలాన్ని సందర్శించారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. ఇది అత్యంత తీవ్రమైన ఉగ్రచర్య అని అధికారులు తెలిపారు. ఇటీవలి కాలంలో ఇలాంటి భయానక ఘటన జరగలేదన్నారు. నిందితుడ్ని పాలస్తీనాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు.
సంబరాలు..
మరోవైపు ఈ దాడిని పాలస్తీనా ఉగ్రసంస్థలు ప్రశంసించాయి. కానీ ఇది తమ పని కాదని పేర్కొన్నాయి. కొన్ని చోట్ల పాలస్తీనా ప్రజలు ఈ ఘటనను సంబరంగా జరుపుకొన్నారు. మిఠాయిలు పంచి, ర్యాలీలు చేశారు.
చదవండి: నన్ను చంపించేందుకు జర్దారీ కుట్ర: ఇమ్రాన్
Comments
Please login to add a commentAdd a comment