
బెత్లహాం: ఇజ్రాయెల్ రాజధానిగా జెరూసలెంను గుర్తిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన బెత్లహాంలో క్రిస్మస్ వేడుకలపై ప్రభావం చూపుతోంది. ప్రతి ఏడాదీ డిసెంబరు 24 అర్ధరాత్రి క్రైస్తవులు సామూహిక ప్రార్థనలు చేస్తారు. స్థానికులే కాకుండా పలు దేశాల నుంచి కూడా యాత్రికులు వస్తుంటారు. ట్రంప్ నిర్ణయంతో పాలస్తీనా నిరసనకారులు, ఇజ్రాయెల్ ఆర్మీ మధ్య ఘర్షణలు, నిరసనల నేపథ్యంలో యాత్రికుల సంఖ్య బాగా తగ్గిపోయింది. హింసకు భయపడే ఎంతోమంది పర్యాటకులు ఇక్కడకు రాలేదని ఓ ఆర్చ్‌బిషప్ చెప్పారు.