జెరూసలెం: ఇజ్రాయెల్‌కు చెందిన ఓ ఆయుధాల కంపెనీతో యుద్ధ ట్యాంకులను ధ్వంసం చేసే క్షిపణుల (స్పైక్) కొనుగోలు ఒప్పందాన్ని భారత్ రద్దు చేసుకుంది. దాదాపు రూ.3 వేల కోట్ల విలువైన 1,600 క్షిపణుల కొనుగోలు ఒప్పందాన్ని రద్దు చేసుకోవడంపై ఆ కంపెనీ విచారం వ్యక్తం చేసింది. త్వరలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు భారత్‌కు రానున్న సమయంలో ఒప్పందం రద్దు చేసుకోవడం గమనార్హం. ‘ఒప్పందం రద్దు చేసుకుంటున్నట్లు భారత్ రక్షణ శాఖ నుంచి అధికారిక సమాచారం అందింది’ అని రాఫెల్ అడ్వాన్స్ డిఫెన్స్ సిస్టమ్స్ ప్రతినిధి వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment