ఢిల్లీ: ప్రముఖ సినీ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు సుప్రీం కోర్టులో ఊరట దక్కింది. లైంగిక వేధింపుల కేసులో అతని బెయిల్‌ను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టేసింది.
తన అసిస్టెంట్‌పై జానీ లైంగిక దాడికి పాల్పడ్డాడన్నది అతనిపై నమోదైన ప్రధాన అభియోగం. ఈ కేసులో అరెస్టై జైల్లో ఉన్న జానీకి తెలంగాణహైకోర్టు అక్టోబర్ 24వ తేదీన బెయిల్ మంజూరు చేసింది. అయితే..
ఆ బెయిల్‌ను రద్దు చేయాలంటూ ఫిర్యాదుదారు సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. దీనిని పరిశీలించిన జస్టిస్ బేలా ఎం.త్రివేది, జస్టిస్ సతీష్‌చంద్ర మిశ్రాలతో కూడిన ధర్మాసనం విచారణకు నో చెప్పింది. హైకోర్టు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని ఫిర్యాదుదారు లాయర్‌కు చెబుతూ.. పిటిషన్‌ను డిస్మిస్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment