'క్రైస్తవులను ఎస్సీ జాబితాలో చేర్చాలి' | Add Dalit Christians to SC status, says ysrcp leader Raghurama krishnamraju | Sakshi
Sakshi News home page

'క్రైస్తవులను ఎస్సీ జాబితాలో చేర్చాలి'

Published Fri, Dec 13 2013 3:14 PM | Last Updated on Sat, Sep 15 2018 3:07 PM

Add Dalit Christians to SC status, says ysrcp leader Raghurama krishnamraju

ఉండి : క్రైస్తవులను ఎస్సీ జాబితాలో చేర్చాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కనుమూరి రఘురామ కృష్ణంరాజు డిమాండ్ చేశారు. క్రైస్తవులకు అండగా న్యాయ పోరాటం చేస్తామని ఆయన శుక్రవారమిక్కడ తెలిపారు. ఉండిలో   వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో క్రైస్తవులు, పాస్టర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రఘురామ కృష్ణంరాజు దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే డెల్టా ఆధునీకరణ పనులు వేగవంతంగా పూర్తి చేస్తామన్నారు.

వైఎస్ఆర్ ఎప్పుడూ ప్రజల సంక్షేమాన్నే కాంక్షించేవారని ఆయన గుర్తు చేశారు. రాష్ట్ర విభజన ముసాయిదా బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందదన్నారు. బిల్లులో ఎన్నో తప్పులున్నాయని, విభజన జరగకుండా న్యాయపోరాటం చేస్తామన్నారు. సమైక్య రాష్ట్రంలోనే ఎన్నికలకు వెళతామని తాము ఆశిస్తున్నామన్నారు. కేంద్రంలో సమైక్యం కోరుకున్న వారితోనే పొత్తు ఉంటుందని  రఘురామ కృష్ణంరాజు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement