
సాక్షి, న్యూఢిల్లీ : తనను అసభ్య పదజాలంతో దూషించారని రఘురామకృష్ణంరాజుపై వైఎస్సార్‌సీపీ ఎంపీ నందిగాం సురేష్ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేశారు. కులం పేరుతో కించపరుస్తూ దుర్భాషలాడారని ఫిర్యాదులో పేర్కొన్నారు. రఘరామకృష్ణం రాజు పదవిని, సెక్యూరిటీని అడ్డంపెట్టుకుని ఎస్సీ వర్గాన్ని బెదిరిస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఆయనపై వెంటనే క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని గురువారం వినతిపత్రం సమర్పించారు. ప్రభుత్వం కల్పించిన సెక్యూరిటీని దుర్వినియోగం చేస్తున్నారని సెక్యూరిటీ తొలగించాలని వివరించారు. కాగా పార్టీ వ్యతిరేక కార్యాకలాపాలకు పాల్పడుతున్నారని వైఎస్సార్‌సీపీ ఎంపీల బృందం ఇదివరకే రఘురామకృష్ణం రాజుపై స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment