పొంగులేటి శ్రీనివాస రెడ్డి
న్యూఢిల్లీః దళిత క్రై స్తవులను కేంద్రం ఆదుకోవాలని వైఎస్ఆర్ సీపీ ఖమ్మం లోక్సభ సభ్యుడు పొంగులేటి శ్రీనివాస రెడ్డి కేంద్రాన్ని కోరారు. మంగళవారం లోక్‌సభలో ఈ అంశంపై ఆయన ప్రత్యేక ప్రస్తావనల కింద మాట్లాడారు. దళిత క్రై స్తవులను ఎస్సీ జాబితాలో చేర్చే అంశం చాలా కాలంగా పెండింగ్‌లో ఉందని తెలిపారు. దళితులు ప్రత్యేకంగా ఒక మతానికి చెందిన వారని లేదు. చాలా కులాలు, వర్గాలు పురాతన కాలం నుంచి వేర్వేరు మతాలను ఆచరిస్తున్నాయని వివరించారు. అలాగే క్రైస్తవ మతాన్ని కూడా కొన్ని వర్గాలు ఆచరిస్తున్నాయని తెలిపారు.
తెలంగాణలోని దళితుల సామాజిక, ఆర్థిక, విద్యా పరిస్థితులు పూర్తిగా మారలేదు. ఇప్పటికీ వారు కుల వివక్షకు గురవుతూనే ఉన్నారని సభ దృష్టికి తెచ్చారు. వారు సామాజిక అణచివేతకు గురవుతున్నారని చెప్పారు. ఆర్థికంగా, విద్యాపరంగా వారు వెనకబడి ఉన్నారని తెలిపారు. దళిత క్రై స్తవులు అనేక రకాల ఇబ్బందులకు గురవుతున్నారని, వారికి దళితులతో సమానంగా ప్రభుత్వం ప్రయోజనాలు కల్పించడం లేదని చెప్పారు. అందువల్ల దళితులతో సమానంగా దళిత క్రైస్తవులను గుర్తించి వారిని సామాజిక స్థితిగతుల్లో మార్పు తేవాలని పొంగులేటి శ్రీనివాస రెడ్డి కోరారు.
**