రాష్ట్రంలోనే మొదటి మోడల్ హౌస్ రెడీ
నేడు ప్రారంభించనున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
కూసుమంచి: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో భా గంగా ప్రభుత్వం మొదటి మోడల్ హౌస్‌ను సిద్ధం చేసింది. ప్రభుత్వం త్వరలోనే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టనుండగా లబ్ధిదారులకు రూ.5 లక్షలు చెల్లిస్తామని ప్రకటించించిన విషయం తెలిసిందే. లబ్ధిదారులకు అవగాహన కల్పించేందుకు ప్రతీ మండల కేంద్రంలో ఒక నమూనా ఇంటిని నిర్మించాలని అధికా రులు నిర్ణయించారు. ఈ మేరకు రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రాతినిద్యం వహిస్తున్న పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచి తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో గతనెల 13న నమూ నా ఇంటి నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేయగా కేవ లం 30 రోజుల్లో శనివారం సాయంత్రానికి పూర్తిచేశారు.
ఈ ఇంటిని సోమవా రం మంత్రి పొంగులేటి ప్రారంభించనున్నారు. దీంతో రాష్ట్రంలోనే తొలి నమూ నా ఇల్లు కూసుమంచిలో అందుబాటులోకి రానుంది. కాగా, ఇదే నమూనాలో ఇంటిని నిర్మించుకోవాలనే నిబంధన ఏదీ లేకపోయినా.. రూ.5 లక్షల వ్యయంతో నిర్మాణం పూర్తిచేయొచ్చని లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తారు.
ఆకర్షణీయంగా నమూనా ఇల్లు..
కూసుమంచిలో 400 చదరపు అడుగుల్లో హాల్, కిచెన్, అటాచ్డ్ బాత్‌రూంతో బెడ్ రూంను నిర్మించారు. ఇంటి లోప లి గదు లు, ముందు వరండాలో టైల్స్ వేశారు. అలాగే, డా బా మెట్ల కింద టాయిలెట్‌ను నిర్మించారు. ఇంట్లో విద్యుత్ సౌకర్యాన్ని కల్పించి ఫ్యాన్లు సైతం ఏర్పాటు చేశారు. ఇంటికి రంగులు, ఇతరత్రా వసతులను రూ.5 లక్షలతోనే పూర్తిచేసినట్లు కాంట్రాక్టర్ కంచర్ల జీవన్‌రెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment