Indiramma house
-
తెలంగాణలో 80% పట్టణీకరణ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో 80 శాతం ప్రాంతం పట్టణీకరణ చెందిందని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం నివేదించింది. రాష్ట్రంలోని 28 పట్టణాభివృద్ధి సంస్థల జాబితాతోపాటు వాటి పరిధిలోకి వచ్చే ప్రాంతాల వివరాలను అందజేసింది. గతంలో 9 పట్టణాభివృద్ధి సంస్థలే ఉండగా, పట్టణీకరణ నేపథ్యంలో వాటిని 28కి పెంచిన ఉత్తర్వుల ప్రతులను కూడా జత చేసింది. పట్టణ ప్రాంతాల సంఖ్య, పరిధి బాగా పెరిగినందున ఈసారి ప్రధానమంత్రి ఆవాస్‌యోజన (పీఎంఏవై) పథకం కింద రాష్ట్రానికి ఇళ్ల యూనిట్ల సంఖ్యను పెంచాలని కోరింది. రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారంటీల్లో భాగంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకానికి కేంద్రం నుంచి భారీగా నిధులు పొందే ఉద్దేశంతో ఈ వివరాలను అందజేసింది. రూ.6 వేల కోట్లు అందేలా..ఇందిరమ్మ పథకం కింద తొలుత 4.20 లక్షల ఇళ్లను పేదలకు ప్రభుత్వం ఇవ్వబోతోంది. వీటి కోసం రూ.20 వేల కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇది రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై పెద్ద భారంగానే ఉండనుంది. దీంతో కేంద్రం నుంచి ఎన్ని ఎక్కువ నిధులు అందితే అంత భారం రాష్ట్ర ప్రభుత్వంపై తగ్గుతుంది. ప్రస్తుతం ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద కేంద్రం పట్టణ ప్రాంత యూనిట్ కాస్ట్‌ను రూ.లక్షన్నరగా, గ్రామీణ ప్రాంత యూనిట్ కాస్ట్‌ను రూ.72 వేలుగా ఖరారు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఒక్కో ఇంటికి రూ.5 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. ఇందులో కేంద్రం ఇచ్చే పట్టణ ప్రాంత యూనిట్ కాస్ట్ రూ.లక్షన్నర అందితే మిగతాది రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే.. మొదటి విడతలో కేంద్రం నుంచి రూ.6 వేల కోట్ల నిధులు అందుతాయని అంచనా వేస్తోంది. రాష్ట్ర వినతిపై కేంద్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ముందు ఇందిరమ్మ పథకం లబ్ధిదారుల జాబితాను అందజేయాలని కోరింది. సంక్రాంతి నాటికి జాబితా..ప్రస్తుతం రాష్ట్రంలో ఇందిరమ్మ పథకం అర్హుల గుర్తింపు సర్వే ప్రక్రియ కొనసాగుతోంది. ఇటీవలే అభివృద్ధి చేసిన మొబైల్ యాప్‌లో సిబ్బంది వివరాలు నమోదు చేస్తున్నారు. గతంలో ప్రజా పాలన పథకం కింద అందిన 80.54 లక్షల దరఖాస్తుల వివరాలను దరఖాస్తుదారుల ఇళ్ల వద్దకు వెళ్లి కుటుంబ సభ్యులతో మాట్లాడి నమోదు చేస్తు న్నారు. దీంతో ఆటోమేటిక్‌గా అర్హుల జాబితా ను యాప్ సిద్ధం చేస్తుంది. ఈ ప్రక్రియ సంక్రాంతి నాటికి పూర్తవుతుందని అంచనా వేస్తున్నారు. ఆ వెంటనే వివరాలను కేంద్రం రూపొందించిన పోర్టల్‌లో అప్లోడ్ చేస్తారు. ఆ వివరాలను కేంద్రప్రభుత్వం సరిచూసుకుని ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద యూనిట్లను మంజూరు చేసి నిధులు విడుదల చేస్తుంది. సమగ్రంగా వివరాల సేకరణదరఖాస్తు పత్రాల్లో నమోదు చేసిన వివరాలు కాకుండా, దరఖాస్తుదారులతో మాట్లాడి వివరాలు రాబట్టి యాప్‌లో పొందుపరుస్తున్నారు. ఏడు ప్రశ్నలకు జవాబులుగా వాటిని సేకరిస్తున్నా.. గతంలో వారి కుటుంబాల్లో ఎవరికైనా పక్కా ఇంటి పథకం కింద లబ్ధి చేకూరిందేమో నన్న అంశంపై ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. ఇల్లు వచ్చినవారు ఆ కుటుంబాల్లో ఉంటే ఆ దరఖాస్తును అనర్హమైందిగా తేలుస్తారు. ఇక ఆర్థిక పరిస్థితిని అంచనా వేసేందుకు రేషన్ కార్డు వివరాలు సేకరిస్తున్నారు. ఆధార్‌కార్డు నంబర్ ద్వారా ఇతర ఆర్థికపరమైన లావాదేవీలతో సరిపోల్చుకునే కసరత్తు కూడా జరుగుతోంది. వెరసి అనర్హులు ఎవరికీ పొరపాటున కూడా జాబితాలో చోటు దక్కుకుండా చూస్తున్నారు. అనర్హులను గుర్తిస్తే నిధుల మంజూరులో కేంద్రం కొర్రీలు విధించే ప్రమాదం ఉండటమే దీనికి కారణం. పేదల్లో అతి పేదలను గుర్తించేందుకు కొన్ని మార్కులు కేటాయిస్తున్నారు. ఆ మార్కులు ఎక్కువగా వచ్చిన దరఖాస్తులకు ర్యాంకులు ఇచ్చి మొదటి 4.20 లక్షల ర్యాంకులను ఎంపిక చేయనున్నారు. వారినే లబ్ధిదారులుగా గ్రామ సభల ముందు ఉంచి చర్చించి ఖరారు చేయనున్నారు. -
రైతుల భూమి బీఆర్ఎస్ నేతల పాలు
సాక్షి, హైదరాబాద్: గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు పంపిణీ చేసిన భూములను బీఆర్ఎస్ పాలనలో బలవంతంగా గుంజుకొని అమ్ముకున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు. అలాంటి దుర్మార్గులు ఇప్పుడు రైతుల సంక్షేమం గురించి మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని ధ్వజమెత్తారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో 24 లక్షల ఎకరాల భూమిని రైతులకు పంచిందని, పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ నాయకులు అందులో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని రైతుల నుంచి 10 వేల ఎకరాల భూమిని బలవంతంగా లాక్కొని అమ్ముకొన్నారని ఆరోపించారు.దివంగత ప్రధాని ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకొని మంగళవారం టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌తో కలిసి ఆయన నెక్లెస్‌రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అరి్పంచారు. అనంతరం గాం«దీభవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడారు. 2013లో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచి్చన భూ సేకరణ చట్టం ప్రకారమే రైతుల నుంచి అభివృద్ధికి అవసరమైన భూములు తీసుకుంటామని, బలవంతంగా తీసుకోబోమని స్పష్టంచేశారు. లగచర్లలో అధికారులపై దాడి చేయించింది బీఆర్ఎస్ పార్టీయేనని ఆరోపించారు. హామీలను నెరవేర్చకుండా బీజేపీ ప్రజలను మోసగించిందని విమర్శించారు. సొంత స్థలం ఉన్న ఇందిరమ్మ ఇళ్ల లబి్ధదారులకు రూ.5 లక్షలు ఇచ్చే అంశంపై సర్వే చేస్తున్నట్లు తెలిపారు. సమానావకాశాల కోసమే సర్వే..: రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు కల్పించేందుకే ప్రభుత్వం సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహిస్తున్నదని భట్టి విక్రమార్క తెలిపారు. మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు మహిళా స్వయం సహాయక సంఘాలకు ఏటా రూ. 20 వేల కోట్ల వడ్డీలేని రుణాలు ఇస్తున్నామని చెప్పారు. దేశాన్ని విభజించి, అస్థిరపరిచి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నవారు ఇందిరాగాంధీ గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. అలాంటివారితో దేశానికి ఎప్పటికైనా ప్రమాదమేనని అన్నారు. మీడియా సమావేశంలో మాజీ మంత్రి గీతారెడ్డి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్, నల్లగొండ డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్, చరణ్ యాదవ్, భూపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.కాళేశ్వరంతో ఏ ప్రయోజనం లేదు⇒ ఆ ప్రాజెక్టు నీళ్లు లేకున్నా రికార్డు స్థాయిలో ధాన్యం ఉత్పత్తి ⇒ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కగన్పౌడ్రీ: బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు వల్ల తెలంగాణకు ఎలాంటి ప్రయోజనం చేకూరలేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఆ ప్రాజెక్టు వల్ల రాష్ట్రంలో వరి ఉత్పత్తి పెరిగిందనటం అవాస్తవమని పేర్కొన్నారు. కాళేశ్వరంతో సంబంధం లేకుండానే రాష్ట్రంలో రికార్డు స్థాయిలో వరి ఉత్పత్తి జరుగుతుందని ఆనాడే చెప్పామని, ఇప్పుడు అదే నిజమైందని పేర్కొన్నారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా మంగళవారం నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో ఆయన పలువురికి ఇందిరాగాంధీ వ్యవసాయ ప్రతిభా అవార్డులను అందజేశారు.ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. రాష్ట్ర చరిత్రలో మొదటిసారి తమ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి బడ్జెట్లో రూ.72 వేల కోట్లు కేటాయించిందని తెలిపారు. వ్యవసాయ రుణాల మాఫీ కింద రూ.18 వేల కోట్లను రైతుల ఖాతాల్లో జమచేశామని వెల్లడించారు. వ్యవసాయరంగ అభివృద్ధికి అన్నివిధాలుగా కృషి చేస్తామని తెలిపారు. అనంతరం ఇందిరాగాం«దీపై ముద్రించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, రాజ్యసభ సభ్యుడు అనిల్‌కుమార్ యాదవ్, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రంలో 4.50 లక్షల ఇళ్ల నిర్మాణమే లక్ష్యం
హుజూర్నగర్: ఈ ఏడాదిలో రాష్ట్రంలోని నిరుపేదలకు రూ.22 వేల కోట్ల బడ్జెట్‌తో 4.50 లక్షల ఇళ్లు నిర్మించి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో ఫణిగిరి గుట్ట వద్ద నిర్మాణంలో ఉన్న 2,160 ఇళ్ల కాలనీని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్‌తో కలసి మంగళవారం పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. తమది చేతల ప్రభుత్వమని రూ.22వేల కోట్లతో పనులు మొదలు పెడుతున్నామని ఆయన స్పష్టం చేశారు. వచ్చే ఐదేళ్లలో ప్రతీ పేద కుటుంబానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇల్లు ఇస్తుందని తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో తాను గృహనిర్మాణ శాఖ మంత్రిగా ఉండగా జీవో ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా అడిగిన ప్రతీ ఒక్కరికీ ఇల్లు ఇచ్చామని, సుమారు 14 లక్షల ఇళ్లు కట్టించామని ఆయన గుర్తు చేశారు. ప్రతీ గ్రామంలో, మున్సిపాలిటీలో ఇందిరమ్మ ఇళ్లు ఉన్నాయన్నారు. డబుల్ బెడ్రూం ఇళ్లు అని కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు ఎలా మోసం చేశారో రాష్ట్ర ప్రజలు గమనించారని చెప్పారు. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో మంత్రి వర్గ సమావేశంలో చేసిన తీర్మానం ప్రకారం అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూం ఇళ్లను పూర్తి చేసి త్వరలోనే అర్హులైన వారికి అందజేస్తామన్నారు. -
‘గృహలక్ష్మి’కి గుడ్‌బై.. చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం! వాటి స్థానంలో..
నిజామాబాద్: గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన గృహలక్ష్మి పథకానికి కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్‌బై చెప్పింది. పథకాన్ని రద్దు చేస్తూ జీవో జారీచేసింది. దీంతో ఎన్నికలకు ముందు జారీచేసిన ప్రొసీడింగ్‌లు రద్దయ్యాయి. ఇందిరమ్మ ఇళ్ల పథకానికి శ్రీకారం చుట్టడంతో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దీంతో గృహలక్ష్మి ప్రొసీడింగ్ కాపీల చెత్తబుట్టలో పారవేయాల్సిందేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 2023–24 ఆర్థిక సంవత్సరానికి గాను గృహలక్ష్మి పథకం కింద ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ. 3లక్షల సాయాన్ని అందించడానికి గత ప్రభుత్వం నిధులను కేటాయించింది. ఒక్కో నియోజకవర్గంలో 3వేల ఇళ్ల నిర్మాణానికి సాయం అందించాలని నిర్ణయించారు. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులే గ్రామాల్లో లబ్ధిదారులను ఎంపిక చేసి గుట్టుచప్పుడు కాకుండా ప్రొసీడింగ్ కాపీలను పంపిణీ చేశారు. ఈ కాపీలపై కలెక్టర్ల ఆదేశాలతో జారీ చేసినట్లు ఎంపీడీవోల హోదాను పేర్కొంటూ రాసి ఉంది. కానీ కాపీలపై ఏ అధికారి సంతకం లేకపోవడం గమనార్హం. జిల్లాలో 16,500ల మందికి ప్రొసీడింగ్ కాపీలను అందించారు. ఎన్నికల తేదీ ఖరారైన తర్వాత కూడా కాపీలను లబ్ధిదారులకు అందించారు. అధికారుల సంతకాలు లేకపోవడంతో అవి చెల్లుబాటు కావని అప్పట్లోనే ప్రచారం జరిగినా ఎవరూ పట్టించుకోలేదు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రూ. 5లక్షల చొప్పున సాయం అందిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ లెక్కన గత ప్రభు త్వం ప్రకటించిన గృహలక్ష్మి పథకం కంటే ఇందిరమ్మ ఇంటికే ఎక్కువ సాయం అందుతుంది. అందువల్ల గతంలోని ప్రొసీడింగ్ల ద్వారా సాయం పొందడం కంటే కొత్తగా ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం మంజూరు చేయించుకుని లబ్ధి పొందడం మంచిదనే భావన కలుగుతుంది. గృహలక్ష్మి పథకం కింద లబ్ధిదారులుగా ఎంపికై న వారు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సాయం పొందడానికి మరోసారి దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఇవి చదవండి: ట్రాఫిక్ చలాన్ల చెల్లింపులో నిర్లక్ష్యం -
ఇండ్లు.. రేషన్‌కార్డులకే ఎక్కువ!
కరీంనగర్: ఆరు గ్యారంటీల అమలులో భాగంగా ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన అభయహస్తం అర్జీల స్వీకరణ జాతరను మరిపిస్తోంది. శుక్రవారం జిల్లావ్యాప్తంగా ఆయా గ్రామాలు, వార్డులు, డివిజన్లలో దరఖాస్తులు స్వీకరించగా ఇందిరమ్మ ఇండ్లు, రేషన్‌కార్డుల కోసం ఎక్కువ అర్జీలొచ్చాయి. ఈ నెల 28న ప్రక్రియ ప్రారంభం కాగా తొలిరోజు 28,452 దరఖాస్తులు వచ్చిన విషయం తెలిసిందే. శుక్రవారం 48,230 వేల దరఖాస్తులు రాగా.. శనివారం 46 గ్రామాలతో పాటు 22 డివిజన్లలో ‘ప్రజాపాలన’ నిర్వహించనున్నారు. రేషన్‌కార్డు లేనివారికి అవకాశం! రేషన్‌కార్డు లేనివారు కూడా దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశఽం కల్పించింది. వీరి కోసం ప్రత్యేక కౌంటర్‌ను ఏర్పాటు చేశారు. రేషన్ కార్డులేనివారు ఆధార్ కార్డులను జత చేయాలని అధికారులు సూచిస్తున్నారు. కాగా.. ప్రభుత్వమే రూపొందించి ఇచ్చిన దరఖాస్తుఫారం నింపే క్రమంలో చాలామంది అయోమయానికి గురయ్యారు. మహాలక్ష్మి పథకానికి కుటుంబంలో ఒకరికన్నా ఎక్కువ మంది ఉండటంతో ఒకే దరఖాస్తులో వివరాలు రాయాలా.. వేర్వేరు అందించాలా అన్న అయోమయానికి గురయ్యారు. రైతుభరోసాలో కౌలు రైతులు దరఖాస్తు చేసినప్పటికి ఫారంలో భూ యజమాని పట్టా పాసుపుస్తకం వివరాలు అందించలేకపోయారు. సబ్ మీటర్ లేకుండా అద్దె ఇళ్లలో ఉన్నవారు గృహజ్యోతికి కాలం పూరించే క్రమంలో సర్వీస్ నంబర్ లేకుండా దరఖాస్తు అందించారు. గ్రామసభల్లో పాల్గొన్న అధికారులు సైతం సరైన సమాచారం ఇవ్వకపోవడంతో గందరగోళం నెలకొంది. కరీంనగర్లో ఎక్కువ కొత్తపల్లిలో తక్కువ కరీంనగర్ సిటీలో అత్యధిక దరఖాస్తులు 15,551 రాగా.. కొత్తపల్లి మున్సిపాలిటీలో అత్యల్పంగా 332 వచ్చాయి. చొప్పదండి మున్సిపాలిటీలో 843, హుజూరాబాద్‌లో 1,956, జమ్మికుంటలో 1,955 దరఖాస్తులు వచ్చాయి. మండలాలవారీగా చూస్తే ఇక చిగురుమామిడి మండలంలో 1,253, చొప్పదండిలో 1,928, ఇల్లందకుంటలో 1,158, గంగాధరలో 2,311, గన్నేరువరం 1,391, హుజూరాబాద్ 1,826, జమ్మికుంట 2,067, కరీంనగర్ రూరల్ 1,605, కొత్తపల్లి 2,587, మానకొండూరు 2,170, రామడుగు 1,952, శంకరపట్నం 1,320, తిమ్మాపూర్ 1,458, సైదాపూర్ 2,183, వీణవంక మండలంలో 2,384 దరఖాస్తు వచ్చాయి. నేడు ప్రజాపాలన జరగనున్న ప్రాంతాలివే.. చిగురుమామిడి మండలంకొండాపూర్, లంబాడిపల్లి, ముదిమాణిక్యం, ముల్కనూరు, చొప్పదండి మండలం కొలిమికుంట, కోనేరుపల్లి, కుర్మపల్లి, మంగళపల్లి, ఇల్లందకుంట మండలం మల్లన్నపల్లి, మల్యాల, మర్రివానిపల్లి, పాతర్లపల్లి, గంగాధర మండలం హిమ్మత్‌నగర్, ఇస్లాంపూర్, కాచిరెడ్డిపల్లి, కాసారం, గన్నేరువరం మండలం హన్మాజిపల్లి, జంగపల్లి, ఖాసీంపేట, మాదాపూర్, హుజూరా బాద్ మండలం కాట్రపల్లి, మందాడిపల్లి, పెదపాపయ్యపల్లి, పోతిరెడ్డిపేట, జమ్మికుంట మండలం నాగంపేట, నగురం, పాపయ్యపల్లి, పాపక్కపల్లి, కరీంనగర్ రూరల్‌లో దుబ్బపల్లి, దుర్శేడ్, ఎలబోతారం, కొత్తపల్లి మండలంలో కమాన్‌పూర్, ఖాజీపూర్, మానకొండూరు మండలంలో చెంజర్ల, దేవంపల్లి, ఈదులగుట్టపల్లి, గట్టుదుద్దెనపల్లి, రామడుగు మండలం వెలిచాల, చిప్పకుర్తి, దత్తోజి పేట, శంకరపట్నం మండలంలో చింతలపల్లి, ధర్మారం, ఎరడపల్లి, గద్దపాక, తిమ్మాపూర్ మండలం ఇందిరానగర్, జుగుండ్ల, కొత్తపల్లి, లక్ష్మీదేవిపల్లి, సైదాపూర్ మండలంలో గొడిశాల, గుజ్జులపల్లి, గుండ్లపల్లి, జాగిర్పల్లి, వీణవంక మండలం బ్రహ్మణపల్లి, దేశాయిపల్లి, ఎలబాక, గంగారం, కొత్తపల్లి మునిసిపాలిటీలో 5, 6వ వార్డులు, చొప్పదండిలోని 5,6వ వార్డులు, కరీంనగర్ నగరపాలకలో 3, 8, 16, 22, 27, 30, 35, 37, 48, 51 డివిజన్లు, జమ్మికుంట మునిసిపాలిటీలో 9, 10, 11, 12వార్డుల్లో, హుజూరాబాద్‌లో 9, 10, 11, 12 వార్డుల్లో గ్రామసభలు నిర్వహించనున్నారు. జిల్లాలో గ్రామాలు: 313, మునిసిపాలిటీలు: 5, జిల్లా మొత్తంగా వచ్చిన అర్జీలు: 76,682, శుక్రవారం వచ్చినవి: 48,230, కవరైన నివాసాలు: 2,13,218, దరఖాస్తులు స్వీకరించిన గ్రామాలు: 90, వార్డులు: 48 ఇవి చదవండి: దరఖాస్తు ఫారాలు విక్రయిస్తే కేసులు.. : కలెక్టర్ రాహుల్‌రాజ్ -
సొంతిల్లు సాకారం పెద్దాయన చలవే..
సాక్షి, మండపేట: ప్రతి పేదవాడూ కలలు కనేది సొంతింటి కోసమే. తన సొంత ఇంటిలో ప్రశాంతంగా జీవించాలని సంబరపడుతుంటారు. అధికారంలోకి వచ్చిందే తడవు పేదల కలను సాకారం చేసి చూపించారు దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి. పేదవర్గాల వారి అద్దె ఇంటి వెతలు తీర్చేందుకు ఇందిరమ్మ పథకాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలుచేశారు. మూడు విడతలుగా అమలుచేసే ఈ పథకానికి జిల్లా నుంచే శ్రీకారం చుట్టారు. మూడేళ్లలో జిల్లాకు 2,14,205 ఇళ్లను మంజూరు చేసిన వైఎస్ దాదాపు రూ.743.96 కోట్లు విడుదల చేశారు. వైఎస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలుచేసిన ఇందిరమ్మ పథకాన్ని 2006 ఏప్రిల్ 1వ తేదీన కపిలేశ్వరపురం మండలం పడమరఖండ్రిక నుంచే ప్రారంభించారు. అప్పటి వరకు అర్బన్ ప్రాంతాల్లో రూ.30 వేలు, రూరల్ ప్రాంతాల్లో రూ.22,500 ఉన్న గృహనిర్మాణ సాయాన్ని పెరిగిన ధరలకు అనుగుణంగా అర్బన్‌లో రూ.55 వేలు, రూరల్‌లో రూ.45 వేలకు పెంచారు. అలాగే ఎస్సీలకు ఇచ్చే సాయాన్ని అర్బన్‌లో రూ.75 వేలు, రూరల్‌లో రూ.65 వేలకు పెంచారు. మునుపెన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో సొంత స్థలాలు లేని పేదవర్గాల కోసం కోట్లాది రూపాయల వ్యయంతో జిల్లా వ్యాప్తంగా వేలాది ఎకరాలు సేకరించారు. ఇందిరమ్మ మూడు దశల్లో భాగంగా స్థలాలు మెరక పనులు చేసి లబ్ధిదారులకు అప్పగించడంతో పాటు గృహ నిర్మాణ రుణాలు మంజూరు చేశారు. మూడు విడతల్లోను మొత్తం జిల్లాకు 2,14,205 ఇళ్లను మంజూరు చేశారు. అందుకోసం సుమారు రూ.743.96 కోట్లు విడుదల చేశారు. పేదవర్గాల వారి సొంతింటి కలను సాకారం చేస్తూ వీటిలో సుమారు 1.95 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేశారు. మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయి. మండపేటలో దాదాపు 4,500 మంది పేదవర్గాల వారికి పంపిణీ చేసేందుకు స్థానిక గొల్లపుంత ప్రాంతంలో రెండు విడతలుగా రూ.18.14 కోట్లతో 122.72 ఎకరాలు సేకరించారు. పేదల సొంతింటి కోసం రాష్ట్రంలోనే ఇది రెండో అతి పెద్ద స్థల సేకరణ కావడం గమనార్హం. తొలి విడతలో సేకరించిన 55.77 ఎకరాల్లో మెరక పనులు పూర్తి కాగా ఒక్కొక్కరికీ సెంటున్నర చొప్పున 2009 ఫిబ్రవరి 27న పట్టాల పంపిణీని వైఎస్ ప్రారంభించారు. 1979 ప్లాట్లుగా విభజించి లబ్ధిదారులకు అప్పగించారు. వీటిలో 1834 మందికి గృహనిర్మాణ రుణాలు మంజూరు కాగా ఇప్పటి వరకు 1200కు పైగా ఇళ్లు పూర్తయ్యాయి. పేదల సొంతింటి కలను సాకారం చేయడం ద్వారా వారి గుండె గూటిలో గూడు కట్టుకున్నారు వైఎస్. పేదల సొంతింటి కలను సాకారం చేసిన దివంగత వైఎస్ దివికేగి ఏళ్లు గడుస్తున్నా పేదల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. పక్కా ఇళ్లకు ‘చంద్ర’గ్రహణం పేదల పక్కా ఇళ్లకు నేడు చంద్రగ్రహణం పట్టింది. అధికారంలోకి వచ్చిన రెండేళ్లకు ఎన్టీఆర్ గృహనిర్మాణం పేరిట పక్కా ఇళ్ల నిర్మాణానికి చంద్రబాబు పచ్చజెండా ఊపారు. 2016–17, 2017–18, 2018–19 ఆర్థిక సంవత్సరాలకు జిల్లాకు కేవలం 64,647 ఇళ్లు మంజూరు చేయడం పేదల పక్కా ఇళ్ల నిర్మాణంలో ప్రభుత్వ చిత్తశుద్ధిని తేటతెల్లం చేస్తోంది. రూ.1.5 లక్షల ఆర్థిక సాయమంటూ మూడేళ్లలో ఆయా ఇళ్లకు కేటాయించింది రూ.594.75 కోట్లు మాత్రమే కావడం గమనార్హం. నిర్మాణంలో ఉన్నవి, నిర్మాణాలు పూర్తిచేసుకున్న లబ్ధిదారులకు రూ. వంద కోట్లకు పైగా బిల్లుల చెల్లింపులు చేయాల్సి ఉన్నట్టు అంచనా. మూడేళ్లలో... మంజూరైన ఇళ్లు నిధులు నిర్మాణం పూర్తయినవి నిర్మాణంలో ఉన్నవి వైఎస్ హయాంలో.. 2,14,205 రూ. 743.96 కోట్లు 1,99,890 14,315 చంద్రబాబు హయాంలో.. 64,647 రూ. 594.75 కోట్లు 46,614 11,998 -
ఇందిరమ్మ నోరుకొట్టి ఎన్టీఆర్ గృహాలు!
టీడీపీ ప్రభుత్వం ఇందిరమ్మ పథకం లబ్ధిదారులకు నిలువనీడ లేకుండా చేసింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అమలుచేసిన ఇందిరమ్మ పథకాన్ని ఎన్టీఆర్ గృహకల్ప పథకంగా మార్చిన ప్రభుత్వం ఆ పథకంలో మంజూరైన గృహాలను లబ్ధిదారులకు సమాచారం ఇవ్వకనే రద్దుచేసి ఆన్లైన్ నుంచి వివరాలను తొలగించింది. వైఎస్ఆర్ హయాంలో 3దశల ఇందిరమ్మ పథకం ద్వారా 3,23,473 గృహాలను పేదలకు మంజూరుచేశారు. అనంతరం టీడీపీ అధికారంలోకి రాగానే ఇందిరమ్మ పథకాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. నిర్మాణంలోని ఇళ్లకు బిల్లులు ఆపేసింది. వివిధ దశల్లోని నిర్మాణాలు అసంపూర్తిగా నిలిచిపోయాయి. చిత్తూరు, బి.కొత్తకోట: జిల్లాలో మూడు విడతల్లో మంజూరైన ఇందిరమ్మ గృహాల్లో 70,483 గృహ నిర్మాణాలను లబ్ధిదారులు చేపట్టలేకపోయారు. పేదలు కావడంతో నిర్మాణాలు చేపట్టేందుకు జాప్యం చేశారు. గత ప్రభుత్వం వరకు ఈ గృహాలు అధికారికంగా మనుగడలోనే ఉన్నాయి. మంజూరైన వాటిలో ఇవి ఇంకా ప్రారంభం కాని గృహాల జాబితాలో ఉంచి లబ్ధిదారులు నిర్మాణాలను ఎప్పుడైనా చేపట్టే వీలు కల్పించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన రెండేళ్ల వరకు ఒక్క ఇంటినీ మంజూరు చేయలేదు. ఇందిరమ్మ పథకానికి రూపాయి విదల్చలేదు. ఫలితంగా జిల్లాలో ఎక్కడి నిర్మాణాలు అక్కడే ఆగిపోయాయి. చేసిన ఖర్చంతా వృథా అయ్యింది. చివరకు ఈ ఇళ్లను ప్రారంభం కాని జాబితా నుంచి తొలగించి రద్దు చేశారు. ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు పక్కా గృహాలు కోల్పోయారు. కాగా ఇందిరమ్మ పథకంలో పునాదులు, గోడల స్థాయిలో జరిగిన ఇంటి నిర్మాణాలకు అప్పటి యూనిట్ విలువకు అదనంగా రూ.25వేలు చెల్లిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. దీనివల్ల కూడా లబ్ధిదారులకు ప్రయోజనం లేదు. ఇందిరమ్మ పథకంలో పునాదుల స్థాయిలో 4,085 గృహాలు, గోడల స్థాయిలో 27,774 గృహాలు ఉండగా అందులో 11,238 గృహాలకు మాత్రమే అదనపు చెల్లింపులు వర్తింపజేశారు. మిగిలిన గృహాలు దీనావస్థలో అసంపూర్తిగా మిగిలిపోయాయి. ఇందిరమ్మ స్థానంలో ఎన్టీఆర్.. ఇందిరమ్మ పథకాన్ని అటకెక్కించిన ప్రభుత్వం దాని స్థానంలో ఎన్టీఆర్ గృహకల్ప పథకాన్ని తీసుకొచ్చింది. 70,483 గృహాలను రద్దుచేసిన ప్రభుత్వం 2016–17 నుంచి 2019–20 వరకు నాలుగు విడతల్లో గ్రామీణ, పట్టణ, గ్రామీణ్ పథకాల ద్వారా 95,295 ఇళ్లు ఇచ్చింది. రద్దయిన ఇందిరమ్మ ఇళ్లను కొనసాగించి ఉంటే పేదలకు ప్రయోజనం కలిగి అదనంగా పేదలకు ఇళ్లు దక్కేవి. 70,483 ఇళ్లను రద్దుచేసిన ప్రభుత్వం వీటికి అదనంగా 24,812 ఇళ్లను కలిపి 95,295 గృహాలను మంజూరు చేసింది. ఇందిరమ్మ ఇళ్ల రద్దుతో గృహాల మంజూరుకు అవసరమైన పేదల సంఖ్య పెరిగింది. ఇళ్లకోసం లక్షల సంఖ్యలో దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులు మంజూరు కోసం ఎదురుచూస్తుంటే పల్స్ సర్వే ఆధారంగా లబ్ధిదారుల ఎంపిక బాధ్యతను టీడీపీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలకు కట్టబెట్టారు. రద్దయ్యాయి జిల్లాలో నిర్మాణాలు ప్రారంభం కాని ఇందిరమ్మ ఇళ్లు రద్దయ్యాయి. మంజూరైన లబ్ధిదారులు ఇళ్లు కోల్పోయారు. వీరికి ఇందిరమ్మ పథకంలో అవకాశం లేదు. పునాదులు, గోడల వరకు నిర్మాణాలు చేసుకున్న ఇందిరమ్మ లబ్ధిదారులకు యూనిట్ విలువకు అదనంగా రూ.25వేలు చెల్లిస్తున్నాం. –రామచంద్రారెడ్డి, హౌసింగ్ పీడీ, చిత్తూరు -
ఇందిరమ్మ ఇళ్లకు సీఎం ఎసరు: చాడ
చిగురుమామిడి (హుస్నాబాద్): కేసీఆర్ ఇందిరమ్మ ఇళ్లకు ఎసరుపెట్టారని, రాష్ట్రవ్యాప్తంగా 4.66 లక్షల ఇళ్ల నిర్మాణాలను నిలిపివేశారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విమర్శించారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం రామంచలో విలేకరులతో మాట్లాడారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో అక్రమాలు జరిగాయని భావించిన ప్రభుత్వం.. సీబీసీఐడీతో విచారణ జరిపించి ఎందుకు మరుగున పెట్టిందని ప్రశ్నించారు. డబుల్‌బెడ్ రూం ఇళ్లు ఎక్కడా నిర్మించడం లేదన్నారు. రామచంద్రం, హుస్నాబాద్ ఎమ్మె ల్యే వొడితెల సతీష్‌కుమార్ పదినెలల క్రితం డబుల్బెడ్రూం ఇళ్లకు శంకుస్థాపన చేశారని, ఇంకా ప్రారంభంకాలేదని పేర్కొన్నారు. -
ఇందిరమ్మ.. ఇదేందమ్మా!
కెరమెరి : నిలువ నీడ లేని నిరుపేదలకు 2005లో అప్పటి ప్రభుత్వం ఇందిరమ్మ పేరిట గృహాలు మంజూరు చేసింది. కానీ నిర్మించిన వాటికి బిల్లులు రాక అవి అర్ధంతరంగా నిలిచిపోయాయి. అయినా వాటి గురించి పట్టించుకునే వారు కరువైయ్యారు. మండలంలోని సాంగ్వి గ్రామ పంచాయతీలోని రావుజిగూడలో 20 ఇళ్లు మంజూరు అయ్యాయి. వారిలో సుమారు 15 ఇళ్లు కిటికి లెవల్ వరకు పూర్తయ్యాయి. అనంతరం ఆ గ్రామం నుంచి ఇందిరమ్మ గృహాలు నిర్మించుకున్న లబ్ధిదారులు ఇతర గ్రామానికి వెళ్లి పోయారు. పోతూపోతూ ఉన్న ఇళ్లను కూడా కూలగొట్టి వెళ్లి పోవడంతో ప్రజా ధనం వృథా అయింది. అందులో మిగిలిన 5 ఇళ్లకు ఇప్పటికీ బిల్లులు రాక అలాగే నిర్మాణాలు నిలిచిపోయాయి. అందులో మూడు బేస్మిట్ లెవల్ వరకు ఉండగా. మరో రెండు స్లాబ్ లేవల్ వరకు నిర్మాణాలు జరిగాయి. నేటికైనా బిల్లులు అందవా? అంటూ లబ్ధిదారులు ఆశతో ఎదురు చూస్తున్నారు. అలాగే కర్పెతగూడలో కూడా నాలుగు ఇళ్లు, కుప్పగూడలో ఐదు, లైన్పటార్లో ఎనిమిది ఇళ్ల నిర్మాణాలకు ఇప్పటికీ ఒక్క బిల్లు కూడా మంజూరు కాలేదు. ప్రభుత్వంపై ఆశలు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం గతంలో మహిళా సంఘాలు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల కోసం తీసుకున్న రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించింది. అర్ధంతరంగా నిర్మాణాలు ఆగి ఉన్న వాటి గురించి ప్రభుత్వం పల్లెత్తు మాట కూడా అనక పోవడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ఎప్పటికైనా ప్రభుత్వం మాపై కరుణించక పోదా అన్న భ్రమలో ఇప్పటికీ లబ్ధిదారులు ఉన్నారు. డబ్బుల్ బెడ్ రూం కోసం మమ్మల్ని ఇంత వరకు ఎవరూ అడగలేదని, ఇక అవి కూడా మంజూరు అయ్యే అవకాశం కూడా కనబడడం లేదని వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి బిల్లులు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. డబ్బుల్లేక నిర్మాణం ఆగింది నేను పేద కుటుంబానికి చెందిన వాడను. నా వద్ద ఇళ్లు నిర్మించుకునేందుకు డబ్బులు లేక పోవడంతో ఇంటి నిర్మిణం ఆగింది. ఇందిరమ్మ బిల్లులు వస్తయి అనుకుంటే పదేళ్లు గడుస్తున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. – కోట్నాక్ జైవంత్‌రావు ప్రభుత్వం పట్టించుకోవాలి ప్రస్తుతం ఉన్న తెలంగాణ ప్రభుత్వం పేదలపై దయ చూపాలి. మా గ్రామంలో నిలిచిన ఇందిరమ్మ గృహాలకు ఎంతో కొంత రుణాలు ఇచ్చి ఇంటి నిర్మాణానికి దోహదపడాలి. పక్కా ఇళ్ల నిర్మాణాల కోసం సహకారం అందించాలి. – కోట్నాక్ బార్ఖిరావు, గ్రామ పటేల్ ‘డబుల్’ మంజూరు చేయాలి గతంలో నిర్మాణం చేపట్టేటప్పుడు బిల్లు రాక అర్ధంతరంగా నిలిచిన ఇందిమరమ్మ గృహాలకు బిల్లులు మంజూరు చేయాలి. లేదా కొత్తగా ప్రభుత్వం పేదలకు ఇస్తున్న డబ్బుల్ బెడ్ రూం ఇళ్లనైనా మంజూరు చేయాలి. – పెందోర్ లింబారావు -
ఆన్లైన్.. ఆలస్యం
బిల్లుల కోసం ఇందిరమ్మ లబ్ధిదారులకు ఇంకా ఎదురుచూపులు తప్పడంలేదు. వైఎస్ హయాంలో ఈ పథకం ప్రారంభించగా.. ‘డబుల్’ ఇళ్ల రాకతో బిల్లులు నిలిచిపోయాయి. ఆందోళన చెందిన లబ్ధిదారులు అధికారులను వేడుకోవడంతో ప్రభుత్వం తహసీల్దార్లతో సర్వే చేయించింది. ఆ వివరాల ఆన్లైన్.. జాప్యం జరుగుతోంది. ఫలితంగా చెల్లింపు ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. సాక్షి ప్రతినిధి, ఖమ్మం : ప్రతీ నిరుపేదకు సొంత ఇల్లు ఉండాలనే సంకల్పంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రవేశపెట్టారు. దశలవారీగా ఇళ్లకు సంబంధించిన బిల్లులు విడుదల చేసేవారు. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన లబ్ధిదారులకు డబుల్బెడ్రూం ఇళ్లను మంజూరు చేసింది. ఈ క్రమంలో ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల విడుదల నిలిచిపోయింది. దీంతో ఇళ్లు నిర్మించుకున్న లబ్ధిదారులు ఆందోళనకు గురయ్యారు. అప్పులు చేసి మరీ ఇళ్లను నిర్మించుకున్నామని, ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నామని, ఇప్పుడు బిల్లులు నిలిపిస్తే తమ పరిస్థితి ఏమిటని అధికారు యంత్రాంగం చుట్టూ తిరిగి విన్నవించుకున్నారు. స్పందించిన ప్రభుత్వం అర్హులైన వారిని గుర్తించేందుకు తహసీల్దార్లతో సర్వే చేపట్టింది. నివేదిక ఇచ్చి ఏడాది.. 2008వ సంవత్సరం నుంచి 2015 వరకు ఇందిరమ్మ పథకం కింద 6,724మంది నిర్మాణాలు వివిధ దశల్లో పూర్తి చేసుకుంటున్నారు. అయితే వాటికి సంబంధించిన బిల్లులు లబ్ధిదారులకు అందలేదు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో అవకతవకలు జరిగాయని, కొంతమంది అసలు ఇళ్లను నిర్మించకుండానే బిల్లులు తీసుకున్నారనే ఆరోపణలు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. దీంతో అర్హులను గుర్తించేందుకు తహసీల్దార్లతో విచారణ చేయించారు. బృందాలుగా ఏర్పడిన తహసీల్దార్లు గ్రామాల్లో విచారణ చేపట్టారు. అర్హులైన లబ్ధిదారులను గుర్తించి ఆ వివరాలను కలెక్టరేట్‌కు పంపించారు. విచారణ పూర్తయి సుమారు ఏడాది కావస్తున్నా ఆన్లైన్లో జాప్యం కారణంగా లబ్ధిదారులు బిల్లుల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. నత్తనడకన ఆన్లైన్.. ఇందిరమ్మ లబ్ధిదారుల ఆన్లైన్ అంశం ఎప్పటికప్పుడు ఆలస్యమవుతోంది. తహసీల్దార్లు విచారణ నివేదికను కలెక్టరేట్‌కు పంపించిన ఏడాది కావొస్తోంది. అయినా ఆన్లైన్ చేయటంలో మాత్రం జాప్యం జరుగుతోంది. ఇప్పటికే ఆలస్యమవడంతో లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాల కోసం తెచ్చుకున్న అప్పులు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 6,724మంది ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకున్నారు. వాటిలో 1,874కు సంబంధించి ఆన్లైన్ కాగా, వారికి సంబం«ధించిన రూ.2.06కోట్లు లబ్ధిదారుల ఖాతాల్లో జమ అయ్యాయి. మిగిలిన 4,845మంది లబ్ధిదారులకు సంబంధించిన వివరాలు ఇంకా ఆన్లైన్ కాలేదు. సిబ్బంది కొరత కారణంగా ఆన్లైన్ చేయడంలో తీవ్ర జాప్యం చోటు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. కేవలం ఐదుగురు ఉద్యోగులు మాత్రమే ఈ ఆన్లైన్ ప్రక్రియ నిర్వహిస్తున్నారు. దీంతో వివరాల నమోదు, నత్తనడకన సాగుతోంది. -
సొంతింటి కలకు చంద్ర గ్రహణం
సెంటు స్థలం ధర లక్షలు పలుకుతోంది. నిర్మాణ వ్యయం పెరిగిపోతోంది. బాడుగింటి అద్దె చుక్కలు చూపుతోంది. రెక్కలు ముక్కలు చేసుకున్నా.. ఐదు వేళ్లు నోట్లోకి వెళ్లని పరిస్థితుల్లో నిరుపేద, మధ్య తరగతి కుటుంబాలకు సొంతిల్లు కలగానే మిగులుతోంది. ‘ఇందిరమ్మ’ పథకంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఎందరికో గూడు చూపినా.. టీడీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ‘చంద్ర’ గ్రహణం పట్టుకుంది. కర్నూలు(అర్బన్): ప్రతి పోదోడి సొంతింటి కలను నెరవేర్చాలనే వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆశయానికి అంచెలంచెలుగా తూట్లు పొడుస్తున్నారు. కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ‘ఇందిరమ్మ’ పథకం అనేక ఆటుపోట్లను ఎదుర్కోగా.. ఇటీవల అధికార పగ్గాలు చేపట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మొదటికే మోసం తీసుకొచ్చారు. కొత్త ఇళ్ల మాట దేవుడెరుగు.. కట్టుకున్న ఇళ్లకు బిల్లులూ మంజూరు చేయకపోవడం లబ్ధిదారులను ఆర్థిక ఇక్కట్లకు గురిచేస్తోంది. ఇదే సమయంలో ఖర్చులు తగ్గించుకునే నెపంతో సిమెంట్ గోడౌన్లను మూసివేయాలని రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఇంటి నిర్మాణంలో కీలకమైన సిమెంట్ సరఫరా నిలిచిపోవడంతో నిర్మాణాలు అటకెక్కే పరిస్థితి నెలకొంది. జిల్లాలో మొత్తం 13 గోడౌన్లు మూతపడనుండగా.. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక గోడౌన్లకు సిమెంట్ సరఫరా చేయకపోవడం ప్రభుత్వ వైఖరిని చెప్పకనే చెబుతోంది. కొత్త ఇళ్ల ఊసే లేనందున గోడౌన్లలో నిల్వ ఉన్న సిమెంట్‌ను పంపిణీ చేసి మూసివేయాలని ఆదేశాలు జారీ అయినట్లు సమాచారం. పేదలకు ఇళ్ల నిర్మాణం భారం కాకూడదనే ఉద్దేశంతో రాష్ట్రంలోని అన్ని సమెంట్ కంపెనీలతో చర్చించి రాయితీపై సిమెంట్‌ను అందించారు. పలు కంపెనీల నుంచి బస్తా సిమెంట్‌ను రూ.153.50లకు కొనుగోలు చేసి రవాణా ఖర్చుతో రూ.158లకు పంపిణీ చేశారు. కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో సిమెంట్ ధర అమాంతం పెరిగిపోవడంతో.. 2011 నుంచి బస్తాపై అంచెలంచెలుగా ధర పెరుగుతూ ప్రస్తుతం రూ.235లకు చేరుకుంది. జీయో ట్యాగింగ్ పేరిట కొత్త ఇళ్ల మంజూరులో జాప్యం రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన జీయో ట్యాగింగ్ సిస్టమ్ కొత్త ఇళ్ల ఆశలపై నీళ్లు చల్లింది. ఇందిరమ్మ లబ్ధిదారులందరినీ ఆధార్‌తో అనుసంధానం చేయడంతో పాటు.. మూడు విడతల ఇందిరమ్మ గృహ నిర్మాణ పథంకంలో చోటు చేసుకున్న అక్రమాలను నిగ్గు తేల్చేందుకు జీయో ట్యాగింగ్ సిస్టమ్‌ను టీడీపీ ప్రభుత్వం తెరపైకి తీసుకొచ్చింది. ఈ సిస్టమ్‌కు సంబంధించి ఇప్పటి వరకు సంబంధిత అధికారులకు ఎలాంటి శిక్షణనివ్వలేదు. అధికారులకు రాష్ట్ర స్థాయిలో శిక్షణనిచ్చిన అనంతరం వారు జిల్లాలోని క్షేత్ర స్థాయి అధికారులకు శిక్షణనివ్వాల్సి ఉంది. నెలాఖరు వరకు బదిలీలకు అవకాశం ఉన్నందున ఉన్నతాధికారులు శిక్షణ విషయంలో వెనుకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. అందని బిల్లులు.. ఆగిన నిర్మాణాలు వివిధ కారణాలతో గత ఐదు నెలలుగా గృహ నిర్మాణాలకు సంబంధించి బిల్లులను కొత్త ప్రభుత్వం నిలిపేసింది. ఈ కారణంగా జిల్లాలోని 53వేల మంది లబ్ధిదారుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అధికారికంగా రూ.22 కోట్లు.. అనధికారికంగా మరో రూ.14 కోట్లు ప్రభుత్వం లబ్ధిదారులకు బకాయి పడినట్లు సమాచారం. ఆపసోపాలు పడి ఇంటి నిర్మాణం పూర్తి చేసుకోవాలని భావించిన లబ్ధిదారులు ప్రభుత్వ తీరుతో దిక్కులు చూస్తున్నారు. ఎక్కడికక్కడ నిలిచిపోయిన నిర్మాణాలను చూసి వారంతా గగ్గోలు పెడుతున్నారు. -
సిబీసీఐడీ దూకుడు
ముకరంపుర : గృహ నిర్మాణ పథకంలో చోటుచేసుకున్న అవి నీతి, అక్రమాల అంతుతేల్చడానికి సీబీసీఐడీ రంగంలోకి దిగింది. ‘ఇంటి’దొంగల భరతం పట్టేందుకు చర్య లు ముమ్మరంచేసింది. ఇల్లు లేని పేదలకు రూ.3.50 లక్షల వ్యయంతోడబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించి ఇస్తామని తెలంగాణసర్కారు ప్రకటించింది. దీనికి ముందే గతంలో గృహనిర్మాణాల్లో జరిగిన అవినీతిని తవ్వి అక్రమార్కుల చిట్టాబయటపెట్టాలని నిర్ణయించింది. అక్రమాలకు ఝలక్ఇవ్వడం ద్వారా కొత్త పథకంలో సాధ్యమైనంత వరకు అవినీతిని అరికట్టవచ్చని భావిస్తోంది. ఈ నేపథ్యంలోముఖ్యమంత్రి కేసీఆర్ ఇందిరమ్మ ఇళ్లనిర్మాణంలో నిధులు దుర్వినియోగడం కావడంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇటీవల జిల్లాలో నమూనా సర్వేలునిర్వహించగా పలు అక్రమాలు బయటపడ్డాయి. దీంతోమరింత లోతుగా విచారించాలని సీఎం కేసీఆర్ ఆదేశించడంతో సీబీసీఐడీ దూకుడుగా వ్యవహరిస్తోంది.సీబీసీఐడీ అధికారులు గురువారం కలె క్టరేట్లోని గృహనిర్మాణ శాఖ కార్యాలయంలో పలు రికార్డులు పరిశీలించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, అందులో జరిగిన అవినీతి, అక్రమాలు, బాధ్యులైన సిబ్బంది, కేసులకు సంబంధించిన వివరాలను సేకరించారు. హౌస్‌హోల్డ్ సర్వేపై సీఎం కేసీఆర్‌తో జిల్లా అధికారులు శుక్రవారం హైదరాబాద్‌లో సమావేశం కానున్న నేపథ్యంలో ఈ వ్యవహారం చర్చనీయాంశమైంది. అక్రమార్కుల్లో గుబులు ఇప్పటివరకు దళారులు, ప్రజాప్రతినిధులే ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అక్రమార్జనకు పాల్పడ్డారని భావించినప్పటికీ.. గృహనిర్మా ణ శాఖలో పనిచేస్తున్న పలువురు అధికారు లు, సిబ్బంది హస్తం కూడా ఉన్నట్లు తేలింది. ఈ మేరకు 2004 నుంచి 2006 వరకు జరిగిన అవినీతి చిట్టాలో ఉన్న సిబ్బంది వివరాలతో గృహనిర్మాణ శాఖ పీడీ జాబితాను సిద్ధం చేశారు. సీబీసీఐడీ అధికారులు ఇప్పటివరకు సంబంధిత శాఖతో పాటు ఇతర శాఖల నుంచి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో అవినీతికి సంబంధించిన 42 కేసుల వివరాలను తీసుకున్నారు. క్రిమినల్ కేసులపై ఆరా తీశారు. అవినీతిలో పాలుపంచుకున్న ఉద్యోగుల వివరాలు సేకరించారు. అక్రమార్కులును జైలుకు పంపుతామని కేసీఆర్ ప్రకటించడం.. సీబీసీఐడీ దూకుడు పెంచడంతో ‘ఇంటి’ దొంగల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇందిరమ్మ పథకం మూడు విడతల్లో జిల్లాకు 3,16,538 ఇళ్లు మంజూరయ్యాయి. ఇప్పటివరకు 1,78,491 ఇళ్ల నిర్మాణాలు పూర్తి కాగా, 71,188 ఇళ్లు వివిధ కారణాలతో చివరి దశలో పనులు నిలిచిపోయాయి. 39,336 ఇళ్లు వివిధ దశల్లో నిర్మాణంలో ఉండగా, 27,523 ఇళ్లు ఇంకా ప్రారంభం కాలేదు. హౌసింగ్ లెక్క రూ.18.50 కోట్లే.. జిల్లావ్యాప్తంగా గృహనిర్మాణాల్లో రూ.70 కోట్ల మేర దుర్వినియోగమైనట్టు తెలుస్తోంది. కానీ.. గృహనిర్మాణ శాఖ విచారణలో జిల్లాలోని 42 గ్రామాల్లో 794 ఇళ్లలో అవినీతి జరిగిందని తేల్చారు. ఇప్పటివరకు రూ.18.5 కోట్లు పక్కదారి పట్టినట్టు నిర్దారించారు. అందులో రూ.22.90 లక్షలు మాత్రమే అక్రమార్కుల నుంచి రికవరీ చేశారు. అవినీతిలో హౌసింగ్ శాఖలో రెగ్యులర్‌గా పనిచేస్తున్న ఆరుగురు డెప్యూటీ ఈఈలు, 36 మంది ఏఈలు, ఒక సీనియర్ అసిస్టెంట్ ఉన్నారు. ఇతర శాఖల నుంచి ఆరుగురు ఎంపీడీవోలు, ఇద్దరు తహశీల్దార్లు ఉండగా, 12 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, 93 మంది అనధికార సిబ్బంది ఉన్నారు. క్రిమినల్ కేసులున్న వారిలో ఆరుగురు అధికార సిబ్బంది, 33 మంది అనధికార సిబ్బంది ఉన్నారు. వీరిలో సస్పెండ్ అయిన వారిలో ముగ్గురు డెప్యూటీ ఈఈలు, 16 మంది ఏఈలు, ఇతరులు ఇద్దరున్నారు. ఇద్దరు వర్క్ ఇన్స్పెక్టర్లను పూర్తిస్థాయిలో తొలగించారు. సస్పెండ్ అయిన వారిలో తిరిగి 18 మంది విధులు నిర్వహిస్తున్నారు. ఈ చిట్టాను సీబీసీఐడీ సేకరించింది. ఈ క్రమంలో హౌస్‌హోల్డ్ సర్వేను చేపట్టేందుకు సర్కారు నిర్ణయించింది. శుక్రవారం హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో హౌస్‌హోల్డ్ సర్వేపై సమావేశం జరగనుంది. ఇన్చార్జి కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, ఆర్డీవోలు, డెప్యూటీ కలెక్టర్లు, తహశీల్దార్లు సమావేశానికి హాజరుకానున్నారు. ఈ సమావేశంలో సర్వేతో పాటు భూపంపిణీ, ‘ఫాస్ట్’ కమిటీ, రేషన్ కార్డులపై ప్రధానంగా చర్చ జరగనున్నట్లు సమాచారం. -
నో బిల్
బద్వేలు: బిల్లుల కోసం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ ఏడాది మార్చి నుంచి ఒక బిల్లు కూడా మంజూరు కాలేదు. ఈ బకాయిలు దాదాపు రూ.22 కోట్లు ఉన్నాయి. ఇవి అందేందుకు చాలా సమయం పడుతుందని గృహనిర్మాణ శాఖ సిబ్బంది పేర్కొంటున్నారు. ప్రస్తుతం జిల్లాలో 12,263 ఇళ్లకు బిల్లులు అందాల్సి ఉంది. ఈ ఇళ్లన్నీ బేస్మట్టం, గోడలు, పైకప్పు వంటి వివిధ దశల్లో ఉన్నాయి. వీటికి సంబంధించిన వివరాలు, ఫొటోలను ఆయా మండలాల్లో గృహనిర్మాణ శాఖ సిబ్బంది తమ వెబ్సైట్లో నమోదు చేయడంతో పాటు బిల్లుల కోసం ఎంబుక్‌లు కూడా అందజేశారు. గత నెల వరకు ఆయా నిర్మాణాల స్థాయి, ప్రగతిని కూడా నమోదు చేసి బిల్లులకు పంపారు. అయితే గత మార్చి 15 నుంచి బిల్లులు మంజూరు కావడం లేదు. ప్రస్తుతం హౌసింగ్ శాఖ వెబ్‌సైట్‌ను మూసివేశారు. దీంతో ప్రస్తుతం జరుగుతున్న ఇళ్ల నిర్మాణం, ప్రగతిని నమోదు చేసేందుకు కూడా అవకాశం లేకుండా పోయింది. దీంతో వీటికి కొలతలు నమోదు చేసి బిల్లులకూ పెట్టలేని పరిస్థితి నెలకొంది. ప్రారంభం కాకుంటే రద్దే! ప్రస్తుతం జిల్లాలో ప్రారంభం కాని ఇందిరమ్మ ఇళ్లు 18 వేలు ఉన్నాయి. వీటన్నింటినీ త్వరలో రద్దు చేసేందుకు టీడీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చని ఆ శాఖ సిబ్బంది చెబుతున్నారు. దీంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్ల పరిశీలన కూడా చేపట్టేందుకు సిద్ధమవుతున్నట్లు వారు పేర్కొంటున్నారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఇళ్లను పరిశీలించాకే బిల్లులు చెల్లించేలా నిర్ణయం తీసుకుంటున్నట్లు సమాచారం. వీటన్నింటికీ సంబంధించి త్వరలో గృహనిర్మాణ శాఖ అధికారులకు మార్గదర్శకాలు రానున్నట్లు తెలిసింది. ఆర్థికభారంతో ఇక్కట్లు తమకు ఎప్పటికి బిల్లులు అందుతాయో అని లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం రావాల్సిన బిల్లులతో పాటు నిర్మాణంలో ఉన్న ఇళ్ల బకాయిలు మరింత పెరిగే అవకాశముంది. సిమెంట్, ఇనుము ధరలు ఆకాశన్నంటుతుండటం, కూలి రేట్లు పెరగడంతో లబ్ధిదారులు ఆర్థిక భారంతో ఇక్కట్లు పడుతున్నారు. బిల్లులు వస్తాయనే ఆశతో పనులు ప్రారంభించిన లబ్ధిదారులు పనులు ఆపేయలా లేక అప్పులు తెచ్చి పూర్తి చేయలా అని ఆలోచిస్తున్నారు. అప్పులు తెస్తే బిల్లులు ఎప్పుడు వస్తాయో, అప్పటి వరకు వడ్డీ కట్టాలంటే ఎలా.. ఇంకా కష్టాలు పెరుగుతాయని ఆలోచిస్తూ పలువురు నిర్మాణాలను ఆపేస్తున్నారు. ప్రభుత్వం స్పందించాలి ప్రస్తుతం ఇళ్లు కట్టుకోవాలంటే ఇబ్బందులు తప్పడం లేదు. సిమెంట్, ఇనుము, ఇసుక ధర పెరిగింది. కూలీలు దొరకడం లేదు. ప్రభుత్వం తక్షణమే బిల్లులు మంజూరు చేయాలి - రామనారాయణరెడ్డి బిల్లు రాకుంటే నిలిపేయాల్సిందే ... బిల్డింగ్ ప్రగతిని నమోదు చేసి బిల్లు పెట్టామని అధికారులు చెబుతున్నా మాకు అందలేదు. బిల్లు రాకుంటే నిర్మాణం నిలిపేయాల్సిందే. వైఎస్ హయాంలో తక్షణమే బిల్లులు వచ్చేవి -సుభాషిణీ, మేకవారిపల్లె -
సొంతిల్లు కలే..
ఒంగోలు, న్యూస్‌లైన్: ఇందిరమ్మ ఇల్లు ఇక కలగా మారనుంది. పేదవాడు సైతం పక్కా ఇంట్లోనే ఉండాలంటూ గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ పథకానికి కొత్త ప్రభుత్వం మంగళం పాడనుంది. ఇంటి నిర్మాణానికి కిరణ్ సర్కారు ప్రకటించిన రూ.80 వేలకు బదులుగా టీడీపీ తన మ్యానిఫెస్టోలో రూ.1.50 లక్షలు ప్రకటించడంతో ఇప్పటి వరకు పెండింగ్‌లో ఉన్న అర్జీలను ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి గృహ నిర్మాణశాఖలో నెలకొంది. దాదాపు 70 వేల మంది అర్హులుగా గుర్తించినా వారంతా కొత్త ప్రభుత్వంలో మళ్లీ దరఖాస్తు చేసుకోక తప్పదు. వేలాది దరఖాస్తుల పెండింగ్: ఒక వైపు ఎన్నికలకు నోటిఫికేషన్ వస్తుందని తెలిసినా కాంగ్రెస్ ప్రభుత్వం హడావుడిగా 2013 నవంబరులో రచ్చబండ-3 ఏర్పాటు చేసింది. ప్రభుత్వం కనికరిస్తే సొంతింటిలో సేద తీరవచ్చంటూ జిల్లా వ్యాప్తంగా 30 వేల మందికిపైగా ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నారు. వారికి సంబంధించి ప్రాథమిక దర్యాప్తు కూడా పూర్తికాకపోవడం, ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారడంతో అధికారులు మిన్నకుండిపోయారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ తొలగిపోయినా కొత్త ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇంటికి ప్రత్యామ్నాయంగా కొత్త పథకం వచ్చే అవకాశం ఉండడంతో పాతవాటిని ఆన్లైన్లో పెట్టేందుకు అధికారులు వెనకాడుతున్నారు. అయితే రచ్చబండ-1, రచ్చబండ-2లో దరఖాస్తు చేసుకొని ఆన్లైన్లో బ్యాలెన్స్ ఉన్నవారి సంఖ్య 43,951 మంది ఉండగా వారిలో కేవలం 2,062 మందికి మాత్రమే రచ్చబండ-3 నిర్వహణ సమయంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులుగా గుర్తించారు. అంటే రచ్చబండ-3లో వచ్చిన 30 వేలకు పైగా అర్జీదారులతో కలిపి పెండింగ్ సంఖ్య దాదాపు 72 వేలుగా ఉండడం గమనార్హం. వై.పాలెం 1,777, దర్శి 5,832, పర్చూరు 5,490, అద్దంకి 5,739, చీరాల 1,838, సంతనూతలపాడు 2,196, ఒంగోలు 1, కందుకూరు 2,543, కొండపి 3,596, మార్కాపురం 4,327, గిద్దలూరు 5,308, కనిగిరి 5,304 మంది రచ్చబండ -3 నాటికి సొంతింటి కోసం ఎదురుచూస్తున్నారు. వీరిలో ఎస్సీ 10,190, ఎస్టీలు 1331, మైనార్టీలు 2235, ఇతరులు 30,195 మంది ఉన్నారు. వీటిలో రచ్చబండ-3 కార్యక్రమం జరిగిన సమయంలో పర్చూరు 725, కందుకూరు 888, కొండపి 289, మార్కాపురం 160 మంది నియోజకవర్గాల వారీగా కొత్త ఇళ్లను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. అంటే రచ్చబండ-3వ విడత కార్యక్రమంలో ప్రకటించిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల సంఖ్య 2062 మాత్రమే. ఇంకా 41,889 మంది మొదటి, రెండో విడత రచ్చబండల్లో అర్హులుగా గుర్తింపు పొంది మంజూరు కోసం ఎదురు చూస్తుండడం గమనార్హం. వీరికి మూడో విడత రచ్చబండలో దరఖాస్తు చేసుకున్న మరో 30 వేల మంది అదనం. ఇవి కాకుండా మరో 28 వేల ఇందిరమ్మ ఇళ్లు ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నాయి. దీనిపై గృహనిర్మాణ శాఖ పీడీ ధనుంజయుడు స్పందిస్తూ ప్రస్తుతం గతంలో మంజూరై నిర్మాణాలు కొనసాగిస్తున్న వాటికి మాత్రం బిల్లులు చెల్లిస్తున్నామన్నారు. రచ్చబండ-3కి సంబంధించి ఇంకా గ్రామస్థాయి నివేదికలు తమకు అందలేదని తెలిపారు.