ఎలక్ట్రిక్ బస్‌ను ప్రారంభిస్తున్న మంత్రి పొంగులేటి. చిత్రంలో పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ
ప్రజలకు మంచి చేస్తే కూడా విమర్శిస్తున్నారు: పొంగులేటి
కేసీఆర్ అసెంబ్లీకి రాకుండా ఆంబోతులను పంపుతున్నారు
హనుమకొండ అర్బన్/నయీంనగర్: ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి పేదవారికి పార్టీతో సంబంధం లేకుండా ఇందిరమ్మ ఇల్లు ఇస్తా మని రెవెన్యూ, గృహ ని ర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ప్రజలకు మంచి చేస్తే కూడా ఓర్వలేక ప్రతిపక్షాల నేతలు విమర్శిస్తున్నారని ఆయన తెలిపారు. సోమవారం హనుమకొండ కుడా మైదానంలో వరంగల్ రీజియన్‌కు కేటాయించిన టీజీఆర్‌టీసీ 50 ఎలక్ట్రిక్ బస్సులను మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్‌లతో కలిసి పొంగులేటి ప్రారంభించారు. అదేవిధంగా హనుమకొండ కలెక్టరేట్‌లో హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై అధికారులతో సమీక్షించారు.
ఈ సందర్భంగా ఆయాచోట్ల మంత్రి మాట్లాడుతూ, గత ప్ర భుత్వం కుట్రపూరితంగా ఆర్టీసీని ప్రైవేట్‌పరం చేయాలని చూసిందని, కానీ ఇందిరమ్మ రాజ్యంలో పరిపుష్టం చేసి, కార్మికులకు భద్రత కల్పించామన్నారు. ధర ణిని ప్రక్షాళన చేసి కొత్త చట్టం తీసుకువచ్చామని, దీనిద్వారా తెలంగాణలో ఉన్న 2 కోట్ల 77లక్షల ఎకరాల ఆసాములకు పూర్తి భద్రత కలి్పస్తున్నామని పే ర్కొన్నారు. గత ప్రభుత్వం కనీసం లక్ష ఇళ్లు కూడా నిర్మించలేదని, తమ ప్ర భుత్వంలో మొదటి విడతగా 4.50 లక్షల ఇళ్లు ఇస్తున్నామన్నారు. మిగతా నాలుగేళ్లలో 20 లక్షల ఇళ్లు నిర్మిస్తామన్నారు.
అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్ రూం ఇళ్లను కూడా పూర్తి చేసి పంపిణీ చేస్తామన్నారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం అర్హులు ఉంటే మండల కార్యాలయాల్లో ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ అసెంబ్లీకి రాకుండా ఆంబోతులను పంపుతున్నారని విమర్శించారు. కేసీఆర్‌కు గతంలో తొంటి ఇరుగుడు నిజమా అబద్ధమా తెలియదు.. కానీ ఇప్పుడు అసెంబ్లీకి రావడానికి ఏమైందని ఆయన ప్రశ్నించారు. సాగు చేసే ప్రతీ భూమికి రైతు భరోసా ఇస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment