
సిటీలో జరిగిన ప్రజాపాలనకు తరలివచ్చిన జనం
కరీంనగర్: ఆరు గ్యారంటీల అమలులో భాగంగా ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన అభయహస్తం అర్జీల స్వీకరణ జాతరను మరిపిస్తోంది. శుక్రవారం జిల్లావ్యాప్తంగా ఆయా గ్రామాలు, వార్డులు, డివిజన్లలో దరఖాస్తులు స్వీకరించగా ఇందిరమ్మ ఇండ్లు, రేషన్‌కార్డుల కోసం ఎక్కువ అర్జీలొచ్చాయి. ఈ నెల 28న ప్రక్రియ ప్రారంభం కాగా తొలిరోజు 28,452 దరఖాస్తులు వచ్చిన విషయం తెలిసిందే. శుక్రవారం 48,230 వేల దరఖాస్తులు రాగా.. శనివారం 46 గ్రామాలతో పాటు 22 డివిజన్లలో ‘ప్రజాపాలన’ నిర్వహించనున్నారు.
రేషన్‌కార్డు లేనివారికి అవకాశం!
రేషన్‌కార్డు లేనివారు కూడా దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశఽం కల్పించింది. వీరి కోసం ప్రత్యేక కౌంటర్‌ను ఏర్పాటు చేశారు. రేషన్ కార్డులేనివారు ఆధార్ కార్డులను జత చేయాలని అధికారులు సూచిస్తున్నారు. కాగా.. ప్రభుత్వమే రూపొందించి ఇచ్చిన దరఖాస్తుఫారం నింపే క్రమంలో చాలామంది అయోమయానికి గురయ్యారు. మహాలక్ష్మి పథకానికి కుటుంబంలో ఒకరికన్నా ఎక్కువ మంది ఉండటంతో ఒకే దరఖాస్తులో వివరాలు రాయాలా.. వేర్వేరు అందించాలా అన్న అయోమయానికి గురయ్యారు. రైతుభరోసాలో కౌలు రైతులు దరఖాస్తు చేసినప్పటికి ఫారంలో భూ యజమాని పట్టా పాసుపుస్తకం వివరాలు అందించలేకపోయారు. సబ్ మీటర్ లేకుండా అద్దె ఇళ్లలో ఉన్నవారు గృహజ్యోతికి కాలం పూరించే క్రమంలో సర్వీస్ నంబర్ లేకుండా దరఖాస్తు అందించారు. గ్రామసభల్లో పాల్గొన్న అధికారులు సైతం సరైన సమాచారం ఇవ్వకపోవడంతో గందరగోళం నెలకొంది.
కరీంనగర్‌లో ఎక్కువ కొత్తపల్లిలో తక్కువ
కరీంనగర్ సిటీలో అత్యధిక దరఖాస్తులు 15,551 రాగా.. కొత్తపల్లి మున్సిపాలిటీలో అత్యల్పంగా 332 వచ్చాయి. చొప్పదండి మున్సిపాలిటీలో 843, హుజూరాబాద్‌లో 1,956, జమ్మికుంటలో 1,955 దరఖాస్తులు వచ్చాయి. మండలాలవారీగా చూస్తే ఇక చిగురుమామిడి మండలంలో 1,253, చొప్పదండిలో 1,928, ఇల్లందకుంటలో 1,158, గంగాధరలో 2,311, గన్నేరువరం 1,391, హుజూరాబాద్ 1,826, జమ్మికుంట 2,067, కరీంనగర్ రూరల్ 1,605, కొత్తపల్లి 2,587, మానకొండూరు 2,170, రామడుగు 1,952, శంకరపట్నం 1,320, తిమ్మాపూర్ 1,458, సైదాపూర్ 2,183, వీణవంక మండలంలో 2,384 దరఖాస్తు వచ్చాయి.
నేడు ప్రజాపాలన జరగనున్న ప్రాంతాలివే..
చిగురుమామిడి మండలంకొండాపూర్, లంబాడిపల్లి, ముదిమాణిక్యం, ముల్కనూరు, చొప్పదండి మండలం కొలిమికుంట, కోనేరుపల్లి, కుర్మపల్లి, మంగళపల్లి, ఇల్లందకుంట మండలం మల్లన్నపల్లి, మల్యాల, మర్రివానిపల్లి, పాతర్లపల్లి, గంగాధర మండలం హిమ్మత్‌నగర్, ఇస్లాంపూర్, కాచిరెడ్డిపల్లి, కాసారం, గన్నేరువరం మండలం హన్మాజిపల్లి, జంగపల్లి, ఖాసీంపేట, మాదాపూర్, హుజూరా బాద్ మండలం కాట్రపల్లి, మందాడిపల్లి, పెదపాపయ్యపల్లి, పోతిరెడ్డిపేట, జమ్మికుంట మండలం నాగంపేట, నగురం, పాపయ్యపల్లి, పాపక్కపల్లి, కరీంనగర్ రూరల్‌లో దుబ్బపల్లి, దుర్శేడ్, ఎలబోతారం, కొత్తపల్లి మండలంలో కమాన్‌పూర్, ఖాజీపూర్, మానకొండూరు మండలంలో చెంజర్ల, దేవంపల్లి, ఈదులగుట్టపల్లి, గట్టుదుద్దెనపల్లి, రామడుగు మండలం వెలిచాల, చిప్పకుర్తి, దత్తోజి పేట, శంకరపట్నం మండలంలో చింతలపల్లి, ధర్మారం, ఎరడపల్లి, గద్దపాక, తిమ్మాపూర్ మండలం ఇందిరానగర్, జుగుండ్ల, కొత్తపల్లి, లక్ష్మీదేవిపల్లి, సైదాపూర్ మండలంలో గొడిశాల, గుజ్జులపల్లి, గుండ్లపల్లి, జాగిర్‌పల్లి, వీణవంక మండలం బ్రహ్మణపల్లి, దేశాయిపల్లి, ఎలబాక, గంగారం, కొత్తపల్లి మునిసిపాలిటీలో 5, 6వ వార్డులు, చొప్పదండిలోని 5,6వ వార్డులు, కరీంనగర్ నగరపాలకలో 3, 8, 16, 22, 27, 30, 35, 37, 48, 51 డివిజన్లు, జమ్మికుంట మునిసిపాలిటీలో 9, 10, 11, 12వార్డుల్లో, హుజూరాబాద్‌లో 9, 10, 11, 12 వార్డుల్లో గ్రామసభలు నిర్వహించనున్నారు.
జిల్లాలో గ్రామాలు: 313, మునిసిపాలిటీలు: 5, జిల్లా మొత్తంగా వచ్చిన అర్జీలు: 76,682, శుక్రవారం వచ్చినవి: 48,230, కవరైన నివాసాలు: 2,13,218, దరఖాస్తులు స్వీకరించిన గ్రామాలు: 90, వార్డులు: 48
ఇవి చదవండి: దరఖాస్తు ఫారాలు విక్రయిస్తే కేసులు.. : కలెక్టర్ రాహుల్‌రాజ్
Comments
Please login to add a commentAdd a comment