మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి వెల్లడి
హుజూర్‌నగర్: ఈ ఏడాదిలో రాష్ట్రంలోని నిరుపేదలకు రూ.22 వేల కోట్ల బడ్జెట్‌తో 4.50 లక్షల ఇళ్లు నిర్మించి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో ఫణిగిరి గుట్ట వద్ద నిర్మాణంలో ఉన్న 2,160 ఇళ్ల కాలనీని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్‌తో కలసి మంగళవారం పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. తమది చేతల ప్రభుత్వమని రూ.22వేల కోట్లతో పనులు మొదలు పెడుతున్నామని ఆయన స్పష్టం చేశారు. వచ్చే ఐదేళ్లలో ప్రతీ పేద కుటుంబానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇల్లు ఇస్తుందని తెలిపారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో తాను గృహనిర్మాణ శాఖ మంత్రిగా ఉండగా జీవో ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా అడిగిన ప్రతీ ఒక్కరికీ ఇల్లు ఇచ్చామని, సుమారు 14 లక్షల ఇళ్లు కట్టించామని ఆయన గుర్తు చేశారు. ప్రతీ గ్రామంలో, మున్సిపాలిటీలో ఇందిరమ్మ ఇళ్లు ఉన్నాయన్నారు. డబుల్ బెడ్‌రూం ఇళ్లు అని కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు ఎలా మోసం చేశారో రాష్ట్ర ప్రజలు గమనించారని చెప్పారు. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో మంత్రి వర్గ సమావేశంలో చేసిన తీర్మానం ప్రకారం అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్‌రూం ఇళ్లను పూర్తి చేసి త్వరలోనే అర్హులైన వారికి అందజేస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment