Construction houses
-
20 ఏళ్లూ కాంగ్రెస్ పాలనే
సాక్షి, ఆదిలాబాద్: ‘అధికారం అందివచ్చిందని అనుభవించాలని అనుకోలేదు.. ఒక బాధ్యతగా నడుచుకుంటున్నాం. ఆర్థిక ఇబ్బందులున్నా, హామీలు అమలు చేస్తాం. 20 ఏళ్లు కాంగ్రెస్సే పాలిస్తుంది’అని డిప్యూటీ సీఎం మల్లుభట్టి విక్రమార్క అన్నారు. ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ మండలం పీప్రీ గ్రామంలో బుధవారం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. ‘ఎన్నికలకు ముందు ఏఐసీసీ ఆదేశాల మేరకు ప్రజా సమస్యలు తెలుసుకుంటూ పాదయాత్ర ఇక్కడి నుంచే ప్రారంభించాను. సీఎలీ్పనేతగా నేను ఓ వైపు.. నాటి పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మరోవైపు ఆదిలాబాద్ జిల్లా నుంచే యాత్రలు ప్రారంభించాం.ఆ పాదయాత్రలో ప్రజల గుండెచప్పుడు విన్నాం. చెప్పిన సమస్యల పరిష్కారానికి కంకణబద్ధులమై ఇందిరమ్మ రాజ్యం తీసుకొచ్చాం. ఇప్పటివరకు అనేక హామీలు అమలు చేశాం. మొదటి సంవత్సరంలోనే ప్రతీ నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇళ్లు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాం. రూ.5లక్షలు ఖర్చు చేసి రెండు పడకలతో ఇల్లు నిర్మిస్తాం. ఎస్సీ, ఎస్టీలకు అదనంగా రూ.లక్ష జత చేసి ఇస్తాం. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే 30వేల ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చాం. మరో 35వేల ఉద్యోగాల నియామక ప్రక్రియ చివరిదశకు చేరుకుంది. త్వరలోనే వారికి నియామక పత్రాలు అందజేస్తాం’అని భట్టి వివరించారు. గత పదేళ్లలో ఐటీడీఏ నిర్వీర్యం గత పదేళ్లు పాలించినవారు ఐటీడీఏలను నిరీ్వర్యం చేశారని డిప్యూటీ సీఎం భట్టి ఆరోపించారు. ‘పాదయాత్రలో గిరిజనులు నాకు ఈ విషయం చెప్పారు. ఐటీడీఏల కోసం తాజా బడ్జెట్లో రూ.17వేల కోట్లు కేటాయించాం. గిరిజన యువతకు చదువు చెప్పించడం, నైపుణ్యం కల్పించడం, డ్వాక్రా సంఘాల ద్వారా ఆర్థిక అభివృద్ధిని సాధించేందుకు కృషి చేస్తాం. తుమ్మిడిహెట్టి ఆగిపోయింది. ఫలితంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సాగునీరు అందడం లేదు.నాటి సీఎం వైఎస్.రాజశేఖరరెడ్డి ప్రారంభించిన ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్ట్ పనులను పున:ప్రారంభించి ఈ జిల్లాకు నీళ్లు ఇస్తాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సాగునీటి ప్రాజెక్టులకు బడ్జెట్లో రూ.400 కోట్లు కేటాయించాం’అని భట్టి చెప్పారు. సభలో ఎమ్మెల్యేలు ప్రేమ్‌సాగర్‌రావు, వెడ్మ బొజ్జు పటేల్, అనిల్‌జాదవ్, ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షిషా, ఎస్పీ గౌస్ ఆలం, ఐటీడీఏ పీఓ ఖుష్బూగుప్తా తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రంలో 4.50 లక్షల ఇళ్ల నిర్మాణమే లక్ష్యం
హుజూర్నగర్: ఈ ఏడాదిలో రాష్ట్రంలోని నిరుపేదలకు రూ.22 వేల కోట్ల బడ్జెట్‌తో 4.50 లక్షల ఇళ్లు నిర్మించి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో ఫణిగిరి గుట్ట వద్ద నిర్మాణంలో ఉన్న 2,160 ఇళ్ల కాలనీని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్‌తో కలసి మంగళవారం పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. తమది చేతల ప్రభుత్వమని రూ.22వేల కోట్లతో పనులు మొదలు పెడుతున్నామని ఆయన స్పష్టం చేశారు. వచ్చే ఐదేళ్లలో ప్రతీ పేద కుటుంబానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇల్లు ఇస్తుందని తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో తాను గృహనిర్మాణ శాఖ మంత్రిగా ఉండగా జీవో ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా అడిగిన ప్రతీ ఒక్కరికీ ఇల్లు ఇచ్చామని, సుమారు 14 లక్షల ఇళ్లు కట్టించామని ఆయన గుర్తు చేశారు. ప్రతీ గ్రామంలో, మున్సిపాలిటీలో ఇందిరమ్మ ఇళ్లు ఉన్నాయన్నారు. డబుల్ బెడ్రూం ఇళ్లు అని కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు ఎలా మోసం చేశారో రాష్ట్ర ప్రజలు గమనించారని చెప్పారు. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో మంత్రి వర్గ సమావేశంలో చేసిన తీర్మానం ప్రకారం అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూం ఇళ్లను పూర్తి చేసి త్వరలోనే అర్హులైన వారికి అందజేస్తామన్నారు. -
రూ. వేయి కోట్లు ఇస్తేనే ‘గృహ’ప్రవేశం
సాక్షి, హైదరాబాద్: దేశంలో మరే రాష్ట్రంలో నిర్మించని తరహాలో నిరుపేదల కోసం రూపుదిద్దుకున్న రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం మూడొంతులు సిద్ధమైనా ఇప్పటికిప్పుడు ప్రజలు నివాసం ఉండే పరిస్థితి కనిపించటం లేదు. ఆ కాలనీలకు మంచినీళ్లు, కరెంటు, మురిగునీటి పారుదల, రోడ్లు.. లాంటి అతి ముఖ్య ప్రాథమిక వసతులు కూడా లేవు. ఇవన్నీ సిద్ధం కావాలంటే ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా రూ.వేయి కోట్లు కావాలి. కనీస వసతుల కల్పనకు ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందన్న విషయంలో స్పష్టత లేకుండా పోయింది. సొంత జాగా ఉన్న పేదలకు ఇందిరమ్మ ఇళ్ల కోసం రూ.5 లక్షల చొప్పున, సొంత జాగా లేనివారికి ముందుగా భూమి ఇచ్చి ఇంటి నిర్మాణ యూనిట్ కాస్ట్ నిధులు ఇస్తామని ఈ ప్రభుత్వం పేర్కొంది. కానీ ఈ ఏడాది సొంత జాగా లేని వారిని పక్కన పెట్టేసింది. ఇక ఇందిరమ్మ ఇళ్ల కోసం 66 లక్షలను మించి వచ్చిన దరఖాస్తుల విషయంలో ఎలా ముందుకెళ్లాలో కూడా రూట్ మ్యాప్ సిద్ధం కాలేదు. 1.49 లక్షల ఇళ్లు సిద్ధమైనా.. రాష్ట్రవ్యాప్తంగా 2.29 లక్షల రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం చేపట్టగా, 1.49 లక్షల ఇళ్లు సిద్ధమయ్యాయి. మరో 80 వేలు తుది దశలో, వివిధ స్థాయిల్లో ఉన్నాయి. ఈ ఇళ్లను కూడా ఇందిరమ్మ ఇళ్ల కిందనే లబ్ధిదారులకు పంపిణీ చేయాలని తాజాగా ప్రభుత్వం భావిస్తోంది. ఇళ్లు సిద్ధంగా ఉన్నా, ప్రజలు మాత్రం వాటిల్లో ఉండే పరిస్థితి మాత్రం ప్రస్తుతం లేదు. ఆయా కాలనీల్లో ఇళ్లనైతే నిర్మించారు గానీ, వాటిల్లో మంచినీళ్లు, విద్యుత్ కనెక్షన్లు లేవు. వాననీళ్లు, మురుగునీళ్లు వెళ్లే వ్యవస్థ లేదు. రోడ్లతో అనుసంధానం కాలేదు. చాలా కాలనీలు ప్రస్తుత జనావాసాలకు దూరంగా ఉన్నందున.. చాలా వసతులు కల్పించాల్సి ఉంది. ఇటీవల అధికారులు వాటిపై సమీక్షించి లెక్కలు వేసి రూ.వేయి కోట్లకుపైగా నిధులు ఉంటే తప్ప ఆ ఏర్పాట్లు చేయటం సాధ్యం కాదని తేల్చారు. వాటి నిర్మాణం ప్రారంభించిన సమయంలో నాటి ప్రభుత్వం వేసిన అంచనాలు ఇప్పుడు పెరిగిపోయాయి. దీంతో వాటిని సవరించాల్సి ఉంది. హైదరాబాద్, శివారు ప్రాంతాల్లో హైదరాబాద్ నగరం, దాని శివారు ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో లక్ష ఇళ్లను నిర్మించారు. వీటిల్లో కొన్నింటిలో లబ్ధిదారులు ఉంటుండగా, మిగ తా కాలనీలు ఇప్పటికీ ఖాళీగానే ఉన్నాయి. ఆయా కాలనీల్లో మంచినీటి, మరుగునీటి పారుదలకు కావా ల్సిన ట్రంక్‌లైన్లు, విద్యుత్ అనుసంధాన వ్యవస్థ, వరదనీటి కాలువల కోసం దాదాపు రూ.650 కోట్లు కావాలి. పోలీసు స్టేషన్లు, అంగన్వాడీ కేంద్రాలు, బస్టాపులు, రేషన్ దుకాణాలు లాంటి వాటిని కూడా సమకూర్చాల్సి ఉంది. అందుకు మరికొన్ని నిధులు కా వాల్సి ఉంటుంది. ఇక జీహెచ్ఎంసీ వెలుపల.. జిల్లా ల్లో నిర్మించిన కాలనీల్లో మంచినీరులాంటి కనీస వస తులు కూడా లేవు. కాలనీలను నివాసయోగ్యంగా మార్చాలంటే రూ.456 కోట్లు కావాల్సి ఉంది. మిగిలిన నిధులు ఏమయ్యాయో? గత ప్రభుత్వం రూ.201 కోట్లను విడుదల చేసింది. వాటిల్లో రూ.39 కోట్లు మాత్రమే ఖర్చ య్యాయి. మిగతా నిధులేమయ్యాయో తేలాల్సి ఉంది. గత ప్రభుత్వం విడుదల చేయగా పోనూ మిగిలిన మొత్తాన్ని ఇప్పుడు విడుదల చేయాల్సి ఉంది. అంచనా వ్యయాలు పెరిగినందున అదనంగా వాటి అవసరం ఏర్పడింది. నిధులు ఇవ్వటంలో జాప్యం జరిగే కొద్దీ.. ఆ ఇళ్లు నిరుపయోగంగా ఉండాల్సిందే. మరింత ఆలస్యమైతే.. నిర్మాణాలు కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది. -
75 గజాల్లోపు ఉన్నా.. అనుమతి తప్పనిసరి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 75 చదరపు గజాల కంటే తక్కువ విస్తీర్ణం ప్లాట్‌లో ఎలాంటి నిర్మాణాన్ని చేపట్టాలనుకున్నా.. భవన యజమానులు మున్సిపాలిటీ లేదా కార్పొరేషన్ నుంచి ధ్రువీకరణ పత్రాన్ని పొందడం తప్పనిసరి అని హైకోర్టు స్పష్టం చేసింది. 75 చదరపు గజాల కంటే తక్కువ ఉన్నా.. ఎక్కువ ఉన్నా అధికారుల నుంచి ధ్రువీకరణ, పని ప్రారంభ ఉత్తర్వును పొందాలని, దీనికి ఎలాంటి మినహాయింపు లేదని తేల్చిచెప్పింది. తమ ప్లాట్లలో నిర్మాణ పనులను ఆపివేయాలంటూ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) నోటీసులు జారీ చేయడాన్ని సవాల్ చేస్తూ నేరేడ్మెట్ వినాయకనగర్‌కు చెందిన ఒక కుటుంబంలోని ముగ్గురు వ్యక్తులు పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్లలో తండ్రీ కొడుకులు, ప్లాట్‌ను రెండు భాగాలుగా విభజించారు. టీఎస్ బీపాస్ చట్టం–2020 ప్రకారం నిర్మాణాలకు రిజిస్ట్రేషన్ చేసుకుని ఒక్కొక్కటి 40 చదరపు గజాల్లో నిర్మాణాన్ని ప్రారంభించారు. మరొక పిటిషనర్ 54 చదరపు గజాలలో నిర్మాణాన్ని ప్రారంభించారు. అయితే వీరి నిర్మాణాలపై పొరుగు వారు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో నిర్మాణాలను ఆపివేయాలంటూ జీహెచ్ఎంసీ నోటీసులు జారీ చేసింది. అయితే టీఎస్ బీపాస్ చట్ట ప్రకారం నిర్మాణాలను ప్రారంభించామని.. జీహెచ్ఎంసీ ఇచి్చన నోటీసులను రద్దు చేస్తూ ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్లు కోరారు. ఈ పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ తడకమళ్ల వినోద్‌కుమార్ విచారణ చేపట్టారు. జీహెచ్ఎంసీ తరఫున స్టాండింగ్ కౌన్సిల్ వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్లు రిజిస్ట్రేషన్ చేసుకుంటే మాత్రమే సరిపోదని, దాని పరిశీలన తర్వాతే నిర్మాణంపై ముందుకు వెళ్లాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని టీఎస్ బీపాస్ చట్టంలోని సెక్షన్ 7 చెబుతోందని చెప్పారు. రిజిస్ట్రేషన్ తర్వాత అధికారులు నిర్ణయం తీసుకోవడానికి 21 రోజుల సమయం ఉంటుందని, ఆ తర్వాత ఎలాంటి కారణం చూపకుండా దరఖాస్తును ఆపితే పిటిషనర్లు ముందుకు వెళ్లవచ్చని తెలిపారు. కానీ, పిటిషనర్లు జనవరి 9న రిజిస్ట్రేషన్ చేసి, వెంటనే నిర్మాణం ప్రారంభించారని పేర్కొన్నారు. దీంతో అదే నెల 18న జీహెచ్ఎంసీ నోటీసులు జారీ చేసిందని వెల్లడించారు. టీఎస్ బీపాస్ నిబంధనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. జీహెచ్ఎంసీ వాదనలను సమర్థించారు. 75 చదరపు గజాల కంటే తక్కువ ప్లాట్లలో నిర్మాణానికి ప్రారంభ అనుమతి సర్టీఫికెట్ అవసరమని స్పష్టం చేశారు. అయితే వీటికి రూ.1 మాత్రమే నామమాత్రపు రుసుము ఉంటుందని, నిర్మాణం పూర్తయిన తర్వాత ఆక్యుపెన్సీ సర్టీఫికెట్ పొందవలసిన అవసరం ఉండదని తేల్చిచెప్పారు. -
పట్టణ పేదలకు ఇళ్ల నిర్మాణంలో సామర్లకోటకు అవార్డు
సాక్షి, అమరావతి: కేంద్ర పట్ణణాభివృద్ధి, గృహ నిర్మాణ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న ‘అర్బన్ హౌసింగ్ కాన్క్లేవ్’లో పట్టణ పేదలకు ఇళ్ల నిర్మాణాల్లో బెస్ట్ పెర్ఫార్మింగ్ మునిసిపల్ కౌన్సిల్‌గా సామర్లకోటకు జాతీయ స్థాయిలో ఐదో ర్యాంక్ లభించింది. ఈ అవార్డును కేంద్ర మంత్రి హరదీప్‌సింగ్ పురీ చేతుల మీదుగా ఏపీ టిడ్కో చైర్మన్ జె.ప్రసన్నకుమార్, గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌జైన్, గృహ నిర్మాణ సంస్థ జేఎండీ శివప్రసాద్ గురువారం అందుకున్నారు. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కాన్క్లేవ్లో నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం కింద నిర్మిస్తోన్న ఇళ్లు, వైఎస్సార్, జగనన్న కాలనీల స్టాల్‌ను ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. -
డబ్బులు లేక, ఆగిన 1.74 లక్షల గృహాల నిర్మాణం
న్యూఢిల్లీ: నిర్మాణ రంగానికి నిధుల కొరత నెలకొన్న నేపథ్యంలో పలు భారీ హౌసింగ్ ప్రాజెక్టులు నిల్చిపోయాయి. దేశీయంగా హైదరాబాద్ సహా ఏడు ప్రధాన నగరాల్లో 1.74 లక్షల గృహాల నిర్మాణం ఆగిపోయింది. వీటి విలువ సుమారు రూ. 1.4 లక్షల కోట్లుగా ఉంటుందని అంచనా. ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ అనరాక్ నిర్వహించిన అధ్యయనంలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. 2014, అంతకన్నా ముందు మొదలుపెట్టిన ప్రాజెక్టులను దీనికి పరిగణనలోకి తీసుకున్నారు. నిల్చిపోయినవే కాకుండా జాప్యం జరుగుతున్న వాటిని కూడా పరిగణనలోకి తీసుకుంటే మొత్తం సంఖ్య 6,28.630గా ఉంటుందని పేర్కొంది. వీటి విలువ సుమారు రూ. 5,05,415 కోట్లుగా వివరించింది. నిర్మాణ రంగాన్ని నిధుల కొరత సమస్య వెంటాడున్నందున.. పూర్తిగా నిల్చిపోయిన ప్రాజెక్టుల్లో కొనుగోళ్లు చేసిన వారికి భవిష్యత్ అంచనాలు అత్యంత విపత్కరంగా ఉన్నాయని తెలిపింది. భారీ జాప్యమున్న ప్రాజెక్టుల్లో కొనుగోలుదారులకూ పరిస్థితి ఆశావహంగా లేవని పేర్కొంది. ఢిల్లీలో అత్యధికం .. నగరాలవారీగా చూస్తే హైదరాబాద్‌లో సుమారు రూ. 2,727 కోట్ల విలువ చేసే 4,150 యూనిట్ల నిర్మాణం నిల్చిపోయింది. ఢిల్లీ–ఎన్సీఆర్ (నేషనల్ క్యాపిటల్ రీజియన్)లో అత్యధికంగా రూ. 86,463 కోట్ల విలువ చేసే 1,13,860 యూనిట్ల నిర్మాణం నిల్చిపోయింది. ఇది మొత్తం టాప్ 7 నగరాల్లో నిల్చిపోయిన వాటిలో 66 శాతం కావడం గమనార్హం. అటు ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్)లో 41,730 యూనిట్లు (విలువ రూ. 42,417 కోట్లు), పుణెలో 9,900 యూనిట్లు (విలువ రూ. 5,854 కోట్లు), బెంగళూరులో 3,870 యూనిట్లు (విలువ రూ. 3,061 కోట్లు), కోల్‌కతాలో 150 ఫ్లాట్ల (విలువ రూ. 91 కోట్లు) నిర్మాణం ఆగిపోయింది. ఇక, నిల్చిపోయిన వాటితో పాటు జాప్యం జరుగుతున్న వాటిని కూడా పరిగణనలోకి తీసుకుంటే హైదరాబాద్‌లో రూ. 11,810 కోట్ల విలువ చేసే 17,960 యూనిట్లు ఉన్నాయి. -
కలల సౌధానికి ‘మెగా’ శంకుస్థాపన
సాక్షి, అమరావతి: సొంతింటి కలను సాకారం చేసుకోవడానికి లబ్ధిదారులు పోటీపడ్డారు. కుటుంబ సభ్యులతో కలిసి ఉత్సాహంగా తమ కలల సౌధం నిర్మాణానికి శంకుస్థాపనలు చేశారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్ జగనన్న కాలనీల్లో శనివారం ‘మెగా ఇళ్ల శంకుస్థాపన’ కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ అయ్యింది. తొలి రోజు గురువారం 2,11,413 ఇళ్లకు శంకుస్థాపన చేసి సృష్టించిన రికార్డును రెండో రోజు అధిగమించారు. రెండో రోజు శనివారం 1.28 లక్షల ఇళ్లకు శంకుస్థాపన చేయాలని గృహనిర్మాణ శాఖ లక్ష్యంగా నిర్దేశిస్తే.. దాన్ని అధిగమించి ఏకంగా 2,90,907 గృహాలకు చేశారు. నిర్దేశించుకున్న లక్ష్యం కంటే 227 శాతం అధికంగా శంకుస్థాపన చేసి రికార్డు సృష్టించారు. విజయనగరం సమీపంలోని గుంకలాం లే అవుట్లో భూమి పూజ చేస్తున్న లబ్ధిదారులు దేశ చరిత్రలో ఒకే రోజున స్వయంగా లబ్ధిదారులే 2,90,907 ఇళ్లకు భూమిపూజ చేసి.. శంకుస్థాపన చేయడం ఇదే ప్రథమమని సామాజికవేత్తలు ప్రశంసిస్తున్నారు. రాష్ట్రంలో ఇళ్లు లేని పేదలెవరూ ఉండకూడదనే లక్ష్యంతో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ పథకం కింద తొలి దశలో 8,905 వైఎస్సార్ జగనన్న కాలనీల్లో రూ.28,084 కోట్ల వ్యయంతో 15,60,227 ఇళ్ల నిర్మాణాన్ని గత నెల 3న వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ ఇళ్లను జూన్ నాటికి పూర్తి చేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం సమిష్టిగా పనిచేస్తోంది. రెండు రోజుల్లో మొత్తం 2.56 లక్షల గృహాలను లక్ష్యంగా నిర్దేశిస్తే 5,02,320 ఇళ్లకు శంకుస్థాపన చేశారు. మెగా ఇళ్ల శంకుస్థాపన కార్యక్రమం ఆదివారం కూడా కొనసాగనుంది. గుంటూరు జిల్లా తెనాలి మండలం శిరిపురంలో ఇళ్ల శంకుస్థాపన పనుల్లో లబ్ధిదారులు కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో సమీక్ష.. మెగా ఇళ్ల శంకుస్థాపన కార్యక్రమానికి సంబంధించి శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు గృహనిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్, గృహనిర్మాణ సంస్థ ఎండీ నారాయణ్ భరత్ గుప్తాలు అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ సూచనలు, సలహాలు ఇచ్చారు. లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈ సందర్భంగా ‘తమకు ఇంటి స్థలంతోపాటూ ఇంటిని మంజూరు చేసి.. తక్కువ ధరకే నిర్మాణ సామగ్రి అందించిన సీఎం వైఎస్ జగన్‌కు జీవితాంతం రుణపడి ఉంటాం’ అని తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం మండలం పెద్దనపల్లికి చెందిన దువ్వూరు భవాని చెప్పారు. ఇదే స్ఫూర్తితో వేగంగా ఇళ్ల నిర్మాణం రాష్ట్రంలో ఇళ్లు లేని పేదలెవరూ ఉండకూడదన్నది సీఎం జగన్ సంకల్పం. అందరికీ ఇళ్లు అందించే దిశగా భారీ ఎత్తున ఇంటి స్థలాలు పంపిణీ చేశారు. ఆ స్థలాల్లో తొలి దశలో 15.60 లక్షల ఇళ్లను జూన్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. రెండు రోజుల్లో 2.56 లక్షల ఇళ్లకు శంకుస్థాపన చేయాలని లక్ష్యంగా నిర్దేశిస్తే.. లబ్ధిదారులు పోటీ పడి 5.02 లక్షల ఇళ్లకు భూమి పూజ చేసుకున్నారు. ఇదే స్ఫూర్తితో వేగంగా ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటాం. – అజయ్ జైన్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, గృహనిర్మాణ శాఖ -
లాక్డౌన్ నుంచి వీటికీ మినహాయింపు
సాక్షి, న్యూఢిల్లీ: లాక్డౌన్ నుంచి మరికొన్ని రంగాలకు మినహాయింపునిస్తూ కేంద్రం శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. గతంలో ప్రకటించిన మినహాయింపులకు అదనంగా ఇవి ఉంటాయని పేర్కొంది. గ్రామీణ ప్రాంతాల్లో నిర్మాణ కార్యక్రమాలు, నీటి సరఫరా, పారిశుద్ధ్య రంగానికి చెందిన నిర్మాణ పనులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు, కో ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీల కార్యకలాపాలకు తాజాగా అనుమతినిచ్చింది. కలపేతర అటవీ ఉత్పత్తుల సేకరణ, కొనుగోలు, ప్రాసెసింగ్.. తదితరాలకు కూడా అనుమతినిచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లోని నిర్మాణ పనుల్లో.. విద్యుత్ స్తంభాలు, విద్యుత్ లైన్లు, టెలికం ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ ఏర్పాటు.. మొదలైనవి ఉన్నాయి. హౌజింగ్ ఫైనాన్స్ సంస్థలు, మైక్రో ఫైనాన్స్ సంస్థలు కొద్దిపాటి సిబ్బందితో పనులు చేసుకోవచ్చు. వెదురు, కొబ్బరి, వక్క, కొకొవా తదితర ఉత్పత్తుల ప్లాంటేషన్, ప్యాకేజింగ్, అమ్మకం, మార్కెటింగ్ మొదలైన పనులను ఈ లాక్డౌన్ కాలంలో చేసుకోవచ్చు. -
మట్టి నీడ
‘‘మాది ఎప్పుడో మా తాత కట్టించిన పాత ఇల్లు. మట్టి గోడలు, మంగుళూరు పెంకుతో పై కప్పు కట్టించాడాయన. మాలాంటి సామాన్యులకు అప్పట్లో అందుబాటులో ఉన్న టెక్నాలజీ అంతవరకే మరి. మా అబ్బాయి ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్. యుఎస్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. వాడికి పెళ్లి సంబంధాలు చూస్తున్నాం. పెళ్లి కంటే ముందు ఈ ఇంటిని పడగొట్టి మోడరన్‌గా మంచి ఇల్లు కట్టాలి. బడ్జెట్ ఎంతయినా ఫర్వాలేదు. సిటీలో మంచి ఆర్కిటెక్ట్ పేరు చెప్పు..’’ అని పేరున్న ఆర్కిటెక్ట్ కోసం శోధించే వాళ్లు చాలా మందే ఉంటారు. అద్దంలా మెరిసిపోయే ఇంటి కోసం రకరకాల డిజైన్లతో మ్యాగజైన్లు కూడా ఉంటాయి. ఇక మహారాష్ట్రకు చెందిన ఆర్కిటెక్ట్ అనుజ్ఞ నూతన్ ధ్యానేశ్వర్ అయితే.. ఇళ్ల నిర్మాణం కోసం బురద మట్టి, మంగుళూరు ఎర్ర పెంకులను ముడిసరుకుగా మార్చుకున్నారు. ఆమె రూపొందిస్తున్న ఎకో ఫ్రెండ్లీ హౌస్ డిజైన్లు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. పుణెకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అన్విత్, నేహా పాఠక్ దంపతులు ఇప్పుడు అనుజ్ఞ డిజైన్ చేసిచ్చిన మడ్‌హౌస్‌లో గృహ ప్రవేశం చేయడానికి సిద్ధమవుతున్నారు.! ‘‘మేము రెండంతస్థుల మట్టి ఇంటిని కట్టించుకుంటున్నాం. మా కొత్త ఇంటిని చూడడానికి మా స్నేహితులు, బంధువులు వస్తున్నారు. ఆ వచ్చిన వాళ్లలో చాలామంది మమ్మల్ని పిచ్చివాళ్లను చూసినట్లు చూస్తున్నారు. నిజానికి మట్టి ఇల్లు ఎండాకాలం బయటి ఉష్ణోగ్రత కంటే 13–14 డిగ్రీల తక్కువగా ఉంటుంది. అలాగే శీతాకాలం చలి నుంచి వెచ్చదనాన్నిస్తుంది. పుణెలో చాలామంది వారాంతపు సెలవులను గడపడానికి నగర శివార్లలో ఇలాంటి ఇళ్లు కట్టించుకుంటున్నారు. మేము నగరంలోనే కట్టించుకుంటున్నాం’’ అంటున్నారు నేహ. సహజ జీవనం ‘‘మట్టి ఇంటి నిర్మాణంలో వీలయినంత ఎక్కువగా ప్రకృతి సిద్ధమైన సహజ వస్తువులను ఉపయోగిస్తాం. ఆ మెటీరియల్ నుంచి వాటి సహజమైన వాసనే విడుదలవుతుంది. అవేవీ శ్వాసకోశ వ్యాధులకు కారణం కావు, పైగా మోడరన్ లైఫ్‌లో ఎదురయ్యే బ్రీతింగ్ సమస్యలను కూడా దూరం గా ఉంచుతుంది. సిమెంట్ ఇళ్ల నిర్మాణంతో పోలిస్తే ఈ ఇళ్ల నిర్మాణ వ్యయం కూడా తక్కువే. సిమెంట్ భవనం నిలిచినంత కాలం నిలిచి ఉండేటట్లు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం’’ అంటున్నారు అనుజ్ఞ. -
పేదల ఇళ్లకు చంద్ర గ్రహణం
శ్రీకాకుళం పాత బస్టాండ్, ఎల్.ఎన్.పేట: ‘మీ సొంతింటి కల నెలవేరాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి.. ఇందిరమ్మ ఇంటికి ఇప్పుడు ఇస్తున్న మొత్తాన్ని రూ. 1.50 లక్షలకు పెంచుతాం. ఇది మా పార్టీ ఎజెండా’.. అని ఎన్నికల ముందు ఊదరగొట్టిన చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్లేట్ ఫిరాయించింది. మొత్తంగా ఇళ్ల నిర్మాణ పథకానికే కాలదోషం పట్టిస్తోంది. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్,రాజశేఖరరెడ్డి ప్రారంభించిన ఈ పథకాన్ని ప్రభుత్వం క్రమంగా మంగళం పాడేట్లు కనిపిస్తోంది. ఈ పధకం ద్వారా పేదలకు సొంతింటి కల నెరవేర్చాలన్న లక్ష్యంతో పట్టణ, గ్రామ ప్రాంతాల్లో ఇంటింటి సర్వేలు నిర్వహించి పక్కా ఇళ్లు లేని కుటుంబాలను గుర్తించారు. ఇలా 2007 నుంచి మూడు విడతల్లో జిల్లాలో సుమారు 3 లక్షల ఇళ్లు మంజూరు చేశారు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాల నిరాసక్తత కారణంగా ఇప్పటికీ సగం ఇళ్ల నిర్మాణాలు కూడా పూర్తి కాలేదు. 44,655 ఇళ్ల నిర్మాణాలు వివిధ కారణాల వల్ల ఇప్పటికీ ప్రారంభం కానేలేదు. అసంపూర్తిగా నిర్మాణాలు ఇక ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో ప్రభుత్వం ఇస్తున్న రూ.లక్ష ఏమూలకు సరిపోగా సుమారు. 1.10 లక్షల ఇళ్ల నిర్మాణాలు వివిధ ధశల్లో అర్ధాంతరంగా నిలిచిపోయాయి. అష్టకష్టాలు పడి నిర్మాణాలు పూర్తి చేసిన లబ్ధిదారులకు బిల్లులు చెల్లించకపోవడంతో మిగిలిన లబ్ధిదారులు డబ్బులు అందుతాయో లేదోనన్న భయంతో నిర్మాణాలను ఎక్కడివక్కడ నిలిపివేశారు. జిల్లాలోని దాదాపు అన్ని మండలాల్లో ఇలా అసంపూర్తిగా నిలిచిపోయిన ఇళ్లు కనిపిస్తున్నాయి. ఎన్నికల కోడ్‌తో కష్టాలు మొదలు ఈ ఏడాది ఫిబ్రవరి వరకు ఒక మోస్తరుగా సాగిన ఇళ్ల నిర్మాణాలు అదే నెలల్లో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ వెలువడి, ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో బిల్లుల మంజూరును అధికారులు నిలిపివేశారు. కాగా ఇళ్ల నిర్మాణ యూనిట్ విలువను రూ.1.50 లక్షలకు పెంచుతామని తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో హామీ ఇవ్వడంతో లబ్ధిదారులు ఆనందించారు. అయితే ఎన్నికలు ముగిసి, టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అసలుకే ఎసరు పెట్టేలా పరిస్థితి తయాైరె ంది. యూనిట్ విలువ పెంచడమేమో గానీ.. ప్రభుత్వం పాత బకాయిల ఊసెత్తకపోగా.. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రతిపాదించిన కొత్త ఇళ్ల మంజూరును సైతం నిలిపివేసింది. గతంలో ఇళ్ల మం జూరులో అవకతవకలు జరిగాయంటూ సీఐడీ విచారణకు ఆదేశించింది. ఆ విచారణ ఏమైందోగానీ.. ఇళ్ల పరిస్థితిలో మాత్రం మార్పులేదు. ప్రభుత్వమూ స్పందించడం లేదు. సిబ్బంది కుదింపు గృహనిర్మాణ సంస్థలో సిబ్బందిని భారీగా తగ్గించడం కూడా ఇళ్ల నిర్మాణాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ సంస్థలో ఔట్ సోర్సింగ్ విధానంలో డేటా ఎంట్రీ ఆపరేటర్, వర్క్ ఇన్స్పెక్టర్, అటెండర్ తదితర పోస్టుల్లో పని చేస్తున్న 124 మందిని తొలగించారు. దీంతో పని చేసేవారు కూడా ఈ శాఖలో కరువయ్యారు. మిగిలిన రెగ్యులర్ సిబ్బంది 2004 నుంచి ఇప్పటి వరకూ మంజూరైన ఇళ్ళు లబ్ధిదారుల పేర్లకు ఆధార్ అనుసంధానం చేసే పనిలో బిజీగా ఉన్నారు. కొత్తగా ఇళ్ల మంజూరు లేదు.. నిర్మాణాలు జరగడం లేదు, బిల్లులు విడుదల కాలేదు.. వెరసి గత ఫిబ్రవరి నుంచి ఈ శాఖ పూర్తిగా స్తంభించిపోయినట్లయ్యింది. రూ. 14 కోట్ల బకాయిలు గృహనిర్మాణ శాఖ గత రెండేళ్లుగా లక్ష్యాలను చేరడం లేదు. 2013-14 లో 23వేల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని లక్ష్యంగా నిర్దేశించగా 17వేల ఇళ్లు మాత్రమే నిర్మించగలిగారు. వీటికి సంబంధించి బిల్లుల విడుదలలో కూడా జాప్యం జరగడంతో నిర్మాణాలు మందకొడిగా సాగాయి. నిర్మాణాలు పూర్తి చేసిన లబ్ధిదారులకు *14 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఇక ఈ ఆర్థిక సంవత్సరంలో(2014-15) నియోజకవర్గానికి రెండు వేలు చొప్పున జిల్లాలో 20వేల ఇళ్లు నిర్మించాలని అధికారులు ప్రాతిపదించారు. అయితే ఆర్థిక సంవత్సరం మొదలై ఐదు నెలలు గడిచిపోయినా ఈ ఇళ్లు మంజూరు కాకపోవడం, పాత బకాయిలు చెల్లించకపోవడంతో ఇంటి నిర్మాణం చేపట్టాలంటేనే లబ్ధిదారులు భయపడిపోతున్నారు. కాగా ప్రభుత్వం నిర్వహించిన వివిధ కార్యక్రమాల్లో జిల్లాలోని అన్ని మండలాల నుంచి సుమారు 42వేల ఇళ్ల కోసం అందిన వినతిపత్రాలు కార్యాలయాల్లోనే ముగ్గుతున్నాయి. ఈ ఏడాదికి కొత్త ఇళ్లు లేనట్లే! ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే ఈ ఆర్థిక సంవత్సరంలో కొత్త ఇళ్లు మంజూరయ్యే అవకాశం లేనట్లేనని అధికారులు భావిస్తున్నారు. రాష్ట్రం విడిపోవడంతో తలెత్తిన ఆర్థిక ఇబ్బందులు, పాత బకాయిలే చెల్లించే పరిస్థితి లేకపోవడం, అవకతవకల పేరుతో విచారణ తదితర అం శాలు ఈ విషయాన్ని సూచిస్తున్నాయంటున్నారు. కొత్త వాటి సం గతి అటుంచితే ఇప్పటికే పూర్తి అయిన, నిర్మాణంలో ఉన్న ఇళ్ల బిల్లులైన చెల్లించాలని లబ్ధిదారులు డిమాండ్ చేస్తున్నారు.