సాక్షి, న్యూఢిల్లీ: లాక్‌డౌన్ నుంచి మరికొన్ని రంగాలకు మినహాయింపునిస్తూ కేంద్రం శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. గతంలో ప్రకటించిన మినహాయింపులకు అదనంగా ఇవి ఉంటాయని పేర్కొంది. గ్రామీణ ప్రాంతాల్లో నిర్మాణ కార్యక్రమాలు, నీటి సరఫరా, పారిశుద్ధ్య రంగానికి చెందిన నిర్మాణ పనులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు, కో ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీల కార్యకలాపాలకు తాజాగా అనుమతినిచ్చింది. కలపేతర అటవీ ఉత్పత్తుల సేకరణ, కొనుగోలు, ప్రాసెసింగ్.. తదితరాలకు కూడా అనుమతినిచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లోని నిర్మాణ పనుల్లో.. విద్యుత్ స్తంభాలు, విద్యుత్ లైన్‌లు, టెలికం ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ ఏర్పాటు.. మొదలైనవి ఉన్నాయి. హౌజింగ్ ఫైనాన్స్ సంస్థలు, మైక్రో ఫైనాన్స్ సంస్థలు కొద్దిపాటి సిబ్బందితో పనులు చేసుకోవచ్చు. వెదురు, కొబ్బరి, వక్క, కొకొవా తదితర ఉత్పత్తుల ప్లాంటేషన్, ప్యాకేజింగ్, అమ్మకం, మార్కెటింగ్ మొదలైన పనులను ఈ లాక్‌డౌన్ కాలంలో చేసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment