Sanitary
-
బీబీనగర్‌లో భారీ అగ్ని ప్రమాదం.. నిప్పురవ్వలు ఎగిసి
సాక్షి, యాదాద్రి: బీబీనగర్ మండలం బ్రాహ్మణపల్లిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. హిందూస్థాన్ శానిటరీ గోడౌన్లో మంటలు ఎగిసిపడుతున్నాయి. గోడౌన్ సమీపంలో ఉన్న వ్యవసాయ క్షేత్రంలో రైతులు గడ్డి తగులబెట్టారు. ఈ క్రమంలో నిప్పు రవ్వలు ఎగిరి గోడౌన్‌లోని కాటన్ బాక్స్‌లపై పడ్డాయి. దీంతో మంటలు వ్యాపించాయి. చుట్టుపక్కల ప్రాంతాల్లో దట్టంగా పొగ అలుముకుంది. ఫైర్ సిబ్బంది మంటలార్పుతున్నారు. -
18 అడుగుల శానిటరీ ప్యాడ్ రూపొందించి..
నోయిడా: మహిళల రుతుక్రమానికి సంబంధించిన అపోహలను తొలగించేందుకు, దీనిపై మరింత అవగాహనం పెంపొందించేందుకు యూపీలోని నోయిడాలో గల ఛాలెంజర్స్ గ్రూప్ గర్ల్స్ ఇంటర్ కాలేజ్ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది.దీనిలో భాగంగా మహిళా సాధికారతకు చిహ్నంగా 81 అడుగుల పొడవు, 29 అడుగుల వెడల్పు కలిగిన శానిటరీ ప్యాడ్‌ను రూపొందించారు. ఛాలెంజర్స్ గ్రూప్ ట్రస్ట్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో 1200 మంది బాలికలు పాల్గొన్నారు. ఆరు వేల శానిటరీ ప్యాడ్లను ఉచితంగా పంపిణీ చేశారు. బహిష్టు సమయంలో పరిశుభ్రత ప్రాముఖ్యత గురించి నిర్వాహకులు బాలికలకు అవగాహన కల్పించారు.వైద్య నిపుణురాలు శాలిని ఆధ్వర్యంలో పలు అవగాహనా కార్యక్రమాలు, క్విజ్ పోటీ, పోస్టర్ పోటీలను కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా ఛాలెంజర్స్ గ్రూప్ వ్యవస్థాపకుడు, చైర్మన్ ప్రిన్స్ శర్మ మాట్లాడుతూ మహిళలు, బాలికలకు రుతుక్రమంలో పరిశుభ్రత, ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు ‘ది పవర్ ఆఫ్ షీ’ అనే కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఛాలెంజర్స్ గ్రూప్ మురికివాడలు, పాఠశాలలు, కళాశాలలను సందర్శిస్తూ, అక్కడి బాలికలకు రుతుక్రమం సమయంలో పాటించాల్సిన పరిశుభ్రత గురించి తెలియజేస్తుందన్నారు.ఇది కూడా చదవండి: కుటుంబ బాధ్యతల్లో బ్యాలెన్స్ అవసరం -
అమెరికాలో ఐటీ జాబ్ వదిలేసి,రీ యూజబుల్ న్యాప్కిన్స్ తయారీ
‘ఎంత పెద్ద చదువులు చదివినా.. ఆర్థికంగా ఎంత ఎదిగినా మనసుకు తృప్తిగా లేకపోతే అందులో సహజత్వం లోపిస్తుంది. చేసే పనుల్లో నైపుణ్యం రాదు..’ అంటున్నారు హేమ. పర్యావరణహితంగా మహిళలకు ఉపయుక్తంగా ఉండే రీ యూజబుల్ క్లాత్‌తో ప్యాడ్స్, పిల్లలకు డైపర్లు తయారు చేస్తూ, గ్రామంలోని మహిళలకు ఉపాధి కల్పిస్తూ వాటిని మార్కెటింగ్ చేస్తున్నారు.తమిళనాడు, చిత్తూరు బార్డర్లో ఉన్న అతిమంజరీ పేట్లో ఉన్న హేమ తన ఉత్పత్తులతో హైదరాబాద్‌లోని క్రాఫ్ట్ కౌన్సిల్‌లోని ప్రదర్శనశాలలో తన స్టాల్ ద్వారా పరిచయం అయ్యారు. అత్యంత నిరాడంబరంగా కనిపిస్తున్న ఆమె... అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగం చేసి, స్వదేశానికి వచ్చి తనను తాను పర్యావరణ ప్రేమికగా ఎలా మలచుకున్నారో, మరికొందరి మహిళలను ఎలా భాగస్వాములను చేస్తున్నారో వివరించారు. ‘‘మా ఊరిలో పన్నెండేళ్లుగా ఉంటున్నాం. గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో వాడకంలో ఉన్న వస్తువులకు ప్రత్యామ్నాయ, పర్యావరణ అనుకూల ఉత్పత్తులను తయారుచేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నాను. చాలా ఆలోచనలు చేశాక మహిళల రుతుక్రమ సమయంలో వాడే ప్యాడ్స్‌కు సంబంధించిన పరిష్కారం కనుక్కోవాలనుకున్నాను. అందులో భాగంగా 2020లో ‘కొన్నై’ పేరుతో మా ఉత్పత్తులన్నీ గ్రామంలోని మహిళలు, యువతతో కలిసి చిన్న చిన్న సమూహాలుగా ఏర్పాటు చేసి, వారితో తయారుచేస్తున్నాను. మహిళలు, చంటిపిల్లలకు ఉపయోగపడే రీ యూజబుల్ ఉత్పత్తుల తయారీకి కొంతమందిని గ్రూప్‌గా చేసి వారి ఇళ్ల నుంచే, సౌకర్యవంతమైన సమయంలో తయారుచేసిచ్చేలా ప్రణాళిక చేశాను. చదువుకునే అమ్మాయిలకు, అబ్బాయిలకు ఇది ఒక పార్ట్‌టైమ్ ఉపాధి లాగా కూడా ఉపయోగపడుతుంది. వాడకం సులువు..మృదువుగా, మన్నికగా ఉండటమే కాకుండా వాడిన తర్వాత రెండు గంటల పాటు నీళ్లలో నానబెట్టి, ఎండలో ఆరవేయవచ్చు. తిరిగి వీటిని వాడుకోవచ్చు. వెదురు కాటన్‌ను వాటర్‌ఫ్రూఫ్ ఫ్యాబ్రిక్‌తో జత చేసి వీటిని తయారుచేస్తుంటాం. ఇవి సురక్షితంగానూ, అనుకూలంగానూ ఉంటాయి. తిరిగి ఉపయోగించడం వల్ల పర్యావరణానికి కలిగే నష్టాన్నీ నివారించవచ్చు. డిస్పోజబుల్ ప్యాడ్లలో రసాయనాల కారణంగా చర్మానికి హాని కూడా కలిగిస్తాయి. మహిళలకు రీ యూజబుల్ క్లాత్ ప్యాడ్స్ మాత్రమే కాదు పిల్లలకు డైపర్లు, మ్యాట్లు, వైప్స్.. అన్నీ ఎకో ఫ్రెండ్లీవే తయారుచేస్తున్నాం. ఇవి మృదువుగా ఉంటాయి. కాబట్టి చర్మానికి ఎలాంటి హానీ కలిగించవు. స్మాల్, మీడియమ్.. సైజులను బట్టి డిజైన్ల బట్టి ధరలు ఉన్నాయి.ఆర్డర్లను బట్టి ఒక్కొరికి రూ.5,000 వరకు ఆదాయం లభిస్తుంది. ఇందులో ఇప్పుడు పెద్దగా ఆదాయం రాకపోవచ్చు. నేను ఆదాయం, రాబడి గురించి ఆలోచించడం లేదు. మునుముందు అందరూ పర్యావరణహితంగా మారాల్సిందే. అందుకు నా వంతు ప్రయత్నం చేస్తున్నాను. సొంత ఊరికి... మేం పన్నెండేళ్లు అమెరికాలో ఉన్నాం. నేనూ, మా వారు దేవ్ అక్కడే సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా ఉద్యోగాలు చేశాం. మాకు ఇద్దరు పిల్లలు. ఒక దశలో మాకు అక్కడ ఉండాలనిపించలేదు. మొత్తం కుటుంబంతో సొంత ఊరికి వచ్చేశాం. ఇక్కడే ఊళ్లో ఏడెకరాల భూమి కొనుగోలు చేశాం. అందులో ఎక్కువ శాతం రాగులు పండిస్తాం. ఆ పని అంతా మా వారు చూసుకుంటారు. ఎవరికి నచ్చిన పని వాళ్లు...అమెరికన్ సంస్కృతిలో పిల్లల మీద చదువుల ఒత్తిడి ఉండదు. పిల్లలకు ఏది ఇష్టమో, ఏ కళలో నైపుణ్యం సాధించాలనుకుంటారో దానిని వారే కనిపెట్టేలా, నైపుణ్యాలు సాధించేలా చూస్తారు. మేం కూడా పిల్లలను స్కూళ్లను, కాలేజీకి పంపించలేదు. హోమ్ స్కూలింగ్ అని మాకు గ్రూప్ ఉంటుంది. ఆ కమ్యూనిటీలో పిల్లలకు నచ్చినవి చదువుకుంటారు. తప్పనిసరిగా చదవాలనే నిబంధన పెడితే, మనసుకు ఇష్టంలేని దానిమీద వారెప్పటికీ ప్రావీణ్యులు కాలేరు. ఇవన్నీ ఆలోచించాం. పిల్లలకు ఏది ఇష్టమో అదే చేయమన్నాం. ఇద్దరూ సంగీతం నేర్చుకున్నారు. ఇరవై ఏళ్ల మా అబ్బాయికి శాస్త్రీయ సంగీతం అంటే ఎక్కువ ఇష్టం. పద్దె నిమిదేళ్ల మా అమ్మాయి ఉడెన్ ఫర్నీచర్‌లో తన నైపుణ్యాలను చూపుతుంటుంది. నేను పర్యావరణ హితంగా ఉండే పనులు చేయాలనే ఆలోచనతో రీ యూజబుల్ న్యాపికిన్స్ పై దృష్టి పెట్టాను. మా విధానాలు మా ఇతర కుటుంబాల వారికి నచ్చుతుందని నేను అనుకోను. ఎందుకంటే, ఈ పోటీ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ పరుగులు పెట్టేవారే. తమకేది నచ్చుతుందో, ఏం చేయగలమో, ఎందులో సంతృప్తి లభిస్తుందో దానిని కనుక్కోలేరు. ప్రకృతి నీడన, నచ్చిన పనుల్లో భాగస్వాములం అవుతూ పర్యావరణహితగా జీవిస్తున్నాం. నా ఈ ఆలోచనను విరివిగా మార్కెట్లోకి తీసుకెళ్లడానికి ఆన్లైన్లోనే కాకుండా ఆఫ్‌లైన్ ద్వారా రకరకాల క్రాఫ్ట్స్ మేళాలో పెడుతూ సాధ్యమైనంత వరకు ప్రజల్లోకి తీసుకెళుతున్నాను’ అని వివరించారు హేమ. – నిర్మలారెడ్డి -
20వేల ఉత్పత్తులతో అమెజాన్ స్వచ్ఛతా స్టోర్.. ఎక్కడో తెలుసా..
దిల్లీలో అమెజాన్ స్వచ్ఛతా స్టోర్‌ను కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ప్రారంభించారు. అవసరమైన వస్తువులను సులభంగా కొనుగోలు చేయడంతోపాటు వినియోగదారులకు పరిశుభ్రమైన వాతావరణాన్ని అందిస్తూ వారికి అవగాహన కల్పించడమే ఈ స్టోర్ లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. ఈ స్వచ్ఛత స్టోర్‌లో వాక్యూమ్ క్లీనర్లు, శానిటరీ వేర్, వాటర్ ప్యూరిఫైయర్లు, మాప్లు, చీపుర్లతో సహా దాదాపు 20,000 క్లీనింగ్ ఉత్పత్తులను కొనుగోలు చేయవచ్చని చెప్పారు. ఇదీ చదవండి: ఏకధాటిగా 40 గంటలు ఎగిరే డ్రోన్.. ఇంకెన్నో ప్రత్యేకతలు అమెజాన్ ఇండియా కన్జూమర్ బిజినెస్ వైస్ ప్రెసిడెంట్, కంట్రీ మేనేజర్ మనీష్ తివారీ మాట్లాడుతూ.. ‘క్లీన్ ఇండియా’ అనే ప్రభుత్వ విజన్‌కు మద్దతివ్వడంపట్ల ఆనందంగా ఉందన్నారు. అమెజాన్ ఎప్పుడూ ‘స్మార్ట్ క్లీనింగ్, అందరికీ పారిశుధ్యం అందించడం, పూర్తి పరిశుభ్రత, పర్యావరణ రక్షణ’కు కట్టుబడి ఉందని తెలిపారు. దేశ పారిశుధ్యంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని కోరారు. -
మంత్రి ఇంట్లో చోరీ.. కంప్లైంట్ ఇస్తే తిరిగి తన మెడకే చుట్టుకుని..
ఘనా: ఘనా దేశ పారిశుధ్యం, నీటి వనరుల శాఖ మంత్రిగా పనిచేస్తోన్న సెసిలియా అబీనా డఫా ఇంట్లో భారీ మొత్తంలో చోరీ జరగడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. ఈ దొంగతనము గురించి బయటకు పొక్కగానే ఒక మంత్రి ఇంట్లో అంత మొతం సొమ్ము ఎలా చేరిందంటూ కొత్త ప్రశ్నలు తలెత్తాయి. దొంగ సొమ్ము దొంగల పాలైతే తప్పేంటని ప్రజలు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. దీంతో ఈ కేసులో తానిచ్చిన కంప్లైంట్ చివరికి తన మెడకే చుట్టుకున్నట్టైంది. ఘనా ప్రభుత్వంలో పారిశుధ్యం, నీటి వనరుల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న సెసిలియా అబీనా డఫా(68) ఇంటిలో భారీ స్థాయిలో దొంగతనం జరిగింది. సుమారు ఒక మిలియన్ డాలర్లు, 3 లక్షల యూరోలు, మరో 3 లక్షల 50 వేల ఘనా కరెన్సీ నగదు 35వేల డాలర్లు, 95 వేల డాలర్ల విలువ చేసే నగలు దోచుకుని వెళ్లారు దొంగలు. అంత పెద్ద మొత్తం చోరీ జరగడంతో షాక్‌లో మంత్రి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. భారీ స్థాయి దొంగతనం కాబట్టి ఈ వార్త ఆ నోటా ఈ నోటా వేగాంగా చేరి, మంత్రి ఇంట్లో అంత పెద్ద మొత్తంలో నగదు, నగలు ఉండటమేమిటని గుసగుసలాడారు నెటిజన్లు. సోషల్ మీడియా వేదికగా ఆమెపై అవినీతి ఆరోపణలు చేశారు. పోయిన సొమ్ము గురించి కంప్లైంట్ ఇస్తే అదికాస్తా అక్రమ సంపాదన కేసుగా మారి తన మెడకే చుట్టుకోవడంతో పదవికి రాజీనామా చేశారు డఫా. అవినీతి ఆరోపణలు, తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తడంతో బాధ్యతగా పదవి నుండి తప్పుకున్న డఫాను అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. రాజీనామా లేఖలో మా యింట్లో పోయిన నగదు మొత్తం ఎంతన్నది స్పష్టంగా చెప్పకపోవడం వల్లనే ఈ సమస్య తలెత్తిందని రాశారు డాఫా. ఇదిలా ఉండగా నానా అకుఫో అడ్డో ప్రభుత్వం ఆమె రాజీనామాను ఆమోదిస్తూ, అవినీతి ఆరోపణలపై స్పందించకపోగా మంత్రిగా ఆమె చేసిన సేవలను కొనియాడారు. ఇది కూడా చదవండి: ఎంతకాలం అడుక్కుంటాం.. ముందు చేతిలో చిప్ప విసిరేయాలి -
బస్స్టేషన్లలోని మరుగుదొడ్లలో ఉచితంగా శానిటరీ ప్యాడ్స్: సజ్జనార్
ఖైరతాబాద్: గౌలిగూడ మహాత్మాగాంధీ, సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టేషన్ల లో ఉచితంగా మరుగుదొడ్ల సౌకర్యంతో పాటు శానిటరీ ప్యాడ్ బాక్స్‌లు కూడా ఏర్పా టు చేయనున్నట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని బస్ స్టేషన్లలో నవంబర్‌లోగా ఈ సౌకర్యం కల్పించనున్నట్లు చెప్పారు. బాలికా విద్య, మహిళలు రుతు సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తూ పీపుల్ ఫర్ అర్బన్ అండ్ రూరల్ ఎడ్యుకేషన్ (ప్యూర్) స్వచ్ఛంద సంస్థ ‘ప్యూరథాన్’ నిర్వహించింది. నెక్లెస్‌రోడ్‌లోని పీపుల్స్‌ప్లాజా వేదికగా ఆదివారం ఉదయం జరిగిన 2కె, 5కె రన్, వాక్‌ను రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్, ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌లు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా సజ్జనార్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల మహిళల్లో శానిటరీ ప్యాడ్స్ గురించి మరింత అవగాహన కల్పించాలని, ఇందుకోసం ఆర్టీసీ తోడ్పాటు అందిస్తుందని తెలిపారు. కొందరు రుతుక్రమం గురించి మాట్లాడేందుకు సిగ్గుపడతారని, ఇది ప్రకృతి సహజమైనదని అన్నారు. ప్యాడ్స్ సౌకర్యం లేకపోవడం వల్ల విద్యార్థినులు పాఠశాలల నుంచి డ్రాపవుట్ అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రుతుక్రమంపై ముఖ్యంగా మగవారిలో మరింత అవగాహన రావాల్సిన అవసరం ఉందని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్, సినీ నటుడు సత్యదేవ్ అన్నారు. జ్వరం, జలుబు వస్తే ఎలా మెడికల్ షాప్‌కు వెళ్లి మందులు కొనుగోలు చేస్తారో అలాగే ప్యాడ్లను కొనుగోలు చేసేలా మహిళలు, యువతులు, బాలికల్లో ధైర్యం పెంచేందుకు ఈ పరుగును నిర్వహించినట్లు ప్యూర్ సంస్థ ఎండీ శైలా తాళ్లూరి తెలిపారు. కార్యక్రమంలో సినీ దర్శకుడు రమేష్, సినీనటి దివి, మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి, గాయని గీతా మాధురి తదితరులు పాల్గొన్నారు. మహిళలు, యువతులు, బాలికలు పెద్ద ఎత్తున ఉత్సాహంగా రన్లో పాల్గొన్నారు. -
మాస్క్ లేకపోతే రిస్క్
ముసుగు వేయొద్దు మనసు మీద అంటారు.. అంటే.. మనసులో ఏం ఉంటే అది మాట్లాడాలని. ఇప్పుడు సీన్ రివర్స్... ముసుగు వేయాలి ముఖం మీద. అదేనండీ మాస్క్. అది లేకపోతే రిస్క్.. ఇక.. బ్యాగ్‌లో ఏం ఉన్నా లేకపోయినా.. శానిటైజర్ బాటిల్ ఉండాల్సిందే. పదే పదే చేతులు శుభ్రం చేసుకోవాలి. లేకపోతే రిస్క్. అంతా కరోనా తెచ్చిన తంటా. ఈ కరోనా కాలంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తాము ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో కొందరు కథానాయికలు చెప్పారు. ఆ విశేషాలు. ఇప్పుడు దూరమే మంచిది -పూజా హెగ్డే ► కరోనాకి సంబంధించి ముందు బేసిక్ పాయింట్స్‌ని ఒకసారి చెప్పుకుందాం ► తరచూ చేతులు కడుక్కోవాలి ► ఫేస్ మాస్క్‌ని మరచిపోకుండా వాడాలి ► ఏదైనా వస్తువు ముట్టుకున్నాక శానిటైజర్ వాడాలి ► ఇప్పుడు ఆవిరి పట్టడం చాలా ముఖ్యం. రోజుకి రెండుసార్లు ఆవిరి పడితే మంచిది. నేను తప్పనిసరిగా రోజుకి రెండుసార్లు ఆవిరి పడుతుంటాను ► వేడినీళ్లు ఎన్ని తాగితే అంత మంచిది. మనం ఎక్కువ నీళ్లు తాగడంవల్ల మన శరీరంలో ఇన్ఫెక్షన్ తక్కువ ఉండే అవకాశం ఉంటుంది. నేను రోజుకి కనీసం మూడు లీటర్లు నీళ్లు తాగుతాను ► యోగా చాలా మంచిది... శరీరానికి, మనసుకి కూడా. నేను రోజూ చేస్తాను ► బత్తాయి, ఆరెంజ్ లాంటి సిట్రస్ ఫ్రూట్స్ మేలు చేస్తాయి. లేకపోతే విటమిన్ సి ట్యాబ్లెట్లు వాడాలి. డాక్టర్ సలహా మేరకు ట్యాబ్లెట్లు తీసుకోవాలండోయ్. నేను రోజూ ఎక్కువగా పండ్లు తింటాను ► షూటింగ్‌కి వెళ్లేటప్పుడు తప్పకుండా శానిటైజర్ తీసుకెళతాను. అలాగే అందరికీ దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తాను. అది నాకూ మంచిది. లొకేషన్లో ఉండేవాళ్లకీ మంచిది షూటింగ్ లొకేషన్లో ఉన్నప్పుడు కాటన్ రుమాలుని మాస్క్‌లా వాడతాను ► నేను ఉండే వ్యానిటీ వ్యాన్ బయట శానిటైజర్ ఉండేలా చూసుకుంటాను. వ్యాన్‌లోకి వచ్చేవాళ్లు చేతులను శానిటైజర్‌తో శుభ్రం చేసుకున్నాకే వస్తారు ► షూటింగ్ ముగించుకుని ఇంటికి రాగానే ఆవిరి తీసుకుంటాను. వేడి నీళ్లతో స్నానం చేస్తాను ∙ఒక నటిగా అన్ని సమయాల్లో మాస్క్ ధరించడం చాలా కష్టం. కెమెరా ముందుకు వెళ్లినప్పుడు మాస్క్ తీసేస్తాం. ► కరోనా వైరస్ వ్యాప్తిని నివారించడానికి అన్ని జాగ్రత్తలూ తీసుకునే, షూటింగ్స్ చేస్తున్నాం. ఆరోగ్యమే గొప్ప సంపద -రాశీ ఖన్నా ► ప్రస్తుతం నాగచైతన్యతో నటిస్తున్న ‘థ్యాంక్యూ’ సినిమా షూటింగ్ చేస్తూ ఇటలీలో ఉన్నాను ∙కోవిడ్ నిబంధనలను చాలా స్ట్రిక్ట్‌గా పాటిస్తున్నాం. మాస్కులు ధరించి షూటింగ్‌కి రావాలనే నిబంధనను అందరం ఫాలో అవుతున్నాం ► లొకేషన్లో వీలున్న చోటల్లా శానిటైజర్లు ఏర్పాటు చేశారు. అలాగే లొకేషన్ని తరచూ శానిటైజ్ చేయిస్తున్నారు ► ఎన్ని చేసినా కెమెరా ముందుకి వెళ్లగానే మేం ఆర్టిస్టులు మాస్కులు తీయాల్సిందే ► నా వ్యక్తిగత విషయానికొస్తే.. మొదట్నుంచీ నాకు ఆరోగ్యం మీద శ్రద్ధ ఎక్కువ. అందుకే ఇప్పుడు ప్రత్యేకంగా ఏమీ చేయడంలేదు ఇప్పుడనే కాదు.. ఎప్పట్నుంచో వేడి నీళ్లు తాగడం నా అలవాటు ► నేను శాకాహారిగా మారి, ఏడాదిన్నర అయింది. దానివల్ల చాలా హాయిగా ఉంది ► ఇప్పుడు అందరూ చేయాల్సిన పనేంటంటే.. ఫిట్‌గా ఉండటం. వైరస్ మనల్ని ఎటాక్ చేస్తే తట్టుకునేంత శక్తి మన దగ్గర ఉండాలి. మంచి ఆహారపుటలవాట్లు మన రోగ నిరోధక శక్తిని పెంచుతాయి ► పెద్ద పెద్ద వ్యాయామాలు చేయడానికి కుదరకపోతే రోజుకి కనీసం 20 నిమిషాలైనా నడవాలి ∙తప్పించలేని పనులుంటే బయటకు వెళ్లక తప్పదు. పని లేకపోతే వెళ్లొద్దు ► ఈ కరోనా వల్ల మనషుల మనుగడ ప్రశ్నార్థకం అయింది. ఈ పోటీ ప్రపంచంలో ఇన్నాళ్లూ పరుగులు పెట్టాం. ఇప్పుడు ఆగి, ఆలోచించాల్సిన అవసరం ఉంది. సంపాదనలోనే ఆనందం ఉందనే భ్రమను తొలగించుకుందాం. ఆరోగ్యమే గొప్ప సంపద అనే విషయాన్ని గ్రహిద్దాం ► ఇప్పటివరకూ ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని పాటించినవాళ్లు ఓకే. లేనివాళ్లు మాత్రం లైఫ్‌స్టయిల్‌ని మార్చుకోవాలి ► ఫైనల్‌గా ఒక మాట చెబుతాను. తప్పనిసరిగా మాస్క్ ధరించండి. మీరు క్షేమంగా ఉండండి. ఇతరులకూ అదే క్షేమం! ఆ ధోరణి మారాలి -నభా నటేష్ ► ప్రజలు కరోనా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది ► కచ్చితంగా మాస్క్‌లు ధరించడం, భౌతిక దూరం పాటించడం, చేతులను శుభ్రంగా కడుక్కోవడం వంటి ప్రాథమిక నియమాలను అలవాటు చేసుకోవాలి ► కరోనా మహమ్మారి మనల్ని ఏడాదికి పైగా బాధపెడుతున్నా మనలోని కొందరు ఇంకా కరోనా జాగ్రత్తలను పాటించే విషయంలో నిర్లక్ష్యంగానే ఉన్నారు. ఆ ధోరణిని మార్చుకోవాలి ► ఈ కరోనా సమయంలోనూ నేను షూటింగ్లో పాల్గొంటున్నాను. అయితే అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాను ► నేనే కాదు.. నా వ్యక్తిగత సిబ్బంది కూడా చాలా జాగ్రత్తగా ఉంటున్నారు ► షూటింగ్ లొకేషన్లో అందరూ మాస్కులు ధరిస్తున్నారు. భౌతిక దూరం పాటించే మాట్లాడుకుంటున్నాం ► షూటింగ్లో భాగంగా కొన్ని వస్తువులను తాకాల్సి వస్తుంది. సో.. ఎప్పటికప్పుడు చేతులను శానిటైజర్‌తో క్లీన్ చేసుకుంటున్నాను ► అందరూ రోగనిరోధక శక్తిని పెంచే ఆహారం తీసుకోవాలి ► రోజులో కాస్త సమయం వ్యాయామానికి కేటాయించాలి ► నేను తప్పకుండా వ్యాయామం చేస్తాను, మంచి ఆహారం తీసుకుంటాను. మంచి అలవాట్ల వల్ల శక్తి అధికంగా ఉండే రోగాల నుంచి కాస్త దూరంగా ఉండొచ్చనేది నా భావన ► కరోనా వల్ల అన్ని రంగాలూ చాలా నష్టపోయాయి. ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు వస్తున్నాయనుకుంటే సెకండ్ వేవ్ రూపంలో మళ్లీ కరోనా విజృంభిస్తోంది. వైరస్‌తో ప్రయాణం చేస్తున్నామని మరచిపోకండి. జాగ్రత్తగా ఉండండి. -
ప్రధాని సంచలన నిర్ణయం: ఉచితంగా ప్యాడ్స్
వెల్లింగ్టన్: న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెర్న్ గురువారం కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో విద్యార్థినిలకు ఉచితంగా నెలసరి కిట్‌ను అందించనున్నట్లు ప్రకటించారు. జూన్ నుంచి దశల వారీగా ఈ పంపిణీ ప్రారంభమవుతుందేని పేర్కొన్నారు. పాఠశాలలు, ఇంటర్మీడియట్, సెకండరీ స్కూల్స్‌లో ఈ కిట్‌ను ఉచితంగా అందిస్తామని తెలిపారు. కాగా పైలట్ ప్రాజెక్ట్‌లో భాగంగా 15 పాఠశాలల్లోని 3200 మంది విద్యార్థినులకు ఉచితంగా శానిటరీ ప్యాడ్స్ సహా మరికొన్ని ఉత్పత్తులను అందించారు. ఇది విజయవంతం కావడంతో వాటిని దేశవ్యాప్తంగా ఫ్రీగా పంపిణీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందుకు దాదాపు 25 మిలియన్ల న్యూజిలాండ్ డాలర్లు ఖర్చు కానున్నాయి. శానిటరీ న్యాప్కిన్ల ధర ఎక్కువగా ఉండటంతో పేద బాలికలు వాటిని కొనలేకపోతున్నారని, దీంతో రుతుక్రమం సమయంలో వారు స్కూలుకు వెళ్లడమే మానేస్తున్నారని ఓ అధ్యయనం పేర్కొంది. దీంతో నెలసరి సమస్యల వల్ల అమ్మాయిలు చదువుకు దూరం కావద్దనే ఈ కొత్త పథకానికి శ్రీకారం చుట్టినట్లు జెసిండా చెప్పుకొచ్చారు. "పీరియడ్ పావర్టీ"ని తగ్గించాలనేదే తన లక్ష్యమని తెలిపారు. శానిటరీ కిట్ల ఉచిత పంపిణీ మూడేళ్ల వరకు కొనసాగుతుందని ప్రకటించారు. అయితే ఇలా మహిళల రుతుక్రమాన్ని దృష్టిలో పెట్టుకుని వారికోసం నెలసరి కిట్లను ఉచితంగా అందించిన తొలి దేశంగా స్కాట్లాండ్ ఇదివరకే చరిత్రకెక్కింది. నెలసరి సమయంలో మహిళలకు అవసరమయ్యే వస్తువులన్నింటినీ ఉచితంగా అందించాలని స్కాట్లాండ్ ప్రభుత్వం నిర్ణయించడమే కాక గతేడాది నవంబర్ నుంచే దాన్ని అమల్లోకి తెచ్చింది. చదవండి: త్వరలోనే పెళ్లి చేసుకోనున్న ప్రధాని జెసిండా! వైరల్: వంటకు సాయం చేస్తున్న కోతి! -
లాక్డౌన్ నుంచి వీటికీ మినహాయింపు
సాక్షి, న్యూఢిల్లీ: లాక్డౌన్ నుంచి మరికొన్ని రంగాలకు మినహాయింపునిస్తూ కేంద్రం శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. గతంలో ప్రకటించిన మినహాయింపులకు అదనంగా ఇవి ఉంటాయని పేర్కొంది. గ్రామీణ ప్రాంతాల్లో నిర్మాణ కార్యక్రమాలు, నీటి సరఫరా, పారిశుద్ధ్య రంగానికి చెందిన నిర్మాణ పనులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు, కో ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీల కార్యకలాపాలకు తాజాగా అనుమతినిచ్చింది. కలపేతర అటవీ ఉత్పత్తుల సేకరణ, కొనుగోలు, ప్రాసెసింగ్.. తదితరాలకు కూడా అనుమతినిచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లోని నిర్మాణ పనుల్లో.. విద్యుత్ స్తంభాలు, విద్యుత్ లైన్లు, టెలికం ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ ఏర్పాటు.. మొదలైనవి ఉన్నాయి. హౌజింగ్ ఫైనాన్స్ సంస్థలు, మైక్రో ఫైనాన్స్ సంస్థలు కొద్దిపాటి సిబ్బందితో పనులు చేసుకోవచ్చు. వెదురు, కొబ్బరి, వక్క, కొకొవా తదితర ఉత్పత్తుల ప్లాంటేషన్, ప్యాకేజింగ్, అమ్మకం, మార్కెటింగ్ మొదలైన పనులను ఈ లాక్డౌన్ కాలంలో చేసుకోవచ్చు. -
భౌతిక దూరం కోసం కంటోన్మెంట్
‘భారతీయులు, కుక్కలకు నిషేధం’ఇలా రాసి ఉన్న బోర్డులు కంటోన్మెంట్ ప్రాంతంలో విరివిగా కనిపించేవి. ప్రధాన ద్వారం, ఆసుపత్రి, క్లబ్, క్రీడా ప్రాంగణం, ఈత కొలను, చర్చీలు.. ఇలాంటి అన్ని చోట్ల ఈ బోర్డులు ఉండేవి. స్థానికులతో కలిస్తే వ్యాధులు సోకుతాయన్న భయం. తమ ప్రాణాలు కాపాడుకోవాలంటే స్థానికులతో భౌతిక దూరాన్ని పాటించాలనేది నాటి నిబంధన. తాము పెంచుకున్న కుక్కలు తప్ప, స్థానిక కుక్కలు రాకుండా చూసుకునేవారు. ఇది 1865 సమయంలో రూపుదిద్దుకున్న కంటోన్మెంట్ కథ’ సాక్షి, హైదరాబాద్: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాను నియంత్రించాలంటే ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఏకైక ‘మందు’భౌతిక దూరం పాటించటమే.. ఇప్పుడు ప్రపంచమంతా అనుసరిస్తున్న విధానం ఇదే. ఈ సూత్రం తెలియకపోవటం వల్లే వందేళ్ల కింద స్పానిష్ ఇన్ఫ్లుయెంజా విసిరిన పంజాకు మన దేశంలో ఏకంగా కోటిన్నర కంటే ఎక్కువ మంది చనిపోయారు. మన దేశంలో అన్ని మరణాలు సంభవించినా.. ఇక్కడ పాలనా పగ్గాలు పట్టుకుని ఉన్న బ్రిటిష్ వాళ్లు మాత్రం అంత ఎక్కువ సంఖ్యలో చనిపోలేదు. దానికి కారణం.. భౌతిక దూరాన్ని పాటించటమే. సిఫారసులు ఇలా.. ► భారత్‌లో విధులు నిర్వర్తిస్తున్న బ్రిటిష్ సిబ్బంది, స్థానిక భారతీయులతో మెసలకుండా ప్రత్యేకంగా నివాసం ఉండాలి. ► స్థానికుల ద్వారా వారికి అంటువ్యాధులు సోకుతున్నాయి. అవి వారి మరణానికి కారణమవుతున్నాయి. ► బ్రిటిష్ సిబ్బందికి విశాలమైన ప్రాంతంలో దూరం దూరంగా ఉండేలా కార్యాలయాలు, నివాస సముదాయాలు నిర్మించాలి. ► వారికి శుద్ధి చేసిన నీరు అందించాలి. మంచి భవనాలు నిర్మించాలి. నీరు నిలిచిపోని విధంగా డ్రైనేజీ వ్యవస్థ ఉండాలి. ఈగలు, దోమలు లేకుండా చూడాలి. ► ఆ ప్రాంగణాల్లోకి భారతీయులను అనుమతించొద్దు. సికింద్రాబాద్ క్లబ్ కంటోన్మెంట్ అందుకే.. సికింద్రాబాద్‌లో ఉన్న కంటోన్మెంట్ ప్రాంతం.. ఈ భౌతిక దూరం సూత్రంపైనే రూపుదిద్దుకుంది. ప్రస్తుతం కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో చరిత్రకారులు నాటి బ్రిటిష్ వారి దూరాలోచనను గుర్తు చేస్తున్నారు. హైదరాబాద్‌లోనే కాదు.. దేశ వ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లో కంటోన్మెంట్ ప్రాంతాలున్నాయి. ఇవన్నీ నాటి ఆంగ్లేయులు నిర్మించినవే. అన్నింటి ఉద్దేశం ఒకటే. స్థానిక భారతీయులతో ‘సామాజిక’దూరాన్ని పాటించటం. 40 శాతం మంది చనిపోతుండటంతో.. ఇది 1850 నాటి సంగతి.. మన దేశంలో పాలన కోసం 10 వేల మంది బ్రిటిష్ సిబ్బంది ఉండేవారు. వీరు దేశంలోని వివిధ ప్రాంతాల్లో విధులు నిర్వహించేవారు. కానీ వీరిలో ఏకంగా 40 శాతం మంది అంటురోగాలు, ఇతర వ్యాధులతో చనిపోయేవారు. మూడింట ఒక వంతు మంది వ్యాధులతో ఎప్పుడూ చికిత్స పొందుతుండేవారు. ఐదారేళ్లు కాగానే 30 శాతం మంది సిబ్బందే మిగిలేవారు. దీంతో ఎప్పటికప్పుడు కావాల్సినంత మందిని ఇంగ్లండ్ నుంచి రప్పించాల్సి వచ్చేది. ఇది ఆ దేశాన్ని తీవ్రంగా కలవరపరిచింది. దీంతో దీనికి కారణాలు కనుక్కుంటూ పరిష్కారాలు చూపాల్సిందిగా ఆదేశిస్తూ ఆ దేశం రాయల్ శానిటరీ కమిషన్‌ను నియమించింది. 1863 ప్రాంతంలో ఈ కమిషన్ నివేదిక సమర్పించింది. వెంటనే కంటోన్మెంట్ నిర్మాణం హైదరాబాద్ ప్రాంతం నిజాం కేంద్రంగా ఉండగా, సికింద్రాబాద్ ప్రాంతాన్ని బ్రిటిషర్స్ తమకు వీలుగా వాడుకునేవారు. అందుకే సికింద్రాబాద్‌లో ప్రత్యేకంగా కంటోన్మెంట్ ప్రాంతాన్ని నిర్మించుకున్నారు. వేల ఎకరాల సువిశాల ప్రాంతంలో వారికి కార్యాలయాలు, నివాసాలు, రీక్రియేషన్ కేంద్రాలు, ఆట మైదానాలు, చర్చీలు, ఉద్యానవనాలు వెలిశాయి. అవన్నీ భౌతిక దూరం పద్ధతిలో దూరం దూరంగా నిర్మించారు. కంటోన్మెంట్ నిర్మాణం తర్వాత బ్రిటిష్ సిబ్బందిలో మరణాల రేటు తగ్గిపోయింది. వారికి ప్రత్యేకంగా మంచినీటి వసతి ఉండటం, నిరంతరం పారేలా మురుగునీటి వ్యవస్థ ఏర్పడటం, మానసిక శారీరక ఉల్లాసానికి ఏర్పాట్లు ఉండటం, పరిశుభ్రమైన వాతావరణం ఏర్పడటం, మంచి వైద్య సేవలు అందుబాటులో ఉండటం, రోగాలతో బాధపడే స్థానికులకు దూరంగా ఉండటం వెరసి వారి ఆరోగ్యంపై సానుకూల ప్రభావం కనిపించింది. ‘1918లో ప్రపంచవ్యాప్తంగా మారణహోమం సృష్టించిన స్పానిష్ ఇన్ఫ్లుయెంజా ప్రభావం మన దేశంలోని కంటోన్మెంట్లలో భద్రంగా ఉన్న బ్రిటిష్‌వారిపై అంతగా ప్రభావం చూపలేదు. ఆ వ్యాధి సోకిన భారతీయులతో వారు భౌతిక దూరాన్ని పాటించడమే దీనికి కారణం. అందుకు కంటోన్మెంట్ ఉపయోగపడింది’అని చరిత్ర పరిశోధకులు డాక్టర్ రాజారెడ్డి పేర్కొన్నారు. అప్పట్లోనే 500 పడకలతో ఆసుపత్రి కంటోన్మెంట్ ప్రాంతంలో 1870 నాటికి కంబైండ్ మిలిటరీ హాస్పిటల్‌ను నిర్మించారు. దీన్ని 1920 నాటికి 500 పడకల స్థాయికి పెంచారు. ఇందులో బ్రిటిష్ నుంచి ఎప్పుడూ నైపుణ్యం ఉన్న వైద్యులు, నర్సులను కావాల్సినంత మందిని ఉంచేవారు. దీంతో ఏ చిన్న సమస్య వచ్చినా, బ్రిటిష్ వారికి వెంటనే నాణ్యమైన వైద్యం అందేది. ప్రస్తుతం సికింద్రాబాద్ క్లబ్‌గా వాడుకుంటున్న క్లబ్‌ను అప్పట్లో బ్రిటిష్ వారి కోసమే వినియోగించేవారు. జింఖానా క్రికెట్ మైదానం ఉన్న చోట వారికి క్రీడా సదుపాయాలుండేవి. -
ఎమ్మెల్యే జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో సానిటైజేషన్ పనులు
-
విశాఖలో మరో అధికారిపై పెట్రోల్ దాడి..!
సాక్షి, పెందుర్తి: వేపగుంటలోని జీవీఎంసీ జోన్ – 6 ప్రధాన కార్యాలయంలో శనివారం పెట్రోల్ దాడి ఘటన తీవ్ర కలకలం రేపింది. జోన్ – 6 ఏఎంహెచ్‌వోగా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ లక్ష్మీ తులసిపై శానిటరీ సూపర్వైజర్ గార అన్నామణి పెట్రోల్‌తో దాడి చేసినట్లు పెందుర్తి పోలీసులకు ఫిర్యాదు అందింది. అయితే ఏఎంహెచ్‌వోతోపాటు ఇతర అధికారుల వేధింపులు భరించలేక తానే ఆత్మహత్య చేసుకునేందుకు పెట్రోల్ వెంట తెచ్చుకున్నానని అన్నామణి చెబుతోంది. ఇరువురి మధ్య కొంతకాలంగా ఉన్న వివాదమే ఈ ఘటనకు కారణంగా తెలుస్తోంది. సంచలనం రేపిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. లక్ష్మీతులసి జోన్ – 6తో పాటు జోన్ – 5కు ఇన్చార్జి ఏఎంహెచ్‌వోగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. చినముషిడివాడకు చెందిన గార అన్నామణి జీవీఎంసీ 68వ వార్డు గోపాలపట్నంలో శానిటరీ సూపర్వైజర్గా పనిచేస్తున్నారు. శనివారం మధ్యాహ్నం జోన్ – 5 కార్యాలయానికి వెళ్లిన కొద్దిసేపటి తర్వాత వేపగుంటలోని జోన్ – 6 కార్యాలయానికి ఆమె వచ్చారు. అదే సమయంలో కార్యాలయానికి సంచితో వచ్చిన అన్నామణి తనకు అన్యాయం జరుగుతుందంటూ ఏఎంహెచ్‌వోతో వివాదానికి దిగారు. కొద్దిసేపటికి సంచిలో ఉన్న పెట్రోల్ సీసా బయటకు తీసి తనపై పోసిందని లక్ష్మీతులసి ఆరోపిస్తున్నారు. పెందుర్తి పోలీస్ స్టేషన్ వద్ద అన్నామణి, ఆమె తీసుకొచ్చిన పెట్రోల్ వెంటనే గదిలోని విద్యుత్ ఉపకరణాలు, దేవుని పటాల వద్ద దీపం ఆపడంతో పెను ప్రమాదమే తప్పిందని చెబుతున్నారు. తాను కేకలు వేయడంతో అన్నామణిని కార్యాలయం సిబ్బంది బయటకు లాక్కుని వెళ్లారని చెబుతున్నారు. తనపై దాడి చేసిన అన్నామణిపై పెందుర్తి పోలీసులకు లక్ష్మీతులసి ఫిర్యాదు చేశారు. దీంతో అన్నామణిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కొద్దిరోజుల క్రితం అధికారుల అనుమతి లేకుండా 20 రోజులపాటు విధులకు హాజరు కాకపోవడంతో అన్నామణి జీతంలో కోత విధించారు. ఈ అంశమే వివాదానికి కారణమని సమాచారం. వేధింపులు తాళలేకే: అన్నామణి తన పిల్లల అనారోగ్యం కారణంగా కొద్ది రోజులు సెలవు పెట్టినందుకు తన జీతంలో కోత విదించారని అన్నామణి అన్నారు. దీంతోపాటు చాలాకాలంగా అధికారులు తనను తీవ్రంగా వేధిస్తున్నారని ఆరోపించారు. శనివారం తాను ఆత్మహత్య చేసుకుందామని పెట్రోల్ తెచ్చుకున్నానని... ఎవరిపైనా దాడి చేసే ఉద్దేశ్యం తనకు లేదని వివరించారు. ఉన్నతాధికారులు కలుగజేసుకుని సమగ్ర దర్యాప్తు చేపట్టి తనకు న్యాయం చేయాలని కోరారు. చదవండి: రూ.3 వేల కోసం ఐదుగురి హత్య -
వామ్మో... దోమలు...
సాక్షి, కోల్‌సిటీ: రామగుండం నగరపాలక సంస్థలోని 50 డివిజన్లలో దోమలు విజృంభిస్తున్నాయి. నగర ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. దోమల బెడదతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సీజన్‌తో సంబంధం లేకుండా దోమలు వ్యాపిస్తున్న తీరుపై నగర ప్రజానికం ఆందోళన చెందుతోంది. దోమల దాడికి వందలాది మంది విషజ్వరాల భారిన పడ్డారు. పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారడంతోనే దోమల బెడద ఎక్కువవుతోందని ఆరోపణలు వస్తున్నాయి. కాలువల్లో పూడికలు తీయకపోడంతో దోమలకు ఆవాస కేంద్రాలుగా మారాయి. దోమల ధాటికి బల్దియా ప్రజలు బెంబేలెత్తుతున్నారు. దోమల నివాస ప్రాంతాలు డ్రెయినేజీల్లో పూడికలు తీయకపోడంతో పారిశుధ్యం పేరుకుపోతోంది. ఎక్కడపడితే అక్కడ మురుగునీరు నిలిచిపోతోంది. ఖాళీ స్థలాలలో పిచ్చిమొక్కలు, చెత్తకుప్పల తొలగింపుపై పర్యవేక్షణ కొరవడింది. ఫలితంగా దోమలకు నివాస ప్రాంతాలుగా మారుతున్నాయి. పట్ట పగలు కూడా ఇళ్ళల్లో ఉండాలంటే దోమల నివారణకు ‘ఆల్ఔట్’ పెట్టుకోవాల్సి వస్తోందని ప్రజలు వాపోతున్నారు. రాత్రిళ్లు మాత్రమే కుట్టే దోమలు ఇప్పుడు రాత్రి, పగలు తేడా లేకుండా దాడి చేస్తూ కంటి మీద కునుకులేకుండా చేస్తున్నాయి. పెరుగుతున్న అదనపు ఖర్చు దోమల నివారణ కోసం కూడా ప్రతీ కుటుంబం ఇంటి బడ్జెట్లో అదనంగా కొంత మొత్తం వెచ్చించాల్సి వస్తోంది. దోమల నివారణకు మస్కిటో కాయల్స్, కెమికెల్స్తోపాటు బ్యాటింగ్ తదితర వాటి కోసం కొంత డబ్బు వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఇంటి సరుకులతోపాటు దోమల నివారణకు కూడా అదనపు వ్యయం చేయాల్సి రావడంపై నగర ప్రజలు మండిపడుతున్నారు. కానరాని నివారణ చర్యలు రోజురోజుకు పెరుగుతున్న దోమలను నివారించడంలో అధికారులు మొక్కుబడి చర్యలు తీసుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి. నిల్వ ఉన్న మురుగు నీటి గుంటల్లో గంభూషియా చేపలను వెయ్యడం లేదు. డ్రెయినేజీల్లో ఆయిల్ బాల్స్, మలాథియిన్ స్ప్రె తదితర నివారణ చర్యలు చేపట్టడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాలువల్లో మొక్కుబడిగా పూడిక తీయించి చేతులు దుల్పుకుంటున్నారని విమర్శలు వస్తున్నాయి. పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి మేయర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత పారిశుధ్యం మెరుగుపర్చేందుకు ప్రత్యేక దృష్టిసారించాను. ఫిర్యాదులపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటు న్నాం. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే దోమలు వ్యాపించవు. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. – చిట్టూరి రాజమణి, నగర మేయర్ చర్యలు తీసుకుంటున్నాం దోమల నివారణకు నగరంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. ప్రతీ శుక్రవారం డ్రై డే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మలాథియిన్ స్ప్రె చేయిస్తున్నాం. నీరు నిల్వ ఉన్న గుంటల్లో గంభూషియా చేపలను వేస్తున్నాం. డ్రెయినేజీల్లో ఆయిల్ బాల్స్ వేస్తున్నాం. చెత్తను ఎప్పటికప్పుడు తొలగిస్తూ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుతున్నాం. – కిషోర్‌కుమార్, శానిటరీ ఇన్స్పెక్టర్ -
సొంత పనులకు లక్షలు ఖర్చు చేసిన సీఎం
సాక్షి, అమరావతి : అసలే ఆంధ్రప్రదేశ్ పీకల్లోతు అప్పుల్లో మునిగిపోయింది. ఆమధ్య ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని స్థితిలో ఉన్నామంటూ ఆర్థిక శాఖా మంత్రి యనమల రామకృష్ణుడు సైతం మీడియా ముందు బీద అరుపులు అరిచారు. ఒకవైపు రైతులు రుణమాఫీ అమలు కాక అన్నదాత, అప్పుల బాధలు తాలలేక ఆత్మహత్యలు చేసుకుంటేంటే ప్రభుత్వానికి చీమకుట్టినట్లుగా కూడా లేదు. ప్రజా సంక్షేమం కోసం నిధులను విదల్చని ముఖ్యమంత్రి, స్వప్రయోజనాలకు మాత్రం యధేచ్ఛగా ఖర్చుపెడుతున్నారు. వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వప్రయోజనం కోసం ప్రజల సొమ్మును మరోసారి యధేఛ్చగా ఖర్చుపెట్టారు. ఆయన సొంత ఇంటి నిర్వహణ ఖర్చులకు రూ.7.50లక్షలను మంజూరు చేశారు. జూబ్లీహిల్స్ రోడ్ నెం.65లో ఇటీవలే నిర్మించిన ఇంట్లో, నీటి సరఫరా, శానిటరీ పనులతో పాటు, మదీనాగూడలోని సొంత ఫాంహౌస్‌కు భద్రత, నిర్వహణకు రూ.7.50 లక్షల నిధులను మంజూరు చేస్తూ తాజగా ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్యమంత్రి సౌకర్యార్థం నిధులు ఉపయోగించుకోవడంలో తప్పులేదు. అది ప్రభుత్వం అందించిన అతిథిగృహం లేదా క్యాంపు కార్యాలయ నిర్వహణకు ఖర్చు చేసినా ఒక అర్థం ఉంటుందని, కానీ ఇలా సొంత పనులకు ప్రజల సొమ్మును ఉపయోగించడం ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. -
కష్టాలు పుష్కలం
వారం రోజులైనా అందని వేతనాలు నిధులు రాలేదని చేతులెత్తేసిన కాంట్రాక్టర్లు సాక్షి, అమరావతి : వారంతా దినసరి కూలీలు. పుష్కరాల్లో గుంటూరు, కృష్ణాజిల్లాల్లో పారిశుద్ధ్య పనులు నిర్వహించేందుకు 20వేల మంది కాంట్రాక్టు కార్మికులు ఈనెల 9న వచ్చారు. వారం రోజులైనా ఒక్క రూపాయి అందలేదు. చేతి ఖర్చులకని తీసుకువచ్చిన డబ్బులు అయిపోయాయి. టీ తాగేందుకు కూడా చిల్లర లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రభుత్వం నిధులు మంజూరు చేయలేదంటూ కాంట్రాక్టర్లు చేతులెత్తేయడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. 150 పుష్కరఘాట్లలో విధులు కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని 150 పుష్కర ఘాట్లలో సుమారు 20 వేల మంది పారిశుద్ధ్య సిబ్బంది దినసరి వేతనంపై పనిచేస్తున్నారు. రోజుకు 8 గంటలపాటు మూడు షిప్టుల్లో విధులు నిర్వహిస్తున్నారు. చెత్త ఊడ్చడం, ఎత్తివేయడంతో పాటు వైద్య శిబిరాలు ఏర్పాటు చేసిన చోట దుస్తులు మార్చుకునే గదుల్లో, పిండ ప్రదానం షెడ్లలో వేసిన చెత్తను తొలగిస్తున్నారు. అలాగే రహదారులు శుభ్రం చేయడంతోపాటు రాత్రి వేళల్లో దోమల ఫాగింగ్ చేస్తున్నారు. ఇన్ని విధాలా కష్టపడుతున్నా కనీస వేతనం వారికి ఇవ్వడం లేదు. వేతనాల్లోనూ కక్కుర్తి ! ప్రభుత్వం ఒక్కో కార్మికుడికి రూ.400 వంతున రోజువారి వేతనంతో పాటు వారికి భోజన వసతి ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రతి ఐదురోజులకు ఒకసారి వేతనాలు చెల్లించాల్సిఉన్నా ఇప్పటివరకు ఒక్క రూపాయి చెల్లించలేదు. రూ. 400కు బదులుగా రూ.250 నుంచి రూ.300 వంతున వేతనం ఇస్తామని ముందే ఒప్పించారు. ప్రభుత్వం ఇచ్చే వేతనంలో కూడా కాంట్రాక్టర్లు కోత పెడుతూ వారి పొట్ట కొడుతున్నారు. నిధులు ఇవ్వని ప్రభుత్వం విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో ఖజానా ఖాళీగా వుంది. పుష్కరాల్లో పారిశుద్ధ్య కార్మికుల వేతనాల కోసం ప్రభుత్వం రూ.184 కోట్లు మంజూరు చేసింది. కానీ నిధులు మంజూరు జీవో కాపీ ఇచ్చారు కానీ నిధులు మంజూరు చేయలేదు. దీంతో మున్సిపల్ శాఖ ఖజానాలో నిధులు లేవు. 14 వ ఆర్థిక సంఘం నిధులైనా ఖర్చు చేసుకోవాలని ఆదేశాలిచ్చినా ఆ నిధులు ఇప్పటికీ ఖజానాలో జమ కాలేదు. దీంతో కాంట్రాక్టర్లకు నిధులు అందించలేక చతికిలపడింది. -
శానిటరీ మేస్త్రీ ఆత్మహత్య
విజయవాడ(చిట్టినగర్): శానిటరీ మేస్త్రీ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కొత్తపేట పోలీస్‌స్టేçÙన్ పరి«ధిలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం కేఎల్‌రావునగర్ వీఎంసీ కాలనీకి చెందిన వడ్డాది ఏడుకొండలు కార్పొరేషన్ ప్రజారోగ్య విభాగంలో శానిటరీ మేస్త్రీగా ఉద్యోగం చేస్తుంటాడు. భార్య, ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. ఇంటి అవసరాల నిమిత్తం రూ.ఆరు లక్షలు అప్పులు చేశాడు. అప్పు ఇచ్చిన వారు ఇంటికి వచ్చి అడుగుతారనే ఆందోళనతో ఆదివారం సాయంత్రం పాముల కాల్వ సమీపంలో తన బైక్‌లోని పెట్రోల్ ఒంటిపై పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తీవ్రగాయాలతో ఆస్పత్రికి తరలించిన ఏడుకొండలు చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కిషోరీ యోజన రద్దు వెనుక సీబీఐ అధికారి?
ఇటీవల ఢీల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తీసుకునే నిర్ణయాలన్నీ వార్తల్లోకెక్కుతుండటంతో ఆయన చేసే ప్రతి పనిని జనం సునిశితంగా గమనిస్తున్నారు. తాజాగా ఢిల్లీలోని సర్కారు బడుల్లో అమల్లో ఉన్న కిషోరీ యోజన కార్యక్రమాన్ని నిలిపివేయడంపై స్థానిక మీడియా దృష్టి పెట్టింది. ఢిల్లీ స్కూళ్లలోని సుమారు 7.5 లక్షలమంది విద్యార్థినులకు శానిటరీ నాప్కిన్లు అందించే సౌకర్యాన్ని రద్దు చేయడం వార్తల్లో కెక్కింది. నాప్కిన్లు అందించే సంస్థ జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ అగ్రిమెంటును సీబీఐ అధికారి ఒకరు తీసుకోవడంతోనే సర్కారు ఈ సౌకర్యాన్నిరద్దుచేసిందంటూ వచ్చిన వార్తలకు కేజ్రీవాల్ వెంటనే స్పందించారు. సీబీఐ అధికారి రాజీందర్కు, కంపెనీకి సంబంధం ఏమిటంటూ ట్వీట్ చేశారు. ఢిల్లీ విద్యార్థినులకు కిషోరీ స్కీమ్ ద్వారా 2012 నుంచి ప్రభుత్వం ఉచితంగా శానిటరీ నాప్కిన్లను అందజేస్తోంది. అయితే సదరు కంపెనీ కాంట్రాక్టును ఢిల్లీ సర్కారుకు చెందిన ఓ ప్రముఖ వ్యక్తి... సీబీఐ అధికారి తీసుకోవడమే విద్యార్థులకు అందించే సౌకర్యాన్ని నిలిపివేయడానికి కారణంగా తెలుస్తోంది. ఇప్పటివరకూ అమల్లో ఉన్న ఈ సౌకర్యాన్ని ఇకపై నిలిపివేస్తున్నట్లు జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ ప్రకటించింది. ఇందులో భాగంగా కంపెనీ నుంచి ఇకపై విద్యార్థులకు శానిటరీ నాప్కిన్స్ అందవన్న వివరాలతో మార్చి 2న ఢిల్లీ విద్యా శాఖకు చెందిన కేర్ టేకింగ్ బ్రాంచ్ కు ఓ లేఖ అందింది. ఇప్పటివరకు లక్ష్మీ ఎంటర్ ప్రైజెస్ ద్వారా విద్యార్థులకు శానిటరీ నాప్కిన్స్ అందిస్తున్న జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ లక్ష్మీ ఎంటర్ ప్రైజెస్ కు కూడా సదరు నిర్దేశాలు జారీచేస్తూ లేఖ పంపింది. అయితే ఢిల్లీ సర్కార్ లోని సీబీఐకి చెందిన దినేష్... సదరు కంపెనీ కాంట్రాక్ట్ ను తీసుకోవడంతోనే ఈ కిషోరీ యోజన కార్యక్రమాన్ని నిలిపివేసినట్లు తెలుస్తోంది. కొన్నేళ్లుగా నిర్విరామంగా, నిర్వివాదంగా, ఎటువంటి సమస్యలు లేకుండా నడుస్తున్న కిషోరీ యోజనా కేవలం సీబీఐ అధికారి చేతుల్లోకి జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ కాంట్రాక్టు వెళ్ళడంతోనే రద్దు అయినట్లు తెలుస్తోంది. సదరు సీబీఐ అధికారి సర్కారు బడులకు నాప్కిన్ల సరఫరా నిలిపివేయమంటూ ఆదేశించడంతోనే ఈ పథకం నిలిపివేసినట్లు సమాచారం. అయితే ఇటీవల విద్యా సంస్థల విషయంలో అనేక సరికొత్త నిర్ణయాలు తీసుకున్న ముఖ్యమంత్రి కేజ్రీవాల్.. సాఫీగా కొనసాగుతున్న పథకాన్ని నిలిపివేయడం హాట్ టాపిక్ గా మారింది. దీంతో స్పందించిన కేజ్రీవాల్.. వార్తల వెనుక కథను పరిశీలించే పనిలో పడ్డారు.