సాక్షి, అమరావతి : అసలే ఆంధ్రప్రదేశ్ పీకల్లోతు అప్పుల్లో మునిగిపోయింది. ఆమధ్య ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని స్థితిలో ఉన్నామంటూ ఆర్థిక శాఖా మంత్రి యనమల రామకృష్ణుడు సైతం మీడియా ముందు బీద అరుపులు అరిచారు. ఒకవైపు రైతులు రుణమాఫీ అమలు కాక అన్నదాత, అప్పుల బాధలు తాలలేక ఆత్మహత్యలు చేసుకుంటేంటే ప్రభుత్వానికి చీమకుట్టినట్లుగా కూడా లేదు. ప్రజా సంక్షేమం కోసం నిధులను విదల్చని ముఖ్యమంత్రి, స్వప్రయోజనాలకు మాత్రం యధేచ్ఛగా ఖర్చుపెడుతున్నారు.
వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వప్రయోజనం కోసం ప్రజల సొమ్మును మరోసారి యధేఛ్చగా ఖర్చుపెట్టారు. ఆయన సొంత ఇంటి నిర్వహణ ఖర్చులకు రూ.7.50లక్షలను మంజూరు చేశారు. జూబ్లీహిల్స్ రోడ్ నెం.65లో ఇటీవలే నిర్మించిన ఇంట్లో, నీటి సరఫరా, శానిటరీ పనులతో పాటు, మదీనాగూడలోని సొంత ఫాంహౌస్‌కు భద్రత, నిర్వహణకు రూ.7.50 లక్షల నిధులను మంజూరు చేస్తూ తాజగా ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్యమంత్రి సౌకర్యార్థం నిధులు ఉపయోగించుకోవడంలో తప్పులేదు. అది ప్రభుత్వం అందించిన అతిథిగృహం లేదా క్యాంపు కార్యాలయ నిర్వహణకు ఖర్చు చేసినా ఒక అర్థం ఉంటుందని, కానీ ఇలా సొంత పనులకు ప్రజల సొమ్మును ఉపయోగించడం ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment