నోయిడా: మహిళల రుతుక్రమానికి సంబంధించిన అపోహలను తొలగించేందుకు, దీనిపై మరింత అవగాహనం పెంపొందించేందుకు యూపీలోని నోయిడాలో గల ఛాలెంజర్స్ గ్రూప్ గర్ల్స్ ఇంటర్ కాలేజ్ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది.
దీనిలో భాగంగా మహిళా సాధికారతకు చిహ్నంగా 81 అడుగుల పొడవు, 29 అడుగుల వెడల్పు కలిగిన శానిటరీ ప్యాడ్‌ను రూపొందించారు. ఛాలెంజర్స్ గ్రూప్ ట్రస్ట్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో 1200 మంది బాలికలు పాల్గొన్నారు. ఆరు వేల శానిటరీ ప్యాడ్‌లను ఉచితంగా పంపిణీ చేశారు. బహిష్టు సమయంలో పరిశుభ్రత ప్రాముఖ్యత గురించి నిర్వాహకులు బాలికలకు అవగాహన కల్పించారు.
వైద్య నిపుణురాలు శాలిని ఆధ్వర్యంలో పలు అవగాహనా కార్యక్రమాలు, క్విజ్ పోటీ, పోస్టర్ పోటీలను కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా ఛాలెంజర్స్ గ్రూప్ వ్యవస్థాపకుడు, చైర్మన్ ప్రిన్స్ శర్మ మాట్లాడుతూ మహిళలు, బాలికలకు రుతుక్రమంలో పరిశుభ్రత, ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు ‘ది పవర్ ఆఫ్ షీ’ అనే కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఛాలెంజర్స్ గ్రూప్ మురికివాడలు, పాఠశాలలు, కళాశాలలను సందర్శిస్తూ, అక్కడి బాలికలకు రుతుక్రమం సమయంలో పాటించాల్సిన పరిశుభ్రత గురించి తెలియజేస్తుందన్నారు.
ఇది కూడా చదవండి: కుటుంబ బాధ్యతల్లో బ్యాలెన్స్ అవసరం
Comments
Please login to add a commentAdd a comment