
ఘనా: ఘనా దేశ పారిశుధ్యం, నీటి వనరుల శాఖ మంత్రిగా పనిచేస్తోన్న సెసిలియా అబీనా డఫా ఇంట్లో భారీ మొత్తంలో చోరీ జరగడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. ఈ దొంగతనము గురించి బయటకు పొక్కగానే ఒక మంత్రి ఇంట్లో అంత మొతం సొమ్ము ఎలా చేరిందంటూ కొత్త ప్రశ్నలు తలెత్తాయి. దొంగ సొమ్ము దొంగల పాలైతే తప్పేంటని ప్రజలు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. దీంతో ఈ కేసులో తానిచ్చిన కంప్లైంట్ చివరికి తన మెడకే చుట్టుకున్నట్టైంది.
ఘనా ప్రభుత్వంలో పారిశుధ్యం, నీటి వనరుల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న సెసిలియా అబీనా డఫా(68) ఇంటిలో భారీ స్థాయిలో దొంగతనం జరిగింది. సుమారు ఒక మిలియన్ డాలర్లు, 3 లక్షల యూరోలు, మరో 3 లక్షల 50 వేల ఘనా కరెన్సీ నగదు 35వేల డాలర్లు, 95 వేల డాలర్ల విలువ చేసే నగలు దోచుకుని వెళ్లారు దొంగలు. అంత పెద్ద మొత్తం చోరీ జరగడంతో షాక్లో మంత్రి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది.
భారీ స్థాయి దొంగతనం కాబట్టి ఈ వార్త ఆ నోటా ఈ నోటా వేగాంగా చేరి, మంత్రి ఇంట్లో అంత పెద్ద మొత్తంలో నగదు, నగలు ఉండటమేమిటని గుసగుసలాడారు నెటిజన్లు. సోషల్ మీడియా వేదికగా ఆమెపై అవినీతి ఆరోపణలు చేశారు. పోయిన సొమ్ము గురించి కంప్లైంట్ ఇస్తే అదికాస్తా అక్రమ సంపాదన కేసుగా మారి తన మెడకే చుట్టుకోవడంతో పదవికి రాజీనామా చేశారు డఫా.
అవినీతి ఆరోపణలు, తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తడంతో బాధ్యతగా పదవి నుండి తప్పుకున్న డఫాను అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. రాజీనామా లేఖలో మా యింట్లో పోయిన నగదు మొత్తం ఎంతన్నది స్పష్టంగా చెప్పకపోవడం వల్లనే ఈ సమస్య తలెత్తిందని రాశారు డాఫా. ఇదిలా ఉండగా నానా అకుఫో అడ్డో ప్రభుత్వం ఆమె రాజీనామాను ఆమోదిస్తూ, అవినీతి ఆరోపణలపై స్పందించకపోగా మంత్రిగా ఆమె చేసిన సేవలను కొనియాడారు.
ఇది కూడా చదవండి: ఎంతకాలం అడుక్కుంటాం.. ముందు చేతిలో చిప్ప విసిరేయాలి
Comments
Please login to add a commentAdd a comment