ముసుగు వేయొద్దు మనసు మీద అంటారు.. అంటే.. మనసులో ఏం ఉంటే అది మాట్లాడాలని. ఇప్పుడు సీన్ రివర్స్... ముసుగు వేయాలి ముఖం మీద. అదేనండీ మాస్క్. అది లేకపోతే రిస్క్.. ఇక.. బ్యాగ్‌లో ఏం ఉన్నా లేకపోయినా.. శానిటైజర్ బాటిల్ ఉండాల్సిందే. పదే పదే చేతులు శుభ్రం చేసుకోవాలి. లేకపోతే రిస్క్. అంతా కరోనా తెచ్చిన తంటా. ఈ కరోనా కాలంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
తాము ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో కొందరు కథానాయికలు చెప్పారు. ఆ విశేషాలు.
ఇప్పుడు దూరమే మంచిది
-పూజా హెగ్డే
► కరోనాకి సంబంధించి ముందు బేసిక్ పాయింట్స్‌ని ఒకసారి చెప్పుకుందాం
► తరచూ చేతులు కడుక్కోవాలి
► ఫేస్ మాస్క్‌ని మరచిపోకుండా వాడాలి
► ఏదైనా వస్తువు ముట్టుకున్నాక శానిటైజర్ వాడాలి
► ఇప్పుడు ఆవిరి పట్టడం చాలా ముఖ్యం. రోజుకి రెండుసార్లు ఆవిరి పడితే మంచిది. నేను తప్పనిసరిగా రోజుకి రెండుసార్లు ఆవిరి పడుతుంటాను
► వేడినీళ్లు ఎన్ని తాగితే అంత మంచిది. మనం ఎక్కువ నీళ్లు తాగడంవల్ల మన శరీరంలో ఇన్ఫెక్షన్ తక్కువ ఉండే అవకాశం ఉంటుంది. నేను రోజుకి కనీసం మూడు లీటర్లు నీళ్లు తాగుతాను
► యోగా చాలా మంచిది... శరీరానికి, మనసుకి కూడా. నేను రోజూ చేస్తాను
► బత్తాయి, ఆరెంజ్ లాంటి సిట్రస్ ఫ్రూట్స్ మేలు చేస్తాయి. లేకపోతే విటమిన్ సి ట్యాబ్లెట్లు వాడాలి. డాక్టర్ సలహా మేరకు ట్యాబ్లెట్లు తీసుకోవాలండోయ్. నేను రోజూ ఎక్కువగా పండ్లు తింటాను
► షూటింగ్‌కి వెళ్లేటప్పుడు తప్పకుండా శానిటైజర్ తీసుకెళతాను. అలాగే అందరికీ దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తాను. అది నాకూ మంచిది. లొకేషన్‌లో ఉండేవాళ్లకీ మంచిది షూటింగ్ లొకేషన్‌లో ఉన్నప్పుడు కాటన్ రుమాలుని మాస్క్‌లా వాడతాను
► నేను ఉండే వ్యానిటీ వ్యాన్ బయట శానిటైజర్ ఉండేలా చూసుకుంటాను. వ్యాన్‌లోకి వచ్చేవాళ్లు చేతులను శానిటైజర్‌తో శుభ్రం చేసుకున్నాకే వస్తారు
► షూటింగ్ ముగించుకుని ఇంటికి రాగానే ఆవిరి తీసుకుంటాను. వేడి నీళ్లతో స్నానం చేస్తాను ∙ఒక నటిగా అన్ని సమయాల్లో మాస్క్ ధరించడం చాలా కష్టం. కెమెరా ముందుకు వెళ్లినప్పుడు మాస్క్ తీసేస్తాం. ► కరోనా వైరస్ వ్యాప్తిని నివారించడానికి అన్ని జాగ్రత్తలూ తీసుకునే, షూటింగ్స్ చేస్తున్నాం.
ఆరోగ్యమే గొప్ప సంపద
-రాశీ ఖన్నా
► ప్రస్తుతం నాగచైతన్యతో నటిస్తున్న ‘థ్యాంక్యూ’ సినిమా షూటింగ్ చేస్తూ ఇటలీలో ఉన్నాను ∙కోవిడ్ నిబంధనలను చాలా స్ట్రిక్ట్‌గా పాటిస్తున్నాం. మాస్కులు ధరించి షూటింగ్‌కి రావాలనే నిబంధనను అందరం ఫాలో అవుతున్నాం
► లొకేషన్లో వీలున్న చోటల్లా శానిటైజర్లు ఏర్పాటు చేశారు. అలాగే లొకేషన్‌ని తరచూ శానిటైజ్ చేయిస్తున్నారు
► ఎన్ని చేసినా కెమెరా ముందుకి వెళ్లగానే మేం ఆర్టిస్టులు మాస్కులు తీయాల్సిందే
► నా వ్యక్తిగత విషయానికొస్తే.. మొదట్నుంచీ నాకు ఆరోగ్యం మీద శ్రద్ధ ఎక్కువ. అందుకే ఇప్పుడు ప్రత్యేకంగా ఏమీ చేయడంలేదు ఇప్పుడనే కాదు.. ఎప్పట్నుంచో వేడి నీళ్లు తాగడం నా అలవాటు
► నేను శాకాహారిగా మారి, ఏడాదిన్నర అయింది. దానివల్ల చాలా హాయిగా ఉంది
► ఇప్పుడు అందరూ చేయాల్సిన పనేంటంటే.. ఫిట్‌గా ఉండటం. వైరస్ మనల్ని ఎటాక్ చేస్తే తట్టుకునేంత శక్తి మన దగ్గర ఉండాలి. మంచి ఆహారపుటలవాట్లు మన రోగ నిరోధక శక్తిని పెంచుతాయి
► పెద్ద పెద్ద వ్యాయామాలు చేయడానికి కుదరకపోతే రోజుకి కనీసం 20 నిమిషాలైనా నడవాలి ∙తప్పించలేని పనులుంటే బయటకు వెళ్లక తప్పదు. పని లేకపోతే వెళ్లొద్దు
► ఈ కరోనా వల్ల మనషుల మనుగడ ప్రశ్నార్థకం అయింది. ఈ పోటీ ప్రపంచంలో ఇన్నాళ్లూ పరుగులు పెట్టాం. ఇప్పుడు ఆగి, ఆలోచించాల్సిన అవసరం ఉంది. సంపాదనలోనే ఆనందం ఉందనే భ్రమను తొలగించుకుందాం. ఆరోగ్యమే గొప్ప సంపద అనే విషయాన్ని గ్రహిద్దాం
► ఇప్పటివరకూ ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని పాటించినవాళ్లు ఓకే. లేనివాళ్లు మాత్రం లైఫ్‌స్టయిల్‌ని మార్చుకోవాలి
► ఫైనల్‌గా ఒక మాట చెబుతాను. తప్పనిసరిగా మాస్క్ ధరించండి. మీరు క్షేమంగా ఉండండి. ఇతరులకూ అదే క్షేమం!
ఆ ధోరణి మారాలి
-నభా నటేష్
► ప్రజలు కరోనా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది
► కచ్చితంగా మాస్క్‌లు ధరించడం, భౌతిక దూరం పాటించడం, చేతులను శుభ్రంగా కడుక్కోవడం వంటి ప్రాథమిక నియమాలను అలవాటు చేసుకోవాలి
► కరోనా మహమ్మారి మనల్ని ఏడాదికి పైగా బాధపెడుతున్నా మనలోని కొందరు ఇంకా కరోనా జాగ్రత్తలను పాటించే విషయంలో నిర్లక్ష్యంగానే ఉన్నారు. ఆ ధోరణిని మార్చుకోవాలి
► ఈ కరోనా సమయంలోనూ నేను షూటింగ్‌లో పాల్గొంటున్నాను. అయితే అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాను
► నేనే కాదు.. నా వ్యక్తిగత సిబ్బంది కూడా చాలా జాగ్రత్తగా ఉంటున్నారు
► షూటింగ్ లొకేషన్లో అందరూ మాస్కులు ధరిస్తున్నారు. భౌతిక దూరం పాటించే మాట్లాడుకుంటున్నాం
► షూటింగ్‌లో భాగంగా కొన్ని వస్తువులను తాకాల్సి వస్తుంది. సో.. ఎప్పటికప్పుడు చేతులను శానిటైజర్‌తో క్లీన్ చేసుకుంటున్నాను
► అందరూ రోగనిరోధక శక్తిని పెంచే ఆహారం తీసుకోవాలి
► రోజులో కాస్త సమయం వ్యాయామానికి కేటాయించాలి
► నేను తప్పకుండా వ్యాయామం చేస్తాను, మంచి ఆహారం తీసుకుంటాను. మంచి అలవాట్ల వల్ల శక్తి అధికంగా ఉండే రోగాల నుంచి కాస్త దూరంగా ఉండొచ్చనేది నా భావన
► కరోనా వల్ల అన్ని రంగాలూ చాలా నష్టపోయాయి. ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు వస్తున్నాయనుకుంటే సెకండ్ వేవ్ రూపంలో మళ్లీ కరోనా విజృంభిస్తోంది. వైరస్‌తో ప్రయాణం చేస్తున్నామని మరచిపోకండి. జాగ్రత్తగా ఉండండి.
మాస్క్ లేకపోతే రిస్క్
Published Sun, Apr 25 2021 3:38 AM | Last Updated on Sun, Apr 25 2021 7:14 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment