
పీరియడ్స్ లేదా ఋతుచక్రం అనేది మహిళలకు, ముఖ్యంగా చదువుకునే వయసులో ఆడపిల్లలకు ఎంత బాధాకరమో చాలా కొద్దిమందికే తెలుసు. ఆ నాలుగు రోజులు అనుభవించే శారీరక బాధలు కంటే.. సామాజికంగా అనుభించే క్షోభే దుర్భరమైంది. ఉత్తర ప్రదేశ్‌లో జరిగిన దారుణం ఈ విషయాన్నే మరోసారి గుర్తు చేసింది. 11 ఏళ్ల బాలికపట్ల అమానవీయంగా వ్యవహరించిన ఘటన విమర్శలకు దారితీసింది.
ఉత్తరప్రదేశ్‌లోని బాలికల పాఠశాలలో 11వ తరగతి చదువుతున్న విద్యార్థి ఎంతో ఉత్కంఠతో పరీక్ష రాయడానికి వచ్చింది. సరిగ్గా ఈ సమయంలోనే ఆమెకు పీరియడ్స్ స్టార్ట్ అయింది. (చాలా మంది అమ్మాయిలకు ఇలాంటి సమస్య ఎదురౌతుంది. పరీక్ల ఒత్తిడి వల్ల రావాల్సిన సమయం కంటే ముందే మెన్సస్ సైకిల్ మొదలువుతుంది. ఈ సమయంలో వారు పడే కష్టాలువేదన వర్ణనాతీతం) టైం కంటే ముందే రావడంతో ప్రిపేర్డ్‌గాలేని బాలిక శానిటరీ ప్యాడ్‌కోసం ప్రిన్సిపాల్‌ను అడిగింది. సానుభూతి చూపించి సహాయం చేయడానికి బదులుగా ఆమేదో పెద్ద నేరంచేసినట్టు వ్యవహరించారు. దాదాపు గంటపాటు క్లాస్ రూం వెలుపల నిలబెట్టేశారు. శనివారం చోటు చేసుకున్న ఈ అమానుష ఘటనపై నెట్టింట తీవ్ర ఆగ్రహం వ్యక్తమౌతోంది.
ఒక పక్క పీరియడ్స్..కాళ్లు, నడుము నొప్పితోపాటు రక్త స్రావం పెరుగుతూ ఉంటుంది. ఈ బాధలకంటే. దుస్తులకు ఎక్కడ రక్తపు మరకలు అంటు కుంటాయో అన్న బెంగ, భయం. ఇవన్నీ ఇలా ఉంటే.. గంటసేపు బయటనిలబెట్టడంతో అవమాన భారంతో ఆ బాలిక ఎంత వేదన పడి ఉంటుందో అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.
మరోవైపు బాలిక తండ్రి ఫిర్యాదుతో సంఘటనపై అధికారిక విచారణ జరుగుతోంది.జిల్లా మేజిస్ట్రేట్, డిస్ట్రిక్ట్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ (DIOS), రాష్ట్ర మహిళా కమిషన్ , మహిళా సంక్షేమ శాఖకు అధికారికంగా ఆయన ఫిర్యాదు చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. విచారణ జరుగుతోందని జిల్లా ఇన్‌స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ దేవ్‌కీ నందన్ ధృవీకరించారు. విచారణ అనంతరం, వాస్తవాల ఆధారంగా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
చదవండి: చదివింది 10వ తరగతే..ముగ్గురు పిల్లలు : అట్టడుగు స్థాయినుంచి వ్యాపారవేత్తగా
చాలా కాస్ట్లీ గురూ! ఉప్పు పేరు చెబితేనే గూబ గుయ్య్..!
Comments
Please login to add a commentAdd a comment