processing
-
ఈపీఎఫ్‌వో క్లెయిమ్ ప్రాసెసింగ్.. ఇప్పుడు మేలు!
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) క్లెయిమ్‌ల ప్రాసెసింగ్‌లో ఇటీవల గణనీయమైన పెరుగుదలను సాధించింది. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది ఆగస్టు, సెప్టెంబరులో ఇది సుమారు 30 శాతం పెరిగింది. దీనంతటికీ కారణం ఈపీఎఫ్‌వో ఇటీవల అమలు చేసిన భారీ సాఫ్ట్వేర్ అప్‌గ్రేడ్. ఇది దాని డిజిటల్ ప్లాట్‌ఫామ్ సామర్థ్యాన్ని మెరుగుపరిచింది.గతంలో క్లెయిమ్‌ల పరిష్కారం నెమ్మదిగా ఉండేది. దీంతో చందాదారులు, ప్రత్యేకించి అత్యవసర ఆర్థిక అవసరాల కోసం నిధులను ఉపసంహరించుకోవాల్సిన వారు ఇబ్బందులు పడేవారు. కొత్త సాఫ్ట్వేర్ అప్డేట్తో ఇప్పుడది బాగా మెరుగుపడింది. ఈ వేగాన్ని కొనసాగించడానికి మరిన్ని హార్డ్‌వేర్ అప్గ్రేడ్లు, అదనపు సాఫ్ట్వేర్ మెరుగుదలలను కూడా ఈపీఎఫ్‌వో ప్లాన్ చేస్తోంది.ఇదీ చదవండి EPFO: కొత్త ప్రతిపాదన.. రిటైరయ్యాక భారీగా సొమ్ముసెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ (C-DAC) అభివృద్ధి చేసిన కొత్త వ్యవస్థ క్లెయిమ్ తిరస్కరణలను తగ్గించడంలో కీలకపాత్ర పోషించింది. ఇటీవలి సాఫ్ట్వేర్ అప్‌గ్రేడ్ తర్వాత, క్లెయిమ్ ప్రాసెసింగ్ వేగం, ఖచ్చితత్వం రెండింటిలోనూ మెరుగుదలను గుర్తించారు. దీంతోపాటు చందాదారులు ఉద్యోగాలు లేదా స్థానాలను మార్చినప్పటికీ, చెల్లింపు వ్యవస్థల క్రమబద్ధీకరణ, చందాదారుల రికార్డులను ఒకే చోట నిర్వహించే కేంద్రీకృత డేటాబేస్‌ను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇది రెండు నెలల్లో కార్యరూపం దాల్చనుంది. -
ఐటీఆర్ ప్రాసెసింగ్.. ఐటీ శాఖ అప్డేట్
2024-25 అసెస్మెంట్ సంవత్సరానికి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ (ITRs) ప్రాసెసింగ్‌పై ఆదాయపు పన్ను శాఖ అప్డేట్ విడుదల చేసింది. జూలై 31 నాటికి 6.21 కోట్ల ఐటీఆర్‌లు ఈ-వెరిఫై అయ్యాయి. వీటిలో 5.81 కోట్లకు పైగా ఆధార్ ఆధారిత ఓటీపీ ద్వారా వైరిఫై చేశారు.ఐటీ శాఖ ప్రకటన ప్రకారం.. ప్రస్తుత అసెస్మెంట్ సంవత్సరానికి సంబంధించి దాఖలైన ఐటీఆర్‌లలో ఇప్పటికే 2.69 కోట్ల ఐటీఆర్‌లను ప్రాసెస్ చేశారు. ఇవి మొత్తం దాఖలు చేసిన రిటర్న్స్‌లో 43.34 శాతం అని ఐటీ శాఖ పేర్కొంది.జూలై 31 గడువు నాటికి రికార్డు స్థాయిలో 7.28 కోట్ల ఐటీఆర్‌లు దాఖలు అయ్యాయి. గత సంవత్సరంతో పోలిస్తే 7.5 శాతం పెరిగాయి. ఈసారి గణనీయమైన సంఖ్యలో పన్ను చెల్లింపుదారులు కొత్త పన్ను విధానాన్ని ఎంచుకున్నారు. ఈ విధానంలో 5.27 కోట్ల ఐటీఆర్‌లు దాఖలయ్యాయి. పాత పన్ను విధానంలో 2.01 కోట్ల మంది ఐటీఆర్ ఫైల్ చేశారు. 58.57 లక్షల మొదటిసారి ఫైలర్లు ఉన్నారు. -
ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్లో కృత్రిమ మేధ!
ఆహార ప్రాసెసింగ్ రంగంలో కృత్రిమ మేధా వినియోగాన్ని వేగవంతం చేయాలని భారత్ చూస్తోంది. ఇటీవల నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ మేనేజ్మెంట్(ఎన్ఐఎప్టీఈఎం) నిర్వహించిన సమావేశంలో ఈ విషయాన్ని అధికారులు వెల్లడించారు. నిజానికి ఇది భారత్‌లో ప్రారంభ దశలోనే ఉన్నాయని అన్నారు. ఈ ఆహార ప్రాసెసింగ్ రంగంలో సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి, రైతుల ఆదాయాన్ని పెంచి, పర్యావరణ ప్రభావాన్ని తగ్గించడానికి కృత్రిమ మేధస్సు (ఏఐ) వినియోగాన్ని వేగవంతం చేయాలనుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. ఈ రంగంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడంపై సీనియర్ బ్యూరోక్రాట్లు, ప్రభుత్వ సలహాదారులు ఏఐ పరిష్కారాలను అమలు చేసేందుకు సరైన రోడ్‌మ్యాప్ వ్యూహం అవసరమని అన్నారు. ఈ ఎన్ఐఎప్టీఈఎం సమావేశంలో ఫుడ్ ప్రాసెసింగ్ సెక్రటరీ అనితా ప్రవీణ్ మాట్లాడుతూ.. ఒక పరిశ్రమగా మనం ఒక రోడ్‌మ్యాప్‌ను రూపొందించాలి. దీనికి ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ(ఎంఈటీవై) మద్దతు కూడా ఉంటుందని చెప్పారు. ఈ క్రమంలో నీతీ అయోగ్ సభ్యుడు రమేష్ చంద్ మాట్లాడుతూ.. సమర్థవంతమైన ఆహార ప్రాసెసింగ్‌కి ఈ "వాతావరణ స్మార్ట్" రైతు ఆదాయాలను పెంపొందించడానికి, వినియోగదారులను సంతృప్తిపరచడానికే కాకుండా పెరుగుతున్న వాతావరణ మార్పుల సవాళ్ల మధ్య పర్యావరణ ప్రభావాన్ని తగ్గించడంలో గొప్ప సహాయకారిగా ఉంటుందన్నారు. అలాగే వ్యవసాయ ఉత్పత్తుల నాణ్యతను అంచనా వేయడానికి సులభమైన పోర్టబుల్ పరికరాలను అవపసరమని, అందుకసం ఏఐని ఉపయోగించాలని చెప్పారు. అదీగాక 2070 నాటికి నికర సున్నా ఉద్గారాలను చేరుకోవాలని భారతదేశం లక్ష్యంగా పెట్టుకున్నందున ఈ ఏఐ పరిష్కారాలు మొత్తం రంగం సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయని అధికారులు తెలిపారు.ఆహార పరిశ్రమలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ..ఆహార రంగంలో కృత్రిమ మేధస్సు అనేది ఆహార ఉత్పత్తి, ఖచ్చితమైన వ్యవసాయం, నాణ్యత నియంత్రణ, వ్యక్తిగతీకరించిన పోషణ, సరఫరా గొలుసు నిర్వహణ కస్టమర్ అనుభవాన్ని మెరుగుపరచడానికి సాంకేతికతలు, డేటా అనలిటిక్స్ అండ్ మెషిన్ లెర్నింగ్‌లను ఉపయోగించడం. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ అప్లికేషన్లు సమర్థవంతమైన ఉత్పత్తి ప్రక్రియను కొనసాగిస్తూ, ఆహార పదార్థాల నాణ్యత ప్రమాణాలను నిర్ధారించడంలో సహాయపడతాయని అర్థం.(చదవండి: ఓటింగ్ శాతం పెంచేలా..రెస్టారెంట్ల అసోసీయేషన్ కస్టమర్లకు భలే ఆపర్ అందించింది!) -
వెజి‘ట్రబుల్’కు విరుగుడు.. టమాటా, ఉల్లిపాయల ప్రాసెసింగ్‌తో దీర్ఘకాలం నిల్వ
-పల్లా రవికిరణ్, ఏపీ సెంట్రల్ డెస్క్ నిన్నటిదాకా వినియోగదారులను ఏడిపించిన టమాటా నేడు రైతన్నలతో కన్నీళ్లు పెట్టిస్తోంది! టమాటాతో పోటీగా ఎగబాకిన పచ్చి మిర్చి ధరలు సగానికిపైగా పతనమయ్యాయి! ఈదఫా ‘ఉల్లిపాయ’ బాంబు పేలటానికి సిద్ధమైంది!! సామాన్యుడిని ఠారెత్తించిన కూరగాయల ధరలు ఇప్పుడు దిగి వచ్చినా కొద్ది నెలలు దేశ ప్రజలకు చుక్కలు చూపించాయి. ఇప్పుడు ఎక్కడ చూసినా టమాటాలే. ఐదారు రోజులకు మించి నిల్వ ఉంటే పాడవుతాయి. అకాల వర్షాలకు ఉల్లిపాయలు కుళ్లిపోతాయి. చాలాసార్లు కనీస ఖర్చులు కూడా దక్కకపోవడంతో టమాటాలను రోడ్లపై పారబోసి నిరసన తెలిపిన ఘటనలున్నాయి. అయితే అనావృష్టి లేదంటే అతివృష్టి..! మరి ఏం చేయాలి? సీజన్లో సద్వినియోగం.. వాతావరణ మార్పుల కారణంగా అకాల వర్షాలతో ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లడం నిజమే అసలు కారణం సరైన నిల్వ, ప్రాసెసింగ్ సదుపాయాలు లేకపోవడమే. వరద వచ్చినప్పుడే ఒడిసి పట్టుకోవాలి! టమాటా, ఉల్లి లాంటివి కూడా సీజన్లో విరివిగా, చౌకగా లభ్యమవుతాయి. మరి సమృద్ధిగా దొరికినప్పుడు సేకరించుకుని ప్రాసెస్ చేసి వాడుకుంటే? రాష్ట్రంలో ఇప్పుడు అదే ప్రక్రియ మొదలైంది. సరైన పద్ధతిలో నిల్వ చేయడం, నాణ్యతను సంరక్షించడం కీలకం. అందుకే ప్రాసెసింగ్ యూనిట్లను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. గ్రామ స్థాయిలో పొదుపు మహిళల ద్వారా వీటిని ఏర్పాటు చేయడంతోపాటు భారీ ప్లాంట్లపై కూడా దృష్టి పెట్టింది. ఒకవైపు ధరలు పతనమైనప్పుడు మార్కెట్ జోక్యంతో అన్నదాతలను ఆదుకుంటూనే మరోవైపు వీటిని అందుబాటులోకి తెస్తోంది. దీనివల్ల ధరల మంటకు, దళారుల దందాకు తెర పడుతుంది! ఈ ఫొటోలో కనిపిస్తున్న మహిళ పేరు షేక్‌జుబేదా బీ. పొదుపు సంఘంలో సభ్యురాలు. కర్నూలు జిల్లా కల్లూరు మండలం తడకనపల్లెకు చెందిన ఈమె ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ సహకారంతో టమాటా, ఉల్లిపాయల ప్రాసెసింగ్, డ్రయ్యింగ్ ద్వారా నెలకు రూ.18,000 వరకు ఆదాయాన్ని పొందుతోంది. బ్యాంకు లోన్‌తో యంత్రాలు, షెడ్‌ను సమకూర్చుకోగా సబ్సిడీగా రూ.70,000 అందాయి. తన వాటాగా రూ.20 వేలు జత చేసింది. సోలార్ డ్రయ్యర్లు, డీ హైడ్రేషన్ యూనిట్లతో రోజూ 200 కిలోల కూరగాయలను ఇంట్లోనే ప్రాసెసింగ్ చేస్తోంది. వీటిని సరఫరా చేస్తూన్న ‘ఎస్4 ఎస్’ అనే కంపెనీ ప్రాసెసింగ్ అనంతరం తిరిగి ఆమె వద్ద నుంచి సేకరిస్తోంది. 50 కిలోలు ప్రాసెసింగ్ చేసినందుకు రూ.125 చెల్లిస్తుండగా కరెంట్ చార్జీల కింద మరో రూ.20 చొప్పున కంపెనీ ఇస్తోంది. ప్రతి నెలా రూ.4,000 బ్యాంకు కిస్తీ పోనూ నికరంగా నెలకు రూ.14,000 వరకు ఆదాయం లభిస్తోంది. డ్రయ్యర్లతో డీ హైడ్రేషన్ యూనిట్లు.. ఉద్యాన రైతులకు గిట్టుబాటు ధర, మహిళలకు స్వయం ఉపాధి కల్పించడం లక్ష్యంగా సోలార్ డ్రయ్యర్లతో కూడిన డీ హైడ్రేషన్ యూనిట్ల ఏర్పాటును రాష్ట్ర ప్రభుత్వం పెద్దఎత్తున ప్రోత్సహిస్తోంది. పైలట్ ప్రాజెక్టు కింద కర్నూలు జిల్లా తడకనపల్లిలో గతేడాది ఆగస్టులో 35 శాతం సబ్సిడీతో పది యూనిట్లు ఏర్పాటు కాగా కొద్ది రోజుల్లోనే మరిన్ని అందుబాటులోకి వచ్చాయి. రైతులకు కనీస మద్దతు ధర చెల్లిస్తూ ఇప్పటి వరకు 1,200 టన్నుల టమాటా, ఉల్లిని ప్రాసెస్ చేశారు. ఈ ఏడాది జూలైలో మరో వంద యూనిట్లను ప్రారంభించారు. పైలెట్ ప్రాజెక్టు విజయవంతం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా రూ.84 కోట్లతో 5 వేల యూనిట్ల ఏర్పాటుకు బ్యాంక్ ఆఫ్ బరోడాతో ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ అవగాహన ఒప్పందం చేసుకుంది. వీటిలో 3,500 యూనిట్లను రాయలసీమ జిల్లాల్లోనే నెలకొల్పుతున్నారు. ప్రతి 100 సోలార్ యూనిట్లను ఒక క్లసర్ కిందకు తెచ్చి రైతుల నుంచి రోజూ 20 టన్నులు టమాటా, ఉల్లిని సేకరించి రెండు టన్నుల ఫ్లేక్స్ తయారు చేయనున్నారు. కర్నూలు జిల్లా ఆదోని ప్రాంతంలో ఇప్పటికే 900 మంది లబ్ధిదారులను గుర్తించారు. సెప్టెంబరు నాటికి 500 యూనిట్ల ఏర్పాటు లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. అనంతపురం జిల్లాలోని తాడిపత్రి, కళ్యాణదుర్గం, సత్యసాయి జిల్లా తనకల్లు ప్రాంతాల్లోనూ లబ్ధిదారులను గుర్తిస్తున్నారు. పత్తికొండలో టమాటా ప్రాసెసింగ్ యూనిట్ కర్నూలు జిల్లా పత్తికొండలో రూ.10 కోట్లతో భారీ స్థాయిలో టమాటా ప్రాసెసింగ్ యూనిట్ నిర్మాణ పనులకు త్వరలో భూమి పూజ జరగనుంది. ఈ యూనిట్లో స్టోరేజీ, సార్టింగ్, గ్రేడింగ్ సదుపాయాలు కల్పిస్తున్నారు. పల్పింగ్ లైన్, డీ హైడ్రేషన్ లైన్ ఉంటాయి. కెచప్, జామ్, గ్రేవీ లాంటి అదనపు విలువతో కూడిన ఉత్పత్తులు తయారవుతాయి. రాజంపేటలో రూ.294.92 కోట్లతో, నంద్యాలలో రూ.165.32 కోట్లతో ఇంటిగ్రేటెడ్ గుజ్జు, ఐక్యూఎఫ్ (టమాటా) పరిశ్రమలను ఏర్పాటు చేస్తున్నారు. రైతన్నకు ‘మద్దతు’.. మహిళలకు ఉపాధి ఉల్లి, టమాటా రైతులకు ఏడాది పొడవునా గిట్టుబాటు ధరలతో పాటు పొదుపు సంఘాల మహిళలకు స్వయం ఉపాధి కల్పన లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా సోలార్ డీ హైడ్రేషన్ యూనిట్ల ఏర్పాటును ప్రోత్సహిస్తున్నాం. కర్నూలు జిల్లాలో పైలట్ ప్రాజెక్టు కింద నెలకొల్పిన 100 యూనిట్లు విజయవంతం కావడంతో సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.84 కోట్ల అంచనాతో 5 వేల యూనిట్లను ఏర్పాటు చేస్తున్నాం. ఈమేరకు బ్యాంక్ ఆఫ్ బరోడాతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాం. ఒక్కో యూనిట్ రూ.1.68 లక్షల అంచనాతో ఏర్పాటు చేస్తున్నాం. లబ్ధిదారుల గుర్తింపు చురుగ్గా సాగుతోంది. – ఎల్.శ్రీధర్‌రెడ్డి, సీఈవో, ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ -
ఫుడ్ ప్రాసెసింగ్ రంగంతోనే రైతుల ఆర్థిక ప్రగతి: మంత్రి కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: అమెరికా పర్యటనలో ఉన్న రాష్ట్ర ఐటీ, పరిశ్ర మల శాఖ మంత్రి కె. తారక రామా రావు ఆదివారం షికాగోలో ఫుడ్ ప్రాసె సింగ్ రంగంపై అధ్య యనం చేశారు. ఇందులో భాగంగా పలు కంపెనీల ప్రతినిధుల తో పెట్టుబడులకు సంబంధించి వరుస సమావేశాలు నిర్వహించారు. ‘‘షికాగో ఫుడ్ స్టాప్‘ను సందర్శించి అక్కడ వరల్డ్ బిజినెస్ షికాగో సంస్థ ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లా డారు. షికాగో ఫుడ్ స్టాప్‌లో ఏర్పాటు చేసిన అనేక షాపులను పరిశీలించారు. స్థానిక వ్యాపారవేత్తలతో సంభాషించారు. షికాగో అనుసరిస్తున్న ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ, ఫుడ్ ప్రొక్యూర్మెంట్ పద్ధతులపైన చర్చించారు. షికాగో ఫుడ్ స్టాప్ ఇన్నోవేషన్ ఈకో సిస్టం వ్యవస్థను తెలంగాణలో ఏర్పాటు చేసేందుకు సంసిద్ధంగా ఉన్నామని కేటీఆర్ తెలిపారు. షికాగో ఫుడ్ స్టాప్ మాదిరి తెలంగాణలో కూడా.. షికాగో ఫుడ్ స్టాప్ మాదిరిం ఫుడ్ ప్రాసెసింగ్ పురోగతికి తెలంగాణ ఫుడ్ స్టాప్ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తామని కేటీఆర్ వెల్లడించారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఇన్నో వేషన్ ప్రాధాన్యత ఎంతగానో ఉందని, ఇది కేవలం ఫుడ్ ఇండస్ట్రీకి మాత్రమే కాకుండా వ్యవసాయ రంగంపైన ఆధార పడిన రైతులు, వ్యవసాయ సంబంధిత పరిశ్రమల్లోని భాగస్వాముల అభివృద్ధికి కూడా ఉపయోగపడుతుందని వివరించారు. ఫుడ్ ఇన్నోవేషన్ హబ్‌గా మారేందుకు కావలసిన అన్ని రకాల అవకాశాలు తెలంగాణలో ఉన్నాయన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ బలోపేతానికి.. ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమను బలోపేతం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపట్టిందన్నారు. ఆ మేరకే తెలంగాణ రాష్ట్రానికి ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో భారీ ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు. కోకా కోల, పెప్సీకో, ఐటీసీ వంటి దిగ్గజ సంస్థలు తెలంగాణ రాష్ట్రంలో పెట్టిన పెట్టుబడుల గురించి ప్రస్తావించారు. తెలంగాణ రాష్ట్రం ఫుడ్ ప్రాసెసింగ్ రంగం అభివృద్ధి కోసం పదివేల ఎకరాలకు పైగా కేటాయించి ప్రత్యేక ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లను ఏర్పాటు చేస్తున్న విషయాన్ని కేటీఆర్ వివరించారు. నిజామాబాద్ ఐటీ హబ్‌లో క్రిటికల్ రివర్ సంస్థ నిజామాబాద్ ఐటీ హబ్ లో అమెరికాకు చెందిన క్రిటికల్ రివర్ సంస్థను ఏర్పాటు చేసేందుకు ఆ కంపెనీ ప్రతినిధులు అంగీకరించిన్నట్లు బీఆర్ఎస్ ఎన్నారై సెల్ కోఆర్డినేటర్ మహేష్ బిగాల తెలిపారు. -
టాక్స్ రిఫండ్స్: పన్ను చెల్లింపుదారులకు శుభవార్త!
Income tax refund: ఆదాయపు పన్ను రిటర్న్‌లు (ITRలు) దాఖలు చేసిన తర్వాత టాక్స్ రిఫండ్స్ విషయంలో ఆదాయపన్ను కీలక నిర్ణయం తీసుకోనుంది. దీనికి సంబంధించిన యావరేజ్ ప్రాసెసింగ్ సమయాన్ని తగ్గించాలని ఆదాయపు పన్ను శాఖ యోచిస్తోంది. ప్రస్తుతం ఉన్న 16 రోజుల నుంచి 10 రోజులకు తగ్గింపుపై పన్ను శాఖ ఆలోచిస్తోంది. అంతేకాదు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే కొత్త టైమ్‌లైన్‌ను అమలు చేయాలని భావిస్తున్నట్లు ఒక నివేదిక పేర్కొంది. కాగా 2022-23 ఆర్థిక సంవత్సరానికి పెనాల్టీ లేకుండా ఐటీఆర్ ఫైల్ చేసేందుకు గడువుజూలై 31, 2023తో ముగిసిన సంగతి తెలిసిందే. తాజా లెక్కల ప్రకారం చాలామంది ఇప్పటికే ఐటీఆర్ ఫైల్ చేసిన పన్ను చెల్లింపుదారులు టాక్స్ రిఫండ్స్ దాదాపు అందుకున్నారు. అయితే మరికొంతమంది మాత్రం టాక్స్ రిఫండ్ కోసం ఇప్పటికీ ఎదురుచూస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు తాజా రిపోర్టుల ద్వారా తెలుస్తోంది.వార్షిక ITRను ఫైల్ చేసేటప్పుడు అసెస్సీ ఉపయోగించే ఎంపికపై ఆధారపడి, రీఫండ్ ఎలక్ట్రానిక్ మోడ్ అంటే ఖాతాకు నేరుగా క్రెడిట్ లేదా రీఫండ్ చెక్ ద్వారా గానీ చెల్లిస్తారు. ఈ రీఫండ్ ప్రాసెస్‌ను సంబంధిత పోర్టల్‌లో చెక్ చేసుకోవచ్చు. రీఫండ్ ఆలస్యం అయితే ఏమి చేయాలి? ప్రతిస్పందన కోరుతూ ఆదాయపు పన్ను శాఖ నుండి ఏదైనా కమ్యూనికేషన్ వచ్చిందా లేదా అని ఈమెయిల్లో చెక్ చేసుకోవాలి ఒక వేళా అలాంటి ఇమెయిల్ ఎదైనా వస్తే వీలైనంత త్వరగా ప్రతిస్పందించడం చాలా ముఖ్యం. ఒకవేళ ITR స్టేటస్ రీఫండ్ గడువు ముగిసినట్లు చూపితే, 90 రోజుల చెల్లుబాటు వ్యవధిలోపు చెల్లింపు కోసం వాపసు సమర్పించబడలేదని అర్థం.ఈ సందర్బంగా టాక్స్‌పేయర్ రీఫండ్ రీ-ఇష్యూ రిక్వెస్ట్ పంపవచ్చు. రీఫండ్ స్టేటస్‌పై చాలా క్వెరీలువస్తున్నాయని, ఇ-ఫైలింగ్ తర్వాత తిరిగి చెల్లించాల్సిన పన్ను చెల్లింపుదారులకు చెల్లింపును వేగవంతం లోకి ఇది మంచి చర్య అని క్లియర్ ఫౌండర్సీఈవో అర్చిత్ గుప్తా అన్నారు. ఈఏడాది పెద్ద సంఖ్యలో పన్ను చెల్లింపుదారులు సకాలంలో దాఖలు చేశారని (31 జూలై 2023 వరకు 6.77 కోట్ల ఐటీఆర్‌లు) అందువల్ల వాపసులను త్వరగా ప్రాసెస్ చేస్తారనే అంచనా ఉందన్నారు. -
ఐటీఆర్‌ల ప్రాసెసింగ్ వేగవంతం చేయండి
న్యూఢిల్లీ: ఆదాయ పన్ను రిఫండ్ల (ఐటీఆర్) ప్రాసెసింగ్‌ను, రిఫండ్ల జారీని వేగవంతం చేయడంపై మరింతగా దృష్టి పెట్టాలని ఐటీ అధికారులకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సూచించారు. అలాగే ఫిర్యాదులను కూడా సత్వరం పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని పేర్కొ న్నారు. సీబీడీటీ అధికారులకు అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఆమె సంక్లిష్టమైన, ప్రత్యేకమైన కేసులేవైనా ఉంటే న్యాయస్థానానికి పంపే వి« దానాన్ని కూడా పరిశీలించాలని సూచించారు. అవసరమైతే సీబీడీటీ (కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బో ర్డు) ఏడాదిలో ఒక వారం రోజుల పాటు కేసుల పరిష్కరణకు కేటాయించవచ్చని మంత్రి పేర్కొన్నారు. ప్రత్యక్ష పన్ను వసూళ్లు 23 శాతం అప్ : ప్రత్యక్ష పన్ను వసూళ్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఇప్పటి వరకూ నికర 23 శాతం పెరిగి 7.04 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డ్ (సీబీడీటీ) డైరెక్టర్ నితిన్ గుప్తా ఈ వివరాలను ఐటీ అధికారుల అవార్డు ప్రదాన కార్యక్రమంలో తెలియజేశారు. 2021–22లో ఆదాయపు, కార్పొరేట్ పన్ను వసూళ్లు భారీగా రూ.14.09 లక్షల కోట్లుగా నమోదయినట్లు పేర్కొన్నారు. ఆదాయపు పన్ను ఈ–ఫైలింగ్ పోర్టల్‌లో లోపాలు దాదాపు తొలగిపోయినట్లు తెలిపారు. జూలై 31వ తేదీ నాటికి 5.83 కోట్ల పన్ను రిటర్న్స్ ఈ పోర్టల్ ద్వారా దాఖలయినట్లు పేర్కొన్నారు. రికార్డు స్థాయిలో ఒక్కరోజులో 72 లక్షల రిటర్న్స్ దాఖలయినట్లు కూడా వెల్లడించారు. 2021–22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వేతన జీవుల ఐటీఆర్ దాఖలు తుదిగడువు జూలై 31వ తేదీతో ముగిసిన సంగతి తెలిసిందే. కాగా, ఐటీ రిఫండ్స్ ఇప్పటి వరకూ రూ.1.41 లక్షల కోట్లు జరిగినట్లు వెల్లడించిన గుప్తా, గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే ఈ విలువ 83 శాతం పెరిగినట్లు వెల్లడించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రత్యక్ష పన్ను వసూళ్ల లక్ష్యాన్ని రూ.14.20 లక్షల కోట్లుగా కేంద్ర బడ్జెట్ నిర్దేశించుకున్న సంగతి తెలిసిందే. ఇందులో కార్పొరేట్ పన్ను వసూళ్ల అంచనా రూ.7.20 లక్షలుకాగా, వ్యక్తిగత పన్ను వసూళ్ల అంచనా రూ.7 లక్షల కోట్లు. -
‘గ్రీన్‌కార్డు’ సిఫార్సుల్లో కీలక కదలిక
వాషింగ్టన్: గ్రీన్ కార్డ్ దరఖాస్తుల ప్రాసెసింగ్, కేటాయింపు సమయాన్ని ఆర్నెల్లకు కుదించడంతో పాటు పెండింగ్ దరఖాస్తులన్నింటినీ 2023 ఏప్రిల్ కల్లా క్లియర్ చేయాలన్న సిఫార్సులపై అమెరికా దృష్టి నిశితంగా సారించింది. ఇవి ప్రస్తుతం డొమెస్టిక్ పాలసీ కౌన్సిల్ పరిశీలనలో ఉన్నాయి. అక్కడ ఆమోదం పొందితే తుది నిర్ణయం కోసం అధ్యక్షుడు జో బైడెన్ వద్దకు వెళ్తాయి. ఈ సిఫార్సులు అమలుకు నోచుకుంటే వేలాదిమంది భారతీయులకు లబ్ధి చేకూరనుంది. ఆసియా అమెరికన్లు తదితరులకు సంబంధించిన సలహా కమిషన్ గత మే నెలలో ఈ కీలక సిఫార్సులు చేయడం తెలిసిందే. భారతీయ మూలాలున్న పారిశ్రామికవేత్త అజయ్ జైన్ భుటోరియా కమిషన్ తొలి భేటీలో ఈ ప్రతిపాదనలు చేయగా ఏకగ్రీవ ఆమోదం లభించింది. బైడెన్‌కు భుటోరియా తొలినుంచీ గట్టి మద్దతుదారు. -
లాక్డౌన్ నుంచి వీటికీ మినహాయింపు
సాక్షి, న్యూఢిల్లీ: లాక్డౌన్ నుంచి మరికొన్ని రంగాలకు మినహాయింపునిస్తూ కేంద్రం శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. గతంలో ప్రకటించిన మినహాయింపులకు అదనంగా ఇవి ఉంటాయని పేర్కొంది. గ్రామీణ ప్రాంతాల్లో నిర్మాణ కార్యక్రమాలు, నీటి సరఫరా, పారిశుద్ధ్య రంగానికి చెందిన నిర్మాణ పనులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు, కో ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీల కార్యకలాపాలకు తాజాగా అనుమతినిచ్చింది. కలపేతర అటవీ ఉత్పత్తుల సేకరణ, కొనుగోలు, ప్రాసెసింగ్.. తదితరాలకు కూడా అనుమతినిచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లోని నిర్మాణ పనుల్లో.. విద్యుత్ స్తంభాలు, విద్యుత్ లైన్లు, టెలికం ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ ఏర్పాటు.. మొదలైనవి ఉన్నాయి. హౌజింగ్ ఫైనాన్స్ సంస్థలు, మైక్రో ఫైనాన్స్ సంస్థలు కొద్దిపాటి సిబ్బందితో పనులు చేసుకోవచ్చు. వెదురు, కొబ్బరి, వక్క, కొకొవా తదితర ఉత్పత్తుల ప్లాంటేషన్, ప్యాకేజింగ్, అమ్మకం, మార్కెటింగ్ మొదలైన పనులను ఈ లాక్డౌన్ కాలంలో చేసుకోవచ్చు. -
మునగ సాగు–మార్కెటింగ్‌పై అధ్యయన యాత్ర
మునగ సాగు పద్ధతులు, ప్రాసెసింగ్ సదుపాయాలు, వ్యాపారావకాశాలపై తమిళనాడులో ఈ నెల 29–30 తేదీల్లో తమిళనాడు కౌన్సిల్ ఫర్ ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో అధ్యయన యాత్ర జరగనుంది. తమిళనాడు వ్యవసాయ వర్సిటీ పెరియకుళం, కోయంబత్తూరు క్యాంపస్‌లతో పాటు ఐదారు చోట్లకు వెళ్లి రైతులు, శాస్త్రవేత్తలు, డీలర్లు, ఎగుమతి వ్యాపారులతో ముఖాముఖి కార్యక్రమాలు ఉంటాయి. ఆసక్తి గలవారు ఈ నెల 22లోగా ప్రాజెక్టు ఆఫీసర్ డా. టి. లతను సంప్రదించి పేర్లు రిజిస్టర్ చేసుకోవచ్చు. 94431 59345, 94875 59345, taced1992@gmail.com -
అమెరికాలో ఎంఎస్ చదవాలంటే?
ఎంఎస్ ఇన్ యూఎస్..! ఆ అవకాశం లభిస్తే.. భవిష్యత్తు బంగారుమయమనే భావన! దీనికోసం ఎన్నో ప్రయత్నాలు.. కోర్సు మూడో ఏడాది నుంచే కసరత్తు ప్రారంభం! ఎన్ని ప్రయత్నాలు చేసినా.. ప్రవేశం ఖరారయ్యేది మాత్రం కొద్ది మందికే! నిరుత్సాహానికి గురయ్యే వారెందరో!! ఇందుకు వర్సిటీల ఎంపిక నుంచి వీసా ఇంటర్వ్యూ వరకు.. కారణాలెన్నో! అమెరికాలో ఎంఎస్‌లో ప్రవేశ ప్రక్రియ ఎలా ఉంటుందో తెలుసుకుందాం.. భారతీయ విద్యార్థులకు స్టడీ అబ్రాడ్ పరంగా తొలి గమ్యం.. అమెరికా. మరి ఏ కోర్సులో చేరాలనుకుంటున్నారు? అని అడిగితే.. ఠక్కున చెప్పే సమాధానం.. ఎంఎస్ (మాస్టర్ ఆఫ్ సైన్స్). ప్రఖ్యాత యూనివర్సిటీలకు నిలయమైన అమెరికా.. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల నుంచి ఏటా పది లక్షల మందికి పైగా విద్యార్థులను ఆకర్షిస్తోంది. 2016–17 గణాంకాల ప్రకారం చదువుల కోసం అమెరికాకు పయనమైన వివిధ దేశాల విద్యార్థుల సంఖ్య 10,78,822. వీరిలో భారత విద్యార్థుల సంఖ్య 1,86,267. భారతీయ విద్యార్థుల్లో ఎక్కువ మంది కోరుకునే కోర్సు ఎంఎస్. ముందస్తు కసరత్తు అమెరికాలో ఫాల్ (సెప్టెంబర్–డిసెంబర్), స్ప్రింగ్ (జనవరి–మే), సమ్మర్ (జూన్–ఆగస్ట్).. ఇలా మూడు సెషన్లలో ప్రవేశ ప్రక్రియ కొనసాగుతుంది. అధిక శాతం ప్రోగ్రామ్‌లు ముఖ్యంగా సైన్స్, ఇంజనీరింగ్ అడ్మిషన్లు ఫాల్ సెషన్లో జరుగుతాయి. విద్యార్థులు తాము చేరదలచుకున్న సెషన్‌కు కనీసం 15 నుంచి 18 నెలల ముందుగా కసరత్తు ప్రారంభించాలి. ముందుగా తమకు ఆసక్తి ఉన్న కోర్సులను అందిస్తున్న యూనివర్సిటీల జాబితా రూపొందించుకోవాలి. ఆ యూనివర్సిటీలు పేర్కొన్న అర్హత నిబంధనలు, ప్రామాణిక టెస్ట్ స్కోర్ల కనీస స్కోరింగ్ వివరాలు తెలుసుకోవాలి. ప్రతి యూనివర్సిటీకి సంబంధించి దరఖాస్తు గడువు తేదీలు కూడా వేర్వేరుగా ఉంటాయి. దీన్ని కూడా పరిగణనలోకి తీసుకొని దరఖాస్తు ప్రక్రియకు ఉపక్రమించాలి. రోలింగ్ అడ్మిషన్స్ అమెరికాలో ఎర్లీ అడ్మిషన్స్ ప్లాన్, రెగ్యులర్ అడ్మిషన్, రోలింగ్ అడ్మిషన్.. అనే మూడు పద్ధతుల్లో దరఖాస్తు చేసుకునే వీలుంది. రోలింగ్ అడ్మిషన్స్ విధానంలో దరఖాస్తుకు ఎలాంటి గడువు తేదీ ఉండదు. ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చు. నిర్ణీత సెషన్లలో సీట్లు భర్తీ కాని సందర్భాల్లో రోలింగ్ అడ్మిషన్ విధానంలో దరఖాస్తు చేసుకున్న వారికి అవకాశం కల్పిస్తారు. కాబట్టి ఒక యూనివర్సిటీకి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు.. రోలింగ్ అడ్మిషన్ సెషన్‌కు కూడా దరఖాస్తు చేసుకోవడం మంచిది. అర్హత నిబంధనలు ఎంఎస్ కోర్సుకు అమెరికాలోని యూనివర్సిటీల అర్హత నిబంధనలు వేర్వేరుగా ఉంటాయి. అధికశాతం యూనివర్సిటీలు మాత్రం 16 ఏళ్ల (10+2+4) ఎడ్యుకేషన్ విధానం ద్వారా పొందిన డిగ్రీని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటున్నాయి. కొన్ని యూనివర్సిటీలు మాత్రం 10+2 తర్వాత మూడేళ్ల వ్యవధిలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేసిన వారికి కూడా అవకాశం కల్పిస్తున్నాయి. ప్రఖ్యాత యూనివర్సిటీలు (హార్వర్డ్, ఎంఐటీ, యూసీ, కార్నెగీ మిలన్ తదితర) మాత్రం తప్పనిసరిగా 10+2+4 విధానంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేసిన వారినే అర్హులుగా పేర్కొంటున్నాయి. స్టాండర్డ్ టెస్ట్‌ల స్కోర్లు మరో ముఖ్య అర్హత నిబంధన స్టాండర్డ్ టెస్ట్ స్కోర్లు. విద్యార్థులు తాము ఎంపిక చేసుకున్న డొమైన్ ఆధారంగా జీఆర్ఈ, జీమ్యాట్, టోఫెల్ స్కోర్లు పొందడం తప్పనిసరి. అంతేకాకుండా జీఆర్ఈలో సబ్జెక్ట్ టెస్ట్ స్కోర్లను కూడా అక్కడి ప్రముఖ యూనివర్సిటీలు తప్పనిసరి చేస్తున్నాయి. జీఆర్ఈలో కనీసం 300 కుపైగా పాయింట్లు సొంతం చేసుకోవడం వల్ల అవకాశాలు మెరుగవుతాయి. జీమ్యాట్‌లో 650కు పైగా స్కోర్ ఉంటే ప్రవేశానికి మార్గం సుగమం అవుతుంది.. టోఫెల్లో కనీసం 100 స్కోర్ సొంతం చేసుకుంటే టాప్ యూనివర్సిటీల్లో ప్రవేశం లభిస్తుంది. అకడమిక్ రికార్డ్ అమెరికాలోని ప్రముఖ యూనివర్సిటీలు పేర్కొంటున్న నిబంధనల ప్రకారం పదో తరగతి నుంచి బ్యాచిలర్ డిగ్రీ వరకు 60 శాతం పైగా మార్కులు లేదా తత్సమాన జీపీఏతో ఉత్తీర్ణత తప్పనిసరి. హార్వర్డ్, ఎంఐటీ వంటి వర్సిటీల్లో ఎనిమిది జీపీఏ అవసరం అవుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని విద్యార్థులు తాము ఎంపిక చేసుకునే యూనివర్సిటీల జాబితాను రూపొందించుకోవాలి. టెస్ట్ స్కోర్‌తోపాటు మరెన్నో! అకడమిక్‌గా అద్భుతమైన ఉత్తీర్ణత శాతాలు, టెస్ట్ స్కోర్లు ఉన్నతంగా ఉన్నప్పటికీ.. మరెన్నో అంశాలు అభ్యర్థుల ప్రవేశాన్ని నిర్దేశిస్తున్నాయి. వాటిలో ప్రధానమైనవి.. లెటర్ ఆఫ్ రికమండేషన్ (ఎల్ఓఆర్), స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ (ఎస్ఓపీ). కొన్ని సందర్భాల్లో అకడమిక్, టెస్ట్ స్కోర్లను సైతం కాదని ఎల్ఓఆర్, ఎస్ఓపీ ఆధారంగా ప్రవేశాలు పొందిన వారు సైతం ఉంటున్నారంటే వీటి ప్రాధాన్యం ఏంటో అర్థం చేసుకోవచ్చు. లెటర్ ఆఫ్ రికమండేషన్ అభ్యర్థుల సామర్థ్యాన్ని గుర్తిస్తూ సంబంధిత రంగంలోని నిపుణులైన వ్యక్తులు ఇచ్చే సిఫార్సు లేఖలు.. లెటర్ ఆఫ్ రికమండేషన్. అభ్యర్థులు తాము చదువుకున్న యూనివర్సిటీ/ఇన్స్టిట్యూట్కు చెందిన ప్రొఫెసర్ల నుంచి.. వర్కింగ్ ఎగ్జిక్యూటివ్స్ వారి ఉన్నతాధికారుల నుంచి లెటర్ ఆఫ్ రికమండేషన్ తీసుకొని సమర్పించాల్సి ఉంటుంది. తమ గురించి బాగా తెలిసిన వ్యక్తులతో ఈ సిఫార్సు లేఖలు పొందడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అమెరికాలోని వర్సిటీలు ప్రస్తుతం కనీసం రెండు ఎల్‌ఓఆర్‌లను అడుగుతున్నాయి. స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ అమెరికాలో ఎంఎస్‌లో అడ్మిషన్ ఖరారు చేయడంలో అత్యంత కీలకమైంది స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్. అభ్యర్థులు అమెరికాలోని సదరు యూనివర్సిటీలోనే ఎందుకు చేరాలనుకుంటున్నారు.. నిర్దిష్టంగా ఆ కోర్సునే ఎంపిక చేసుకోవడానికి కారణాలు.. భవిష్యత్తు లక్ష్యాలు ఏంటి? అనే వివరాలు పేర్కొంటూ.. నిర్దేశిత పదాల్లో ఎస్ఓపీని సొంత మాటల్లో రాయాలి. దీన్ని యూనివర్సిటీకి సంబంధించిన అకడమిక్ నిపుణుల కమిటీ క్షుణ్నంగా పరిశీలిస్తుంది. కొన్ని సందర్భాల్లో టెస్ట్ స్కోర్లు, అకడమిక్ పర్సంటేజీలు తక్కువగా ఉన్నప్పటికీ.. ఎస్ఓపీలో అభ్యర్థి పొందుపర్చిన సమాచారం, చూపిన నిబద్ధతను పరిగణనలోకి తీసుకొని ప్రవేశం ఖరారు చేస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. ఎస్సే.. రెజ్యూమె సైతం ఇటీవల కాలంలో అమెరికాలోని పలు యూనివర్సిటీలు.. ఎస్సే (వ్యాస రచన) రాయమని కోరుతున్నాయి. దరఖాస్తు సమయంలోనే ఏదైనా ఒక అంశం పేర్కొని.. నిర్దిష్ట పదాల్లో వ్యాసం రాయమని అడుగుతున్నాయి. దరఖాస్తు ప్రక్రియ అంతా ఆన్లైన్లోనే జరుగుతుంది. అభ్యర్థుల అకడమిక్ అర్హతలు, ఇతర స్కోర్లు పొందుపరిచే విధంగా దరఖాస్తు నమూనా ఉంటుంది. అయినప్పటికీ యూనివర్సిటీలు రెజ్యూమె లేదా సీవీని కూడా అప్లోడ్ చేయమంటున్నాయి. అభ్యర్థులు అకడమిక్ అర్హతలతోపాటు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్‌లో పాల్గొన్న తీరు, ప్రాజెక్ట్ వర్క్స్ వివరాలు తెలుసుకునేందుకే సమగ్ర రెజ్యూమెను అడుగుతున్నాయి. వీసాకు దరఖాస్తు అభ్యర్థులకు ప్రవేశం ఖరారైతే.. యూనివర్సిటీ ఇచ్చే కన్ఫర్మేషన్ లెటర్ ఆధారంగా ఇమిగ్రేషన్ విభాగంలో ఐ–20 ఫామ్‌ను పూర్తిచేసి వీసాకు దరఖాస్తు చేసుకోవాలి. వీటిని పరిశీలించిన ఇమిగ్రేషన్ విభాగం అధికారులు నిర్దేశిత తేదీల్లో ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఇంటర్వ్యూ సందర్భంగా అప్రమత్తంగా వ్యవహరించాలి. కోర్సు పూర్తయ్యాక స్వదేశానికి తిరిగొచ్చేస్తామనే విధంగానే సమాధానాలు ఇవ్వాలి. అలాకాకుండా కోర్సు పూర్తయ్యాక అమెరికాలో స్థిరపడాలనే ఉద్దేశం ఉందనే అభిప్రాయం కలిగేలా సమాధానమిస్తే.. వీసా మంజూరు కష్టమే. ఇలా.. యూనివర్సిటీల అన్వేషణ నుంచి వీసా ఇంటర్వ్యూ వరకు.. అడుగడుగునా అప్రమత్తంగా వ్యవహరిస్తేనే యూఎస్‌లో ఎంఎస్ కల సాకారం అవుతుంది. 201617 గణాంకాల ప్రకారం చదువుల కోసం అమెరికాకు పయనమైన వివిధ దేశాల విద్యార్థుల సంఖ్య 10,78,822. వీరిలో భారత విద్యార్థుల సంఖ్య 1,86,267. భారతీయ విద్యార్థుల్లో ఎక్కువ మంది కోరుకునే కోర్సు ఎంఎస్. ఫీజులు.. 30 వేల నుంచి 50 వేల డాలర్లు అమెరికాలోని యూనివర్సిటీల్లో ఎంఎస్ ప్రోగ్రామ్ ఫీజులు ఏడాదికి 30 వేల డాలర్ల నుంచి 50 వేల డాలర్ల మధ్యలో ఉంటున్నాయి. ఇవి.. ఆయా యూనివర్సిటీల స్థాయి, అభ్యర్థులు ఎంపిక చేసుకున్న స్పెషలైజేషన్‌పై ఆధారపడి ఉంటాయి. హార్వర్డ్, ఎంఐటీ వంటి ప్రతిష్టాత్మక ఇన్స్టిట్యూట్లలో చదవాలంటే ఏడాదికి కనీసం 50 వేల డాలర్ల ఫీజు చెల్లించాల్సిందే. అవసరమైన డాక్యుమెంట్లు అకడమిక్ ట్రాన్స్క్రిప్ట్స్ (విద్యార్హతల సర్టిఫికెట్లు). జీఆర్ఈ/జీమ్యాట్/టోఫెల్/ఐఈఎల్టీఎస్ తదితర టెస్ట్ స్కోర్లు. లెటర్ ఆఫ్ రికమండేషన్ (ఎల్ఓఆర్). స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ (ఎస్ఓపీ). వర్క్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్(బ్యాంక్ స్టేట్మెంట్). రెజ్యూమె/సీవీ. టాప్ యూనివర్సిటీలు ఎంఎస్ కోర్సు బోధనలో అమెరికాలో టాప్ యూనివర్సిటీల వివరాలు.. హార్వర్డ్ యూనివ్సిటీ ఎంఐటీ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రిన్స్టన్ యూనివర్సిటీ యూసీ–బర్కిలీ యూనివర్సిటీ ఆఫ్ షికాగో కార్నెల్ యూనివర్సిటీ యేల్ యూనివర్సిటీ -
అతి పురాతన కంప్యూటర్...
కంప్యూటర్ అంటే... డిజిటల్ సమాచారాన్ని ప్రాసెసింగ్ చేసే యంత్రమే కాదు.. ఆటోమేటిక్‌గా లెక్కలు చేసి పెట్టేది కూడా. ఆ లెక్కన చూస్తే.. ఇది ప్రపంచంలోనే అతి పురాతన కంప్యూటర్. క్రీస్తుపూర్వం 205లో దీనిని నిర్మించారట. క్రీటే, గ్రీస్‌ల మధ్య సముద్రంలో మునిగిపోయిన నౌక శిథిలాల్లో ఇది 1901లో దొరికింది. 13 అంగుళాల పొడవు, 7 అంగుళాల వెడల్పు ఉన్న పెట్టెలో ఇది ముక్కలుగా కనిపించింది. తర్వాత పరిశోధన మొదలుపెట్టిన శాస్త్రవేత్తలు.. ఇది గ్రహాల స్థానాలు, సూర్య, చంద్రగ్రహణాల తేదీలు, సమయాలను చెప్పే కంప్యూటర్‌గా తేల్చారు. దీనికి ‘యాంటికెథైరా మెకానిజమ్’గా పేరు పెట్టి వయసును క్రీ.పూ. 125గా నిర్ణయించారు. అయితే తాజాగా మళ్లీ పరిశోధన చేపట్టిన అర్జెంటినాలోని నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ క్విల్మెస్, యూనివర్సిటీ ఆఫ్ పుగెట్ శాస్త్రవేత్తలు ఇది క్రీస్తుపూర్వం 205 లోనే నిర్మించి ఉంటారని వెల్లడించారు. ఇది బాబిలోనియన్ల కాలం నాటిదని అంచనా వేశారు.