2024-25 అసెస్‌మెంట్ సంవత్సరానికి ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ (ITRs) ప్రాసెసింగ్‌పై ఆదాయపు పన్ను శాఖ అప్‌డేట్ విడుదల చేసింది. జూలై 31 నాటికి 6.21 కోట్ల ఐటీఆర్‌లు ఈ-వెరిఫై అయ్యాయి. వీటిలో 5.81 కోట్లకు పైగా ఆధార్ ఆధారిత ఓటీపీ ద్వారా వైరిఫై చేశారు.
ఐటీ శాఖ ప్రకటన ప్రకారం.. ప్రస్తుత అసెస్‌మెంట్ సంవత్సరానికి సంబంధించి దాఖలైన ఐటీఆర్‌లలో ఇప్పటికే 2.69 కోట్ల ఐటీఆర్‌లను ప్రాసెస్ చేశారు. ఇవి మొత్తం దాఖలు చేసిన రిటర్న్స్‌లో 43.34 శాతం అని ఐటీ శాఖ పేర్కొంది.
జూలై 31 గడువు నాటికి రికార్డు స్థాయిలో 7.28 కోట్ల ఐటీఆర్‌లు దాఖలు అయ్యాయి. గత సంవత్సరంతో పోలిస్తే 7.5 శాతం పెరిగాయి. ఈసారి గణనీయమైన సంఖ్యలో పన్ను చెల్లింపుదారులు కొత్త పన్ను విధానాన్ని ఎంచుకున్నారు. ఈ విధానంలో 5.27 కోట్ల ఐటీఆర్‌లు దాఖలయ్యాయి. పాత పన్ను విధానంలో 2.01 కోట్ల మంది ఐటీఆర్ ఫైల్ చేశారు. 58.57 లక్షల మొదటిసారి ఫైలర్లు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment