‘గ్రీన్‌కార్డు’ సిఫార్సుల్లో కీలక కదలిక | White House looking into recommendations to reduce Green Cards | Sakshi

‘గ్రీన్‌కార్డు’ సిఫార్సుల్లో కీలక కదలిక

Sep 25 2022 5:57 AM | Updated on Sep 25 2022 5:57 AM

White House looking into recommendations to reduce Green Cards - Sakshi

వాషింగ్టన్‌: గ్రీన్‌ కార్డ్‌ దరఖాస్తుల ప్రాసెసింగ్, కేటాయింపు సమయాన్ని ఆర్నెల్లకు కుదించడంతో పాటు పెండింగ్‌ దరఖాస్తులన్నింటినీ 2023 ఏప్రిల్‌ కల్లా క్లియర్‌ చేయాలన్న సిఫార్సులపై అమెరికా దృష్టి నిశితంగా సారించింది. ఇవి ప్రస్తుతం డొమెస్టిక్‌ పాలసీ కౌన్సిల్‌ పరిశీలనలో ఉన్నాయి. అక్కడ ఆమోదం పొందితే తుది నిర్ణయం కోసం అధ్యక్షుడు జో బైడెన్‌ వద్దకు వెళ్తాయి.

ఈ సిఫార్సులు అమలుకు నోచుకుంటే వేలాదిమంది భారతీయులకు లబ్ధి చేకూరనుంది. ఆసియా అమెరికన్లు తదితరులకు సంబంధించిన సలహా కమిషన్‌ గత మే నెలలో ఈ కీలక సిఫార్సులు చేయడం తెలిసిందే. భారతీయ మూలాలున్న పారిశ్రామికవేత్త అజయ్‌ జైన్‌ భుటోరియా కమిషన్‌ తొలి భేటీలో ఈ ప్రతిపాదనలు చేయగా ఏకగ్రీవ ఆమోదం లభించింది. బైడెన్‌కు భుటోరియా తొలినుంచీ గట్టి మద్దతుదారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement