pending applications
-
జీవో 59తో రూ.6 వేల కోట్లు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సుమారు ఏడాది నుంచి పెండింగ్‌లో ఉన్న జీవో 59ను అమలు చేయడం ద్వారా ప్రభుత్వ ఖజానాకు పెద్ద ఎత్తున ఆదాయం రానుంది. ఈ జీవో కింద వచ్చిన 50వేలకుపైగా దరఖాస్తులను పరిష్కరించడం ద్వారా సుమారు రూ.6 వేల కోట్ల వరకు ఖజానాకు సమకూరుతుందని రెవెన్యూ శాఖ అంచనా వేసింది. ఆదాయ వనరుల సమీకరణపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘానికి దీనిపై నివేదిక కూడా సమర్పించింది. ఈ జీవో అమలును నిలిపివేయడానికి ముందువరకు రూ.534 కోట్ల ఆదాయం వచ్చిoదని.. మిగతా దరఖాస్తుల పరిష్కారం ద్వారా మరో రూ.500 కోట్లు వస్తాయని పేర్కొన్నట్టు తెలిసింది. ఇదే జీవో కింద అధిక విలువ గల భూములను క్రమబద్దీకరిస్తే ఇంకో రూ.5,500 కోట్లు వస్తాయని... జీవో 76, 118 దరఖాస్తుల పరిష్కారం ద్వారా అదనంగా రూ.300 కోట్లు అందుతాయని వివరించినట్టు సమాచారం. ఏడాది నుంచి ఎదురుచూపులే.. జీవో 59 కింద భూముల క్రమబద్దీకరణ కోసం దరఖాస్తు చేసుకున్నవారు ఏడాది నుంచి ఎదురుచూపులు చూస్తున్నారు. ఈ జీవోను అడ్డుపెట్టుకుని గత ప్రభుత్వ హయాంలో కొందరు అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలున్నా... ఎలాంటి పలుకుబడి లేని సాధారణ ప్రజలు మాత్రం వీటి పరిష్కారం ఇంకెప్పుడు అంటూ ఆందోళన చెందుతున్నారు. ఈ జీవో కింద పరిశీలన పూర్తయి డిమాండ్ నోటీసు మేరకు డబ్బులు పూర్తిగా చెల్లించినవారు, పాక్షిక మొత్తం చెల్లించినవారు, తనిఖీలు పూర్తిచేసుకున్న వారు, కన్వేయన్స్ డీడ్లు వచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం విధించిన స్టేతో ఆ భూములపై ఎలాంటి లావాదేవీలు నిర్వహించడానికి వీల్లేనివారు వేల మంది ఉన్నారు. వారంతా కాంగ్రెస్ సర్కారు నిర్ణయం పట్ల ఆశతో ఉన్నారు. అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాల్సిందేనని, అదే క్రమంలో అర్హులైన వారికి భూములపై హక్కులు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రక్రియ కొనసాగుతుండగానే.. జీవో 59 కింద ప్రభుత్వ స్థలాల క్రమబద్ధీకరణ కోసం 2022, 2023 సంవత్సరాల్లో రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో కలిపి 31 వేలు, మిగతా అన్ని జిల్లాల్లో 26 వేల వరకు.. మొత్తంగా 57 వేల వరకు దరఖాస్తులు వచ్చాయి. ఇందులో ప్రభుత్వం 32,788 దరఖాస్తులను ఆమోదించి సదరు లబ్దిదారులకు డిమాండ్ నోటీసులు జారీ చేసింది. 10వేల మందికిపైగా ప్రభుత్వం నిర్ణయించిన ధర చెల్లించి కన్వేయన్స్ డీడ్ (రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు) కూడా పొందారు. డిమాండ్ నోటీసుల మేరకు డబ్బులు కట్టినా.. కన్వేయన్స్ డీడ్లు జారీకానివారు మరో 3 వేల మందికి పైగా ఉన్నారు. ఈ ప్రక్రియ కొనసాగుతుండగానే ఎన్నికలు రావడం, ప్రభుత్వం మారడం జరిగింది. గత ఏడాది డిసెంబర్ 7న కాంగ్రెస్ సర్కారు ఏర్పాటవగా.. అదే నెల 11వ తేదీ నుంచి ఈ జీవోకు సంబంధించిన పోర్టల్‌ను నిలిపివేశారు. ఆ జీవో కింద అప్పటికే చేసిన క్రమబద్దీకరణలను నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. ఈ జీవోను అడ్డుపెట్టుకుని విలువైన భూములను బీఆర్ఎస్ నేతలు క్రమబద్ధీకరించుకున్నారనే ఆరోపణలతో ఈ చర్య తీసుకున్నట్టు ప్రకటించింది. అయితే అలాంటివన్నీ ముందే జరిగిపోయాయని... సాధారణ ప్రజల దరఖాస్తులే ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని దరఖాస్తు దారులు పేర్కొంటున్నారు. హక్కులు కల్పించని కారణంగా ఈ భూములు ఇటు తమవి కాకుండా, అటు ప్రభుత్వానివి కాకుండా మిగిలిపోతున్నాయని పేర్కొంటున్నారు. అసలు జీవో 59 ఏంటి?తెలంగాణ ఏర్పాటయ్యాక ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు కట్టుకుని ఉంటున్న పేదలకు ఆ భూములను క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు 2014 డిసెంబర్ 30న తొలిసారి జీవో 59 విడుదల చేసింది. ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. 2022, 2023 సంవత్సరాల్లో ఆ జీవోలో స్వల్ప మా ర్పులు చేస్తూ పొడిగింపు ఉత్తర్వులు జారీ చేశారు.చివరిగా 2023లో విడుదల చేసిన జీవో ప్రకారం... క్రమబద్దీకరణ కోసం 125 నుంచి 250 గజాల వరకు స్థలాలకు మార్కెట్ విలువలో 25 శాతం... 250 గజాల నుంచి 500 గజాల ఉన్న స్థలాలకు 50శాతం, 500–750 గజాల స్థలాలకు 75శాతం, 750 గజాలపైన ఉంటే మార్కెట్ విలువలో 100 శాతం సొమ్ము చెల్లించాలి. క్రమబద్దీకరణ సంబంధించిన మరో జీవో 58 ప్రకారం... 125 చదరపు గజాలలోపు భూమిలో నిర్మాణాలుంటే ప్రభుత్వం ఉచితంగా క్రమబద్దీకరిస్తుంది. తొలుత 2014 జూన్ 2 నాటికి ఆక్రమణలో ఉన్న భూములను క్రమబద్దీకరిస్తామని జీవోలో పేర్కొన్నా.. 2023లో విడుదల చేసిన జీవోలో దరఖాస్తు చేసుకునే నాటికి ఆక్రమణలో ఉన్నా క్రమబద్దీకరిస్తామని సర్కారు పేర్కొంది. -
అధిక పెన్షన్ కోసం సంస్థలకు గడువు పెంపు
న్యూఢిల్లీ: అధిక పెన్షన్ కోరుకుంటూ దరఖాస్తు చేసుకున్న ఉద్యోగుల తరఫున, వేతన వివరాలను అప్లోడ్ చేసేందుకు గడువును డిసెంబర్ 31 వరకు పొడిగించినట్టు ఈపీఎఫ్‌వో ప్రకటించింది. ఈ గడువు సెపె్టంబర్ 30తో ముగియనుండగా, సంస్థల యాజమాన్యాలు, యాజమాన్య సంఘాలు చేసిన వినతి మేరకు ఈపీఎఫ్‌వో ఈ నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా సెపె్టంబర్ 29 నాటికి 5.52 లక్షల పెన్షన్ దరఖాస్తులు యాజమాన్యాల వద్ద పెండింగ్‌లో ఉన్నట్టు ఈపీఎఫ్‌వో తెలిపింది. అధిక పెన్షన్ కోసం ఈపీఎఫ్‌వో దరఖాస్తులు ఆహా్వనించగా.. జూలై 11 నాటికి మొత్తం 17.49 లక్షల దరఖాస్తులు వ్యాలిడేషన్ ఆఫ్ ఆప్షన్/జాయింట్ ఆప్షన్ కోసం వచి్చనట్టు ఈపీఎఫ్‌వో ప్రకటించింది. ఈ దరఖాస్తుదారులకు సంబంధించి వేతన వివరాలను సంస్థలు అప్లోడ్ చేసి, తమవైపు ఆమోదం తెలియజేస్తే అప్పుడు వాటిని ఈపీఎఫ్‌వో ప్రాసెస్ చేయడానికి వీలుంటుంది. -
4 లక్షల భారతీయులు... గ్రీన్ కార్డ్ కళ్లజూడలేరు!
వాషింగ్టన్: అమెరికాలో ఉంటున్న భారతీయుల్లో 4 లక్షల మందికి పైగా తమ జీవిత కాలంలో గ్రీన్ కార్డ్ కళ్లజూడలేరని తాజా అధ్యయనం ఒకటి పేర్కొంది! ఆ లోపే వారు కన్ను మూస్తారని అభిప్రాయపడింది. అమెరికాలో ఈ ఏడాది ఉద్యోగాధారిత గ్రీన్ కార్డ్ పెండింగు దరఖాస్తులు ఏకంగా 18 లక్షలు దాటాయి. వీటిలో ఏకంగా 63 శాతం, అంటే 11 లక్షలకు పైగా భారతీయులవే! దాదాపు 2.5 లక్షలు, అంటే 14 శాతంతో చైనా రెండో స్థానంలో ఉంది. కానీ ఏటా గరిష్టంగా జారీ చేసే గ్రీన్ కార్డుల్లో ఏ దేశానికీ 7 శాతం కంటే ఇవ్వరు. ఈ నిబంధన వల్ల భారతీయులకు తీవ్ర అన్యాయం జరుగుతూ వస్తోంది. ఈ కారణంగా జీవిత కాలంలో గ్రీన్ కార్డు పొందలేని 4.24 లక్షల మందిలో ఏకంగా 90 శాతానికి పైగా భారతీయులే ఉంటారని అధ్యయనం చెబుతోంది. 83 లక్షల కుటుంబ ఆధారిత గ్రీన్ కార్డు పెండింగ్ దరఖాస్తులు వీటికి అదనం! -
సీఐసీ వద్ద 19 వేల దరఖాస్తులు పెండింగ్
న్యూఢిల్లీ: కేంద్ర సమాచార హక్కు కమిషన్ (సీఐసీ) వద్ద గత ఏప్రిల్ నాటికి 19,233 దరఖాస్తులు, అప్పీళ్లు పెండింగ్‌లో ఉన్నాయని కేంద్రం బుధవారం లోక్‌సభకు తెలిపింది. పది మంది సభ్యులుండే సీఐసీలో నాలుగు ఖాళీలు ఉన్నాయని కేంద్ర సిబ్బంది వ్యవహారాల సహాయమంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. 2021–22లో 29,213 దరఖాస్తులు, 2020–21లో 35,178 , 2018–19లో 29,655 పెండింగ్‌లో ఉన్నాయని వివరించారు. -
Collegium Controversy: ఇబ్బందికరంగా కేంద్రం తీరు
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా గత డిసెంబర్లో కొలీజియం సిఫార్సు చేసిన ఐదు పేర్లను త్వరలో ఆమోదించనున్నట్టు కేంద్రం పేర్కొంది. రాజస్తాన్, పట్నా, మణిపూర్ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు జస్టిస్ పంకజ్ మిత్తల్, జస్టిస్ సంజయ్‌కరోల్, జస్టిస్ పి.వి.సంజయ్ కుమార్‌తో పాటు పట్నా హై కోర్టు న్యాయమూర్తి జస్టిస్ అష్నదుద్దీన్ అమానుల్లా, అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మనోజ్ మిశ్రా వీరిలో ఉన్నారు. కొలీజియం సిఫార్సులను కేంద్రం పెండింగ్‌లో పె డుతున్న వైనంపై విచారణ జరుపుతున్న జస్టిస్ ఎస్.కె.కౌల్, జస్టిస్ ఏఎస్ ఓకా ధర్మాసనానికి అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి శుక్రవారం ఈ మేరకు సమాచారమిచ్చారు. ‘‘ఆ ఐదు సిఫార్సులు గత డిసెంబర్ 13న చేసినవి. ఇప్పుడు ఫిబ్రవరి వచ్చింది’’ అని ధర్మాసనం గుర్తు చేయగా, ఆదివారానికల్లా నియామక ఉత్తర్వులు రావచ్చని బదులిచ్చారు. కోర్టులపై దాడి పరిపాటైంది: జస్టిస్ కౌల్ కొలీజియం సిఫార్సులను తొక్కిపడుతున్న తీరుపై ధర్మాసనం ఈ సందర్భంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హైకోర్టు న్యాయమూర్తుల నియామకం, బదిలీల సిఫార్సు సంగతేమిటని ప్రశ్నించింది. అందుకు ఇంకాస్త సమయం పడుతుందని ఏజీ చెప్పగా మండిపడింది. ‘‘ఇది చాలా చాలా సీరియస్ అంశం. ఈ విషయంలో కేంద్రం వైఖరి మమ్మల్ని ఎంతగానో ఇబ్బంది పెడుతోంది. బదిలీ సిఫార్సులను కూడా పెండింగ్‌లో పెడితే మేమింకేం చేయాలని మీరు ఆశిస్తున్నట్టు? మీరు ఉత్తర్వులిచ్చే దాకా సదరు న్యాయమూర్తులు చేతులు ముడుచుకుని కూర్చోవాలా? మీరదే కోరుకుంటున్నారా?’’ అంటూ తీవ్ర స్వరంతో ప్రశ్నించింది. ‘‘ఈ విషయంలో మేం ఒక వైఖరికి వచ్చి అతి కఠినమైన నిర్ణయాలు తీసుకునేలా చేస్తున్నారు. అది అంతిమంగా అందరికీ చాలా అసౌకర్యంగా ఉంటుంది’’ అంటూ ఏజీని హెచ్చరించింది. ‘‘హైకోర్టు న్యాయమూర్తుల బదిలీల్లో జాప్యాన్ని అస్సలు అనుమతించేది లేదు. ఎందుకంటే ఈ విషయంలో కేంద్రం పాత్ర అతి స్వల్పం. ఈ విషయమై ఎవరో మూడో శక్తి మాతో ఆటలాడటాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోం. మీ జాప్యం వల్ల న్యాయ, పాలనపరమైన విధులకు విఘాతం కలగడం అస్సలు ఆమోదనీయం కాదు’’ అంటూ మండిపడింది. ‘‘హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవికి ఒక న్యాయమూర్తి పేరును కొలీజియం సిఫార్సు చేస్తే ఇప్పటిదాకా ఏ నిర్ణయమూ తీసుకోలేదు. మరో 19 రోజుల్లో ఆయన రిటైరవుతున్నారు. సీజే అవకుండానే రిటైరవాలని మీరు ఆశిస్తున్నట్టా?’’ అని నిలదీసింది. ఇది తమ దృష్టిలో ఉందని, అవసరమైన చర్యలు తీసుకుంటామని ఏజీ బదులిచ్చినా సంతృప్తి చెందలేదు. ‘‘కొలీజియం సిఫార్సులను ఒక్కోసారి రాత్రికి రాత్రే ఆమోదిస్తున్నారు. మరికొన్నిసార్లు విపరీతంగా జాప్యం చేస్తున్నారు’’ అంటూ తీవ్రంగా తప్పుబట్టింది. కొలీజియం పునరుద్ఘాటించిన పేర్లనూ పెండింగ్‌లో పెడుతున్నారని న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. కోర్టులపై బయట తీవ్ర దాడికి పాల్పడుతున్నారని మరో న్యాయవాది ఆరోపించగా వీటికి అలవాటు పడిపోయామని జస్టిస్ కౌల్ ఆవేదన వెలిబుచ్చారు. విచారణను ఫిబ్రవరి 13కు వాయిదా వేశారు. కొలీజియం విషయమై కేంద్రానికి, న్యాయవ్యవస్థకు మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొనడం తెలిసిందే. కొలీజియం సిఫార్సులను కేంద్రం పెండింగ్‌లో పెట్టడం దాన్ని మరింత పెంచింది. తాజాగా అలహాబాద్, గుజరాత్ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల పేర్లను సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా సీజేఐ జస్టిస్ డి.వై.చంద్రచూడ్ సారథ్యంలోని కొలీజియం జనవరి 31న సిఫార్సు చేసింది. సుప్రీంకోర్టులో 34 మంది న్యాయమూర్తులకు గాను ప్రస్తుతం 27 మందే ఉన్నారు. -
‘గ్రీన్‌కార్డు’ సిఫార్సుల్లో కీలక కదలిక
వాషింగ్టన్: గ్రీన్ కార్డ్ దరఖాస్తుల ప్రాసెసింగ్, కేటాయింపు సమయాన్ని ఆర్నెల్లకు కుదించడంతో పాటు పెండింగ్ దరఖాస్తులన్నింటినీ 2023 ఏప్రిల్ కల్లా క్లియర్ చేయాలన్న సిఫార్సులపై అమెరికా దృష్టి నిశితంగా సారించింది. ఇవి ప్రస్తుతం డొమెస్టిక్ పాలసీ కౌన్సిల్ పరిశీలనలో ఉన్నాయి. అక్కడ ఆమోదం పొందితే తుది నిర్ణయం కోసం అధ్యక్షుడు జో బైడెన్ వద్దకు వెళ్తాయి. ఈ సిఫార్సులు అమలుకు నోచుకుంటే వేలాదిమంది భారతీయులకు లబ్ధి చేకూరనుంది. ఆసియా అమెరికన్లు తదితరులకు సంబంధించిన సలహా కమిషన్ గత మే నెలలో ఈ కీలక సిఫార్సులు చేయడం తెలిసిందే. భారతీయ మూలాలున్న పారిశ్రామికవేత్త అజయ్ జైన్ భుటోరియా కమిషన్ తొలి భేటీలో ఈ ప్రతిపాదనలు చేయగా ఏకగ్రీవ ఆమోదం లభించింది. బైడెన్‌కు భుటోరియా తొలినుంచీ గట్టి మద్దతుదారు. -
అనధికార లే అవుట్లు..16 వేలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అధిక సంఖ్యలో ఉన్న అనధికార లే అవుట్లలో ప్లాట్ల విక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారమే.. రాష్ట్రంలో 20 వేలకు పైగా లేఅవుట్లుండగా, అందులో కేవలం 3,568కి మాత్రమే పూర్తిస్థాయిలో అనుమతులు ఉన్నాయని తెలుస్తోంది. మిగిలిన దాదాపు 16 వేలకు పైగా లే అవుట్లలో కొన్నిటికి అరకొరగా అనుమతులుండగా, మరికొన్నిటికి అసలు అనుమతులే లేవు. అయినప్పటికీ ఆయా లే అవుట్లలోని ప్లాట్లను ప్రజలకు రియల్ వ్యాపారులు అమ్మేస్తున్నారు. ఈ లే అవుట్లు 1.22 లక్షలకు పైగా ఎకరాల్లో విస్తరించి ఉంటే, అందులో 40 వేల ఎకరాల వరకే అనుమతులున్నాయని, మిగిలిన 80 వేలకు పైగా ఎకరాల్లో అమ్మకాలు జరుపుతున్న ప్లాట్లు ప్రభుత్వ నిబంధనల ప్రకారం లేవని పట్టణాభివృద్ధి శాఖ వర్గాలంటున్నాయి. పట్టణాభివృద్ధి సంస్థలు, డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ (డీటీసీపీ)ల నుంచి అనుమతులు లేకుండా తయారు చేస్తున్న ఈ అనధికార లే అవుట్లలో ప్లాట్లు కొంటున్న సామాన్యులు ఆ తర్వాత ఇబ్బందుల పాలు కావాల్సి వస్తోంది. ఇలాంటివెన్నోఉదంతాలు వెలుగులోనికి వచ్చినా రియల్ వ్యాపారులను నియంత్రించలేని కారణంగా ఫలితం లేకుండా పోతోందనే విమర్శలున్నాయి. తాజాగా ఇప్పుడు రాష్ట్రంలోని ఇండ్ల స్థలాల విషయంలో మున్సిపల్ మంత్రి కేటీఆర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం తగిన నిర్ణయం తీసుకుంటుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది. ఉపసంఘం ఎజెండాలో ప్లాట్లు, ఇండ్ల స్థలాల క్రమబద్ధీకరణ, అనధికారిక లే అవుట్ల అంశాల ప్రస్తావన ఉండటంతో ఈ సమస్యలకు త్వరలోనే పరిష్కారం లభిస్తుందనే చర్చ జరుగుతోంది. ఎల్ఆర్ఎస్ ఏమవుతుందో? ఉపసంఘం ఎజెండాలో భూముల క్రమబద్ధీకరణ (ఎల్ఆర్ఎస్) అంశాన్ని ప్రభుత్వం స్పష్టంగా ప్రస్తావించకపోయినా దీనిపైన కూడా నిర్ణయం వెలువడే అవకాశముందని పట్టణాభివృద్ధి శాఖ వర్గాలంటున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 25 లక్షలకు పైగా ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటి పరిష్కారానికి ఇప్పటికే శాఖాపరమైన కమిటీ ఏర్పాటు చేసి దరఖాస్తులను పరిశీలించి నివేదికలు సిద్ధం చేయాలని ప్రభు త్వం నిర్ణయించింది. ఈ నివేదికలను కూడా ఉపసంఘం పరిశీలించే అవకాశం ఉంది. కోర్టు తుది తీర్పునకు లోబడి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని పట్టణాభివృద్ధి శాఖ వర్గాలంటున్నాయి. మరోవైపు గ్రామకంఠం భూములపై కూడా ప్రభుత్వం దృష్టి సారించింది. గ్రామపంచాయతీలకు చెందిన భూముల్లో ఏవైనా ఆక్రమణలు ఉంటే వాటిని కూడా ఉపసంఘం పరిశీలిస్తుందనే చర్చ జరుగుతోంది. మొత్తంమీద ఈ అనధికారిక లేఅవుట్లు, ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు, గ్రామకంఠం భూములను క్రమబద్ధీకరిస్తే.. అనధికార లే అవుట్లలో ప్లాట్లు కొన్నవారికి ఉపశమనం లభించడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి రూ.10 వేల కోట్ల వరకు ఆదాయం వస్తుందనే అంచనా ఉంది. కేటీఆర్ నేతృత్వంలో ఉప సంఘం రాష్ట్రంలోని ఇండ్ల స్థలాల సంబంధిత సమస్యలపై మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర పురపాలక, పరిశ్రమలు, ఐటీ మంత్రి కె. తారకరామారావు ఈ కమిటీకి చైర్మన్‌గా వ్యవహరించనుండగా, మంత్రులు టి. హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, వి.శ్రీనివాస్‌గౌడ్, మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డిలు సభ్యులుగా వ్యవహరించనున్నా రు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలోని అనధికారిక లే అవుట్లు.. ప్లాట్లు, ఇండ్లస్థలాల క్రమబద్ధీకరణ, గ్రామ కంఠాలతో పాటు ఇతర అంశాలపై కమిటీ పరిశీలన జరుపుతుందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
దరఖాస్తులు పెండింగ్‌లో ఉంచొద్దు
ఆదిలాబాద్‌అర్బన్: అధికారులు, కలెక్టర్ దృష్టికి వచ్చిన సమస్యలే మళ్లీ మళ్లీ గ్రీవెన్స్‌లో వస్తున్నాయని కలెక్టర్ ఎం.జ్యోతిబుద్ధప్రకాశ్ అన్నారు. ఒకసారి వచ్చిన సమస్యను పరిష్కరిస్తే వారు రాకుండా ఉంటారని, ఆ సమస్య మళ్లీ వచ్చే ఆస్కారం ఉండదని, మళ్లీ మళ్లీ అవే సమస్యలు రాకుండా.. పెండింగ్‌లో ఉంచకుండా వచ్చిన ప్రజా సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజా ఫిర్యాదుల విభాగం నిర్వహించారు. ఉదయం 10.30 గంటల నుంచి అరగంటపాటు డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ఆరుగురు ఫోన్ చేసి తమ సమస్యలను నేరుగా కలెక్టర్‌కు విన్నవించారు. సానుకూలంగా స్పందించిన కలెక్టర్ సమస్యలను త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ప్రజా ఫిర్యాదుల విభాగం నిర్వహించారు. గ్రీవెన్స్‌కు వచ్చిన ప్రజల నుంచి కలెక్టర్, జాయింట్ కలెక్టర్ కృష్ణారెడ్డి అర్జీలు స్వీకరించారు. గ్రీవెన్స్‌కు వచ్చిన దరఖాస్తులు ఎన్ని.. ఇంత వరకు పరిష్కరించినవి ఎన్ని.. ఇంకెన్ని పెండింగ్‌లో ఉన్నాయో తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఎక్కువగా వచ్చే దరఖాస్తుల్లో మండల స్థాయిలో పరిష్కారమయ్యేవిగా ఉన్నాయని, అక్కడి అధికారులు పరిష్కరించి ప్రజలకు సహకరించాలని సూచించారు. డీఆర్వో బానోత్శంకర్, ఆర్డీవో సూర్యనారాయణ, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్యశ్రీ వర్తించదటా..! మా పాప హిందూ(9) తలలోని బ్రెయిన్ పక్కన ఎముక పెరుగుతోందని హైదరాబాద్ యశోద ఆసుపత్రి వైద్యులు గుర్తించారు. ఆపరేషన్ చేసి తొలగించాలని, రూ.70 వేలు ఖర్చవుతుందని అన్నారు. చికిత్స కోసం ఐదు నెలలుగా ప్రభుత్వం, అధికారులను ఆర్థిక సాయం కోరుతున్నా. ఇంతవరకు ఎవరూ స్పందించలేదు. నేను ఎలక్ట్రీషియన్, నా భార్య విజయ బీడీ వర్కర్. ఇప్పటివరకు మా దగ్గర ఉన్న రూ.లక్షా నలభై వేలు ఆసుపత్రికి ఖర్చు చేశాం. ఆరోగ్యశ్రీ కింద చికిత్స కోసం వెళ్తే వర్తించదని అంటున్నారు. ఆపరేషన్ కోసం రూ.70 వేలు ప్రభుత్వం నుంచి అందించాలని కలెక్టర్‌ను కోరాం. అధికారులు స్పందించి మా కూతురు హిందూను ఆదుకోవాలని కోరుతున్నాం. – విజయ పోశేట్టి, టీచర్స్‌కాలనీ, ఆదిలాబాద్ -
కార్మికుల సమస్యల పరిష్కారానికి చర్యలు
– డీసీఎల్ మహేశ్వర కుమార్ – 212 మందికి రూ.60,2400 మంజూరు చేయాలని ప్రతిపాదన కర్నూలు (రాజ్‌విహార్): కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్, చైర్మన్ యు.మహేశ్వర కుమార్ ఆదేశించారు. మంగళవారం స్థానిక ధర్మపేటలోని కార్మిక శాఖ కార్యాలయంలో భవన నిర్మాణ కార్మికుల పెండింగ్ దరఖాస్తులపై ఏసీఎల్, ఏఎల్ఓ, కార్మిక అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమ పథకాలను కార్మికుల చెంతకు చేర్చాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. సమస్యలు ఎదురైనప్పుడు ట్రేడ్ యూనియన్ల నాయకులు అధికారుల దృష్టికి తీసుకు రావాలన్నారు. ఈ క్రమంలో 212 పెండింగ్ దరఖాస్తులకు మోక్షం కల్పించాలని కోరుతూ రూ.60,2400 మంజూరు చేయాలని కోరుతూ ఉన్నతాధికారులకు ప్రతిపాదనల పంపించారు. ఇందులో భవన నిర్మాణ కార్మిక కుటుంబాల్లో మెటర్నిటీ (కాన్పు) అలవెన్స్ కింద 154 మందికి రూ.20వేలు చొప్పున రూ.30.80లక్షలు కావాలని, పెళ్లిళ్లకు 33 మందికి రూ.10వేల చొప్పు రూ.3.30లక్షలు, ప్రమాదవశాత్తూ మరణానికి రూ.12.40లక్షలు (ముగ్గురికి), తాత్కాలిక వైకల్యం రూ.2400(ఒకరు), సహజ మరణానికి రూ.13.50లక్షలు(21 మంది) చొప్పున పంపించారు. కార్యక్రమంలో ఏసీఎల్ శేషగిరి రావు, ఏఎల్ఓలు కేషన్న, సుందరేష్, సుబ్బారెడ్డి, విల్సన్, హేమాచారి, ఇర్ఫాన్ తదితరులు పాల్గొన్నారు. -
పనిజరిగేనా..పటాటోపమేనా!
గత మూడు విడతల్లో పరిష్కారానికి నోచని అర్జీలు ఇళ్లకోసం పెండింగ్ దరఖాస్తులు 90 వేలు అందని బిల్లు బకాయిలు సామాజిక పింఛన్లదీ అదే దారి రేష¯ŒS కార్డుల కోసం వేలాది మంది ఎదురుచూపులు ఆచరణ లేకుండా.. ఆదర్శాలను వల్లించడం వల్ల కలిగే ప్రయోజనం అంతంతమాత్రంగానే ఉంటుంది. ‘జన్మభూమి – మా ఊరు’ కార్యక్రమం దీనినే తలపిస్తోంది. జన్మభూమి అనగానే పింఛన్లు, రేషన్‌కార్డుల వంటి సంక్షేమ కార్యక్రమాలు దరిచేరతాయని ప్రజలు ఆశపడడం సహజం. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇందుకు భిన్నంగా కనిపిస్తోంది. గత మూడు జన్మభూమి కార్యక్రమాల్లో వచ్చిన దరఖాస్తులకే ఇంతవరకూ దిక్కూమొక్కూ లేదు. ఈ రీత్యా సోమవారం నుంచి ప్రారంభమయ్యే నాలుగో విడత జన్మభూమిలో వచ్చే దరఖాస్తులైనా పరిష్కారానికి నోచుకుంటాయనేది అనుమానమే. – సాక్షి ప్రతినిధి, కాకినాడ సాక్షి ప్రతినిధి, కాకినాడ : జిల్లాలో పది రోజులపాటు జరగనున్న నాలుగో విడత ‘జన్మభూమి – మా ఊరు’ కార్యక్రమం సోమవారం ప్రారంభం కానుంది. ఈసారైనా తమ సమస్యలు పరిష్కారమవుతాయని పలువురు పేదలు ఆశగా ఎదురు చూస్తున్నారు. కానీ, గతానుభవాల దృష్ట్యా వారి ఆశ మరోసారి నిరాశగానే మిగిలిపోతుందేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత జన్మభూముల్లో వచ్చిన అర్జీల్లో చాలావరకూ ఇప్పటికీ పరిష్కారానికి నోచుకోకపోవడమే ఇందుకు కారణం. గూడు.. గోడు.. గత మూడు విడతల జన్మభూముల్లో ఇళ్ల కోసం 90 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. మంజూరు కోసం వారంతా కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నారు. జన్మభూమికి వెళ్తే ఎక్కడ నిలదీస్తారోననే భయంతో ఇటీవలే జిల్లా అంతటికీ కలిపి 10 వేల ఇళ్లు మాత్రమే మంజూరు చేశారు. వీటిల్లో కూడా సగం అంటే 4,500 ఇళ్లు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు సొంత నియోజకవర్గం తునికే కేటాయించేశారు. మిగిలిన 5,500 ఇళ్లు జిల్లాలోని మిగిలిన నియోజకవర్గాలు (కాకినాడ అర్బన్, రాజమహేంద్రవరం అర్బ¯ŒS మినహా) పంచుకోవాల్సిన పరిస్థితి. అంటే నియోజకవర్గానికి 343 ఇళ్లు మాత్రమే వస్తున్నాయి. ఇవి కాకుండా నియోజకవర్గానికి మరో 1250 ఇళ్లు మంజూరు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీనిపై ఇంతవరకూ ఉత్తర్వులు రాలేదు. పెండింగ్ బిల్లులకు మొండిచేయి గత ప్రభుత్వం హయాంలో మంజూరై, వివిధ దశల్లో ఉన్న ఇళ్లకు రూ.230 కోట్ల మేర బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రభుత్వం వారిపట్ల దయ చూపడం లేదు. కనీసం ఈ రెండున్నరేళ్లలో ఒక్క లబ్ధిదారుడికి ఒక్క రూపాయి కూడా పెండింగ్ బిల్లు విడుదల చేసిన దాఖలాలు లేవు. పూర్తికాని లబ్ధిదారుల ఎంపిక సామాజిక పింఛన్ల కోసం జిల్లాలో సుమారు 40 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ జన్మభూమిలో ప్రతి నియోజకవర్గానికి రెండు వేల కొత్త పింఛన్లు మంజూరు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రకటన చూస్తే అందరికీ పింఛన్లు ఇస్తారన్నట్టుగా కనిపిస్తోంది. కానీ, ఇంతవరకూ అర్హుల ఎంపికే పూర్తి కాలేదు. అందరికీ అందని రేష¯ŒS కార్డులు గృహనిర్మాణం, పింఛన్లు కాకుండా మూడో ప్రాధాన్య అంశం రేష¯ŒS కార్డులు. 2015 డిసెంబర్‌నాటికి జిల్లాలో సుమారు 2 లక్షల మంది రేష¯ŒS కార్డుల కోసం దరఖాస్తు చేసుకోగా, పరిశీలన అనంతరం లక్షా 60 వేల మంది అర్హులని లెక్క తేల్చారు. ఆ తరువాత 2016 జనవరిలో నిర్వహించిన మూడో విడత జన్మభూమిలో లక్షా 19 వేల మందికి పంపిణీ చేశారు. మిగిలిన లబ్ధిదారులకు తరువాత ఇస్తామని చెప్పి చేతులు దులుపేసుకున్నారు. అప్పటినుంచీ కార్డుల కోసం దరఖాస్తుదారులు మండల కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతూనే ఉన్నారు. కాకినాడ అర్బ¯ŒSలో 6,798, రాజమహేంద్రవరం అర్బ¯ŒSలో 5,156, మున్సిపాల్టీల్లో వెయ్యికి పైబడి, మండలాల్లో వందల సంఖ్యలో దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈవిధంగా జిల్లావ్యాప్తంగా 40 వేలకు పైగా దరఖాస్తులు అపరిష్కృతంగా ఉన్నాయి. గతంలో ఇవ్వాల్సినవాటితో కలిపి మొత్తం 63,416 మంది లబ్ధిదారులకు ఈసారి జన్మభూమిలో రేష¯ŒS కార్డులు పంపిణీ చేస్తామంటున్నారు. వీరు కాకుండా మరో 35 వేల మంది కొత్తగా దరఖాస్తు చేసుకున్నవారు కూడా ఉన్నారు. ఒక్క కాకినాడ నగరంలోనే ఈరకంగా దరఖాస్తు చేసుకున్నవారి సంఖ్య 7 వేలకు పైగా ఉంది. గతంలో దరఖాస్తు చేసుకున్నవారికి పూర్తిగా ఇస్తే.. అప్పుడు మిగిలినవారి సంగతి చూద్దామని అధికారులు చెబుతున్నారు. రమణయ్యపేటలో నేడు ప్రారంభం జన్మభూమి – మా ఊరు కార్యక్రమానికి కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ పర్యవేక్షణలో అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. జిల్లా మంత్రులు సోమవారం ఉదయం కాకినాడ రూరల్ రమణయ్యపేటలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ప్రతి గ్రామంలో మూడున్నర గంటలపాటు గ్రామసభలు నిర్వహించి, సంక్షేమ కార్యక్రమాలు, రుణమాఫీ, వాటి ద్వారా ఆ గ్రామస్తులకు చేకూరిన లబ్ధి, లబ్ధిదారుల వివరాలు, గ్రామాభివృద్ధి ప్రణాళికలు, ప్రజా విజ్ఞప్తులపై తీసుకున్న చర్యలను వివరించాలి. నగదు రహిత లావాదేవీలపై అవగాహన కల్పించాలి. కొత్తగా మంజూరు చేసిన పింఛన్లు, చంద్రన్న బీమా, రేష¯ŒS కార్డులు, డ్వాకా సంఘాల సభ్యుల పిల్లలకు మంజూరైన ఉపకార వేతనాలను పంపిణీ చేస్తారని చెబుతున్నారు. ఈవిడత జన్మభూమికి జిల్లా ప్రత్యేకాధికారిగా ఐ.శ్రీనివాస శ్రీనరేష్తోపాటు డివిజ¯ŒSకో అధికారిని పర్యవేక్షకులుగా నియమించారు. -
స్త్రీనిధి రుణాలకూ కష్టకాలం!
నోట్ల రద్దుతో మహిళలపై ప్రభావం 1.43 లక్షల దరఖాస్తులు పెండింగ్ ఆందోళనలో స్వయం సహాయక సంఘాలు సాక్షి, హైదరాబాద్: ‘నోట్ల రద్దు’ ప్రభావం రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాలపైనా తీవ్రంగా పడింది. లక్షలాది మంది మహిళలు తమ జీవనోపాధి కోసం అవసరమైన రుణాలు పొందేందుకు వీలు లేకుండా పోయింది. రాష్ట్రంలోని వివిధ స్వయం సహాయక సంఘాలకు చెందిన 1.43 లక్షల మంది మహిళలు సూక్ష్మ, మధ్యస్థాయి, డైరీ రుణాల కోసం రెండు నెలల కిందే గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలోని స్త్రీనిధి బ్యాంకుకు దరఖాస్తు చేసుకున్నారు. వారికీ రూ.354 కోట్ల మేర రుణాలు మంజూరు చేసేందుకు ‘స్త్రీనిధి’ అధికారులు కూడా ఆమోదం తెలిపారు. అయితే ‘నోట్ల రద్దు’ పరిణామాలతో స్థానికంగా ఉండే బ్యాంకులు మహిళలకు రుణాలిచ్చేందుకు ససేమిరా అంటున్నాయి. రుణాలను మంజూరు చేసిన తేదీ నుంచీ 13.5 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉండే నేపథ్యంలో.. స్థానిక బ్యాంకులు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేదాకా రుణాల మంజూరుకు ‘స్త్రీనిధి’ అధికారులు బ్రేక్ వేసినట్లు తెలిసింది. మొత్తంగా సకాలంలో రుణాలు అందకపోవడంతో చిన్న చిన్న అవసరాల కోసం ప్రైవేటు వ్యక్తుల వద్ద అధిక వడ్డీకి అప్పు తీసుకోవాల్సి వస్తోందని స్వయం సహాయక సంఘాల మహిళలు వాపోతున్నారు. జీవనోపాధి కోసం రుణాలు.. గ్రామీణ ప్రాంతాల్లో పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన మహిళలు మైక్రో ఫైనాన్స్ సంస్థల బారిన పడకుండా.. వారి జీవనోపాధి కోసం ఆర్థిక తోడ్పాటును అందించేందుకు ప్రభుత్వమే స్త్రీనిధి బ్యాంకును నిర్వహిస్తోంది. గ్రామాల్లో చిన్న హోటళ్లు, కిరాణ దుకాణాలు, కూరగాయలు పండించడం, విక్రయించడం, పేపర్ ప్లేట్ల తయారీ, టైలరింగ్.. తదితర వ్యాపారాలు, వృత్తులు చేసుకునే స్వయం సహాయక సంఘాల మహిళలకు చిన్నచిన్న మొత్తాల్లో ‘స్త్రీనిధి’ బ్యాంకు రుణాలు అందిస్తుంది. వాటిని 13.5 శాతం వడ్డీతో తిరిగి చెల్లించాలి. అయితే సకాలంలో తిరిగి చెల్లిస్తే.. వడ్డీలేని రుణాలు పథకం కింద ప్రభుత్వం వారు చెల్లిం చిన వడ్డీ మొత్తాన్ని తిరిగి వారికి ఖాతాల్లో జమ చేస్తుంది. అయితే నోట్ల రద్దు ప్రభావంతో రెండు నెలలుగా మహిళల దరఖాస్తులను స్త్రీనిధి బ్యాంకు పెండింగ్‌లో పెట్టింది. రుణ మొత్తాలకు సరిపడా లబ్ధిదారులకు కొత్తనోట్లు ఇస్తామని స్థానిక బ్యాంకులు తెలిపే వరకు రుణాలను మంజూరు చేయలేమని స్త్రీనిధి అధికారులు చెబుతున్నారు. -
విద్యాసంవత్సరం కోల్పోకుండా చూడండి: విజయసాయిరెడ్డి
న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల నుంచి 2016-17 విద్యా సంవత్సరానికిగాను మొత్తం 60 దరఖాస్తులను సీబీఎస్ఈ స్వీకరించిందని కేంద్ర మానవ అభివద్ధి శాఖ సహాయ మంత్రి ఉపేంద్ర కుష్వాహా చెప్పారు. ప్రాథమిక ప్రక్రియలో ఏ దరఖాస్తు కూడా పెండింగ్‌లో లేదని, అయితే, బై-చట్టాలకు అనుగుణంగా నిబంధనలు పాటించని పాఠశాలల దరఖాస్తులు మాత్రం పెండింగ్‌లో ఉంచినట్లు తెలిపారు. రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి సీబీఎస్ఈకి వచ్చిన స్కూల్ అప్లికేషన్లు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని ఆమోదించడానికి సీబీఎస్ఈ ఎలాంటి చర్యలను తీసుకుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి గురువారం రాజ్యసభలో ప్రశ్నించగా ఈ మేరకు కేంద్రమంత్రి లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. వెనుకబడిన ప్రాంతాలకు చెందిన పిల్లలు విద్యనందుకునేలా సాయపడాలని, విద్యార్థులు విద్యాసంవత్సరం కోల్పోకుండా ఉండేందుకు సీబీఎస్ఈ చర్యలు తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా కేంద్రమంత్రికి విజయసాయిరెడ్డి విజ్ఞప్తి చేశారు. -
‘సూక్ష్మం’.. ఏదీ మోక్షం!
‘సూక్ష్మనీటి’పై అలక్ష్యం ♦ ఏటా తగ్గుతున్న లక్ష్యం ♦ డిమాండ్ ఉన్నా కుదింపు ♦ వేలాది దరఖాస్తులు పెండింగ్‌లోనే ♦ ఉసూరుమంటున్న రైతులు ♦ సీఎం సొంత జిల్లాలోనే ఈ దుస్థితి ♦ నాబార్డు బడ్జెట్‌పైనే ఆశలు ♦ విస్మయం కలిగిస్తున్న అధికారుల తీరు గజ్వేల్: బిందు, తుంపర సేద్యానికి ప్రాధాన్యమివ్వాలని ఓవైపు సీఎం చెబుతున్నా.. అధికారులు ఆ దిశగా అడుగులు వేయడం లేదు. బిందు, తుంపర సేద్యానికి పరికరాలు ఇవ్వాలని కోరుతూ రైతులు చేసుకున్న దరఖాస్తులు పెండింగ్‌లోనే ఉన్నాయి. జిల్లాలో ఈ ఏడాది కూడా మంజూరు అంతగా లేదు. గతంతో పోలిస్తే టార్గెట్‌ను చాలావరకు తగ్గించారు. ఇప్పటికే వేలాది దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా... కొత్త దరఖాస్తులకు మోక్షం లభించడం అనుమానమే. సీఎం కేసీఆర్ సొంత జిల్లాలోనే ఈ దుస్థితి నెలకొంది.భూగర్భ జలాలపై ఆధారపడి సాగు చేస్తున్న ఈ జిల్లాలో సూక్ష్మనీటి పథకం అనివార్యంగా మారింది. అందుబాటులో ఉన్న కొద్దిపాటి నీటిని సద్వినియోగం చేసుకొని పంటలు పండించడానికి ఈ పథకాన్ని రైతులు తరుణోపాయంగా భావిస్తున్నారు. ఈ పథకం కింద ఎస్సీ, ఎస్టీ రైతులకు వందశాతం, ఇతరులకు 90శాతం సబ్సిడీపై పరికరాలను అందిస్తున్నారు. ఏ యేటికాయేడు ఈ పథకానికి విపరీతమైన డిమాండ్ ఏర్పడుతోంది. కానీ రైతుల అవసరాలకనుగుణంగా ప్రభుత్వం పరికరాలను అందించలేకపోతోంది. రెండేళ్ల కిందట 6,500 హెక్టార్లలో డ్రిప్పు, మరో 3,500 హెక్టార్లలో తుంపర సేద్యం పరికరాలను అందజేశారు. గతేడాది జిల్లా వ్యాప్తంగా మూడు వేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉంటూ వస్తున్నాయి. సీఎం సొంత నియోజకవర్గమైన గజ్వేల్‌లోనూ సుమారు వెయ్యి వరకు దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ క్రమంలో గతేడాది కేవలం నాలుగు వేల హెక్టార్లలో డ్రిప్పు, 1,650 హెక్టార్లలో స్ప్రింక్లర్లను అందించడానికి కార్యాచరణ రూపొందించగా... బిందు సేద్యం పరికరాల విలువ రూ.43.02 కోట్లు, స్ప్రింక్లర్ల విలువ రూ.16.93 కోట్లు ఉంటుంది. సబ్సిడీని మినహాయిస్తే రెండు కలుపుకొని రూ.40 కోట్లు ఉంటుందని అధికారులు చెబుతుండగా.... వాటిని కూడా పూర్తిస్థాయిలో అందించలేకపోయారు. తాజాగా డ్రిప్‌కు సంబంధించి 4,500 హెక్టార్లు, మరో 3,940 హెక్టార్లు స్ప్రింక్లర్లు అందించడానికి టార్గెట్‌ను సిద్ధం చేశారు. ఇందుకోసం రూ.50 కోట్ల బడ్జెట్ కూడా మంజూరైంది. నిజానికి గతేడాది మాదిరిగా 10 వేల హెక్టార్ల టార్గెట్‌ను పెట్టుకున్నా... రైతుల నుంచి డిమాండ్ వెల్లువలా వచ్చే అవకాశముందని అధికారులకు తెలిసినా కుదించడంలో ఆంతర్యమేమిటో వారికే తెలియాలి. వాస్తవ పరిస్థితిని మరిచి ప్రణాళికలు తయారు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీఎం సొంత జిల్లాలోనే ఇలాంటి పరిస్థితి నెలకొనడంపై రైతులు ఆందోళన చెందుతున్నారు. నాబార్డు బడ్జెట్‌పైనే ఆశలు... జిల్లాకు సుమారు రూ.198 కోట్ల బడ్జెట్ సూక్ష్మనీటి సేద్యపు పథకానికి మంజూరయ్యే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. ఈ బడ్జెట్ విడుదల కాగానే ఎంతమంది రైతులు డ్రిప్, స్ప్రింక్లర్లు అడిగినా ఇచ్చే అవకాశముంటుందని చెబుతున్నారు. -
చెవిలో పూలు
అడ్డదారిలో గ్రేడ్లు * ప్రభుత్వ శాఖల్లో అధికారుల లీలలు * సమస్యలు పక్కన పెట్టి రికార్డుల సృష్టి * ప్రజా దరఖాస్తుల దారి మళ్లింపు * ఒక్కసారిగా ‘ఏ’ గ్రేడ్‌కు ఎగబాకిన వైనం గుంటూరు ఈస్ట్ : జిల్లా యంత్రాంగం వివిధ శాఖల అధికారుల పనితీరుపై నిర్ణయించిన గ్రేడింగ్ విధానం నిరు పేదలకు కష్టాలను మిగుల్చుతోంది. వివిధ ప్రభుత్వ శాఖల సిబ్బంది, అధికారులు తమ పనితీరు మెరుగ్గా ఉందని పెండింగ్ దరఖాస్తుల సంఖ్యను తక్కువ చేసి ఉన్నతాధికారులకు చూపిస్తున్నారు. సాంకేతిక సమస్యలు చూపి ప్రజల నుంచి వస్తున్న దరఖాస్తులను తిరస్కరిస్తున్నారు. ఇలాంటి తప్పుడు వివరాలతో కూడిన నివేదికను సోమవారం విజయవాడలో జరిగిన ముఖ్యమంత్రి సమావేశంలో జిల్లా ఉన్నతాధికారులు అందించారని ఉద్యోగ సంఘాల నాయకులు చెబుతున్నారు. అమల్లోకి గ్రేడింగ్ విధానం.. మూడు నెలల క్రితం ఉద్యోగులు, అధికారుల పనితీరును పరిశీలించి గ్రేడింగ్ ఇచ్చే విధానాన్ని జిల్లా యంత్రాంగం అమలులోకి తీసుకువచ్చింది. ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను పరిష్కరించడంలో జిల్లా వెనుకబడి ఉండడంతో ముఖ్యమంత్రి కార్యాలయం జిల్లాకు ‘సి’గ్రేడ్‌ను నిర్ణయించింది. ముఖ్యమంత్రి కార్యాలయ సిబ్బంది ఆన్లైన్లో ఆయా ప్రభుత్వశాఖల పనితీరును పరిశీలిస్తోంది. ప్రతినెలా ఆయా జిల్లాలకు గ్రేడింగ్ ఇవ్వడం ప్రారంభించారు. ఈ క్రమంలో జనవరి నెలలో సమస్యల పరిష్కారంపై పరిశీలన చేసిన ముఖ్యమంత్రి కార్యాలయం జిల్లాకు ‘సి’ గ్రేడ్ ఇచ్చింది. దీంతో జిల్లా యంత్రాంగం అందుకు కారణమైన 10 మంది ఎంఆర్ఓలకు మెమోలు ఇచ్చి, అక్షింతలు వేసింది. ఈ గ్రేడ్ల గండం నుంచి బయటపడేందుకు అడ్డదారిని ఆశ్రయించారు. జనవరి నెలలో మీసేవ ద్వారా వచ్చిన గడువు దాటిన దరఖాస్తులు 84 వేలు ఉంటే, ఒక్క నెలలోనే 15వేలు పరిష్కరించి 69 వేలకు చేరినట్లు చూపారు. జన్మభూమి, మీకోసం ద్వారా వచ్చి గడువు దాటిన దరఖాస్తులు ఒక నెలలోనే సుమారు 40 వేల వరకు పరిష్కరించినట్లు చూపారు. నాలుగు నెలలకు కూడా పరిష్కారం కానివి జనవరి నెలలోనే పరిష్కారం అయినట్టు అధికారులు చూపారు. అసలేం జరిగిందంటే.. గడువు దాటినవి, గడువులోపు ఉన్న దరఖాస్తులు జిల్లాలో సుమారు లక్షన్నరకు పైగా ఉన్నట్లు సమాచారం. ఈ గండం నుంచి బయటపడేందుకు జిల్లా వ్యాప్తంగా మీసేవ సెంటర్లలో వివిధ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను సర్వర్ పనిచేయడం లేదంటూ తీసుకోవడం లేదు. దీంతో దరఖాస్తుల సంఖ్య పెరగకుండా చేశారు. తీసుకున్న దరఖాస్తులను పరిష్కరించే క్రమంలో అవసరమైన డాక్యుమెంట్లు, ఇతర వివరాలు లేవంటూ వాటిని ఆన్లైన్ నుంచి తిరస్కరించారు. అలాగే సాంకేతిక ఇబ్బందులు చూపించి భవిష్యత్తులో పరిష్కరిస్తామంటూ రాజీమార్గంలో ఒప్పించి ఆన్లైన్ నుంచి తొలగించారు. మొత్తం మీద జనవరి నెలలో జిల్లాలో 90 శాతం తహశీల్దారు కార్యాలయాలు సి గ్రేడ్‌లో ఉండగా, ఫిబ్రవరి నాటికి 90 శాతం ఏ గ్రేడ్‌కు చేరినట్లు చూపించారు. సమస్యలను పరిష్కరించి ప్రజల ఇబ్బందులు తొలగించే అంశం పక్కన బెట్టి రికార్డు పరంగా సంఖ్యను తగ్గించుకోవడానికే అధికారులు శ్రద్ధ చూపిస్తున్నారు. ఈ విషయమై కలెక్టరేట్ పరిపాలనాధికారి ప్రసాద్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా, అటువంటి అక్రమ మార్గాలు అనుసరించే అధికారులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
సిఫార్సుల పర్వం
డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం పెరుగుతున్న ఒత్తిడి ఎమ్మెల్యేలు, మంత్రులకు ఎంపిక బాధ్యత పెండింగ్‌లో 1.81 లక్షల దరఖాస్తులు సిటీబ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకానికి అర్హుల ఎంపికపై ఒత్తిడి పెరిగింది. దసరా సందర్భంగా పథకాన్ని ప్రారంభించాలనే ఉద్దేశంతో అధికారులు యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు పూర్తి చేయడంతో అనుకున్నట్లుగానే మంత్రులు శంకుస్థాపన నిర్వహించారు. అయితే లబ్ధిదారుల ఎంపికపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ పథకం కింద మంజూరైన ఇళ్లలో సగం స్థానిక ఎమ్మెల్యే, మిగతా సగం జిల్లా మంత్రి ఆధ్వర్యంలో అర్హులను ఎంపిక చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఎంపికే కీలకం ఈ పథకం కింద జిల్లాకు 6000 ఇళ్లు మంజూరుకాగా, ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి 400 చొప్పున కేటాయించారు. ఇందుకుగాను 3000 మంది లబ్ధిదారులను ఎమ్మెల్యేలు, మరో 3000 మందిని జిల్లా మంత్రి ఎంపిక చేయాల్సి ఉండడంతో స్థానిక ప్రజాప్రతినిధుల నుంచి వారిపై ఒత్తిడి పెరుగుతోంది. జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 11 వేలకు పైగా మురికివాడలు ఉండగా జీహెచ్ఎంసీ 56 బస్తీల(మురికివాడల)ను మాత్రమే ఇందుకు ఎంపిక చేయడం గమనార్హం. ఈ నేపథ్యంలో తమను కూడా ఎంపిక చేయాలని వివిధ బస్తీల నుంచి విన్నపాలు వస్తున్నాయి. కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహిస్తున్న మీ కోసం కార్యక్రమంలో కూడా దరఖాస్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. అయితే లబ్ధిదారుల ఎంపికపై ఎలాంటి మార్గదర్శకాలు ప్రకటించని ప్రభుత్వం, మురికివాడల్లో లబ్ధిదారుల ఎంపిక బాధ్యతలను జీహెచ్ఎంసీకి అప్పగిచడంతో ఎమ్మెల్యే, మంత్రుల సిఫార్సుల ఆధారంగా ఎంపిక చేపట్టే అవకాశం ఉంది. మంజూరైన కోటా అతి తక్కువ ఉండటం, జీహెచ్ఎంసీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బస్తీల ఎంపిక నాయకులకు ఇబ్బందులు తెచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. 1.81 లక్షలకుపైగా దరఖాస్తులు పెండింగ్ జిల్లాలో దరఖాస్తుదారుల సంఖ్య 1.81 లక్షలు ఉన్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. డబుల్ బెడ్ రూమ్ పథకాన్ని ప్రకటించిన తర్వాత వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇప్పటి వరకు పెండింగ్‌లో ఉన్న ఇళ్ల దరఖాస్తుల వివరాలు ఇలా ఉన్నాయి. -
మందకొడిగా వివాహ పథకాలు
* పెరుగుతున్న కల్యాణలక్ష్మి, షాదీముబారక్ దరఖాస్తులు... * 10వేలకు పైగా పెండింగ్ సాక్షి, హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీ వర్గాలకు చెందిన పేదింటి అమ్మాయిలకు వివాహ సమయంలో రూ.51 వేలు అందించేందుకు ఉద్దేశించిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు మందకొడిగా సాగుతున్నాయి. ఈ పథకాల కింద పెట్టుకున్న దరఖాస్తులను అధికారులు చాలా సూక్ష్మంగా పరిశీలిస్తున్నారు. కొందరు అనర్హులు లబ్ధిపొందారన్న వార్తల నేపథ్యంలో పరిశీలనలో జాప్యం జరుగుతోంది. దాదాపు 1500 దరఖాస్తులను తిరస్కరించారు. అత్యధికంగా ఎస్టీశాఖ పరిధిలో 697, ఎస్సీశాఖ 684, మైనారిటీ శాఖకు సంబంధించి 107 దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. సరైన అర్హతలు లేకపోయినా, ఆయా ధ్రువీకరణ పత్రాలను సమర్పించకపోవడంతో అధికారులు తిరస్కరిస్తున్నారు. ఇటీవల దరఖాస్తుల పెండింగ్ సంఖ్య కూడా పెరిగిపోయింది. ఇప్పటివరకు 10 వేలకుపైగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రస్తుత ఆర్థికసంవత్సరంలో ఆరు నెలల్లో ఈ మూడు శాఖలకు 59,428 దరఖాస్తులు రాగా... 47,728 దరఖాస్తులను ఆమోదించారు. -
పహాణీ పాట్లు
ఏళ్ల తరబడి రైతుల ఎదురుచూపులు వేల సంఖ్యలో పెండింగ్ దరఖాస్తులు పరిశీలన పూర్తయినా.. నమోదులో జాప్యం కలెక్టర్ వాకాటి కరుణ ఆదేశాలు బేఖాతరు హన్మకొండ అర్బన్ :‘పట్టాదారు పాస్‌పుస్తకాలు, పహాణీల జారీ విషయంలో రైతులను ఇబ్బందులు పెట్టొద్దు. రైతుల ఇంటి వద్దకే వెళ్లి రుణాలు, రెవెన్యూ పత్రాలు అందజేయాలి.’ ఇటీవల కలెక్టర్ ప్రతి సమావేశంలోనూ ఇదే విషయూన్ని చెబుతున్నారు. కానీ.. జిల్లాలో పరిస్థితి ఇందుకు విరుద్ధంగా ఉంది. చాలా మండలాల్లో పహాణీల కోసం రైతులు నానాయాతన పడుతున్నారు. పంటల సాగు నిమిత్తం బ్యాంక్ రుణాల కోసం రైతులకు వారి భూములకు సంబంధించిన మీసేవ పహాణీ తప్పనిసరి. దీంతో రైతులు సమయం వెచ్చించి... ఆర్థికభారం భరించి మీ సేవ కేంద్రాలకు వెళ్లి పహాణీలు తీసుకుంటున్నారు. తీరి వెళ్లి తీసుకుని వస్తే... అందులో ఉన్న సవాలక్ష తప్పులతో రైతులు అధికారుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి నెలకొంది. పహాణీలో ఉన్న భూమి కన్నా తక్కువ ఉండడం.. తండ్రి పేరుకు బదులు తాత పేరు ఉండడం.. కబ్జా కాలంలో ఉన్న పేరు మాయమై ఊళ్లో లేని వారి పేరు ప్రత్యక్షమవుతోంది. ఇదేంటని రైతులు.. వీఆర్వోను కలిస్తే ఎమ్మార్వోను కలవమని సలహా ఇస్తున్నారు. రెతులు ప్రయూసపడి అక్కడికి వెళితే నెలల తరబడీ ఎమ్మార్వో దొరకని పరిస్థితి ఉం టోంది. కోర్టు డ్యూటీ, ప్రొటోకాల్. కలెక్టర్, ఆర్డీఓ సమీక్షలు, క్షేత్రస్థాయి పరీశీలనలు, విచారణ నివేదికలంటూ పెద్దపెద్ద మండలాల్లో తహసీల్దార్లు పహాణీలపై దృష్టిసారించకపోవడంతో వేలాదిగా పెండింగ్‌లో పడ్డారుు. స్వయంగా కలెక్టర్ ఇచ్చిన ఆదేశాలు క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు. కాలం నెత్తి మీదికొచ్చినా తమ ఇబ్బందులను పట్టించుకునే నాధుడే లేడని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హన్మకొండలో 1500కు పైగా పెండింగ్ గ్రామీణ ప్రాంత పరిధి తక్కువగా ఉన్న హన్మకొండ మండలంలో పహాణీలో తప్పులు దొర్లి న దరఖాస్తులు ఇప్పటివరకు సుమారు 1500 కు పైగా పెండింగ్‌లో ఉన్నాయి. ఈ విషయం లో వీఆర్వోలు, ఆర్ఐలు క్షేత్రస్థాయి పరీశీలన చేసి నివేదిక ఇచ్చారు. వాటికి కూడా మోక్షం లేదు. రైతులను ఇదిగో.. అదిగో అంటూ ప్రతి రోజూ కార్యాలయానికి తిప్పుకుంటున్నారు. ఒక్కటే ‘కీ’ సమస్య ముఖ్యంగా డిజిటల్ కీ సమస్యతోనే వెబ్లాండ్ పహాణీ దరఖాస్తులు పేరుకుపోతున్నాయని తెలుస్తోంది. తహసీల్దార్ కార్యాయంలో రేషన్‌కార్డులు, కులం ఆదాయం, నివాసం సర్టిఫికెట్లు, పహాణీల మార్పులకు సంబంధించి మండలానికి ఒకటే డిజిటల్ కీ ఉంటోంది. దీంతో హన్మకొండ మండలంలో అధికారులు పూర్తిగా సర్టిఫికెట్ల జారీకే పరిమితమవుతున్నారు. మిగతా పనులు పెండింగ్‌లో పడుతున్నారుు. రెండుళ్లుగా తిరుగుతున్నా... మాకు అమ్మవారి పేట శివారులో భూమి ఉంది. పహాణీ లో మా పేరు కాకుండా వేరేవారి పేరు వస్తోంది. ఈ విషయూన్ని తహసీల్దార్‌కు చెబితే వీఆర్వోకు రాశారు. వీఆర్వో, ఆర్ఐలు నివేదిక ఇచ్చారు. కంప్యూటర్లో నమోదు కోసం మూడు నెలల నుంచి తిప్పుకుంటున్నారు. ఇప్పటికి రెండేళ్లుగా ఇదే ఇబ్బంది. ఇప్పటికైనా అధికారులు గమనించాలి. - బిక్షపతి, రైతు, భట్టుపల్లి 6 నెలలుగా రేపటి వాయిదానే... కడిపికొండ గ్రామ పరిధిలోని మా భూమి వివరాలు కబ్జాలో ఎక్కించాలని ఆరు నెలల క్రితం దరఖాస్తు ఇచ్చాం. వీఆర్వో పరిశీలన పూర్తయింది. కంప్యూటర్లో నమోదు కోసం రేపు... మాపు అంటూ ఆరునెలలుగా తిప్పుతున్నారు. పంటల సీజన్లో రైతులకు పహాణీ లేనిదే పనులు కావు. అధికారులు మాత్రం ఈ విషయంలో పూర్తి నిర్లక్ష్యంగావ్యవహరిస్తున్నారు. - రవీందర్‌రెడ్డి, రైతు, హన్మకొండ -
అర్జీలకు దిక్కేది?
► జిల్లాలో అపరిష్కృత దరఖాస్తులు 1,33,220 ► గడువు ముగిసినా పరిష్కారం కానివి 80,994 ► రెండు, మూడురోజుల్లో గడువు ముగిసేవి 52,226 ► తహసీల్దార్ కార్యాలయాల్లో భారీగా పెండింగ్ దరఖాస్తులు ► గడువు ముగిసినా పరిష్కరించని రెవెన్యూ అధికారులు ► చెప్పులరిగేలా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న అర్జీదారులు జిల్లాలో పౌరసేవలు పడకేశాయి. తహసీల్దార్ కార్యాలయాల్లో పెండింగ్ దరఖాస్తులు గుట్టల్లా పేరుకుపోతున్నాయి. నిర్దేశిత గడువులోగా పరిష్కరించాల్సిన వాటిని పట్టించుకునే పరిస్థితి లేకుండాపోయింది. ఫలితంగా అర్జీదారులు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. జిల్లాలోని 37 మండలాల రెవెన్యూ కార్యాలయాల్లో గడువు దాటినా పరిష్కరించని దరఖాస్తులు 80,994 ఉన్నాయి. ఇవికాక మరో రెండు,మూడు రోజు ల్లోనే పరిష్కరించాల్సిన అర్జీలు 52,226 ఉన్నాయి. మొత్తంగా జిల్లాలో 1,33,220 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. - సాక్షి, రంగారెడ్డి జిల్లా సాక్షి, రంగారెడ్డి జిల్లా : భూ క్రమబద్ధీకరణ ప్రక్రియ సాధారణ పాలనపై ప్రభావం చూపుతోంది. వివిధ పథకాల్లో లబ్ధికోసం అర్జీదారులు పెట్టుకున్న దరఖాస్తులు కార్యాలయాల్లో వేలల్లో మూలుగుతున్నాయి. అయితే వాటిని సకాలంలో పరిష్కరించాల్సిన అధికారులు భూ క్రమబద్ధీకరణ పనుల్లో భాగంగా చేపట్టిన క్షేత్రస్థాయి పరిశీలనలో తలమునకలై ఉన్నారు. ఆయా మండలాల్లోని తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది నగర శివారు మండలాల్లో డిప్యుటేషన్‌పై విధులు నిర్వహిస్తున్నారు. దీంతో తహసీల్దార్ కార్యాలయాలు ఖాళీ కావడంతో క్షేత్రస్థాయిలో వచ్చే అర్జీల పరిష్కారం అటకెక్కింది. దాదాపు మూడు నెలలుగా రెవెన్యూ ఉద్యోగులంతా భూక్రమబద్ధీకరణ బిజీ పేరిట విధులు నిర్వహిస్తుండడంతో రోజువారీగా వచ్చే దరఖాస్తులన్నీ కార్యాలయాల్లో గుట్టల్లా పేరుకుపోయాయి. కులధ్రువీకరణ అర్జీలే ఎక్కువ.. ప్రస్తుతం ప్రభుత్వ కార్యాలయాల్లో పరిష్కారానికి నోచుకోని దరఖాస్తుల్లో అధికంగా కుల, ఆదాయ, అడంగల్ దరఖాస్తులే ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం జిల్లాలో 9,904 కుల ధ్రువీకరణ దరఖాస్తులకు నిర్దేశిత గడువు ముగిసినా పరిష్కారం కాలేదు. అదేవిధంగా మరో 30,709 దరఖాస్తులకు త్వరలో గడువు ముగియనుంది. జిల్లాలో 6,867 ఆదాయ ధ్రువీకరణ దరఖాస్తుల పరిష్కారం కావాల్సి ఉండగా.. మరో 6,375 దరఖాస్తులు సైతం పెండింగ్‌లో ఉన్నాయి. వీటితోపాటు అడంగల్, పహాణీల దరఖాస్తులు మరో 15వేలు ఉన్నాయి. కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల జారీలో తీవ్ర జాప్యం జరుగుతుండడంతో పలువురు విద్యార్థులు పోటీ పరీక్షలు, కోర్సులలో ప్రవేశాలకు దూరమవుతున్నారు. ఇబ్రహీంపట్నం మండలం మండల్పల్లి గ్రామానికి చెందిన మహేందర్ ఇటీవల ఎస్బీఐ క్లర్క్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునేందుకుగాను కులధ్రువీకరణ కోరగా.. అధికారుల నిర్లక్ష్యంతో చివరకు జనరల్ కోటాలో ఆన్లైన్లో అప్లై చేసుకున్నాడు. తనకు వచ్చిన మార్కులతో రిజర్వ్డ్ కోటాలో ఉద్యోగం దక్కేదని, స్థానిక అధికారుల నిర్లక్ష్యంతోనే ఉద్యోగానికి దూరమైనట్లు ఆవేదన వ్యక్తం చేశాడు. -
ఇంకా తేలని లెక్క !
= గడువు ముగిసినా అందని క్రమబద్ధీకరణ ఉత్తర్వులు =హెచ్ఎండీఏలో వేళ్లూనుకొన్న నిర్లక్ష్యం సాక్షి, సిటీబ్యూరో : హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ)లో క్రమబద్ధీకరణకు సంబంధించి లెక్కా పత్రం లేక అయోమయం నెలకొంది. ఎల్ఆర్ఎస్ కింద 65,669, బీపీఎస్ కింద 8676 దరఖాస్తులు వచ్చాయని, వీటిలో 7,656 ఎల్ఆర్ఎస్, 382 బీపీఎస్ దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు సిబ్బంది అధికారుల దృష్టికి తెచ్చారు. వాస్తవానికి బీపీఎస్ దరఖాస్తులు 520, ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు సుమారు 10వేలకు పైగా పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను పరిష్కరించడం ద్వారా అదనపు ఆదాయాన్ని రాబట్టుకోవాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఇందుకోసం ప్రభుత్వ అనుమతి కోరుతూ లేఖ రాయాలని నిర్ణయించారు. అందులో భాగంగా అధికారులు ఇప్పుడు ఆగమేఘాలపై ఆ వివరాలను తెప్పించేందుకు 4 జోనల్ కార్యాలయాలపై ఒత్తిడి పెంచారు. ఈ నెల 11లోగా ఎల్ఆర్ఎస్ పెండింగ్ దరఖాస్తుల వివరాలు కేంద్ర కార్యాలయానికి పంపాలని హుకుం జారీ చేశారు. ఆ తర్వాత నాలుగు రోజుల్లో ఆయా వివరాలను స్థిరీకరించి ఈ నెల 15 తర్వాత ప్రభుత్వానికి నివేదించాలని కమిషనర్ నీరభ్‌కుమార్ ప్రసాద్ ప్లానింగ్ విభాగం అధికారులకు గడువు నిర్దేశించారు. దీంతో ఎల్ఆర్ఎస్ పెండింగ్ దరఖాస్తుల లెక్క తేల్చే పనిలో ప్లానింగ్ విభాగం సిబ్బంది బిజీ అయ్యారు. గడువు ముగిసినా... నిర్ణీత గడువులోగా అపరాధ రుసుం చెల్లించిన వారికి సైతం అధికారులు క్రమబద్ధీకరణ ఉత్తర్వులు జారీ చేయడంలో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారు. 2008లో మొదలైన ఎల్ఆర్ఎస్, బీపీఎస్ ప్రక్రియ 2013 మే 31వరకు పలు దఫాలుగా గడువు పెంపుతో కొనసాగింది. బీపీఎస్ కథ ముగియగా... ఎల్ఆర్ఎస్ గడువు ముగిసినప్పటికీ దరఖాస్తుల పరిశీలన, ఉత్తర్వుల జారీకి 2013 నవంబర్ 30వరకు అవకాశమిచ్చారు. గడువు ముగిసే చివరి రోజున హడావుడి చేసిన అధికారులు సుమారు 200లకు పైగా దరఖాస్తులను పరిష్కరించినా వీటికి సంబంధించిన ప్రొసీడింగ్స్‌ను ఇవ్వలేకపోయారు. ఫీజు చెల్లించిన వారికి కూడా క్రమబద్ధీకరణ ఉత్తర్వులు అందని పరిస్థితి ఏర్పడింది. అలాగే బీపీఎస్‌కు సంబంధించి గడువులోగా అపరాధ రుసుంతో చెల్లించినప్పటికీ ఆ దరఖాస్తుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారయింది. ఆదిలోనే నిర్లక్ష్యం : ఆరంభంలో ఎల్ఆర్ఎస్/బీపీఎస్ దరఖాస్తుల వివరాలను కంప్యూటరీకరించక పోవడం వల్ల అనేక అక్రమాలకు తావు ఇచ్చినట్లయింది. క్రమబద్ధీకరణ ముసుగులో జరిగిన వ్యవహారాలతో అక్రమార్కుల జేబులు నిండగా హెచ్ఎండీఏ ఖజానాకు భారీగా గండి పడింది. శంకర్పల్లి జోనల్ కార్యాలయంలో ఫెళ్లను తగులబెట్టిన సంఘటనపై విచారణ చేపట్టిన సిబిసిఐడీ దర్యాప్తు కూడా జాప్యం జరుగుతుండడం అనుమానాలకు తావిస్తోంది.