పనిజరిగేనా..పటాటోపమేనా! | janmabhoomi ..issue | Sakshi
Sakshi News home page

పనిజరిగేనా..పటాటోపమేనా!

Published Sun, Jan 1 2017 11:35 PM | Last Updated on Tue, Sep 5 2017 12:08 AM

janmabhoomi ..issue

  • గత మూడు విడతల్లో పరిష్కారానికి నోచని అర్జీలు
  • ఇళ్లకోసం పెండింగ్‌ దరఖాస్తులు 90 వేలు 
  • అందని బిల్లు బకాయిలు
  • సామాజిక పింఛన్లదీ అదే దారి  
  • రేష¯ŒS కార్డుల కోసం వేలాది మంది ఎదురుచూపులు
  •  
    ఆచరణ లేకుండా.. ఆదర్శాలను వల్లించడం వల్ల కలిగే ప్రయోజనం అంతంతమాత్రంగానే ఉంటుంది. ‘జన్మభూమి – మా ఊరు’ కార్యక్రమం దీనినే తలపిస్తోంది. జన్మభూమి అనగానే పింఛన్లు, రేషన్‌కార్డుల వంటి సంక్షేమ కార్యక్రమాలు దరిచేరతాయని ప్రజలు ఆశపడడం సహజం. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇందుకు భిన్నంగా కనిపిస్తోంది. గత మూడు జన్మభూమి కార్యక్రమాల్లో వచ్చిన దరఖాస్తులకే ఇంతవరకూ దిక్కూమొక్కూ లేదు. ఈ రీత్యా సోమవారం నుంచి ప్రారంభమయ్యే నాలుగో విడత జన్మభూమిలో వచ్చే దరఖాస్తులైనా పరిష్కారానికి నోచుకుంటాయనేది అనుమానమే.
    – సాక్షి ప్రతినిధి, కాకినాడ
     
    సాక్షి ప్రతినిధి, కాకినాడ :
    జిల్లాలో పది రోజులపాటు జరగనున్న నాలుగో విడత ‘జన్మభూమి – మా ఊరు’ కార్యక్రమం సోమవారం ప్రారంభం కానుంది. ఈసారైనా తమ సమస్యలు పరిష్కారమవుతాయని పలువురు పేదలు ఆశగా ఎదురు చూస్తున్నారు. కానీ, గతానుభవాల దృష్ట్యా వారి ఆశ మరోసారి నిరాశగానే మిగిలిపోతుందేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత జన్మభూముల్లో వచ్చిన అర్జీల్లో చాలావరకూ ఇప్పటికీ పరిష్కారానికి నోచుకోకపోవడమే ఇందుకు కారణం.
    గూడు.. గోడు..
    గత మూడు విడతల జన్మభూముల్లో ఇళ్ల కోసం 90 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. మంజూరు కోసం వారంతా కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నారు. జన్మభూమికి వెళ్తే ఎక్కడ నిలదీస్తారోననే భయంతో ఇటీవలే జిల్లా అంతటికీ కలిపి 10 వేల ఇళ్లు మాత్రమే మంజూరు చేశారు. వీటిల్లో కూడా సగం అంటే 4,500 ఇళ్లు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు సొంత నియోజకవర్గం తునికే కేటాయించేశారు. మిగిలిన 5,500 ఇళ్లు జిల్లాలోని మిగిలిన నియోజకవర్గాలు (కాకినాడ అర్బన్, రాజమహేంద్రవరం అర్బ¯ŒS మినహా) పంచుకోవాల్సిన పరిస్థితి. అంటే నియోజకవర్గానికి 343 ఇళ్లు మాత్రమే వస్తున్నాయి. ఇవి కాకుండా నియోజకవర్గానికి మరో 1250 ఇళ్లు మంజూరు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీనిపై ఇంతవరకూ ఉత్తర్వులు రాలేదు.
     
    పెండింగ్‌ బిల్లులకు మొండిచేయి
    గత ప్రభుత్వం హయాంలో మంజూరై, వివిధ దశల్లో ఉన్న ఇళ్లకు రూ.230 కోట్ల మేర బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రభుత్వం వారిపట్ల దయ చూపడం లేదు. కనీసం ఈ రెండున్నరేళ్లలో ఒక్క లబ్ధిదారుడికి ఒక్క రూపాయి కూడా పెండింగ్‌ బిల్లు విడుదల చేసిన దాఖలాలు లేవు.
    పూర్తికాని లబ్ధిదారుల ఎంపిక
    సామాజిక పింఛన్ల కోసం జిల్లాలో సుమారు 40 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ జన్మభూమిలో ప్రతి నియోజకవర్గానికి రెండు వేల కొత్త పింఛన్లు మంజూరు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రకటన చూస్తే అందరికీ పింఛన్లు ఇస్తారన్నట్టుగా కనిపిస్తోంది. కానీ, ఇంతవరకూ అర్హుల ఎంపికే పూర్తి కాలేదు.
    అందరికీ అందని రేష¯ŒS కార్డులు
    గృహనిర్మాణం, పింఛన్లు కాకుండా మూడో ప్రాధాన్య అంశం రేష¯ŒS కార్డులు. 2015 డిసెంబర్‌నాటికి జిల్లాలో సుమారు 2 లక్షల మంది రేష¯ŒS కార్డుల కోసం దరఖాస్తు చేసుకోగా, పరిశీలన అనంతరం లక్షా 60 వేల మంది అర్హులని లెక్క తేల్చారు. ఆ తరువాత 2016 జనవరిలో నిర్వహించిన మూడో విడత జన్మభూమిలో లక్షా 19 వేల మందికి పంపిణీ చేశారు. మిగిలిన లబ్ధిదారులకు తరువాత ఇస్తామని చెప్పి చేతులు దులుపేసుకున్నారు. అప్పటినుంచీ కార్డుల కోసం దరఖాస్తుదారులు మండల కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతూనే ఉన్నారు. కాకినాడ అర్బ¯ŒSలో 6,798, రాజమహేంద్రవరం అర్బ¯ŒSలో 5,156, మున్సిపాల్టీల్లో వెయ్యికి పైబడి, మండలాల్లో వందల సంఖ్యలో దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈవిధంగా జిల్లావ్యాప్తంగా 40 వేలకు పైగా దరఖాస్తులు అపరిష్కృతంగా ఉన్నాయి. గతంలో ఇవ్వాల్సినవాటితో కలిపి మొత్తం 63,416 మంది లబ్ధిదారులకు ఈసారి జన్మభూమిలో రేష¯ŒS కార్డులు పంపిణీ చేస్తామంటున్నారు. వీరు కాకుండా మరో 35 వేల మంది కొత్తగా దరఖాస్తు చేసుకున్నవారు కూడా ఉన్నారు. ఒక్క కాకినాడ నగరంలోనే ఈరకంగా దరఖాస్తు చేసుకున్నవారి సంఖ్య 7 వేలకు పైగా ఉంది. గతంలో దరఖాస్తు చేసుకున్నవారికి పూర్తిగా ఇస్తే.. అప్పుడు మిగిలినవారి సంగతి చూద్దామని అధికారులు చెబుతున్నారు.
     
    రమణయ్యపేటలో నేడు ప్రారంభం
    జన్మభూమి – మా ఊరు కార్యక్రమానికి కలెక్టర్‌ హెచ్‌.అరుణ్‌కుమార్‌ పర్యవేక్షణలో అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. జిల్లా మంత్రులు సోమవారం ఉదయం కాకినాడ రూరల్‌ రమణయ్యపేటలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ప్రతి గ్రామంలో మూడున్నర గంటలపాటు గ్రామసభలు నిర్వహించి, సంక్షేమ కార్యక్రమాలు, రుణమాఫీ, వాటి ద్వారా ఆ గ్రామస్తులకు చేకూరిన లబ్ధి, లబ్ధిదారుల వివరాలు, గ్రామాభివృద్ధి ప్రణాళికలు, ప్రజా విజ్ఞప్తులపై తీసుకున్న చర్యలను వివరించాలి. నగదు రహిత లావాదేవీలపై అవగాహన కల్పించాలి. కొత్తగా మంజూరు చేసిన పింఛన్లు, చంద్రన్న బీమా, రేష¯ŒS కార్డులు, డ్వాకా సంఘాల సభ్యుల పిల్లలకు మంజూరైన ఉపకార వేతనాలను పంపిణీ చేస్తారని చెబుతున్నారు. ఈవిడత జన్మభూమికి జిల్లా ప్రత్యేకాధికారిగా ఐ.శ్రీనివాస శ్రీనరేష్‌తోపాటు డివిజ¯ŒSకో అధికారిని పర్యవేక్షకులుగా నియమించారు. 
     
     
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement