వాషింగ్టన్: అమెరికాలో ఉంటున్న భారతీయుల్లో 4 లక్షల మందికి పైగా తమ జీవిత కాలంలో గ్రీన్ కార్డ్ కళ్లజూడలేరని తాజా అధ్యయనం ఒకటి పేర్కొంది! ఆ లోపే వారు కన్ను మూస్తారని అభిప్రాయపడింది. అమెరికాలో ఈ ఏడాది ఉద్యోగాధారిత గ్రీన్ కార్డ్ పెండింగు దరఖాస్తులు ఏకంగా 18 లక్షలు దాటాయి. వీటిలో ఏకంగా 63 శాతం, అంటే 11 లక్షలకు పైగా భారతీయులవే! దాదాపు 2.5 లక్షలు, అంటే 14 శాతంతో చైనా రెండో స్థానంలో ఉంది.
కానీ ఏటా గరిష్టంగా జారీ చేసే గ్రీన్ కార్డుల్లో ఏ దేశానికీ 7 శాతం కంటే ఇవ్వరు. ఈ నిబంధన వల్ల భారతీయులకు తీవ్ర అన్యాయం జరుగుతూ వస్తోంది. ఈ కారణంగా జీవిత కాలంలో గ్రీన్ కార్డు పొందలేని 4.24 లక్షల మందిలో ఏకంగా 90 శాతానికి పైగా భారతీయులే ఉంటారని అధ్యయనం చెబుతోంది. 83 లక్షల కుటుంబ ఆధారిత గ్రీన్ కార్డు పెండింగ్ దరఖాస్తులు వీటికి అదనం!
Comments
Please login to add a commentAdd a comment