ఐదేళ్ల క్రితం కూలిన ఇల్లు..
ప్రస్తుతం పిల్లలతో కలసి అద్దెకుంటున్న మహిళ
ఇందిరమ్మ పథకానికి ఎంపిక చేయని వైనం
చిగురుమామిడి (కరీంనగర్ జిల్లా): అద్దె ఇంట్లో ఉంటుందన్న కారణంతో ఓ మహిళకు అధికారులు ఇందిరమ్మ ఇల్లు (Indiramma Illu) మంజూరు చేయ లేదు. దీంతో కూలి పనితో కుటుంబ పోష ణ చేసుకుంటున్న తనకు న్యాయం చేయా లని ఆ మహిళ వేడుకుంటోంది.
వివరాలిలా ఉన్నాయి.. కరీంనగర్ జిల్లా చిగురుమామిడికి చెందిన వేల్పుల అంజలి భర్త ఆరేళ్ల క్రితం మృతి చెందారు. ఇద్దరు ఆడ పిల్లలతో నివాసం ఉంటున్న ఆమె పెంకుటిల్లు ఐదేళ్లక్రితం కూలిపోయింది. కొంతకాలం కూలిన ఇంటిపైనే రేకులు వేసుకుని జీవనం సాగించింది. అయితే గాలి దుమారం, కోతుల బెడదతో వేగ లేక ఆ ఇంటిని ఖాళీ చేసింది.
ప్రస్తుతం అద్దె ఇంట్లో జీవనం సాగిస్తోంది. కూలిపని చేసుకుంటూ కూతుళ్లను చదివిస్తోంది. కనీసం గుంట భూమి కూడా లేని ఆమె, ఇటీవల ఇందిరమ్మ ఇల్లు కోసం దరఖాస్తు చేసుకుంది. కానీ గురువారం జరిగిన గ్రామసభలో ప్రకటించిన జాబితాలో అంజలి పేరు రాలేదు. ఈ విషయమై అక్కడి అధికారులను నిలదీయగా.. అద్దె ఇంట్లో ఉంటున్నందున ఇల్లు మంజూరు కాలేదని కార్యదర్శి సమాధానం ఇచ్చారని వెల్లడించింది. ఈ విషయంలో కలెక్టర్ జోక్యం చేసుకుని తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూ రు చేయాలని అంజలి వేడుకుంటోంది.
Comments
Please login to add a commentAdd a comment