సాక్షి,హైదరాబాద్: ఇందిరమ్మ ఇళ్ల పథకంపై కేంద్రమంత్రి బండి సంజయ్‌కి పీసీసీ ఛీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. శనివారం(జనవరి25) మహేష్‌కుమార్‌గౌడ్ గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. ‘బండి సంజయ్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు. ప్రధానమంత్రి ని గౌరవిస్తాం. ఇంధిరమ్మ త్యాగం ముందు మీరు, మీ మోదీ ఎంత. ఇంధరమ్మను బండి సంజయ్ అవమానిస్తున్నారు.
బండి సంజయ్ క్షమాపణ చెప్పాలి. కాంగ్రెస్ మాట ఇస్తే మడమ తిప్పదని రేపు నాలుగు పథకాలు ప్రారంభించి మరోసారి నిరూపించుకోబోతున్నాం. రేపు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు పండుగ జరుపుకోవాలి. పదేళ్లలో బీఆర్‌ఎస్ కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదు. ఇండ్లు ఇవ్వలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరుతో అయినా గత పాలకులకు కనివిప్పు కలగాలి.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేల అనుచరులకే సంక్షేమ పథకాలు వచ్చాయి. మా ప్రభుత్వంలో కాంగ్రెస్ కార్యకర్తలే లబ్ధిదారుల లిస్ట్‌లో పేరు లేదని ఫిర్యాదు చేస్తున్నారు. మేం ఎవరిపై కక్ష సాధింపు చర్యలు చేపట్టలేదు. తప్పు చేస్తే మాత్రం చర్యలు తప్పవు’అని మహేశ్ గౌడ్ స్పష్టం చేశారు.
కాగా, ఇందిరమ్మ(Indiramma house) పేరు పెడితే ఒక్క ఇల్లు కూడా కేంద్రం ఇవ్వదంటూ కేంద్రమంత్రి బండి సంజయ్(Bandi Sanjay) షాకింగ్ కామెంట్స్ చేశారు. ‘ప్రధానమంత్రి ఆవాస్ యోజన’(Pradhan Mantri Awas Yojana) పేరు పెడితేనే నిధులిస్తామంటూ తేల్చి చెప్పారు. కాంగ్రెస్ ఫొటోలు పెడితే రేషన్ కార్డులు ఇవ్వం.. మేమే ముద్రించి ప్రజలకు రేషన్‌కార్డులు ఇస్తామని బండి సంజయ్ చెప్పారు.
కరీంనగర్‌లో మేయర్, కార్పొరేటర్లు బీజేపీలోకి చేరిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం ఇచ్చిన నిధులు, చేసిన అభివృద్ధి గుర్తించి బీజేపీలో చేరడం సంతోషమన్నారు బీఆర్ఎస్ హయాంలో చాలా ఇబ్బందులు పెట్టారు. రాజకీయ ఒత్తిళ్లతో బీఆర్ఎస్‌లో ఉన్న సునీల్‌రావు కూడా ఏం చేయలేకపోయారు. నేను హైదరాబాద్‌లో మీటింగ్‌లో గొడవ చేసిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చాక నిధులు విడుదల చేశారని బండి సంజయ్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment