మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక, సేవలను మరింత పారదర్శకంగా అందించడానికి ప్రత్యేక వెబ్‌సైట్‌ను ప్రభుత్వం ప్రారంభించింది. ఫిర్యాదుల కోసం ఇంది రమ్మ ఇళ్ల గ్రీవెన్స్ మాడ్యూల్‌ను తెచ్చినట్లు రెవె న్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. గురువారం సచివాల యంలోని తన కార్యాలయంలో ఈ గ్రీవెన్స్ మాడ్యూల్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో ఏమైనా సమస్యలు ఎదురైతే indirammaindlu.telangana.gov.in కు ఫిర్యాదు చేయవచ్చని, ఆ ఫిర్యాదులపై ఎప్పటి కప్పుడు చర్యలు తీసుకుని, వివరాలను ఫిర్యాదు దారు మొబైల్‌కు మెసేజ్ రూపంలో పంపిస్తామని తెలిపారు.
ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల పరిశీలన ఈనెల 8వ తేదీనాటికి 32 జిల్లాలలో 95% పూర్తికాగా, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 88% పూర్తయిందన్నారు. త్వరలో లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేసి ఇళ్ల నిర్మాణం కార్యాచరణపై దృష్టి సారిస్తా మన్నారు. మొదటి విడతలో నివాస స్థలం ఉన్నవారికి, రెండో దశలో ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లను మంజూరు చేస్తామన్నారు, మొదటి విడతలో వికలాంగులు, ఒంటరి మహిళలు, అనాథలు, వితంతువులు, ట్రాన్స్‌జెండర్లు, అత్యంత ప్రాధా న్యత ఇవ్వాలని అధికారులకు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment