Jupudi Prabhakara Rao
-
బిల్డప్ ఎక్కువ బిజినెస్ తక్కువ..చంద్రబాబుపై జూపూడి ఫైర్
-
పేదలపై టీడీపీ కూటమి ప్రభుత్వం కక్ష
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పేదలపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులకు దిగిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు జూపూడి ప్రభాకరరావు విమర్శించారు. 20 ఏళ్లు పూర్తయిన అసైన్డ్ భూములపై లబ్ధిదారులైన పేదలకు పూర్తి హక్కులు కల్పిస్తూ గత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే, ఇప్పుడు ఆ అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్లు ఆపాలంటూ ఆదేశాలివ్వడం అత్యంత దుర్మార్గమని మండిపడ్డారు. సోమవారం హైదరాబాద్‌లోని సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. అసలైన లబ్ధిదారుల పేరుపై మాత్రమే రిజిస్టర్ చేసి వారికి మాత్రమే అమ్ముకునే అవకాశం వైఎస్ జగన్ హయాంలో ఇచ్చారని, ఇప్పుడు ప్రభుత్వ నిర్ణయం వల్ల లక్షలాది రైతుల పరిస్థితి గందరగోళంగా మారిందని చెప్పారు. ఆ అసైన్డ్ భూములపై ఇప్పటికే అధికార పార్టీ నాయకులు కన్నేశారని, పలు చోట్ల వారు పేదలను బెదిరించి భూములు స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. వైఎస్సార్సీపీ హయాంలో పలు రకాల భూములను నిషేధిత జాబితాల నుంచి తొలగించి, భూములపై హక్కులు కల్పించడం ద్వారా రైతులకు మేలు చేస్తే, చంద్రబాబు ఇప్పుడు వారిని ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఒక్క సెంటు భూమి కూడా రైతులకు ఇవ్వలేదని, కానీ గత ప్రభుత్వం కొత్తగా 42,307 మంది రైతులకు 46,463 ఎకరాల అసైన్డ్ భూములు పంపిణీ చేసిందని తెలిపారు. మేనిఫెస్టో హామీలను అమలు చేయలేక, ప్రజల దృష్టి మళ్లించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. -
ఇంగ్లిష్ వ్యతిరేకులు పేదల శత్రువులు
ఈనాడు వైఎస్ జగన్ నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వచ్చే విద్యా సంవత్సరం నుంచీ ప్రాథమిక విద్యా స్థాయి నుంచీ ప్రవేశపెట్టబోతున్న ఇంగ్లిష్ మీడియంను వ్యతి రేకిస్తున్న వారందరూ, వారి పూర్వీకులూ లేదా వారి వారసులూ ఇంగ్లిష్ మీడియంలోనే చదువు కున్నారనీ, చదువుకుంటున్నారనీ బహుజన పేద లందరికీ తెలుసు. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, మద్రాసు, గుంటూరు, విజయవాడ, బందరు, రాజమండ్రి... తదితర ప్రఖ్యాత విద్యా కేంద్రా లలో అటు ప్రొటెస్టంట్, ఇటు క్యాథలిక్ విద్యా సంస్థలలో ఇంగ్లిష్ విద్యను నేర్చుకున్నవారే తొలి తరం జాతీయ నాయకులు, విద్యావేత్తలు, మేధా వులు, శాస్త్ర సాంకేతిక నిపుణులు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది ఎన్నారైలు, రాష్ట్ర వ్యాప్తంగా పది లక్షలకు పైబడిన తెలుగువారు విదేశాల్లో నేడు స్థిర పడ్డారంటే అది మెకాలే ఆంగ్ల విద్య, క్రైస్తవ మిష నరీ విద్యా సంస్థల చలవేనని గుర్తుంచుకోవాలి. బీజేపీ, కాంగ్రెస్, కమ్యూనిస్టు... వంటి జాతీయ పార్టీల ఒకప్పటి, ఇప్పటి ఉన్నత శ్రేణి కురువృద్ధ నాయకులందరూ క్రైస్తవ మిషనరీ, మెకాలే ఆంగ్ల విద్యా విధానంలోనే చదివినవారు. అదే విధంగా టీడీపీ, జనసేన లాంటి ఆంధ్ర పార్టీల నాయకులు, వారి పిల్లల పరిస్థితి కూడా. ఈ పార్టీలలోనే ధనికులు, కొందరు ప్రైవేటు ఇంగ్లిష్ మీడియం స్కూళ్లు, కాలేజీలు నడుపు కుంటూ తమ పిల్లల్ని ఇంగ్లిష్ భాషలోనే మునక లేయిస్తూ తెలుగుభాష మరణశయ్యపై ఉందని మొసలి కన్నీరు కారుస్తున్నారు. బహుజన పేద విద్యార్థులకు ఇంగ్లిష్ భాషా జ్ఞానం అందకూడదని పన్నాగం పన్నుతున్నారు. జాతీయ, అంతర్జాతీయ శాస్త్ర సాంకేతిక విజ్ఞా నమంతా ఇంగ్లిష్‌లోనే ఉంది. సాఫ్ట్వేర్, ఇన్ఫర్మే షన్ టెక్నాలజీ, మెడిసిన్, ఐఐటీ, ఐఐఎం, స్పేస్ సైన్స్, కంప్యూటర్ ప్రోగ్రామింగ్, ఇంజనీరింగ్.. వంటి అగ్రశ్రేణి శాస్త్ర సాంకేతిక విజ్ఞాన విద్యను దేశంలోనూ, అమెరికా, ఇంగ్లండ్‌లోనూ ఇంగ్లిష్ లోనే బోధిస్తారు. అంతర్జాతీయ స్థాయి శాస్త్ర సాంకే తిక నిపుణులుగా ఎదగాలంటే 1వ తరగతి నుంచీ ఇంగ్లిష్ విద్య పునాది ఉండాలి. నేటి పోటీ ప్రపం చంలో ఇది తప్పనిసరి. లేకపోతే ఆయా శాస్త్ర సాంకేతిక వృత్తి విద్యా పదాలను తెలుగులోనే నేర్చుకొని ఉన్నత స్థాయిలో విద్యాభ్యాస సమ యంలో ఇంగ్లిష్‌లో అర్థం చేసుకోవడం కష్టమై చదువు మధ్యలో ఆపేయడం లేదా వెనుకబడి పోవడం వంటి దుస్థితిలో బహుజన విద్యార్థులు చిక్కుకుంటారు. యూనివర్సిటీ స్థాయి ఉన్నత విద్యలో ఇంగ్లిష్ మీడియం గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో (జీఈఆర్) 12.4 శాతం మాత్రమే మన దేశం సాధించింది. ప్రపంచ సగటులో ఇది సగ భాగం మాత్రమే. ఇక గ్రామీణ దళిత యువత జీఈఆర్ 6 శాతం ఉంటే, అత్యంత దయనీయంగా 2 శాతం దళిత యువ మహిళల శాతం ఉంది. మహాత్మ పూలే, పెరియార్, డాక్టర్ అంబేడ్కర్ లాంటి ఎందరో భారతీయ మేధావులు జ్ఞానాన్ని పొందేందుకు భాషను ఒక సాధనంగా భావిం చారు. విద్య పొందాలంటే భాష ఒక మాధ్యమ మేనని విశ్వసించారు. మరి అంతర్జాతీయ స్థాయి విజ్ఞానాన్ని విద్య ద్వారా పొందాలంటే, అది ఇంగ్లిష్ భాష ద్వారానే సాధ్యమౌతుంది. ఈ మహనీయుల విద్యా తత్వశాస్త్రాన్ని గుర్తించి, గౌర వించి, ఆచరించిన ముఖ్యమంత్రి జగన్ క్రాంత దర్శి, రాజనీతిజ్ఞుడు, రాజకీయ కోవిదుడు. పూలే, పెరియార్, అంబేడ్కర్, అనేక బహు జన మేధావులు భావిస్తున్నట్లు, సూచిస్తున్నట్లు ఇక ఇంగ్లిష్ ఎంతమాత్రమూ భాష కాదు, కానేకాదు, కానేరదు. ఇంగ్లిష్ ఒక జ్ఞానం, ఒక నైపుణ్యం. ఇంగ్లిష్ పునాది లేకపోతే బహుజన పేద వర్గాల విద్యార్థినీ, విద్యార్థులు నైపుణ్యం, జ్ఞానం లేని కార్మికులుగానే ఉండిపోతారు. ఇదే ఇంగ్లిష్ వ్యతి రేకించేవారి కుటిల రాజనీతి. అందుకే బహుజన పేద విద్యార్థులకు చిన్ననాటి నుంచే ఆంగ్ల విద్యను అందించాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్, రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించే ఆధిపత్య ధనిక వర్గ పార్టీలూ, వాటి నాయకులూ బహుజన పేదల శత్రువులని ప్రకటించాల్సిన సందర్భం నేడు తెలుగు ప్రజల ముందుంది. ఇంగ్లిష్‌ను కాపాడు కుందాం! ఇంగ్లిష్ మనల్ని కాపాడుతుంది!! (నేడు తిరుపతిలో ‘పేద ప్రజలు, ప్రభుత్వం, ఆంగ్ల విద్య’ అంశంపై సెమినార్ సందర్భంగా) జూపూడి ప్రభాకరరావు వ్యాసకర్త వైఎస్సార్సీపీ రాష్ట్ర నాయకులు, ఏపీ ఎస్సీ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్, మొబైల్ : 90148 63300 -
ఈసీకి ఇంగిత జ్ఞానం లేదు: జూపూడి
న్యూఢిల్లీ : ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు సహా ముగ్గురు పోలీసు ఉన్నతాధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేయడంతో టీడీపీ నేతలు విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నారు. ఎలక్షన్ కమిషన్‌కు కనీస ఇంగిత జ్ఞానం, పరిజ్ఞానం, నియమ నిబంధనలు తెలియవంటూ ఆ పార్టీ నేత జూపూడి ప్రభాకర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పోలీసు ఉన్నతాధికారులపై బదిలీ వేటును ప్రశ్నిస్తూ సీఎం చంద్రబాబు నాయుడు రాసిన లేఖను కనకమేడల రవీంద్రకుమార్‌తో కలిసి ఢిల్లీకి తీసుకెళ్లిన జూపూడి మీడియాతో మాట్లాడుతూ ఈసీపై ఫైర్ అయ్యారు. ఒక పార్టీ ఫిర్యాదు చేస్తే కనీసం పరిశీలించకుండా ఎలా నిర్ణయం తీసుకుంటారని ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు రక్షణ బాధ్యతలు చూసుకునే ఇంటలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వర్లును ఎలా బదిలీ చేస్తారన్నారు. అసలు ఆయనపై చర్యలు తీసుకునే హక్కు కేంద్ర ఎన్నికల సంఘానికి లేదని, ఇంటలిజెన్స్ చీఫ్ ఎన్నికల పరిధిలోకే రాడన్నారు. చంద్రబాబుకు ముప్పు ఉందని, ఆయన జెడ్ కేటగిరి సంరక్షణలో ఉన్నారని తెలిపారు. అలాంటి సీఎం భద్రతను చూసే అధికారిపై వేటు వేస్తారా అంటూ ప్రశ్నించారు. ఇక ‘ఏబీ’ని కాపాడేందుకు ఈసీ ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఏపీ ప్రభుత్వం హడావుడిగా వివాదాస్పద జీవో జారీచేసింది. -
సినిమాల్లో బ్రహ్మానందంలా ఆయన తీరు
-
సినిమాల్లో బ్రహ్మానందంలా ఆయన తీరు
సాక్షి, అమరావతి : వైఎస్ జగన్ తల్లి విజయమ్మ, సోదరి షర్మిలపై ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్‌తో నీచ వ్యాఖ్యలు చేయించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తాజాగా తన వ్యూహాన్ని మార్చినట్టు కనిపిస్తోంది. వైఎస్ జగన్‌పై విజయమ్మ, షర్మిలే దాడి చేయించారంటూ రాజేంద్రప్రసాద్ చేసిన అత్యంత దిగజారుడు వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తడంతో చంద్రబాబు ఆత్మరక్షణలో పడ్డారు. ఈ క్రమంలో ఆయన వ్యాఖ్యలను ఖండిస్తూ.. టీడీపీ నేత జూపూడి ప్రభాకర్‌రావు మీడియా ముందుకు వచ్చారు. ఇంత తీవ్రమైన వ్యవహారం నడుస్తున్నప్పుడు జోక్‌లు చేయడం సరికాదని రాజేంద్రప్రసాద్‌కు జూపూడి హితవు పలికారు. ఎమ్మెల్సీ మాట్లాడిన తీరు సినిమాల్లో బ్రహ్మానందం కామెడి చేసినట్టుగా ఉందని ఎద్దేవా చేశారు. రాజేంద్రప్రసాద్ వ్యవహరించిన తీరు మొత్తం వ్యవహారాన్ని తప్పదోవ పట్టించేదిగా ఉందని విమర్శలు గుప్పించారు. బాధ్యతగల పదవిలో ఉన్న రాజేంద్రప్రసాద్ చేసిన వ్యాఖ్యలు ఆయన విజ్ఞతకే వదిలేయాలనీ, ఎమ్మెల్సీ అనుచిత వ్యాఖ్యలపై ఏం చర్యలు తీసుకోవాలో పార్టీ నిర్ణయిస్తుందని జూపుడి చెప్పుకొచ్చారు. అయితే, రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు రావడంతో చంద్రబాబే జూపూడితో మాట్లాడించారని, రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలతో పార్టీకి సంబంధం లేదని జూపూడితో చెప్పించి.. ఈ వ్యాఖ్యల నుంచి దూరం జరిగేందుకు చంద్రబాబు ప్రయత్నించారని టీడీపీ వర్గాలు అంటున్నాయి. -
రూ.1,100కోట్ల రాయితీ రుణాలు
ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్‌రావు నెల్లూరు రూరల్ : ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 99,464 మందికి రూ.1,100 కోట్ల రాయితీ రుణాలను అందిస్తున్నట్లు చైర్మన్ జూపూడి ప్రభాకర్‌రావు అన్నారు. మంగళవారం మినిబైపాస్ రోడ్డులోని టీడీపీ నేత ఆదాల ప్రభాకర్‌రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో ప్రభుత్వ పథకాల ప్రచారం నిర్వహించి, వారిని టీడీపీలో చేర్చేందుకు ప్రతి కార్యకర్త పనిచేయాలని సూచించారు. రాష్ట్ర రాజధాని అమరావతిలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ 125వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. దళితులను మోసం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తుందని విమర్శించారు. రాష్ట్రంలో లక్షమంది యువకుల స్కిల్స్ డెవలప్మెంట్కు ప్రత్యేక శిక్షణ ఇచ్చి, ఉపాధి, ఉద్యోగ అవకాశాల కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతరం సీఎం రీలీఫ్ ఫండ్ చెక్కును బాధితులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర, జిల్లా పరిశీలకుడు నరసింహయాదవ్, విజయ డైయిరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, ఆనం జయకుమార్‌రెడ్డి, స్వర్ణా వెంకయ్య పాల్గొన్నారు. -
మిత్రధర్మం పాటించాల్సిన అవసరం లేదు: జూపూడి
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇగో ప్రదర్శిస్తున్నారు. ఆయన తీరు నచ్చక ఇప్పటికే అన్ని ప్రాంతీయ పార్టీలు వదిలేసి వెళ్లిపోతున్నాయని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకరరావు చెప్పారు. మంగళవారం ఆయన విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో తెలుగునాడు స్టూడెండ్ ఫెడరేషన్ (టీఎన్ఎస్ఎఫ్) ఆధ్వర్యాన ‘ప్రత్యేక హోదా నిజానిజాలు- ప్రతిపక్షాల కుట్రలు’ అంశంపై జరిగిన చర్చావేదికలో పాల్గొన్నారు. జూపూడి మాట్లాడుతూ.. మోడీతో కలిసి ఉండటానికి వీల్లేదని శివసేన, అకాలీదళ్ వెళ్లిపోగా టీడీపీ మాత్రమే మిత్రధర్మం పాటిస్తోందన్నారు. బీజేపీ శత్రువైఖరిని అవలంభిస్తే మిత్రధర్మం పాటించాల్సిన బాధ్యత తమకు లేదని స్పష్టం చేశారు. రాష్ట్ర విభజనానంతరం బాధ్యత వహించాల్సిన బీజేపీ.. ప్రజల తిరస్కరణకు గురైన కాంగ్రెస్ పార్టీబాటలోనే పయనిస్తోందన్నారు. ప్రత్యేక హోదా విషయంలో కాంగ్రెస్ చేసిన మోసాన్నే చేస్తే ఆ పార్టీకి పట్టిన గతే బీజేపీకి పడుతుందని హెచ్చరించారు. 'ప్రత్యేకహోదాపై తిరుపతిలో మోదీ ప్రకటించారనే ఆయన్ను అమరావతికి పిలిచాం. అమరావతిలో తమను అవమానించిన మోదీ పార్లమెంట్లో అరుణ్‌జైట్లీ ద్వారా వినిపించిన విధానమేదైతే ఉందో అది నచ్చక సీఎం చంద్రబాబు సీరియస్‌గా ఉన్నారు’ అని జూపూడి పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో మోదీ రాష్ట్ర పర్యటనలో భాగంగా చేసిన వాగ్దానాలను నిలుపుకోవాలని డిమాండ్ చేశారు. విభజన సమయంలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రానికి ప్రత్యేక హోదా, వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఏపీ గెజిటెడ్ జేఏసీ చైర్మన్ కృష్ణయ్య, జేఏసీ ప్రధాన కార్యదర్శి వరలక్ష్మీ, టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు బ్రహ్మం చౌదరి, జాతీయ నాయకులు ఎ.రాజేష్, వివిధ జిల్లాల నాయకులు పాల్గొన్నారు. -
జూపూడి, చెంగల మధ్య ముగిసిన వివాదం
హైదరాబాద్ : ఎమ్మెల్సీ చెంగల్రాయుడు, జూపూడి ప్రభాకరరావుల మధ్య వివాదం ఎట్టకేలకు ముగిసింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రకటన అంశంపై శాసనమండలిలో మాట్లాడుతున్న తనను చెంగల్రాయుడు దూషించి అవమానపరిచారంటూ శుక్రవారం ఉదయం జూపూడి ఛైర్మన్ పోడియం ముందు బైఠాయించి నిరసనకు దిగారు. దాంతో తన వ్యాఖ్యలు జూపూడికి బాధకలిగించి ఉంటే ఉపసంహరించుకుంటున్నట్లు చెంగల్రాయుడు తెలిపారు. ఈ సందర్భంగా కౌన్సిల్ ఛైర్మన్ చక్రపాణి మాట్లాడుతూ చెంగల్రాయుడు వ్యాఖ్యలు రికార్డుల్లోకి వెళ్లలేదన్నారు. మరోవైపు చెంగల్రాయుడిపై జూపూడి సభా హక్కుల నోటీసు ఇచ్చారు. -
'జూపూడికి వైఎస్సార్ సీపీ అత్యధిక ప్రాధాన్యం ఇచ్చింది'
నెల్లూరు:జూపూడి ప్రభాకర రావుకి వైఎస్సార్ సీపీ అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిందని ఆ పార్టీ నేతలు స్పష్టం చేశారు. దళితులకు వైఎస్సార్ కుటుంబం అధిక ప్రాధాన్యత ఇచ్చిందని ఎంపీ వరప్రసాద్, ఎమ్మెల్యే నారాయణ స్వామిలు తెలిపారు. తన ఓటమికి సుబ్బారెడ్డే కారణమని జూపూడి చెప్పడం దురదృష్టకరమన్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ కార్యాలయంలోమాట్లాడిన పార్టీ నేతలు.. ఇప్పటికైనా జూపూడి తన నిర్ణయాన్ని మార్చుకోవాలన్నారు. వైఎస్సార్ సీపీ తరుపునే అధిక సీట్లను దళితులే గెలిచారని వారు తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జూపూడి ప్రభాకర రావు శనివారం పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. తనంతట తానుగా పార్టీ నుంచి తప్పుకుంటున్నట్టు తెలిపారు.రాజీనామా లేఖను కొరియర్ ద్వారా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పంపానని జూపూడి చెప్పారు. పార్టీలో ఇమడలేకే ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. -
బీజేపీ సహకారంతోనే రాష్ట్ర విభజన
పొన్నలూరు, న్యూస్‌లైన్: పార్లమెంటులో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ సహకారంతోనేరాష్ట్ర విభజన చేపట్టిందని వైఎస్సార్ సీపీ కొండపి నియోజకవర్గ సమన్వయకర్త జూపూడి ప్రభాకరరావు అన్నారు. రెండో విడత ఈనెల 11వ తేదీ జరగనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం మండలంలోని ముత్తరాసుపాలెం, ముప్పాళ్ల, వేంపాడు, ఉప్పలదిన్నె, రావులకొల్లు, పొన్నలూరు, వెంకుపాలెం, రాజోలుపాడు, అగ్రహారం, తిమ్మపాలెం, పెద వెంకన్నపాలెం వరకు బైక్‌ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో జూపూడితో పాటు ఎమ్మెల్సీ పోతుల రామారావు, మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదెన్న, పార్టీ నాయకుడు మద్దులూరి మాలకొండయ్య తదితరులు పాల్గొన్నారు. బైక్ ర్యాలీలో పలు చోట్ల జూపూడి మాట్లాడుతూ రాజకీయ ప్రయోజనాలను ఆశించే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజనకు పూనుకుందన్నారు. ఇందులో టీడీపీ నాయకుడు చంద్రబాబు హస్తం కూడా ఉందని విమర్శించారు. తెలంగాణ ఇచ్చినందుకు సోనియానే కాదు..సహకరించినందుకు ఈ చిన్నమ్మను కూడా గుర్తుంచుకోండని పార్లమెంటులో బీజేపీ నాయకురాలు సుష్మాస్వరాజ్ వ్యాఖ్యానించారని, అలాంటి బీజేపీతో పొత్తుపెట్టుకోవడం టీడీపీకే చెల్లిందన్నారు. వలస నాయకులతో కిటకిటలాడుతున్న టీడీపీ ఏ క్షణంలోనైనా మునిగిపోతుందన్నారు. రాష్ట్రంలో స్థిరమైన పాలన అందించగల సత్తా జగన్‌కే ఉందన్నారు. ఎమ్మెల్సీ పోతుల రామారావు మాట్లాడుతూ పొన్నలూరు జెడ్పీటీసీ అభ్యర్థి అనుమోలు సాంబశివరావు, ఎంపీపీ అభ్యర్థి పల్నాటి వెంకటేశ్వరరెడ్డిని గెలిపించాలని కోరారు. కార్యక్రమానికి ముందుగా ముత్తరాసుపాలెంలోని ఆంజనేయస్వామి గుడిలో నాయకులు ప్రత్యేక పూజలు చేశారు. కొత్తశింగరబొట్లపాలెం గ్రామ నాయకుడు వేణుగోపాలరెడ్డి ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడటంతో ఆయన్ను పరామర్శించారు. గ్రామానికి చెందిన ధనకోటిరెడ్డికి జూపూడి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అగ్రహారం సర్పంచ్ నాయబ్స్రూల్, రాజోలుపాడు డీలర్ రూబేను పార్టీలో చేరారు. కొత్తపాలెం నాయకుడు మార్తాల వెంకటేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో 30 కుటుంబాలవారు, కల్లూరివారిపాలెంకు చెందిన కల్లూరి వెంకటేశ్వరరెడ్డి, బసిరెడ్డి సుబ్బారెడ్డి కాంగ్రెస్ నుంచి వైఎస్సార్ సీపీలో చేరారు. చెరువుకొమ్ముపాలేనికి చెందిన పిల్లి గంగిరెడ్డి, పిల్లి వెంకటేశ్వర్లు కుటుంబాలు టీడీపీ నుంచి జూపూడి సమక్షంలో పార్టీలో చేరాయి. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ఈశ్వరరెడ్డి, మండల కన్వీనర్ బెజవాడ వెంకటేశ్వర్లు, స్టీరింగ్ కమిటీ సభ్యుడు రాఘవరెడ్డి,పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు పిల్లి లక్ష్మీనారాయణరెడ్డి, ఏఎమ్‌సీ వైస్ చైర్మన్ ఎస్ఏ లియాఖత్‌తో పాటు మండలంలోని అన్ని గ్రామాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
ఒంటరిగా జగన్‌ను ఎదుర్కోలేకే: జూపూడి
సాక్షి, హైదరాబాద్: తమ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డిని నేరుగా ఎదుర్కొనే ధైర్యంలేకే టీడీపీ ఇతర పార్టీలతో పొత్తులకు సిద్ధమైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీజీసీ సభ్యుడు, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకరరావు ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఒక్కడిగా ఎన్నికలకు వెళ్లే ధైర్యం చేయలేకే మోడీ, పవన్‌కల్యాణ్, కాంగ్రెస్, కిరణ్‌కుమార్‌రెడ్డి, జయప్రకాష్ నారాయణ్, సీపీఐలతో పొత్తులకోసం వెంపర్లాడుతున్నారని దుయ్యబట్టారు. జూపూడి శుక్రవారం పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుతం చంద్రబాబుకు ఒక్కడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనే శక్తి ఉందా అని సవాల్ విసిరారు. రాష్ట్రంలో పాలకపక్షం విఫలమైనప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా నిలబడాల్సిన టీడీపీ.. నిన్నటిదాకా పాలకపక్షాన్ని భుజాలపై మోసిందని దుయ్యబట్టారు. మళ్లీ ఎన్నికలోచ్చేసరికి ఒక్కడుగా పోటీ చేయలేక పవన్, మోడీ, జేపీ జపం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు వాళ్లందరితో పొత్తు కట్టినా ప్రజలు మాత్రం జగన్ పక్షానే ఉండాలని నిర్ణయం తీసేసుకున్నారని జూపూడి పేర్కొన్నారు. -
రాష్ట్రాన్ని విడగొట్టి ఒక్కటవుతున్నాయి: జూపూడి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన సమయంలో ద్వంద వైఖరిని ప్రదర్శించిన టీడీపీ, కాంగ్రెస్‌లు ఇప్పుడు ఒక్కటవుతున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీజీసీ సభ్యుడు ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్‌రావు వ్యాఖ్యానించారు. రాజశేఖరరెడ్డి మరణం తర్వాత నాలుగున్నర ఏళ్లుగా కలిసి పనిచేస్తున్న కాంగ్రెస్, టీడీపీలు... ఎన్నికల షెడ్యూలు వెలువడిన తర్వాత ఆ ముసుగును తీసేసి ఒకటిగా కలిసిపోతున్నారని దుయ్యబట్టారు. టీడీపీలో కాంగ్రెస్ విలీనం కావడానికి సిద్ధపడుతోందన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న టీడీపీ ‘పిల్ల టీడీపీ కాంగ్రెసో, తల్లి టీడీపీ కాంగ్రెసో’ చంద్రబాబే స్పష్టంచేయాలన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ నేతలను టీడీపీలోకి తీసుకోవడం కోసం చంద్రబాబు వారి పార్టీ కార్యకర్తలకు చేసిన హితోపదేశాన్ని ప్రత్యేక తెరపై జూపూడి ప్రదర్శించారు. ‘‘ఇది చారిత్రాత్మకమైన సమయం. కాంగ్రెస్ వాళ్లు ఎంత మంది వస్తే అంతమందిని కలుపుకోండి. గ్రామస్థాయితో పాటు ఎక్కడికక్కడ కలుపుకుంటే పార్టీ బలపడుతోంది. ఎక్కువ ఓట్లు వచ్చే అవకాశం ఉంది. నేను హైదరాబాద్ లేవల్లో ఆలోచన చేస్తున్నా. త్వరలో పార్టీలోకి చేర్చుకునే వారిని మీరు పేపర్లో చూస్తారు’’ అంటూ కార్యకర్తలను హైదరాబాద్‌కు పిలిచి కాంగ్రెస్‌తో చెలిమి చేయడం, వారిని కలుపుకోవడానికి గల కారణాలను చంద్రబాబు వివరిస్తూ ఉపోద్ఘాతం చేశారని దుయ్యబట్టారు. ఎన్నికల ముందు చంద్రబాబు ఇలాంటి ఎన్ని జిమ్మిక్కులు చేసినా ప్రజలు విశ్వసించరని చెప్పారు. 2009లో ఎన్నికల్లో కూడా మహాకూటమిని ఏర్పాటు చేసినా ప్రజలు చంద్రబాబును ఓడించారన్నారు. అవిశ్వాసం సందర్భంగా వచ్చిన 18 ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ కలిసి పనిచేసినా... ప్రజామోదంతో వైఎస్సార్సీపీ 15 స్థానాలను కైవసం చేసుకుందన్నారు. దీంతో ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు జరిగితే వాటి ఫలితాలు ప్రకటించొద్దంటున్నారని విమర్శించారు. తెలంగాణకు, సీమాంధ్రకు చంద్రబాబు తీరని ద్రోహం తలపెట్టారని జూపూడి మండిపడ్డారు. * సింగపూర్‌తో చంద్రబాబుకు విడదీయరాని బంధం ఉంది. కుటుంబంతో పాటు వ్యక్తిగత పనుల మీద ఆయనిప్పటి వరకు దాదాపు 200సార్లు వెళ్లివచ్చుంటారు. * సింగపూర్ అంటూ సీమాంధ్రలో వ్యవసాయం లేకుండా చేసేందుకు కుట్ర చేస్తున్నారా? రైతుల భూములన్నింటినీ లాక్కుంటారా? * హైదరాబాద్‌లో హైటెక్ సిటీ నిర్మాణాన్ని కాంట్రాక్టుకు ఇచ్చినందుకు పార్టీ కార్యాలయాన్ని, హెరిటేజ్ కార్యాలయాన్ని ఉచితంగా నిర్మించుకున్న విషయం ప్రజలకు గుర్తుంది. * చంద్రబాబు మాటలన్నీ నీటి మూటలే. ఆయనే గనుక రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినట్లయితే రెండుసార్లు ఎందుకు ఓడిపోయారు. చంద్రబాబు వన్నీ మాయమాటలు, నయవంచన. రాష్ట్రంలోనే కాదు దేశంలోనే చంద్రబాబు నమ్మదగిన వ్యక్తి కాదు. * కేంద్రమంత్రి పురందేశ్వరి మాపార్టీపై విమర్శలు చేసే అర్హతలేదు. చంద్రబాబు వెంట ఉండి తండ్రి ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిపించిన పురందేశ్వరి, ఇప్పుడు రాష్ట్ర విభజన జరుగుతుంటే కాంగ్రెస్, బీజేపీ పంచన చేరారు. * పురందేశ్వరి అధికార దాహం కోసం ప్రతీ పదేళ్లకు ఒకసారి పార్టీలు మారే సంప్రదాయముంది. ఆమెకు తండ్రి ఆత్మగౌవరమే కాదు తెలుగుప్రజల ఆత్మగౌరవం పట్టదు. -
సీమాంధ్రలో వ్యవసాయం ఏం చేస్తావు బాబూ?
హైదరాబాద్: టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సీమాంధ్రను సింగపూర్‌గా మారుస్తానంటున్నారని, సీమాంధ్రలో ఉన్న వ్యవసాయాన్ని ఏం చేస్తారు? అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర రావు ప్రశ్నించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు తీరుపై మండిపడ్డారు. రాష్ట్ర విభజనకు కాంగ్రెస్, టీడీపీలు కలిసి సనిచేశాయన్నారు. ఆ 2 పార్టీలు ఎప్పటి నుంచో తోడు దొంగలుగా వ్యవహరిస్తున్నాయన్నారు. కాంగ్రెస్ నేతలను కలుపుకుని పనిచేద్దామని టీడీపీ కార్యకర్తలకు చంద్రబాబు దిశానిర్ధేశం చేస్తున్నారని జూపూడి అన్నారు. కాంగ్రెస్, టీడీపీ నేతలు కలిసి తిరుగుతున్నారని విమర్శించారు. టీడీపీలో కాంగ్రెస్ విలీనం అవుతుందన్నారు. టీడీపీ కాస్త పిల్ల టీడీపీ కాంగ్రెస్‌గా మారిందని ఎద్దేవా చేశారు. -
చంద్రబాబు సర్పంచ్‌గా కూడా గెలవలేడు
ఒంగోలు, న్యూస్‌లైన్: రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేయడంలో పూర్తి మద్దతు ప్రకటించిన చంద్రబాబు ఎన్ని గోబెల్స్ ప్రచారాలు చేసినా ఆయన కనీసం సర్పంచ్‌గా కూడా గెలవలేరని వైఎస్సార్సీపీ కేంద్రపాలకమండలి సభ్యులు జూపూడి ప్రభాకరరావు అన్నారు. శనివారం సాయంత్రం స్థానిక వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో 75శాతం మంది జనాభా సమైక్యాంధ్రను కోరుకుంటున్నారని తెలిసినా అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీజేపీ, తెలుగుదేశం పార్టీ కుమ్మక్కై రాష్ట్రాన్ని ముక్కలు చేశాయని విమర్శించారు. నాడు వైఎస్సార్ వదిలేయడం వల్లే చంద్రబాబు జైలుపాలు కాకుండా తప్పించుకున్నారని, కానీ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వస్తే జైలుకు వెళ్లక తప్పదనే ఉద్దేశంతోనే కుట్రపన్ని జగన్మోహన్రెడ్డిని జైలుపాలు చేశారన్నారు. రాష్ట్ర విభజన విషయంలో భారతదేశ పార్లమెంట్ ఎలా వ్యవహరిస్తుందో అంటూ అత్యంత ఆసక్తిగా విదేశాలు చూశాయని, కానీ వాటి అంచనాలకు భిన్నంగా రాష్ట్ర విభజన ప్రక్రియను విజయవంతం చేశామని చెప్పడం హాస్యాస్పందంగా ఉందని జూపూడి అన్నారు. విభజనకు నాలుగు సార్లు లేఖ ఇచ్చిన చంద్రబాబు సీమాంధ్రలో ఏవిధంగా అడుగుపెట్టగలరన్నారు. కిరణ్‌కుమార్‌రెడ్డికి మిగిలిన ఏకైక మార్గం సొంత పార్టీ పెట్టుకోవడం ఒక్కటే అన్నారు. ఆయన పార్టీ పెట్టినా వైఎస్సార్సీపీకి ఎటువంటి నష్టం లేదని అన్నారు. సీమాంధ్రలోని 175 స్థానాల్లో 150 సీట్లను వైఎస్సార్సీపీ కైవసం చేసుకోవడం ఖాయమన్నారు. కేవలం టీడీపీ, కిరణ్ కలిపి పాతిక సీట్లలోపే పరిమితమవుతారని ప్రస్తుత సర్వేలు వెల్లడిస్తున్నాయని ప్రకటించారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నూకసాని బాలాజీ మాట్లాడుతూ రాష్ట్ర విభజనే ఏకైక లక్ష్యంగా సోనియా గాంధీ వ్యవహరించారని విమర్శించారు. కుమ్మక్కైన మూడు పార్టీలను జనం ఏమాత్రం క్షమించే ప్రశ్నే లేదన్నారు. -
ఒక్క సీటైనా లేని బీజేపీతో చర్చలా?: జూపూడి
సోనియా, ప్రధాని రాష్ట్ర ప్రజలతో చర్చించరేం?: జూపూడి ఎన్నికల సమయంలో తొందరెందుకు? సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఒక్క ఎంపీ కూడా లేని బీజేపీతో ప్రధాని మన్మోహన్సింగ్ రాష్ట్ర భవిష్యత్తుపై విందు రాజకీయాల్లో చర్చించడమేమిటని వైఎస్సార్ కాంగ్రెస్ సీజీసీ సభ్యుడు, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకరరావు ధ్వజమెత్తారు. ఆయన బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ... రాష్ట్రంలో 75 శాతం మంది ప్రజలు విభజనను వ్యతిరేకిస్తుంటే ప్రధానిగాని, సోనియాగాంధీ గాని ఇక్కడి ప్రజలతో చర్చించకుండా బీజేపీతో ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. విభజన బిల్లు విషయంలో కాంగ్రెస్ పార్లమెంటరీ సంప్రదాయాలన్నింటినీ తుంగలో తొక్కి అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. అందువల్ల ఈ విభజన బిల్లును ప్రజాస్వామ్య శక్తులన్నీ అడ్డుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇంకా ఆయన ఏమన్నారంటే... లోపభూయిష్టమైన ఈ బిల్లును గట్టెక్కించేందుకు కాంగ్రెస్‌పార్టీ ప్రజాస్వామ్య సంప్రదాయాలను పక్కకుపెట్టి కార్పొరేట్ కంపెనీలా పరుగులు తీస్తోంది. లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్ సైతం ఆర్టికల్ 371 (డి)ని సవరించాల్సిన అవసరం ఉందా? లేదా? అనే అంశంపై న్యాయ సలహా కోరారంటేనే ఈ బిల్లు ఎంత తప్పుల తడకగాఉందో అర్థమవుతోంది. సాధారణ ఎన్నికల షెడ్యూలు త్వరలో వెలువడుతున్న తరుణంలో మరో వారం రోజుల్లో ఇంటికి వెళ్లే ఈ ప్రభుత్వం విభజన బిల్లు విషయంలో ఎందుకు తొందరపడుతోంది? ఇదేమైనా దేశ అంతర్గత వ్యవహారాలకు సంబంధించిన అత్యవసరమైన బిల్లా..? లేక దేశంలో 60 కోట్ల జనాభా ఉన్న మహిళా సోదరీమణులకు చట్ట సభల్లో రిజర్వేషన్ కల్పించే బిల్లా..? ఎందుకంత తొందరపడుతున్నారు? వైఎస్ మరణానంతరం ప్రజల్లో ఉప్పొంగిన వైఎస్ సానుభూతిని దెబ్బ తీసేందుకు తొలుత తెలంగాణ చిచ్చు రాజేశారు. ఆ తరువాత టీడీపీతో కలిసి కుమ్మక్కు రాజకీయాలు చేశారు. ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వచ్చే ఎన్నికల్లో నామరూపాల్లేకుండా చేయాలనే దుర్భుద్ధి, కుట్రతోనే ఇంత అప్రజాస్వామికంగా బిల్లును తీసుకొస్తున్నారు. అసెంబ్లీకి ఈ బిల్లు వచ్చిన నాటి నుంచీ చర్చించడానికి ఇందులో ఏమీ లేదని తొలి నుంచీ వైఎస్సార్సీపీ చెబుతూ ఉన్నా ఏ మాత్రం పట్టించుకోలేదు. చర్చ జరిపించి చివరికి వచ్చేటప్పటికి ఇది ముసాయిదా బిల్లే కనుక తిరస్కరించాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు నాటకాలాడారు. రాష్ట్రం సమైక్యంగా ఉండటానికి వీరిద్దరూ చేసిందేమీ లేదు. విభజన నిర్ణయం వెలువడినప్పటినుంచీ మా పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి తీవ్రంగా ప్రతిఘటిస్తూనే ఉన్నారు. జైల్లో ఉండి కూడా దీక్షకు పూనుకున్నారు. లోక్‌సభను స్తంభింప జేసేందుకు బుధవారం ఆయన వెల్‌లోకి వెళ్లి నిరసన తెలిపారు. -
బయటకు వెళ్లాలంటే భయమేస్తోంది!: జూపూడి
మండలిలో వైఎస్సార్సీపీ నేత జూపూడి సాక్షి, హైదరాబాద్:‘సభలో కౌగిలించుకోవచ్చు.. బయటకు వెళితే విషపు చూపులు కనిపిస్తున్నాయి. కుటుంబాన్ని వదిలి వారంరోజులు బయటకు వెళ్లాలంటే కుటుంబానికి భద్ర త ఉంటుందో ఉండదోననే భయం వేస్తోంది..’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకరరావు అన్నారు. రాష్ట్ర విభజన జరిగితే పరిస్థితి మరింత కష్టంగా ఉంటుందని, అందుకే సమైక్యాంధ్ర కోరుకుంటున్నామని చెప్పారు. టీడీపీ, కాంగ్రెస్ కుట్రతో వచ్చిన రాష్ట్ర విభజన బిల్లును తాము వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లుపై చర్చలో భాగంగా జూపూడి శుక్రవారం శాసనమండలిలో మాట్లాడారు. హైదరాబాద్‌ను యాస పేరుతో విభజించాలని చూస్తున్నారని, ఇక్కడ పుట్టిన వాళ్లు మాత్రమే ఇక్కడ ఉండాలని అంటున్నారని చెప్పారు. ‘పాలకులు ఆంధ్రా ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేదు. పెట్టుబడులన్నీ హైదరాబాద్ చుట్టే తిరిగారుు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మాత్రం అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు ప్రయత్నం చేశారు...’ అని చెప్పారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ డి.శ్రీనివాస్ కల్పించుకుని వైఎస్ బలమైన, ప్రజాదరణ కలిగిన నాయకుడనే విషయంలో ఎలాంటి వివాదం లేదని, న్యాయపరమైన కోరిక అయిన తెలంగాణను అధిష్టానం పరిశీలిస్తోందని వైఎస్ సభలోనే చెప్పారని అన్నారు. ‘ఒక్కో ప్రాంతంలో ఒక్కో భాష ఉంటుంది, ఆయా ప్రాంతాన్ని బట్టి యాస ఉంటుంది.. వీటిని బట్టి రాష్ట్రాన్ని ముక్కలు చేస్తారా?’ అని వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ దేశాయ్ తిప్పారెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రం విడిపోతే కేంద్రాన్ని మెడలు వంచే స్థాయి నుంచి కాళ్లు పట్టుకునే స్థాయికి దిగజారుతామని హెచ్చరించారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఆమోస్ మాట్లాడుతూ దుర్బుద్ధితోనే పవర్ ప్రాజెక్టులన్నీ సీమాంధ్రలో ఏర్పాటు చేశారన్నారు. ఏఐసీసీ అధ్యక్ష పదవే గొప్ప: సీఎం ముఖ్యమంత్రి పదవికన్నా ఏఐసీసీ అధ్యక్ష పదవే గొప్పదని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యానించారు. శుక్రవారం శాసనమండలిలో ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్‌రావు మాట్లాడుతూ.. ఇప్పటివరకు 16 మంది సీఎంలైనప్పటికీ.. వారిలో దామోదరం సంజీవయ్య ఒక్కరే దళితుడని అన్నారు. ఆయన్నూ రెండేళ్లకే తప్పించారన్నారు. ఆ సమయంలో సీఎం స్పందిస్తూ ముఖ్యమంత్రిగా ఉన్న సంజీవయ్యను ఏఐసీసీ అధ్యక్షుడిగా చేశారని, సీఎం కంటే ఏఐసీసీ అధ్యక్షుడి పదవే గొప్పదని అన్నారు. -
'చంద్రబాబు స్వగ్రామానికి వెళ్లి పించన్ తీసుకోవడం మంచిది'
-
'చంద్రబాబు స్వగ్రామానికి వెళ్లి పించన్ తీసుకోవడం మంచిది'
హైదరాబాద్: టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మానసిక పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, ఈ పరిస్థితులలో ఆయన స్వగ్రామం వెళ్లి పించన్ తీసుకోవడం మంచిదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర రావు సలహా ఇచ్చారు. సంక్రాంతికి సొంత ఊరు వెళ్లి పాత స్నేహితులను కలిసి, వైఎస్ఆర్ను, జగన్మోహన రెడ్డినే విమర్శిస్తున్నారని చెప్పారు. ముందు మీ వైఖరి తెలిపి, ఆ తరువాత వైఎస్ఆర్ కాంగ్రెస్ గురించి మాట్లాడటం మంచిదన్నారు. బాబు తీరు చూస్తే టీడీపీ ఎటుపోతుందో అర్థం కావటం లేదన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు నాయుడులే విభజన ఛాంపియన్లన్నారు. విభజన జరగదని పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ చేసిన సీఎం విభజనకు అన్ని విధాల సహకరిస్తున్నారని చెప్పారు. బీఏసీకి చంద్రబాబు, సీఎం ఎందుకు రావటం లేదని ఆయన ప్రశ్నించారు. ఓటింగ్ ఉంటుందో లేదో సీఎం , స్పీకర్, చంద్రబాబు చెప్పటం లేదన్నారు. పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, కిరణ్, చంద్ర బాబు ఎందుకు అభిప్రాయం చెప్పటం లేదని జూపూడి ప్రశ్నించారు. -
'రాష్ట్రాన్ని గాలికొదిలేసిన అసమర్ధనేత చంద్రబాబు'
హైదరాబాద్: రాష్ట్ర విభజన విషయంలో నిర్ణయాన్ని వెల్లడించకుండా రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తున్న తెలుగుదేశం పార్టీపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడు, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకరరావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు తమ విధానాన్ని చెప్పకుండా రాష్ట్రాన్ని గాలికొదిలేసిన అసమర్ధనేత'' అని వైఎస్సార్ కాంగ్రెస్ నేత జూపూడి ధ్వజమెత్తారు. చంద్రబాబు తన హయాంలో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేశారా? ఆయన ఘాటుగా ప్రశ్నించారు. ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు తూట్లుపొడిచింది వాస్తవం కాదా? అని మండిపడ్డారు. చంద్రబాబూ నీ వాగ్దానాలన్నీ నీటి మీద రాతలే కదా? ఆయన ఎద్దెవా చేశారు. చంద్రబాబు అంతా అబద్దాల కోరు మరొకరున్నారా? అంటూ జూపూడి ప్రభాకార రావు విమర్శించారు. -
నూతన ఏడాదిలో జగనే సీఎం
శింగరాయకొండ(కొండపి), న్యూస్‌లైన్: ఈ ఏడాది వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి పదవి చేపట్టడం తథ్యమని ఆ పార్టీ కొండపి నియోజకవర్గ సమన్వయకర్త జూపూడి ప్రభాకరరావు అన్నారు. మూలగుంటపాడులోని దేవీ సీఫుడ్స్ వద్ద అతిథి గృహంలో బుధవారం నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేశారు. ప్రజలకు శుభాలు కలగాలని ఆకాంక్షించారు. వైఎస్ సంక్షేమ పథకాలను ముందుకు తీసుకెళ్లగల నాయకుడు జగన్ మాత్రమేనని స్పష్టం చేశారు. ఆయన్ను ప్రజలు వందశాతం విశ్వసిస్తున్నారని తెలిపారు. రాష్ట్ర సమైక్యత కోసం అన్ని విధాలా పోరాడుతున్న యోధుడు జగన్ మాత్రమేనన్నారు. కుట్రలు, కుతంత్రాలు, కుయక్తులు, రెండు కళ్ల సిద్ధాంతంతో రెండు ప్రాంతాల ప్రజలను మోసం చేస్తున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు.. రానున్న ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెబుతారని హెచ్చరిం చారు. నూతన సంవత్సరంలో అయినా చంద్రబాబుకు మంచి బుద్ధి కలగాలని టీడీపీ కార్యకర్తలు దేవుణ్ణి ప్రార్థించాలని సూచించారు. అసమర్థ కాంగ్రెస్ పాలనలో ప్రజలు విసిగి పోయారన్నారు. గడపగడపకూ వైఎస్ఆర్ సీపీ కార్యక్రమాన్ని పాకల నుంచి గురువారం ఉదయం ప్రారంభించనున్నట్లు జూపూడి తెలిపారు. కార్యక్రమంలో మూల గుంటపాడు సర్పంచ్, శింగరాయకొండ కన్వీనర్ చుక్కా కిరణ్‌కుమార్, కొండపి, జరుగుమల్లి, మర్రిపూడి, టంగుటూరు,పొన్నలూరు మండలాల కన్వీనర్లు బి. ఉపేంద్ర, జి. శ్రీనివాసరావు, బి. రమణారెడ్డి, బి. రామారావు, బి. వెంకటేశ్వర్లు, శింగరాయకొండ యూత్ కన్వీనర్ సామంతుల రవికుమార్‌రెడ్డి , బి. అశోక్‌కుమార్, సర్దార్, మాధవ, ఐదు గ్రామాల సర్పంచ్‌లు, గ్రామాల కన్వీనర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
జగన్ నాయకత్వంలోనే సమైక్య రాష్ట్రం
ఒంగోలు: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన రెడ్డి నాయకత్వంలోనే రాష్ట్రం సమైక్యంగా ఉంటుందని ఆ పార్టీ అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర రావు చెప్పారు. రాష్ట్రం సమైక్యంగా ఉంచుకోవడం కోసం అందరూ ముందుకురావాలన్నారు. ప్రభుత్వం మెడలు వంచి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుకుందాం అని ఆయన అన్ని పార్టీల నేతలకు పిలుపు ఇచ్చారు. టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పిచ్చి మాటలు మానుకోవాలని సలహా ఇచ్చారు. ఇప్పటికైనా ఆయన సమైక్యాంధ్రకు మద్దతు తెలపాలని కోరారు. -
బాబూ! ఈ ప్రభుత్వాన్ని ఎందుకు మోస్తున్నారు?: జూపూడి
హైదరాబాద్: ఈ ప్రభుత్వాన్ని మోయవలసిన బాధ్యత మీకేమిటి? అని టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర రావు ప్రశ్నించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు ఆయన విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబుపై ప్రశ్నల వర్షం కురిపించారు. సమైక్యవాదినని చెప్పుకునే ధైర్యం మీకు ఉందా? 18 ఏళ్ల మీ రాజకీయ అనుభవం ఏమైంది? తెలంగాణపై ఇచ్చిన లేఖ వెనక్కు తీసుకునే దమ్ముందా? కేంద్ర మంత్రుల బృందం(జిఓఎం)కు మీ విధానం ఇది అని ఎందుకు చెప్పలేకపోతున్నారు? అని ప్రశ్నించారు. చంద్రబాబు ముమ్మాటికీ విభజన వాదేనని చెప్పారు. ఆయన ఎన్నటికీ సమైక్యవాది కాలేరన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గానీ, పార్టీ అధ్యక్షుడు జగన్మోహన రెడ్డిని గానీ విమర్శించే హక్కు చంద్రబాబుకు లేదని జూపూడి అన్నారు. -
'చంద్రబాబుకు రాజకీయంగా యావజ్జీవ శిక్ష'
హైదరాబాద్: టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు ప్రజలు రాజకీయంగా యావజ్జీవ శిక్ష విధించారని వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర రావు అన్నారు. ఆయన ఈరోజు ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ రెండుసార్లు ప్రజలు తిరస్కరించిన చంద్రబాబు మళ్లీ అధికారం కావాలనడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రజలు ఆయనను అధికారానికి దూరంగా ఉంచడం వల్ల ఆయన రాజకీయపరంగా యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్నారని అన్నారు. చంద్రబాబు నిజస్వరూపం దేశం మొత్తానికీ తెలిసిపోయిందని, అందుకే ఆయన దీక్షను ఢిల్లీలో ఎవరూ పట్టించుకోలేదని చెప్పారు. లోక్‌సత్తా నేత జయప్రకాశ్ నారాయణ చంద్రబాబుకు తబలా కొట్టడం సరికాదన్నారు. టీడీపీ, కాంగ్రెస్ కుమ్మక్కు రాజకీయాలను జేపీ ఎందుకు ప్రశ్నించడంలేదు? అని అడిగారు. రాష్ట్ర విభజనపై నిజాయతీ ఉంటే చంద్రబాబు, జేపీలు అసెంబ్లీని సమావేశపరచమని ఎందుకు అడగరు? సమైక్యాంధ్ర గురించి మాట్లాడటానికి చంద్రబాబూ నీకు దమ్ముందా? ఇంత మంది ప్రజలు వ్యతిరేకిస్తున్న విభజన నిర్ణయాన్ని నీవు ఎందుకు వ్యతిరేకించవు? అని జూపూడి ప్రశ్నించారు. ''చంద్రబాబుకు పిచ్చి ముదిరింది. అందుకే జగన్‌పై ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. ఆయన మాటలు చూసి ప్రజలంతా బాబుకు పిచ్చి పట్టిందని నమ్ముతున్నారు. రోజూ కాంగ్రెస్ కొంగు చాటున రాజకీయాలు చేస్తున్నారు. జగన్ ప్రజాదరణ చూసి ఉలిక్కి పడుతున్నారు. నిజాయతీ రాజకీయాలు గురించి మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదు. నిజాయతీ రాజకీయాల కోసం జగన్ ఎన్ని కష్టాలనైనా ఎదుర్కొంటున్నారు. అందుకే జైల్లో ఉండి కూడా ప్రజల కోసం దీక్ష చేశారు. సమైక్యాంధ్ర కోసం నిజాయతీగా పోరాటం చేస్తున్నారు'' అని చెప్పారు. -
'చంద్రబాబుకు రాజకీయంగా యావజ్జీవ శిక్ష'
-
జీవోఎం భేటీకి మా పార్టీ నుంచి మైసూరా వెళ్తారు
-
దేశవ్యాప్తంగా సమైక్య యాత్ర: వైఎస్ జగన్మోహన్రెడ్డి
*16 నుంచి 26 దాకా దేశమంతా పర్యటిస్తా: వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి * ముఖ్య రాష్ట్రాలకు వెళ్లి పార్టీల మద్దతు కోరతాం * వాటినీ విభజించే ప్రమాదముందని చెబుతాం * వైఖరి మార్చుకోవాలని బీజేపీ తదితరాలను కోరతాం * సహకరించాలని లెఫ్ట్ పార్టీలకు విజ్ఞప్తి చేస్తాం * జీవోఎం భేటీకి మా పార్టీ నుంచి మైసూరా వెళ్తారు * నాలుగు తిట్లు తిట్టి, వాళ్లకు గట్టిగా గడ్డి పెట్టి వస్తారు * సమైక్య తీర్మానం చేసిన 9,368 పంచాయతీలకు సలామ్ * 26 నుంచి జగన్ ‘సమైక్యాంధ్రప్రదేశ్’ యాత్ర * తెలంగాణతో పాటు రాష్ట్రవ్యాప్తంగా పర్యటన సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి దేశవ్యాప్తంగా పర్యటించి అన్ని రాజకీయ పార్టీల మద్దతు కోరతానని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. నవంబర్ 16 నుంచి 26 వరకు ఆయా రాష్ట్రాలతో పాటు ఢిల్లీలోనూ పర్యటించనున్నట్టు తెలిపారు. శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో పార్టీ నేతలు మైసూరారెడ్డి, జూపూడి ప్రభాకరరావు, దాడి వీరభద్రరావు, గట్టు రామచంద్రరావులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే విషయంలో అన్ని పార్టీల మద్దతు కూడగట్టేందుకు తమిళనాడు, పశ్చిమబెంగాల్, ఉత్తరప్రదేశ్, ఒడిశా వంటి ప్రతి ముఖ్యమైన రాష్ట్రానికీ వెళ్లి.. అక్కడి రాజకీయ పక్షాలన్నింటినీ కలుస్తామని చెప్పారు. బీజేపీ వంటి ప్రతి ముఖ్య పార్టీనీ కలిసి రాష్ట్ర విభజనపై వారి వైఖరిని మార్చుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తామని వెల్లడించారు. అలాగే కమ్యూనిస్టుల వంటి ముఖ్యమైన పార్టీలను కూడా తమకు సహకరించాల్సిందిగా కోరతామన్నారు. దేశంలో ఎక్కడా కనీవినీ ఎరగని రీతిలో ఆంధ్రప్రదేశ్‌ను విడగొట్టే ప్రయత్నం చేస్తున్నారని జగన్ మండిపడ్డారు. కేంద్రంలో అధికారంలో ఉన్నవాళ్లు, ఆ తర్వాతి ఎన్నికల్లో ఏదైనా రాష్ట్రం తమకు రాదని భావిస్తే, దాన్ని విడదీసే కార్యక్రమానికి ఇవాళ శ్రీకారం చుడుతున్నారని దుయ్యబట్టారు. ‘‘ఇలాంటి అడ్డగోలు ప్రక్రియ మన రాష్ట్రంతోనే ప్రారంభమైంది. ఇదిక్కడితోనే ఆగదు. ఢిల్లీలో అధికారం చేపట్టినవారు తర్వాత ఏ రాష్ట్రంలోనైతే వారికి సీట్లు రావని, బలహీనంగా ఉన్నామని భావిస్తారో అక్కడల్లా ఇలాంటి అడ్డగోలు కార్యక్రమాలకు పాల్పడే అవకాశం ఉంది. ఈ రోజు ఆంధ్రప్రదేశ్‌కు జరుగుతున్న అన్యాయాన్ని చూస్తూ ఊరుకుంటే.. రేపటి రోజున కేంద్రంలో అధికారంలో ఉన్నవారు తమ ప్రయోజనాల కోసం ఇలాంటి విధానాన్నే ఇతర రాష్ట్రాల్లోనూ అమలు చేసే ప్రమాదం ఉందన్న విషయాన్ని అన్ని రాష్ట్రాల నేతలకు వివరిస్తా. ఇవాళ మీరు వ్యతిరేకించకపోతే మీ వరకు వచ్చేసరికి ఎవరూ కనపడరని నచ్చజెబుతా’’ అని వివరించారు. అదేవిధంగా నవంబర్ 26 నుంచి సమైక్యాంధ్రప్రదేశ్ నినాదంతో రాష్ట్రవ్యాప్త పర్యటనకు శ్రీకారం చుట్టనున్నట్టు తెలిపారు. ఏయే ప్రాంతాల్లో పర్యటిస్తానన్న వివరాలను పార్టీ నేతలు తర్వాత వెల్లడిస్తారని పేర్కొన్నారు. తెలంగాణలోనూ పర్యటన కొనసాగుతుందా అని విలేకరులు ప్రశ్నించగా కచ్చితంగా ఉంటుందని బదులిచ్చారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో సమైక్యాన్ని చాటుతూనే ఓదార్పు కుటుంబాలను పరామర్శిస్తూ పర్యటన సాగుతుందని వెల్లడించారు. జీవోఎం భేటీకి ఆహ్వానం అందింది వివిధ రాజకీయ పార్టీలతో జీవోఎం తలపెట్టిన సమావేశానికి వైఎస్సార్సీపీని ఆహ్వానిస్తూ పంపిన లేఖ శుక్రవారం తమకు అందిందని జగన్ తెలిపారు. తాము కచ్చితంగా ఆ భేటీకి వెళతామని, పార్టీ ప్రతినిధిగా మైసూరారెడ్డిని పంపుతున్నామని పేర్కొన్నారు. ‘‘రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న పార్టీ వాదననే ఆ సమావేశంలో గట్టిగా చెప్పమని మైసూరా అన్నకు చెబుతా. అంతేకాదు నాలుగు తిట్లు తిట్టి.. వారికి బుద్ధి వచ్చేలా కాస్త గడ్డి పెట్టి రమ్మని కూడా చెప్పి పంపుతా’’ అని వెల్లడించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ గ్రామసభల్లో తీర్మానం చేసి కేంద్ర హోం శాఖకు పంపిన 9,368 గ్రామ పంచాయతీల సభ్యులకు జగన్ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే సమైక్యానికి మద్దతుగా 48 గంటల పాటు నిర్వహించిన రహదారుల దిగ్బంధన కార్యక్రమాన్ని పోలీసుల జులం మధ్య కూడా విజయవంతం చేసినవారికీ, సహకరించిన ప్రజలకు కూడా కృతజ్ఞతలు తెలిపారు. నిమిషాల్లోనే విభజన నిర్ణయాలా?: విభజన ప్రక్రియకు సంబంధించి నివేదికల పేరుతో ఢిల్లీ నుంచి రోజుకోలా లీకులు వెలువడుతుండటంపై జగన్ తీవ్రంగా మండిపడ్డారు. కేంద్రంలో అధికారంలో ఉన్నవారి తీరు బాధ్యతారాహిత్యంతో.. ‘మాకు ఓట్లూ, సీట్లూ కావాలి, వాటి కోసం ఏదైనా చేస్తాం, ఆ తర్వాత మీ చావు మీరు చావండి’ అన్నట్టుగా ఉందని దుయ్యబట్టారు. విభజన ప్రక్రియకు సంబంధించిన కీలక నిర్ణయాలకు కూడా నిమిషాల్లో పరిష్కారం చూపిస్తోంటే ఆశ్చర్యమేస్తోందన్నారు. జల వనరులకు సం బంధించి జైరాం రమేశ్ ఇచ్చిన నివేదికను ఈ సందర్భంగా జగన్ ప్రస్తావించారు. ‘‘సాగునీటికి సంబంధించి జైరాం రమేశ్ ఇచ్చిన నివేదికను పేపర్లో చదివా. జల వనరుల మంత్రి అధ్యక్షతన ఒక మండలి పెడతారట. వాటిలో రెండు రాష్ట్రాలకు చెందిన సీఎంలు, సెక్రటరీలు ఉంటారట. ఆ మం డలి కింద బోర్డులు వేస్తారట. ఈ సందర్భంగా వారిని ఒకటి అడగదలుచుకున్నా. దేశంలో 28 రాష్ట్రాల్లో ఏ ఒక్కరికీ లేనిది మా రాష్ట్రంలోనే ఇలా ఎందుకు తీసుకొస్తున్నారు? ఇప్పటికే కృష్ణా నదీజలాల వినియోగంలో ఎగువన ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక తమ ప్రాజెక్టుల అవసరాలు తీరాకే కిం దకు వదులుతున్నాయి. రాష్ట్రం ఐక్యంగా ఉన్నప్పుడే నీరు వదలడం లేదు. మీరు చెబుతున్న మండలిని ఎగువ రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటకల్లో పెట్టి నీళ్లెం దుకు ఇవ్వడం లేదు?’’ అని ప్రశ్నించారు. మన రాష్ట్రంలోనే మండలి ఏర్పాటు చేసి దాని కింద బోర్డులంటే ఇకపై మిగులు జలాలు వాడుకునే పరిస్థితి ఉండదని, వాటిపై కట్టిన ప్రాజెక్టులన్నీ శూన్యమవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘పై రాష్ట్రాలు మాత్రం మిగులు జలాలతో ప్రాజెక్టులు పూర్తి చేసుకుం టాయి. మన రాష్ట్రంలో మాత్రం ఈ మండలి ఉంటుంది కాబట్టి దీని ఆధ్వర్యంలోనే అన్నీ జరగాలనే షరతుతో ప్రాజెక్టు నిలిపేస్తారు. దీంతో రాష్ట్రం ఎడారి అవుతున్నా చూస్తూ ఊరుకోవాల్సిందే తప్ప ఏమీ చేయలేని పరిస్థితి ఉత్పన్నం కానుంది. నిజంగా వీళ్లు ఇస్తున్న తీర్పును చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది’’ అని ఆవేదన వ్యక్తంచేశారు. బాబూ.. విభజన లేఖను వెనక్కి తీసుకో! రాష్ట్రం విడిపోతే అన్ని రకాలుగా నష్టపోయే ప్రమాదమున్నందున టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఇప్పటికైనా కళ్లు తెరిచి, విభజనకు అనుకూలంగా గతంలో ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకోవాలని జగన్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలంటూ కేంద్రానికి లేఖ రాయాలని సూచించారు. ఈ విషయంలో చరిత్రహీనుడిగా మిగిలిపోవద్దని హితవు పలికారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం కోసం ఇలాంటి సమయంలో ప్రతి ఒక్కరూ ఏకం కావాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. రాష్ట్రం నష్టపోయే పరిస్థితి ఉన్న ఈ సమయంలో ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేయవద్దని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ‘‘అందరం ఏకమైతేనే విభజనను ఆపగలుగుతాం. రాష్ట్రానికి చెందిన అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నా. ప్రతి ఒక్కరినీ వేడుకుంటున్నా. అంతా ఒక్కటవాల్సిన సమయం ఆసన్నమైంది. రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే అందరం బాగుపడతాం. దేశంలో హిందీ తర్వాత రెండో అతి పెద్ద జాతిగా ఉన్న తెలుగువారం విచ్ఛిన్నమైతే ఎవరూ పట్టించుకునే పరిస్థితి ఉండదు. రూ.1.75 లక్షల కోట్ల బడ్జెట్‌తో దేశంలో మూడో అతి పెద్ద ఆర్థిక శక్తిగా ఉన్న రాష్ట్రాన్ని విడగొడితే భవిష్యత్తు అంధకారమవుతుంది’’ అని హెచ్చరించారు. ఇతర రాష్ట్రాల్లో పర్యటనకు కోర్టు నుంచి అనుమతి రాలేదు కదా అని విలేకరులు ప్రస్తావించగా.. కాంగ్రెస్, సీబీఐ ఒక్కటై అడ్డుకోవచ్చు గానీ న్యాయస్థానాలు వాళ్ల చేతుల్లో లేవని విశ్వసిస్తున్నానని పేర్కొన్నారు. న్యాయస్థానాల పట్ల తనకు నమ్మకముందని, వారు అనుమతి ఇస్తారనే భావిస్తున్నట్టు చెప్పారు. -
'కాంగ్రెస్ పార్టీ స్వార్థ రాజకీయాలకు పాల్పడుతోంది'
ప్రకాశం:కాంగ్రెస్ పార్టీ స్వార్థ రాజకీయాలకు పాల్పడుతూ బాధ్యతారహితంగా వ్యవహరిస్తోందని వైఎస్సార్ సీపీ నేత జూపూడి ప్రభాకర్ విమర్శించారు. సమైక్య రాష్ట్రం కోసం లక్షల మంది రోడ్డుపైకి వచ్చి ఉద్యమాలు చేస్తుంటే కాంగ్రెస్ పార్టీకి చీమకుట్టినట్లు కూడా లేదని మండిపడ్డారు. టీడీపీతో పొత్తు కోసం బీజేపీ వైఎస్ కుటుంబంపై, బ్రదర్ అనిల్ పై అసత్య ఆరోపణలు చేస్తుందని జూపూడి తెలిపారు. సీమాంధ్ర ప్రజల పట్ల కాంగ్రెస్-టీడీపీలు నిర్లక్ష్యంగా వ్యవరించడం తగదన్నారు. ప్రజల ఓటుతో అధికారంలో ఉన్న కాంగ్రెస్ దిగజారుడు రాజకీయాలు చేస్తుందన్నారు. అంతకు ముందు శోభా నాగిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయాలకు అతీతంగా సమైక్య శంఖారావం సభను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు సమైక్య పార్టీలకు మద్దతు ఇచ్చి.. మిగిలిన పార్టీలపై ఒత్తిడి పెంచాలని ఆమో ప్రజలకు సూచించారు. -
‘విభజన పేరుతో అహంకారంగా వ్యవహిరిస్తే సహించం’
గుంటూరు: రాష్ట్ర విభజన పేరుతో ప్రభుత్వం అహంకారంగా వ్యవహరిస్తే సహించేది లేదని వైఎస్సార్సీపీ నేత జూపూడి ప్రభాకరరావు హెచ్చరించారు. ఈ నెల 26న నిర్వహిస్తున్న 'సమైక్య శంఖారావం' సభకు సమైక్యవాదులంతా తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వ్యవహరిస్తున్న తీరుపై మండిపడ్డారు. విభజన పేరుతో అహంకారంగా వ్యవహరించడం ఎంతమాత్రం సరికాదని ఆయన సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటు జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకూ జరిగిన పరిణామాలను వివరించేందుకే సమైక్య శంఖారావం సభను నిర్వహిస్తున్నట్లు జూపూడి తెలిపారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, రామోజీరావులు కలిసి ఆడుతున్న కుట్రలను బయటపెడతామన్నారు. సమైక్య శంఖారావానికి సమైక్య వాదులంతా తరలి రావాలని ఆయన తెలిపారు. -
'ఎన్నికల్లో మాకు వచ్చిన సీట్లను భిక్షంగా వేస్తాం'
ప్రకాశం: యూపీఏ ప్రభుత్వం రాజకీయ లబ్ధికోసమే రాష్ట్రాన్ని విడగొట్టడానికి యత్నిస్తోందని వైఎస్సార్ సీపీ నేత జూపూడి ప్రభాకర రావు మండిపడ్డారు. అందరి అభిప్రాయం తీసుకున్నాక రాష్ట్రాన్ని విభజన జరుగుతుందన్న కాంగ్రెస్ మాటల్లో వాస్తవం లేదన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసమే రాష్ట్ర విభజనకు పూనుకున్నారన్నారు. ప్రకాశం జిల్లా కొండేపిలో గురువారం జూపూడి దీక్ష విరమించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి అధికారం కట్టబెట్టడం కోసమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విడగొట్టడానికి పూనుకుంటే వచ్చే ఎన్నికల్లో తమకు వచ్చిన సీట్లను భిక్షంగా వేస్తామన్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని చీల్చడానికి మగ్గు చూపురని ఆయన విమర్శించారు. హైదరాబాద్ నగరంలో ఉన్న తమ ఆస్తులను కాపాడుకోవడం కోసమే చంద్రబాబు, రామోజీరావు, కాంగ్రెస్ నేతలు కలిసి నాటకాలు ఆడుతున్నారని జూపూడి తెలిపారు. -
'చంద్రబాబు కాకమ్మ కథలు చెప్పడం మానేయాలి'
హైదరాబాద్: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కాకమ్మ కథలు చెప్పడం మానేయాలని వైఎస్సార్ సీపీ అధికారి ప్రతినిధి జూపూడి ప్రభాకర రావు విమర్శించారు. బాబు గారు చెప్పే కాకి లెక్కలకు దేశంలో అవినీతి తగ్గుతుందా అని ప్రశ్నించారు. ఆయన ఆస్తులు ఎక్కడున్నాయో కనుక్కోవాల్సిన బాధ్యత ప్రజలకు లేదని జూపూడి తెలిపారు. చంద్రబాబు అవినీతి గురించి మాట్లాడటం గురువింద గింజ సామెతను గుర్తుకుతెస్తోందన్నారు. ప్రస్తుతం చూపెడుతున్న చంద్రబాబు ఆస్తుల విలువను ప్రజలు నమ్ముతారనుకోవడం పొరపాటన్నారు. ఆయన తనయుడు లోకేష్ ఆస్తుల ఎలా పెరిగాయో బాబుగారు ఇప్పడి వరకూ చెప్పలేదని జూపూడి ప్రశ్నించారు. -
'జగన్ వెంటే రాష్ట్ర రాజకీయాలు'
హైదరాబాద్:వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహనరెడ్డి వెంటే రాష్ట్ర రాజకీయాలు తిరుగుతున్నాయని ఆ పార్టీ నేత జూపూడి ప్రభాకర రావు అభిప్రాయపడ్డారు. జగన్ జైల్లో ఉన్నా రాష్ట్ర రాజకీయాలు ఆయన చుట్టూనే తిరుగుతున్నాయన్నారు. కొండేపి మండలం కె.ఉప్పలపాడులో వైఎస్ఆర్ వర్ధంతి సభలో జూపూడి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన జగన్ నాయకత్వంలో పని చేస్తున్నందుకు గర్వపడుతున్నామని తెలిపారు. నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు జగన్ లో ఉన్నాయన్నారు. అసమర్థ నాయకత్వం వల్లే రాష్ట్రం అల్లకల్లోలమైందని విమర్శించారు. కేంద్ర మంత్రి పదవుల కోసమే రాష్ట్రాన్ని సోనియా కాళ్ల వద్ద తాకట్టు పెట్టారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని పోరాడుతున్నది ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమేనన్నారు. వైఎజ్ జగన్‌ను జైలులో పెట్టి రాష్ట్రాన్ని విడగొడితే ప్రజలు ఊరుకోరని జూపూడి అన్నారు. -
'చంద్రబాబు సీడబ్యూసీ-2 గా వ్యవరిస్తున్నారు'
విజయవాడ: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సీడబ్యూసీ-2గా వ్యవరిస్తున్నారని వైఎస్సార్ సీపీ నేత జూపూడి ప్రభాకర రావు విమర్శించారు. ప్రస్తుతం ఆయన చేస్తున్న యాత్ర కాంగ్రెస్ ను బతికించడానికేనని జూపూడి ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో నిజమైన ప్రజానాయకుడు వైఎస్ జగన్మోహనరెడ్డినేనని ఆయన అభిప్రాయపడ్డారు. ఢిల్లీ కాంగ్రెస్ పెద్దల కుట్రలకు రాష్ట్రం బలైపోయిందని ఆయన మండిపడ్డారు. రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం మొండి వైఖరితో వ్యవహరిస్తుందని ఆయన ఆరోపించారు. ఏదైనా పోరాడి సాధిద్దామని అన్నారు. సీమాంధ్రలో ఉద్యమం ఎగసి పడుతున్న తరుణంలో బాబు యాత్ర ఎలా చేస్తారని వైఎస్సార్ సీపీ ప్రశ్నిస్తోంది. -
సిడబ్ల్యూసి2 లాగా టిడిపి: జూపూడి
నెల్లూరు: తెలుగుదేశం పార్టీ సీడబ్ల్యూసీ-2 లాగా వ్యవహరిస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర రావు విమర్శించారు. ప్రతిపక్ష పాత్రను పోషించడంలో టీడీపీ విఫలమైందన్నారు. కాంగ్రెస్‌ను వ్యతిరేకించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డిని జైల్లో పెట్టారు. ఆయనను ఆదరించిన తెలుగు ప్రజలను రెండుగా విభజించారన్నారు. రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా కడప ఎంపి జగన్మోహన రెడ్డి, పులివెందుల ఎమ్మెల్యే విజయమ్మ రాజీనామాలు చేయడం హర్షనీయం అని జూపూడి అన్నారు. -
రాష్ట్ర ప్రజలకు అండగా వైస్ఆర్సిపి: జూపూడి
ఢిల్లీ: రాష్ట్ర ప్రజలందరికి వైఎస్ఆర్ సీపీ అండగా ఉంటుందని ఆ పార్టీ అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర రావు, సెంట్రల్ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడు మారెప్ప భరోసా ఇచ్చారు. రాష్ట్ర విభజన విషయంలో ఏ ప్రాంతానికి అన్యాయం జరగకుండా నిర్ణయం తీసుకోవాలని వారు కోరారు. వారు ఈరోజు ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. విభజనపై కాంగ్రెస్‌లోనే స్పష్టత లేదన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, మంత్రులు, ఆ పార్టీ ఎంపీలు తలా ఒక రకంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. అందరికి సమన్యాయం చేయాలని తమ పార్టీ నిర్ణయం అని చెప్పారు. కాంగ్రెస్‌ను ఎదిరించినందుకే జగన్‌ను జైల్లో పెట్టారన్నారు. జగన్‌ను ఆదరించిన జనాన్ని విభజించి శిక్షించారని వారు పేర్కొన్నారు. -
చరిత్ర పుటల్లో నిలిచిపోనున్న షర్మిల పాదయాత్ర: జూపూడి
శ్రీకాకుళం: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర చరిత్ర పుటల్లో నిలిచిపోతుందని ఆ పార్టీ అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర రావు చెప్పారు. పాదయాత్ర నేటితో ముగియనున్న సందర్భంగా ఆ పార్టీ నేతలందరూ ఇచ్చాపురం చేరుకున్నారు. ఈ సందర్భంగా జూపూడి మాట్లాడుతూ ప్రజల కోసం షర్మిల సుదీర్ఘమైన పాదయాత్ర చేశారన్నారు. కష్టాల్లో ఉన్న జగన్‌ను ఆదరిస్తున్న ప్రజల అభిమానం చూసి కాంగ్రెస్ ఓర్వలేకపోతోందని విమర్శించారు. రాష్ట్రాన్ని విభజన చేసి కేంద్రం చారిత్రక తప్పిదం చేసిందని జూపూడి అన్నారు. వైఎస్ఆర్సీపీ మహిళ విభాగం అధ్యక్షురాలు కొల్లి నిర్మలాకుమారి మాట్లాడుతూ షర్మిల పాదయాత్రతో కాంగ్రెస్, టీడీపీల గుండెల్లో రైళ్లు పరిగెత్తుస్తున్నాయన్నారు. ఈ రోజు ఉదయం షర్మిల మరో ప్రజాప్రస్థానం 230వ రోజు పాదయాత్ర బలరాంపురం నుంచి ప్రారంభమైంది. సవరదేవిపేట, అయ్యవారిపేట, లొద్దపుట్టి మీదుగా పాదయాత్ర కొనసాగింది. ఇచ్ఛాపురంలో భారీ బహిరంగ సభలో షర్మిల ప్రసంగిస్తారు. ఇప్పటికే రాష్ట్రం నలుమూలల నుంచి నేతలు కార్యకర్తలు ఇచ్చాపురం చేరుకున్నారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి జనం భారీగా తరలివస్తున్నారు. సభా ప్రాంగణం జనంతో కిక్కిరిసిపోయింది. షర్మిల 9 నెలల్లో 14 జిల్లాల్లో 116 నియోజకవర్గాల మీదుగా 3,112 కిలోమీటర్లు పాదయాత్ర చేసి దేశ రాజకీయ చరిత్రలో ఓ సంచలన రికార్డు సృష్టించారు.