
జూపూడి ప్రభాకర రావు
హైదరాబాద్: టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సీమాంధ్రను సింగపూర్‌గా మారుస్తానంటున్నారని, సీమాంధ్రలో ఉన్న వ్యవసాయాన్ని ఏం చేస్తారు? అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర రావు ప్రశ్నించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు తీరుపై మండిపడ్డారు. రాష్ట్ర విభజనకు కాంగ్రెస్, టీడీపీలు కలిసి సనిచేశాయన్నారు. ఆ 2 పార్టీలు ఎప్పటి నుంచో తోడు దొంగలుగా వ్యవహరిస్తున్నాయన్నారు.
కాంగ్రెస్ నేతలను కలుపుకుని పనిచేద్దామని టీడీపీ కార్యకర్తలకు చంద్రబాబు దిశానిర్ధేశం చేస్తున్నారని జూపూడి అన్నారు. కాంగ్రెస్, టీడీపీ నేతలు కలిసి తిరుగుతున్నారని విమర్శించారు. టీడీపీలో కాంగ్రెస్ విలీనం అవుతుందన్నారు. టీడీపీ కాస్త పిల్ల టీడీపీ కాంగ్రెస్‌గా మారిందని ఎద్దేవా చేశారు.