
జూపూడి ప్రభాకర రావు
టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మానసిక పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, ఈ పరిస్థితులలో ఆయన స్వగ్రామం వెళ్లి పించన్ తీసుకోవడం మంచిదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర రావు సలహా ఇచ్చారు.
హైదరాబాద్: టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మానసిక పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, ఈ పరిస్థితులలో ఆయన స్వగ్రామం వెళ్లి పించన్ తీసుకోవడం మంచిదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర రావు సలహా ఇచ్చారు. సంక్రాంతికి సొంత ఊరు వెళ్లి పాత స్నేహితులను కలిసి, వైఎస్‌ఆర్‌ను, జగన్మోహన రెడ్డినే విమర్శిస్తున్నారని చెప్పారు. ముందు మీ వైఖరి తెలిపి, ఆ తరువాత వైఎస్ఆర్ కాంగ్రెస్ గురించి మాట్లాడటం మంచిదన్నారు. బాబు తీరు చూస్తే టీడీపీ ఎటుపోతుందో అర్థం కావటం లేదన్నారు.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు నాయుడులే విభజన ఛాంపియన్లన్నారు. విభజన జరగదని పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ చేసిన సీఎం విభజనకు అన్ని విధాల సహకరిస్తున్నారని చెప్పారు. బీఏసీకి చంద్రబాబు, సీఎం ఎందుకు రావటం లేదని ఆయన ప్రశ్నించారు. ఓటింగ్ ఉంటుందో లేదో సీఎం , స్పీకర్, చంద్రబాబు చెప్పటం లేదన్నారు. పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, కిరణ్, చంద్ర బాబు ఎందుకు అభిప్రాయం చెప్పటం లేదని జూపూడి ప్రశ్నించారు.