
'రాష్ట్రాన్ని గాలికొదిలేసిన అసమర్ధనేత చంద్రబాబు'
రాష్ట్ర విభజన విషయంలో నిర్ణయాన్ని వెల్లడించకుండా రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తున్న తెలుగుదేశం పార్టీపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడు, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకరరావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
హైదరాబాద్: రాష్ట్ర విభజన విషయంలో నిర్ణయాన్ని వెల్లడించకుండా రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తున్న తెలుగుదేశం పార్టీపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడు, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకరరావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు తమ విధానాన్ని చెప్పకుండా రాష్ట్రాన్ని గాలికొదిలేసిన అసమర్ధనేత'' అని వైఎస్సార్ కాంగ్రెస్ నేత జూపూడి ధ్వజమెత్తారు.
చంద్రబాబు తన హయాంలో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేశారా? ఆయన ఘాటుగా ప్రశ్నించారు. ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు తూట్లుపొడిచింది వాస్తవం కాదా? అని మండిపడ్డారు. చంద్రబాబూ నీ వాగ్దానాలన్నీ నీటి మీద రాతలే కదా? ఆయన ఎద్దెవా చేశారు. చంద్రబాబు అంతా అబద్దాల కోరు మరొకరున్నారా? అంటూ జూపూడి ప్రభాకార రావు విమర్శించారు.