శ్రీకాకుళం: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర చరిత్ర పుటల్లో నిలిచిపోతుందని ఆ పార్టీ అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర రావు చెప్పారు. పాదయాత్ర నేటితో ముగియనున్న సందర్భంగా ఆ పార్టీ నేతలందరూ ఇచ్చాపురం చేరుకున్నారు. ఈ సందర్భంగా జూపూడి మాట్లాడుతూ ప్రజల కోసం షర్మిల సుదీర్ఘమైన పాదయాత్ర చేశారన్నారు. కష్టాల్లో ఉన్న జగన్‌ను ఆదరిస్తున్న ప్రజల అభిమానం చూసి కాంగ్రెస్ ఓర్వలేకపోతోందని విమర్శించారు. రాష్ట్రాన్ని విభజన చేసి కేంద్రం చారిత్రక తప్పిదం చేసిందని జూపూడి అన్నారు.
వైఎస్ఆర్‌సీపీ మహిళ విభాగం అధ్యక్షురాలు కొల్లి నిర్మలాకుమారి మాట్లాడుతూ షర్మిల పాదయాత్రతో కాంగ్రెస్, టీడీపీల గుండెల్లో రైళ్లు పరిగెత్తుస్తున్నాయన్నారు.
ఈ రోజు ఉదయం షర్మిల మరో ప్రజాప్రస్థానం 230వ రోజు పాదయాత్ర బలరాంపురం నుంచి ప్రారంభమైంది. సవరదేవిపేట, అయ్యవారిపేట, లొద్దపుట్టి మీదుగా పాదయాత్ర కొనసాగింది. ఇచ్ఛాపురంలో భారీ బహిరంగ సభలో షర్మిల ప్రసంగిస్తారు. ఇప్పటికే రాష్ట్రం నలుమూలల నుంచి నేతలు కార్యకర్తలు ఇచ్చాపురం చేరుకున్నారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి జనం భారీగా తరలివస్తున్నారు. సభా ప్రాంగణం జనంతో కిక్కిరిసిపోయింది.
షర్మిల 9 నెలల్లో 14 జిల్లాల్లో 116 నియోజకవర్గాల మీదుగా 3,112 కిలోమీటర్లు పాదయాత్ర చేసి దేశ రాజకీయ చరిత్రలో ఓ సంచలన రికార్డు సృష్టించారు.
చరిత్ర పుటల్లో నిలిచిపోనున్న షర్మిల పాదయాత్ర: జూపూడి
Published Sun, Aug 4 2013 4:01 PM | Last Updated on Fri, Sep 1 2017 9:38 PM
Advertisement
Advertisement